ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓ శ్రీనివాస్‌, జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌ సోమవారం ప్రారంబించారు. గ్రామానికి చెందిన వంజరి భిక్షపతి, బంజ మంజూల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటికళ నెరవేరిందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్వేత, పంచాయతీ కార్యదర్శి నగేష్‌, నాయకులు పుండరీకంగౌడ్‌, దేవెందర్‌, భూమయ్య, వెంకటేశ్వరరావ్‌, మల్లికార్జున్‌గౌడ్‌, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

మక్కరాజీపేటలో..

చేగుంట(తూప్రాన్‌): మండల పరిధిలోని మక్కరాజీపేటలో సోమవారం అధికారులు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరంగా మారినట్లు తెలిపారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని డీఈ తెలిపారు. మండలంలో 30 ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే రావాల్సిన డబ్బులను అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రేఖ, ఎంపీడీఓ చిన్నారెడ్డి, హౌసింగ్‌ ఏఈ రియాజొద్దిన్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నవీన్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ స్టాలిన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement