చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలను అందించకుంటే కాంట్రాక్టర్‌పై చర్యలు తప్పవని విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా లారీల సప్‌లై కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సకాలంలో లారీలను అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్ నర్సింహులు, తహసీల్దార్ గ్రేసిబాయి, ఆర్‌ఐ శ్రీధర్, ఐకేపీ ఏపీఎం సృజన్‌రెడ్డి ఉన్నారు.


