రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు రూ. 2.18 కోట్ల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిశుభ్రత విషయంలో మహిళదే ప్రధాన పాత్ర అని, ఇళ్లలో చెత్తను ట్రాక్టర్లలోనే వేయాలన్నారు. పట్టణంలో పరిశుభ్రత విషయమై ప్రజలు సహకరించాలని కోరారు. టీనేజీ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజం బాగు పడుతుందని వివరించారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీత, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, మద్దెల మాధవి, నాయకులు డాకి స్వామి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య


