India
-
చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
భారతదేశం ఎదుగుదలకు తయారీ రంగం చాలా కీలకమని కేంద్రమంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తయారీ రంగ వృద్ధి గురించి బిల్డింగ్ ఎనర్జీ సూపర్-ఇంటెలిజెన్స్ 'శుభమ్ మిశ్రా' ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.భారతదేశలో తయారీ రంగ అభివృద్ధిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి పెద్ద కంపెనీల రూపంలో కాకుండా.. చిన్న భాగాల తయారీ సంస్థల్లో, సరఫరా వ్యవస్థల్లో జరుగుతోంది. ఉదాహరణకు.. 2014లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు దీని విలువ 115 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇది భారత పరిశ్రమల వేగవంతమైన ఎదుగుదలకు నిదర్శనం అని శుభమ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.ఐఫోన్ తయారీలో భారత్యాపిల్ కంపెనీ సరఫరా వ్యవస్థలో.. భారతదేశం కీలక పాత్ర పోషించడం కూడా ఒక పెద్ద మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఐఫోన్ తయారీలో భారతదేశం పాత్ర చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో గణనీయమైన శాతం భారత్‌లోనే తయారవుతోంది. ఇది భారతీయ పరిశ్రమల నైపుణ్యం పెరుగుతోందనడానికి ఒక ఉదాహరణ.మిశ్రా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అసలు అభివృద్ధి చిన్న పరిశ్రమల పనితీరులో ఉంది. హోసూర్ వంటి ప్రాంతాల్లో చిన్న సంస్థలు అతి సూక్ష్మ ప్రమాణాలతో భాగాలను తయారు చేయడం నేర్చుకుంటున్నాయి. ఇలాంటి నైపుణ్యాలే ఒక దేశాన్ని పరిశ్రమల శక్తిగా మార్చుతాయి.చైనాలా భారత్భారతదేశాన్ని మిశ్రా ప్రారంభ దశలో ఉన్న చైనాతో పోల్చారు. చైనా ఒక్కసారిగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారలేదు. 2003 నుంచి 2018 మధ్య నెమ్మదిగా, క్రమంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో కూడా ప్రపంచం ''వాళ్లు కేవలం అసెంబ్లీ పని చేస్తున్నారు'' అని భావించింది. కానీ అదే చిన్న చిన్న పురోగతులు తరువాత చైనాను ప్రపంచ తయారీ శక్తిగా నిలబెట్టాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి దశలో ఉందని ఆయన సూచించారు.Very well said, Shubham. The real strength of manufacturing is never glamorous.It grows quietly in workshops, factory floors and industrial sheds, long before the world notices it in economic rankings or headlines.India’s manufacturing future won’t be built only by giant… https://t.co/2BblFgxVy6— anand mahindra (@anandmahindra) May 15, 2026దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. దేశ ఆర్థికాభివృద్ధి పెరగాలంటే, కేవలం కొన్ని పెద్ద కంపెనీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), ఫ్యాక్టరీలు, వర్క్‌షాప్‌లు, సరఫరా సంస్థల కలిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నిజమైన అభివృద్ధి..అనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. తయారీ రంగం బయటకు కనిపించేంత గొప్పగా ఉండదు. కానీ నిజమైన అభివృద్ధి అనేది ఫ్యాక్టరీలలో, యంత్రాల మధ్య, పరిశ్రమల షెడ్లలో జరుగుతుంది. చిన్న పరిశ్రమలు తమ పనిలో నాణ్యతను పెంచుకుంటూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటున్నాయి. ఇవే భవిష్యత్తులో భారతదేశాన్ని బలమైన దేశంగా నిలబెడతాయి.దేశం ఎదగాలంటే..దేశం ఎదగాలంటే.. ముఖ్యంగా MSMEsకు ప్రభుత్వ మద్దతు అవసరమని చెప్పారు. మంచి రహదారులు, ఇండస్ట్రియల్ పార్కులు, త్వరితగతిన అనుమతులు, తక్కువ నియంత్రణ సమస్యలు ఉంటే పరిశ్రమలు వేగంగా ఎదుగుతాయి. పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వడం సరిపోదు. మధ్య తరహా సంస్థలకు సులభమైన వ్యాపార వాతావరణం కల్పించడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌కు చేరుకున్న మరో ఎల్పీజీ నౌక
కాండ్లా : పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న వేళ పెద్దమొత్తంలో ఎల్పీజీ సరకుతో మరో నౌక భారత్‌కు చేరుకుంది. 20వేల మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ట్యాంకర్ హార్మూజ్ జలసంధిని దాటి శనివారం గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుంది. ఖతర్ నుంచి బయలుదేరిన ఈ నౌక మే 13వ తేదీన హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. 46,427 టన్నుల ఎల్పీజీతో నిండిన మరో నౌక ‘సన్‌షైన్’ గురువారం హార్మూజ్‌ను దాటిందని, సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా,హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై దాడులు, నావికా సిబ్బందిని ప్రమాదంలో పడేయడంపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ప్రత్యేక సమావేశంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. -
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్‌బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్‌వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్‌లో ప్రముఖ దేశంగా స్వీడన్‌కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026 -
పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ.. ట్యాంకర్ రాగానే భీకర పోరు
వాషిం జిల్లా: పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరి, క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు జనాలు. డీజిల్ లేదని వాహనదారులకు సిబ్బంది చెప్పారు. కొద్దిసేపటికి అక్కడకు డీజిల్ ట్యాంకర్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డీజిల్ కోసం జనాలు తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా, అకోలా నాకా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జిల్లాలో ఇంధన కొరత పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో డీజిల్ నింపించుకునేందుకు ఓ బంక్ వద్ద ఎదురుచూస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.మొదట వెయిట్ చేసే సమయంలో వాహనదారుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత డీజిల్ ట్యాంకర్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఇంకా అదుపుతప్పింది. భౌతిక దాడుల వరకు వెళ్లింది. రెండు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. డీజిల్ డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్ బంక్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడడం వీడియోలో చూడొచ్చు. డీజిల్ నింపించుకునేందుకు ఎదురుచూస్తున్న వారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో వాహనాలు, జనాలతో భారీ రద్దీ మధ్య జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గాయాలు, అరెస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా వాషిం జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత కొనసాగుతోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.FUEL AND FURYFor the third consecutive day, Washim, Maharashtra witnessed a severe diesel shortage. Amid the rush to procure diesel, two groups clashed with each other, leading to a violent brawl. A video of the incident has surfaced. The footage is said to be from a petrol pump… pic.twitter.com/m0SO9JbP1G— Rahul Shivshankar (@RShivshankar) May 17, 2026 -
ఆ డీల్ ఓకే అయితేనే భారత్‌తో సంబంధాలు.. బంగ్లాదేశ్
ఢాకా: భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ మంత్రి మీర్జా ఫఖ్రుల్ అస్రాం ఆలంగీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగానది జలాల భాగస్వామ్య పునరుద్ధరణతోనే ఆధారపడి ఉంటాయన్నారు. బంగ్లాదేశ్ ప్రజల అంచనాలు మరియు అవసరాలకు అనుగుణంగా భారత్ కొత్త ఒప్పందంపై చర్చలు జరపాలని భారత్‌పై ఒత్తిడి తెచ్చారు.1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రస్తుత గంగా నీటి ఒప్పందం ఈ ఏడాది (2026) డిసెంబర్‌తో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై స్పందించింది. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ "భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగడం అనేది గంగా నీటి భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకుండా ఒప్పందం ఉండాలి". అన్నారు.గంగా నది వివాదంభారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్ వ్యవసాయం, జీవవైవిధ్యం మరియు నీటి సరఫరాకు ఈ నది చాలా కీలకం.కాగా కోల్‌కతా ఓడరేవులో పూడికను కొట్టుకుపోయేలా చేసి, హుగ్లీ నదిలో నావిగేషన్‌ను మెరుగుపరచడానికి ఫరక్కా బ్యారేజ్ భారత్ నిర్మించింది. అయితే దీనివల్ల ఎండాకాలంలో ఫరక్కా బారేజ్ వల్ల బంగ్లాదేశ్‌కు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతోందని, దీనివల్ల ఉప్పునీటి శాతం పెరిగి, వ్యవసాయం, నదీ వ్యవస్థలు మరియు పర్యావరణం దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.వివాదాస్పదంగా 'పద్మా బారేజ్' ప్రాజెక్ట్ఫరక్కా బారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి పద్మా నదిపై ఒక భారీ బారేజ్ నిర్మించే ప్రాజెక్ట్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ వల్ల భారత్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని వాదిస్తోంది. భారత్స్పందన ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉన్నాయని వీటన్నిటిపై చర్చించడానికి ఇప్పటికే ఒక పటిష్టమైన ద్రైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు.అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు నది నీటి ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని తెలిపారు. -
‘భోజ్‌శాల’ తీర్పుతో షాక్..అవి మందిరాలా? మసీదులా?
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ‘భోజ్‌శాల’ సంచలన తీర్పు.. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా రగులుతున్న పలు చారిత్రక వివాదాలకు మళ్లీ ప్రాణం పోసింది. ధార్‌లోని భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని కోర్టు తేల్చి చెప్పడంతో.. ఇప్పుడు అందరి దృష్టి 1991 ప్రార్థనా స్థలాల చట్టంపై పడింది. 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితులనే కొనసాగించాలనే ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2019 నాటి చారిత్రాత్మక అయోధ్య తీర్పు తర్వాత, ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రముఖ మందిరం-మసీదు న్యాయ పోరాటాలివే..శ్రీకృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు (మధుర, ఉత్తరప్రదేశ్)హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల మధుర ఆలయ సముదాయం, దానిని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ పక్షాల ప్రధాన వాదన. అయితే ఈ కట్టడం 1991 ప్రార్థనా స్థలాల చట్టం రక్షణ పరిధిలోకి వస్తుందని ముస్లిం ప్రతినిధులు వాదిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకుని, ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భక్తులు దాఖలు చేసిన 18 వేర్వేరు వ్యాజ్యాలు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 2024 ఆగస్టు ఒకటిన, మసీదు కమిటీ అభ్యంతరాలను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.కాశీ విశ్వనాథ్ ఆలయం - జ్ఞానవాపి మసీదు (వారణాసి, ఉత్తరప్రదేశ్)అయోధ్య, మధుర తరహాలోనే దేశంలో అత్యంత సంచలనం రేపుతున్న మతపరమైన ఆస్తుల కేసు ఇది. ఔరంగజేబు హయాంలో అసలైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చివేసి, జ్ఞానవాపి మసీదును నిర్మించారని హిందువుల వాదన కాగా, శతాబ్దాలుగా ఇక్కడ నమాజులు జరుగుతున్నాయని ముస్లింలు 1991 చట్టాన్ని ఉదహరిస్తున్నారు. 2021లో ఐదుగురు మహిళలు ప్రార్థనల హక్కుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయపోరాటం వేగవంతమైంది. కోర్టు ఆదేశాలతో జరిగిన సర్వేలో మసీదు ‘వజూఖానా’లో శివలింగాన్ని పోలిన నిర్మాణం బయటపడటంతో సుప్రీంకోర్టు ఆ ప్రాంతానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించింది. అనంతరం 2024లో మసీదులోని ‘వ్యాస్ జీ కా తహ్ఖానా’ బేస్మెంట్లో హిందూ పూజారి రోజూ ప్రార్థనలు చేయడానికి కోర్టు అనుమతించింది.షాహీ జామా మసీదు (సంభాల్, ఉత్తరప్రదేశ్)విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి భగవానుడి ప్రాచీన ‘హరిహర’ ఆలయం ఉన్న స్థలంలో ఈ మసీదును నిర్మించారన్న ఆరోపణలతో 2024లో సంభాల్ జిల్లాలో తీవ్ర పౌర అశాంతి చెలరేగింది. 1526లో బాబర్ కాలంలో ఇది నిర్మితమైందని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు సర్వేకు ఆదేశించింది. రెండో విడత సర్వే సమయంలో భద్రతా బలగాలు, స్థానిక ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు (ఢిల్లీ)ప్రముఖ కుతుబ్ మినార్ సముదాయంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కోసం.. మహ్మద్ ఘోరీ సైన్యాధికారి కుతుబుద్దీన్ ఐబక్ ఏకంగా 27 హిందూ, జైన దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ దేవాలయాల శిథిలాలతోనే మసీదును కట్టారని, అక్కడ తమ దేవుళ్లను పునరుద్ధరించాలని 2021లో హిందూ, జైన భక్తులు సివిల్ కోర్టులో దావా వేశారు. అయితే ఈ కట్టడాల ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన ప్రార్థనలకు చట్టపరంగా అనుమతి లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కౌంటర్ దాఖలు చేసింది. చారిత్రక సంఘటనల ఆధారంగా శాంతికి విఘాతం కలిగించలేమంటూ సివిల్ కోర్టు దావాను కొట్టివేయగా, ప్రస్తుతం దీని అప్పీల్ పెండింగ్‌లో ఉంది.ఈద్గా మైదాన్ (హుబ్బళ్లి, కర్ణాటక)2022లో హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించుకునేందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై అంజుమన్-ఏ-ఇస్లాం సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు మున్సిపల్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ భూమి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం కేవలం ఏడాదికి ఒక్క రూపాయి నామమాత్రపు రుసుముతో 999 సంవత్సరాల లీజును మాత్రమే కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇది సాధారణ ప్రార్థనా స్థలం కాదని, కేవలం బక్రీద్, రంజాన్ పండుగల సమయంలో మాత్రమే ఇస్లామిక్ ప్రార్థనలకు అనుమతించారని తేల్చిచెప్పింది.