సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలే కేంద్ర బిందువని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితోనే జిల్లా ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ జీవన భద్రత కోసం బీమా పథకాల అమలు, భూసారాన్ని కాపాడేందుకు పంటల మార్పిడి, లాభదాయక వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం ఆయాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, మెదక్‌, రామాయంపేట మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు రాధిక, లావణ్య, సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్య ంగా అధికారులు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం

చేగుంట(తూప్రాన్‌): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శుక్రవారం రెడ్డిపల్లి కొనుగోలు కేంద్రంతో పాటు చందాయిపేటలోని రైస్‌మిల్లును సందర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జనగణన కార్యక్రమాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement