దుబ్బాక: ‘ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు.. నెలరోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు’ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు నరకయాతన పడుతున్నారన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


