జనగణనలో
● మెదక్‌లో మారథన్ ర్యాలీ
● కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని జనగణనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. సోమవారం మెదక్‌లో జనగణనపై నిర్వహించిన మారథన్ ర్యాలీలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధికతోపాటు ఆమె పాల్గొన్నారు. జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌లో హెచ్‌పీవీ వ్యాక్సీన్, ఇంటర్ అడ్వాన్స్ సంప్లమెంటరీ పరీక్షలు, సీఎస్‌ఆర్ నిధులు, ఉపాధిహామీ, జనగణన, నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్‌లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో ప్రజలందరి భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో గృహగణన ప్రక్రియ ప్రారంభమైందని, దానిని సక్రమంగా చేయాలన్నారు. జిల్లాలోని 14 నుంచి 15 మధ్య వయస్సు గల బాలికలందరికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈనెల 13 నుంచి 21 వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పలు పరిశ్రమల యాజమానులతో మాట్లాడుతూ సమాజ హితం కోసం సీఎస్‌ఆర్ నిధులు అందించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో 17 పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు నేషనల్ అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వందరోజుల పని కల్పించి ఉపాధి కల్పించాలన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌పాల్గొని ప్రజల నుంచి 67 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌ఓ అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని మాధవి, మెడికల్ సూపరిండెంట్ సునీత దేవి తదితరులు పాల్గొన్నారు.


