నర్సాపూర్ రూరల్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని చిన్న చింతకుంటలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
గురుకులంలో అడ్మిషన్లు
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రం చేగుంటలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుమతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో పరిమిత సీట్లు ఉన్నందున వాటిని భర్తీ చేసేందుకు రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇంటర్‌లో చేరాలనుకునే విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
విద్యార్థి బలవన్మరణం
చేగుంట(తూప్రాన్): విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బీటి మహాలక్ష్మి(17) మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. కాగా పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించినా మా ర్కులు తక్కువగా వచ్చాయి. ఇటీవల నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసింది. అయినా తనకు మార్కులు తక్కువ వస్తాయేమోనని నిత్యం బాధపడుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో మహాలక్ష్మి ఉరి వేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పంచనామా నిర్వహించారు.


