కొల్చారం(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాలకు కుప్పల తెప్పలుగా వచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేసేందుకు హమాలీల కొరత ఒకవైపు... లారీల కొరత మరోవైపు సమయానికి తిండి తినలేక రైతులు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తూకం వేసిన ధాన్యం రవాణా చేసేందుకు లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు శనివారం సంఘానికి వచ్చిన లారీ ట్రాన్‌న్స్‌పోర్ట్ ప్రతినిధులను రెండు గంటల పాటు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న సంఘం చైర్మన్ రమేష్ అధికారులతో మాట్లాడి రైతులను సముదాయించారు. సంఘం పరిధిలో తూకం వేసిన 22,000 బస్తాల ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. తూకం వేసిన బస్తాలు నింపుకొని వెళ్లిన లారీలను వెంటనే అన్‌లోడ్ చేసి తిరిగి పంపించాలని చైర్మన్ రమేష్ తహసీల్దార్ శ్రీనివాస్ చారి దృష్టికి తీసుకువచ్చారు.
రంగంపేట పీఏసీఎస్‌లో నెలకొన్న పరిస్థితి
ముందుకు సాగని తూకం,
ధాన్యం రవాణా


