జిల్లా కోఆపరేటివ్ అధికారి పద్మ
అల్లాదుర్గం(మెదక్): జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కోఆపరేటివ్ అధికారి పద్మ ఆదేశించారు. గురువారం అల్లాదుర్గంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన జొన్నలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ శివగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
అదనపు కలెక్టర్ నగేశ్
చిన్నశంకరంపేట(మెదక్): రానున్న వర్షకాలంలో అనర్థాలను అరికట్టేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మండలంలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ సంతోషనవీన్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, మురుగు కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్, ఎంపీడీఓ దామోదర్, తహసీల్దార్ మాలతి పాల్గొన్నారు. గ్రామసభ అనంతరం పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకే అందిస్తున్నారని అదనపు కలెక్టర్ వద్ద వాపోయారు.
రూ.25 వేల
జరిమానా విధిస్తాం
వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్‌కుమార్
చిన్నశంకరంపేట(మెదక్): వరికోతల అనంతరం వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి దేవ్‌కుమార్ రైతులకు సూచించారు. వరికొయ్యలను తగలబెట్టి పర్యావరణానికి నష్టం కలిగిస్తే రైతులకు రూ. 25 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. గురువారం మండల పరిధి రుద్రారం గ్రామంలో రైతు చేవెళ్ల దుర్గయ్య పంట పొలంలో వేసిన జీలుగను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు బలం చేకూర్చి, భూసారం పెంపొందించేందుకు అవసరమైన జీలుగ, పెద్ద జనుము నాటాలన్నారు. కోతల అనంతరం నీటి తడిపెట్టి పొలంలో సూపర్ ఫాస్పేట్ వేసి దుక్కిదున్నడం వల్ల సత్ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓలు ప్రవీణ్‌కుమార్, యాదగిరి, ఏఈఓ మధులిక ఉన్నారు.


