జిల్లావ్యాప్తంగా 904 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 69,609 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభం కానున్నాయి. బడులు తెరుచుకునే రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, యూనిఫాంలు అందిస్తామంటూ ప్రభుత్వం, అధికారులు పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ నేటికి జిల్లాకు క్లాత్ సైతం సరఫరా చేయని పరిస్థితి నెలకొంది. పిల్ల పుట్టక ముందే కుళ్ల కుట్టిన చందంగా గతేడాది మాదిరిగానే మహిళా సంఘాలతో విద్యార్థుల యూనిఫాం కుట్టిస్తామంటూ టైలర్లతో మార్చిలోనే విద్యార్థుల కొలతలు సైతం తీయించారు. కానీ నేటికీ క్లాత్‌ను మాత్రం పంపిణీ చేయలేకపోయారు. ప్రభుత్వ బడుల్లో వందశాతం నిరుపేద పిల్లలే చదువుకుంటున్నారు. ఏమాత్రం ఆర్థికంగా ఉన్నా వారి పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్ బడులకు పంపి చదివిస్తున్నారు. కాగా సర్కారు బడుల్లో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా స్కూల్ యూనిఫాంలను ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున అందిస్తోంది. జిల్లావ్యాప్తంగా 69,609 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, వారిలో బాలికలు 34,842 మంది, బాలురు 34,767 మంది ఉన్నారు.
పాత స్కూల్ డ్రెస్‌తోనే విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరం 2026–27లో అడుగుపెట్టే పరిస్థితులు దాపురించాయి. యూనిఫామ్స్ తయారీకి విద్యా శాఖ కార్యాచరణను రూపొందించినా, సకాలంలో బడి పిల్లలకు అందుతాయా..? అన్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లాత్ ఎప్పుడు వస్తుందో ఏ అధికారికి తెలియని పరిస్థితి నెలకొంది. క్లాత్ వచ్చాక కుట్టాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి క్లాత్‌ను త్వరగా తెప్పించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
విద్యార్థుల యూనిఫామ్స్‌కు సంబంధించి క్లాత్ ఇంకా రాలేదు. రాగానే మహిళా సంఘాల సభ్యులకు స్టిచ్చింగ్ బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే విద్యార్థుల కొలతలు తీసుకున్నాం.
– రాజు, ఐఈసీఎంఓ, మెదక్
ఇప్పటివరకు జిల్లాకు చేరని క్లాత్
విద్యార్థుల కొలతలు తీసుకుంటున్న సిబ్బంది(ఫైల్ )
ప్రభుత్వ బడులు తెరుచుకునే నాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అందిస్తామని విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్కూళ్ల రీ ఓపెన్‌కు మరో 15 రోజులే మిగిలి ఉండగా, ఇప్పటివరకు జిల్లాకు క్లాత్ సరఫరా చేయకపోవడంగమనార్హం. – మెదక్‌జోన్
● మరో 15 రోజుల్లో బడుల పునః ప్రారంభం
● జిల్లావ్యాప్తంగా 904 పాఠశాలలు
● 69 మందికి పైగా విద్యార్థులు
పాత డ్రెస్‌తోనే బడికి..
క్లాత్ రాగానే కుట్టిస్తాం