ట్రిపుల్‌ ఐటీకి విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీకి విద్యార్థుల ఎంపిక

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): శివ్వంపేట మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని రేవతి ట్రిపుల్‌ ఐటీ బాసరకు ఎంపికై ంది. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన రేవతి శివ్వంపేట ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో 557 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ట్రీపుల్‌ ఐటీ బాసరకు ఎంపిక కావడంపై విద్యార్థిని తల్లిదండ్రులు లలిత బంగారయ్య, ఎంఈఓ బుచ్చనాయక్‌, హెచ్‌ఎం బాలచంద్రం,ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

ముస్లాపూర్‌ పీఎంశ్రీ పాఠశాలలో..

అల్లాదుర్గం(మెదక్‌): మండల పరిధిలోని ముస్లాపూర్‌ పీఎంశ్రీ పాఠశాలలో ప్రైవేట్‌ పాఠశాలకు దీటుగా విద్యబోధన అందిస్తున్నారు. గంథాలయం, కంప్యూటర్‌ విద్య, ఆటలు, టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పాఠశాల నుంచి ఏడుగురు విద్యార్థులు బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపిక అయ్యారు. టెన్త్‌లో మంచి మార్కులతో పాసైన మొల్ల నేహ, నందు, దుర్గాప్రసాధ్‌, భువనేశ్వరి, సాయికుమార్‌, నవప్రసన్న, అంజయ్యలు త్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యారు. వీరిని పాఠశాల హెచ్‌ఎం రమేశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్ల విజయం సాధించినట్లు తెలిపారు.

కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌ ..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రవితేజ, దివ్యలు బాసర ట్రిపుల్‌ఐటీకి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుమోహన్‌ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను ప్రిన్సిపాల్‌ మధుమోహన్‌, ఉపాధ్యాయులు శివరాజ్‌, మల్లారెడ్డి, సందీప్‌, శ్రీనివాస్‌, కొండల్‌రెడ్డి అభినందించారు.

మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు..

చిన్నశంకరంపేట(మెదక్‌): బాసర ట్రిపుల్‌ ఐటీకి చిన్నశంకరంపేట మోడల్‌స్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ వాణికుమారి తెలిపారు. తెలంగాణ మోడల్‌స్కూల్‌ టాపర్స్‌గా నిలిచిన గుండు భవ్యశ్రీ, సాహితి, వైష్ణవి, సంధ్య, రాకేష్‌, రిషివర్ధన్‌, దీపక్‌ ట్రిపుల్‌ఐటీకి ఎంపికై నట్లు చెప్పారు. పదవ తరగతి పరీక్షలో సత్తాచాటి బాసర ట్రిపుల్‌ఐటీకి ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్‌ వాణికుమారి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement