పల్లెలు సౌర కాంతులీననున్నాయి. పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మిగులు విద్యుత్ విక్రయంతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి. ఇందు కోసం జిల్లాలో అధికారులు మూడు గ్రామాలను ఎంపిక చేశారు.
– రామాయంపేట(మెదక్)
‘పీఎం సూర్య ఘర్’ పథకంలో భాగంగా రా ష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు తెలంగాణ రెడ్కో సంస్థ ద్వారా మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి, నర్సాపూర్‌లోని మాసాయిపేట గ్రామా లు ఎంపికయ్యాయి. కొర్విపల్లిలో 163, మాసాయిపేటలో 2,710 ఇళ్లపై సోలార్ పలకలు బిగించనున్నారు. గృహజ్యోతి పథకం కింద ఎంపికై న లబ్ధిదారులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎంపిక చేసిన ఇళ్లపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా నెలకు సుమారు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 200 యూనిట్ల వరకు గృహావసరాలకు పోనూ అదనంగా ఉండే వంద యూనిట్లను ప్రభుత్వ గ్రిడ్‌కు విక్రయించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రతినెల ఒక్కో కుటుంబం రూ. 500 వరకు అదనంగా సంపాదించుకునే అవకాశం ఉంటుందని రెడ్‌కో అధికారులు చెబు తున్నారు.
‘పేట’కు రూ. కోటి మంజూరు
కేంద్ర నూతన పునరుత్పాద ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంన్‌ఆర్‌ఈ) పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో పాపన్నపేట ఎంపికై ంది. సదరు గ్రామంలో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. పలుశాఖల అధికారులు గ్రామంలో ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. ఈ పథకంలో ప్రభుత్వ భవనాలు, ఆస్తులకే సోలార్ సదుపాయం కల్పించనున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, ఎలక్ట్రిక్‌టూ వీలర్లు, ఈ–ఆటోలు ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా గ్రామంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెన్లు, ఇన్వర్టర్లు బిగిస్తారు. వీటితో పాటు భద్రత కోసం పకడ్బందీగా ఎర్తింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. మోడల్ సోలార్ విలేజీలుగా ఎంపికై న మూడు గ్రామాల్లో అధునాతనమైన ఎల్‌ఈడీ బల్బులతో కూడిన సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు.
జిల్లాలో మూడు గ్రామాలు ఎంపిక
గృహజ్యోతి లబ్ధిదారులకు చేయూత
మిగులు విద్యుత్ కొనుగోలుకు అవకాశం


