నూతన మిల్లులో ధాన్యం నిల్వ చేయండి | - | Sakshi
Sakshi News home page

నూతన మిల్లులో ధాన్యం నిల్వ చేయండి

May 24 2026 11:22 AM | Updated on May 24 2026 11:22 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): మండల పరిధి చండూర్‌ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఓ రైస్‌మిల్లులో మండల రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలు నిల్వ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మిల్లు ఓనర్‌ సుబ్బరాజును జిల్లా సివిల్‌ సప్లై అధికారి నిత్యానంద్‌, సివిల్‌ సప్‌లై డీఎం జగదీష్‌ కోరారు. శనివారం వారు రైస్‌ మిల్లును సందర్శించి, ధాన్యం బస్తాల గోదాంగా వినియోగించేందుకు ఓనర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండటంతో ధాన్యం బస్తాలు నిల్వ చేసేందుకు గోదాంలు సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నూతన రైస్‌మిల్లు నడిపేందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో, ధాన్యం బస్తాలు నిల్వ ఉంచేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. త్వరలోనే మిల్లు నడిపేందుకు పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లులోకి లారీలు వచ్చేందుకు ర్యాంప్‌లు, ధాన్య బస్తాల నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓనర్‌ సుబ్బరాజు సైతం ధాన్యం బస్తాల నిల్వకు అంగీకరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌, ఎంపీడీఓ ప్రశాంత్‌, మాజీ వైస్‌ ఎంపీపీ విశ్వంభర, సొసైటీ సిబ్బంది నర్సింహులు పాల్గొన్నారు.

జిల్లా సివిల్‌ సప్లై అధికారి నిత్యానంద్‌

Advertisement
 
Advertisement
Advertisement