కౌడిపల్లి(నర్సాపూర్): ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభలను విజయవంతం చేయాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 4, 6, 8, 10వ తేదీల్లో నిర్వహించే ప్రత్యేక గ్రామసభను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, మంచినీరు, మురికి కాల్వల పరిశుభ్రత, పిచ్చిమొక్కలు పొదల తొలగింపు తదితర కార్యక్రమాలపై చర్చించాలని చెప్పారు. ఈ మేరకు గ్రామసభలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ రామారావ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ శ్రీనివాస్


