మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

మెదక్‌కలెక్టరేట్‌: డ్వాక్రా సంఘాల మహిళలు ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవనంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతోందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడానికి ప్రయత్నిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. 7, 8వ తేదీలలో శివ్వంపేటలో నిర్వహించనున్న సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవయ్య, కార్యదర్శి కె.మల్లేశం, ఉపాధ్యక్షులు నరేందర్‌, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలకురూ.10 లక్షలు ఇవ్వాలి

వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ

Advertisement
 
Advertisement
Advertisement