దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

దరఖాస్తుల ఆహ్వానం సకాలంలో వైద్య సేవలు పారదర్శకత కోసమే సీసీ కెమెరాలు: ఎస్పీ తొలి రోజు ప్రశాంతం ప్రశాంతంగా పాలిసెట్‌

మెదక్‌ కలెక్టరేట్‌: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో మొదటి తరగతి ఇంగ్లీష్‌ మీడియంలో ఆరుగురి (బాలురు 3, బాలికలు 3) అడ్మిషన్లకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయంలో పూర్తి చేసిన దరఖా స్తులు అందజేయాలన్నారు. 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రామాయంపేట(మెదక్‌): వడదెబ్బ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరాం సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శి ంచి రోగులతో మాట్లాడారు. ఎండలు తీవ్రత పెరిగిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు సంబంధించిన మందులు అన్ని ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం రిజిస్టర్‌, వ్యాక్సిన్‌, మందుల నిల్వలను పరిశీలించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యురాలు వైశాలి, ఇతర సిబ్బంది ఉన్నారు.

తూప్రాన్‌: పారదర్శకతను పెంపొందించడానికి జిల్లావ్యాప్తంగా 21 పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. బుధవారం తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. పోలీస్‌స్టేషన్లలోని అన్ని విభాగాలను సీసీటీవీ కెమెరాల నిఘాలోకి తీసుకురావడం ద్వారా విచారణలు పారదర్శకంగా సాగుతాయని వివరించారు. అలాగే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అంతకు ముందు టోల్‌ప్లాజా వద్ద బక్రీద్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సందర్శించారు. భారీ వాహనాల్లో పశువుల అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో మొ త్తం 1,180 మంది విద్యార్థులకు 1,120 మంది హాజరు కాగా, 60 మంది గైర్హాజరయ్యారు. హాజరుశాతం 94.91గా నమోదైంది. మధ్యా హ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 365 మందికి గానూ 338 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజయ్యారు. దీంతో విద్యార్థుల హాజరుశాతం 92.6శగా నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందు కు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి మాధవి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,047 మంది విద్యార్థుల కోసం మెదక్‌లో 6, చేగుంటలో 1 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెదక్‌లోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, గీతా హైస్కూల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్‌ క్యాంపస్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ, బీ కేంద్రాలతో పాటు చేగుంటలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో పరీక్షలు కొనసాగాయి. మొత్తం 2,047 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 1,957 మంది హాజరయ్యారు. మరో 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మెదక్‌ ప్ర భుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement