పెద్దశంకరంపేట(మెదక్): నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ నారాయణ, ఏఓ కృష్ణ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలతో పాటు పురుగుమందుల స్టాక్ వివరాలు పరిశీలించారు. ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హచ్చరించారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదులు తీసుకోవాలని సూచించారు.