ఇది కూడా చదవండి: ‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్‌లో పర్యటించారు. రాజధాని ద హేగ్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్‌లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్‌లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్‌లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్‌లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్‌లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్‌కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్‌కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్‌లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్‌కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భారత్‌లోనూ సూపర్ ఎల్‌నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్‌లో సూపర్ ఎల్ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్‌లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్ లేదా జూలైకల్లా సూపర్ ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు. 1997, 2015లో ఎల్‌నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి ఎలా ఉండొచ్చు? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్–సెప్టెంబర్(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్‌లో ఈసారి జూన్‌లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్ ఎల్ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లో వర్షపాతం తగ్గొచ్చు. లద్దాఖ్, రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్‌లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ
ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్ చెప్పారు.కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్మాల్యా బాగ్చి ప్రశ్నించారు.ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు. -
పెట్రో బాదుడు.. మెరుపు సమ్మెకు దిగిన గిగ్ వర్కర్లు
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్ల పెంపుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పెంపుతో ఇటు గిగ్ వర్కర్ల జీవనోపాధి మరింత కష్టాల్లో పడింది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని కార్మికులు ఒంటరిగా భరించలేరని, ప్రభుత్వం-కంపెనీలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మెరుపు సమ్మెకు గిగ్ వర్కర్ల అసోషియేషన్ పిలుపు ఇచ్చింది. ఇవాళ(శనివారం) యాప్ ఆధారిత సేవలను నిలిపివేయాలని గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) నిర్ణయించింది. అయితే ఈ సమ్మె తాత్కాలికంగానే ఉండనుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ సేవలు బంద్ ఉంటాయని నిన్న రాత్రి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. యూనియన్ అధ్యక్షురాలు సీమా సింగ్ మాట్లాడుతూ, “ఇప్పటికే వేసవిని లెక్క చేయకుండా పనిచేస్తున్న డెలివరీ వర్కర్లకు.. పెట్రో పెరుగుదల నేరుగా దెబ్బతీసింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు ఈ భారాన్ని భరించలేరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలోమీటరుకు రూ.20 చెల్లించేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా చెబుతోంది ఏంటంటే.. దేశవ్యాప్తంగా సుమారు 1.4 కోట్ల గిగ్ వర్కర్లు మోటార్‌బైక్‌లు, స్కూటర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మహిళా కార్మికులు, డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది రోజుకు 10–14 గంటలు ట్రాఫిక్జామ్ల్లో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఇంధన ధరలతో పాటు వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ కంపెనీలు చెల్లింపులను తగినంతగా పెంచడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లు ఇలా సమ్మె చేయడం ఇదేం కొత్త కాదు. వేతనాల పెంపు, ఉద్యోగ..సామాజిక భద్రతలు డిమాండ్లతో ఈ మధ్యకాలంలో ఒక్క పూట, ఒక్కరోజు సమ్మెలు చేశాయి కూడా. ఈ నేపథ్యంతో ప్రభుత్వాలకు మెమొరాండం సమర్పించి, డెలివరీ ఛార్జీలు, కిలోమీటరు రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, డున్జో, అర్బన్ కంపెనీ, ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్, అమెజాన్ ఫ్లెక్స్, ఇన్‌స్టామార్ట్ వంటి యాప్ ఆధారిత సంస్థలకు కూడా యూనియన్ లేఖలు పంపింది. పెరిగిన ఇంధన ఖర్చులను కార్మికులపై మోపకుండా, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు ఇప్పటికే అస్థిరంగా ఉన్న వేతనాలను మరింత తగ్గిస్తాయని, దీనివల్ల గిగ్ వర్కర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని గిగ్ & ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. Rising petrol, diesel & LPG prices are directly affecting gig workers across India.GIPSWU demands fair per-kilometre rates for delivery workers & drivers.Appeal for temporary app shutdown tomorrow from 12 PM to 5 PM.#GIPSWU @PTI_News @the_hindu @htTweets @timesofindia pic.twitter.com/y5aECETQii— GIPSWU - Gig & Platform Service Workers Union (@GIPSWU_) May 15, 2026అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడింది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే 11 వారాల పాటు ఆయిల్ కంపెనీలు నష్టాల్ని భరించుకుంటూ వస్తుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్‌కు లీటర్‌కు రూ.3 చొప్పున రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, 2022 తర్వాత పెట్రోల్ రేట్లు పెరగడం ఇదే కాగా.. అదీ రూ.3 పెంచడం ఆందోళనకు దారి తీసింది. -
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
-
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్‌కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
భారత్‌కు ఇంధన భద్రత
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్‌లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు. భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్‌కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పైనా సంతకాలు చేశారు. గుజరాత్లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్‌లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం. మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా యూఏఈ యుద్ధ విమానం ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్‌పోర్టు దాకా ఎస్కార్ట్‌గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్‌పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
భారత బాక్సర్లకు 17 పతకాలు
తాష్కెంట్: ఆసియా అండర్-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 17 పతకాలతో అదరగొట్టారు. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత బాలికలు 12 పతకాలు సాధించగా... భారత బాలురు 5 పతకాలు సొంతం చేసుకున్నారు. బాలికల కేటగిరీలో రాఖీ (46 కేజీలు), నవ్య (57 కేజీలు) స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.ఖుషీచంద్ (48 కేజీలు), దివ్య (63 కేజీలు), హిమాన్షి (70 కేజీలు), జ్యోతి (75 కేజీలు), వన్షిక (80 కేజీలు), గుర్సీరత్ కౌర్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను దక్కించుకున్నారు. మమత (52 కేజీలు), లక్ష్మీ మంజునాథ్ (54 కేజీలు), ఇషిక (60 కేజీలు), హర్నూర్ కౌర్ (66 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు పొందారు.బాలుర కేటగిరీ 75 కేజీల ఫైనల్లో లక్షయ్ ఫొగాట్ 0:5తో తొష్పులతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. నేళ్ల నరేంద్ర కుమార్ (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ కుమార్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలను సంపాదించారు. -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన
'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్‌స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్‌ని తాజాగా విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)Aandhi banke jo aa raha hai usse DHURANDHAR kehte hain.🔥Watch Dhurandhar The Revenge, Raw & Undekha. Grand Digital Premiere on June 4th at 7 PM, starts streaming from June 5th only on JioHotstar.#Dhurandhar2OnJioHotstar #DhurandharTheRevenge #RawAndUndekha@RanveerOfficial… pic.twitter.com/w73rLgM06F— JioHotstar (@JioHotstar) May 15, 2026 -
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.👉 పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.👉హింట్ ఇస్తూ.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతీయడం.. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. సరిపడా నిల్వలు ఉన్నాయంటూనే.. పెంచక తప్పదనే చెబుతూ వచ్చింది. ఈలోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి, కార్‌పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే రూ.3 రూపాయల చొప్పున పెంపుతో సరిపెట్టాయి ఆయిల్ కంపెనీలు.👉 సీఎన్జీ కూడా.. మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు. 👉 ప్రజలలో ఆందోళన.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం ఖాయం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపనుంది. సోషల్ మీడియాలో "ఇది తాత్కాలిక పెంపేనా? లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా?" అనే చర్చలు మొదలయ్యాయి.👉 ఆర్థికవేత్తల అభిప్రాయం.. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. "ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది" అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త ధరలుఢిల్లీ: పెట్రోల్ ₹97.77, డీజిల్ ₹90.67ముంబై: పెట్రోల్ ₹106.54, డీజిల్ ₹93.03హైదరాబాద్: పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70కోల్‌కతా: పెట్రోల్ ₹108.45, డీజిల్ ₹95.02చెన్నై: పెట్రోల్ ₹103.80, డీజిల్ ₹95.39బెంగళూరు: పెట్రోల్ ₹105.96, డీజిల్ ₹93.99పాట్నా: పెట్రోల్ ₹108.54, డీజిల్ ₹94.78జైపూర్: పెట్రోల్ ₹108.03, డీజిల్ ₹93.49తిరువనంతపురం: పెట్రోల్ ₹110.38, డీజిల్ ₹99.26చండీగఢ్: పెట్రోల్ ₹97.30, డీజిల్ ₹85.45తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. -
పెట్రో మంట తప్పదా..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇక తప్పదా అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కోట్లకు పైగా అండర్ రికవరీ వస్తోందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచకుండా కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల కంపెనీలపై భారం మరింత పెరిగింది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఆయిల్ కంపెనీలు భారీ నష్టాలు భరించలేని స్థితికి వచ్చాయని సంకేతాలు ఇచ్చారు. పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ధరల సవరణ తప్పనిసరికావచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా హెచ్చరించారు. అయితే ద్రవ్యోల్బణ భయం కారణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల తక్షణ పెంపు నిర్ణయంపై ఇంకా ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ యుద్ధ ఉద్రిక్తతల దెబ్బతో ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న ఇంధన రేట్లకు తగ్గట్లు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచకపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 14, డీజిల్‌పై రూ. 42 మేర నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం నెలకు రూ. 55,416 కోట్ల మేర అండర్ రికవరీలు ఉంటున్నాయని అంచనా. ఈ నష్టాలను తగ్గించుకుని, తిరిగి గతేడాది స్థాయికి చేరుకోవాలంటే పెట్రోల్, డీజిల్ రేట్లను 20 శాతం మేర పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కనీసం రూ. 10 పెంచితే రూ. 17,000 కోట్ల మేర నష్టం భర్తీ అవుతుందని చెబుతున్నాయి. రేట్లు కొంత పెంచినా ఊరటే.. దేశీయంగా గత రెండు నెలలుగా, ప్రతి నెలా 37 లక్షల టన్నుల పెట్రోల్, 85 లక్షల టన్నుల డీజిల్ వినియోగం ఉంటోంది. దీంతో ఓఎంసీలపై భారం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ కంపెనీలకు నెలకు రూ. 55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో లీటరుకు రూ. 2 చొప్పున పెంచితే నెలవారీ అండర్ రికవరీలు రూ. 52,105 కోట్లకు, రూ. 4 పెంచితే రూ. 48.794 కోట్లకు తగ్గుతాయని భావిస్తున్నారు. రూ. 10 పెంచితే ఓఎంసీలకు రూ. 17,000 కోట్ల భారం తగ్గుతుందని, ఆదాయ నష్టం సుమారు రూ. 38,863 కోట్లకు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
హార్మూజ్‌ను దాటిన 2 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: హార్మూజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్ మే 13వ తేదీన హార్మూజ్‌ను దాటగా ఎన్వీ సన్‌షైన్ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్‌ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్వీ సన్‌షైన్ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్‌కు రప్పిస్తోంది. ఆగని దాడుల పరంపర.. కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్‌ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది. ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్‌కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
పశ్చిమాసియా శాంతి.. అందని ద్రాక్ష కానివ్వం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో గురువారం మొదలైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సదస్సులో పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇకనైనా హార్మూజ్ జలసంధి తెరచుకునేలా, సముద్రమార్గంలో సరకుల రవాణా సవ్యంగా జరిగి ముడిచమురు, నిత్యావసరాల ధరలు దిగొచ్చేలా ప్రపంచదేశాలు సమష్టి నిర్ణయాలు తీసుకుని పశ్చిమాసియా యుద్ధమేఘాలను చెల్లాచెదురుచేయాలని భారత్ ఆశాభావం వ్యక్తంచేసింది. అగ్రరాజ్యాల అసంబద్ధ ఆంక్షల కత్తిని తొలగించేలా ఉమ్మడి పోరాటం చేయాలని బ్రిక్స్ దేశాలకు భారత్ పిలుపిచ్చింది. రెండ్రోజులపాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో తొలిరోజు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించారు. ఇరాన్‌పై దాడికి తెగబడిన అమెరికానుద్దేశించి జైశంకర్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తోటి దేశాలు గౌరవించాలని హితవు పలికారు. ‘‘శాంతి అనేది కలగా మిగిలిపోనివ్వం. అంతర్జాతీయ చట్టాల ఉనికి శాంతే కీలకం. ప్రజలను కాపాడాన్నా, మౌలిక వసతుల పరిరక్షించాలన్నా శాంతి వెల్లివిరియాలి. సంఘర్షణలకు సంప్రతింపులు, దౌత్యమే అత్యుత్తమ మార్గం. ‘‘పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో సముద్రమార్గంలో సరకు రవాణా కష్టమైంది. ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. హార్మూజ్ తెరచుకోవాలి. ఎర్రసముద్రం గుండా రవాణా కొనసాగాలి. ఇక గాజాలో మానవతా సాయం ఊపందుకోవాలి. శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సాయం పెంపు, విశ్వసనీయ మధ్యవర్తిత్వం ద్వారా శాంతిని సాధించం అనేవి ఎంతో కీలకం. పాలస్తీనియన్ల భవిష్యత్తు దృష్ట్యా రెండు దేశాల విధానానికి భారత్ ఓటేస్తోంది’’అని జైశంకర్ అన్నారు. గురువారం బ్రిక్స్ సెషన్స్‌లో ఒక దాంట్లో చర్చవేళ యూఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ జోక్యంచేసుకోవడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, యూఏఈ విదేశాంగ మంత్రి ఖలీఫా షాహీన్ అల్ మరార్‌లు శాంతించారని తెలుస్తోంది. ఈ సెషన్లో బ్రెజిల్ విదేశాంగ మంత్రి మారో వియేరా, ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియానో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా తదితరులు పాల్గొన్నారు. తమదేశంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంపై యూఏఈ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విస్తరణవాదానికి మేం బలయ్యాం ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడారు. ‘‘యుద్దకాంక్షతో రగిలిపోతున్న దేశాల అక్రమ రాజ్యవిస్తరణవాదానికి మేం బలైపోతున్నాం. నేటి సమాజంలో ఇలాంటి ధోరణులకు చోటివ్వకూడదు. హేయమైన దాడులు జరుగుతున్నా ఇరాన్ ప్రజలు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శాంతి కోసం పరితపిస్తున్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తూ మాపై యుద్ధానికి కాలు దువ్విన అమెరికా, ఇజ్రాయెల్‌ను బ్రిక్స్ సభ్యదేశాలు తప్పుబట్టాల్సిందే’’అని అరాఘ్చీ డిమాండ్‌చేశారు. -
బిగ్ క్యాట్, బిగ్ మిషన్ : భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: బిగ్ క్యాట్లుగా ఖ్యాతికెక్కిన సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతాల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బిగ్‌క్యాట్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) సమ్మిట్–2026కు ముందస్తు సన్నాహక కార్యక్రమాలుగా మోదీ సర్కార్ వీటిని నిర్వహించబోతోంది. భారత్‌లో పులి, ఆసియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతా సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యలను ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పులుల సంరక్షణలో మనమే ఆదర్శంప్రపంచంలోని అడవి పులులలో 70 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ టైగర్’(ఎన్టీఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రపూర్ కార్యక్రమంలో టైగర్ రిజర్వుల విస్తరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, వన్యప్రాణి కారిడార్ల రక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలను వివరించనున్నారు. ప్రపంచంలో ఆసియాటిక్ సింహాలు కేవలం భారత్‌లోనే ఉండటంతో గిర్ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ‘ప్రాజెక్ట్ లయన్’ కింద దీర్ఘకాలిక సంరక్షణ, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాధి నిరోధక పర్యవేక్షణ, మాల్ధారి సముదాయాల భాగస్వామ్యం వంటి అంశాలను ప్రదర్శించ నున్నారు. ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!మనుషుల మధ్యే చిరుతల సహజీవనంభువనేశ్వర్లో జరిగే కార్యక్రమంలో చిరుతలు మానవ నివాస ప్రాంతాల దగ్గర ఎలా జీవిస్తున్నాయో, మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించే చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్యాంగ్‌టక్‌లో జరిగే కార్యక్రమంలో మంచు చిరుతల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, పర్వత జీవవ్యవస్థల పరిరక్షణపై చర్చించనున్నారు.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లిచీతాల పునరావాసంలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపుమధ్యప్రదేశ్లోని భోపాల్ కార్యక్రమంలో ‘ప్రాజెక్ట్ చీతా’పై ప్రత్యేకంగా దృష్టి సారించ నున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్‌కు తీసుకువచ్చి పునరావాసం కల్పించడం ప్రపంచంలోనే తొలి అంతర్‌ఖండ పెద్ద మాంసాహారి జీవి మార్పిడి ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. భారత్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిగ్ క్యాట్ జాతుల సంరక్షణకు సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు వేదికగా నిలవనున్నాయి. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఐదు రాష్ట్రాల్లో బిగ్ క్యాట్లసంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు..ఆసియా సింహం – గిర్(గుజరాత్)చీతా – భోపాల్(మధ్యప్రదేశ్)చిరుత – భువనేశ్వర్(ఒడిశా)మంచు చిరుత – గ్యాంగ్‌టక్(సిక్కిం)పులి – చంద్రపూర్(మహారాష్ట్ర) -
రాబోయేది లాక్ డౌన్ కాదు... అంతకుమించి!!
-
భారత్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. పర్యటన ఫలిస్తుందా..?
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత్ చేరుకున్నారు. ఈ రోజు (మే 14,15) తేదీలలో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అరాఘ్చీకి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మెుదలైన తర్వాత ఇరాన్ ప్రతినిధులు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఆయన వినియోగించిన మినాబ్ 168 విమానం ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్దం ముగిసిందా అనే విషయంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు దేశాలు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో యుద్ధం ముగింపుపై స్పష్టత వచ్చే అంశం కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన ఇప్పుడు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది.మినాబ్ 168 విమానంలో భారత్ చేరుకున్న అరాగ్చీఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మినాబ్ 168 అనే పేరు గల ఇరాన్ విమానంలో భారత్ చేరుకున్నారు. ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల మీద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది బాలికలు మరణించారు. అమాయక పౌరులపై జరిగిన దాడులకు గుర్తుగా, ఆ విషాద ఘటనను ప్రతిబింబించేలా ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఎండగట్టడానికి ఇది చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ఒత్తిడి తెస్తున్న ఇరాన్అయితే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌పై ఇరాన్ గత కొంతకాలంగా ఇరాన్ ఒత్తిడి చేస్తూ వస్తుంది. అయితే కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో ఈ అంశంలో యుఏఈతో పాటు ఇతర సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుత సమావేశంలో యుద్ధంపై ఉమ్మడి ప్రకటన వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.సమావేశ ప్రధాన లక్ష్యాలు"BRICS@20: స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం" అనే థీమ్‌తో జరుగుతోంది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు మరియు బహుపాక్షిక వ్యవస్థల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. అయితే, సభ్య దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ కూటమి ఐక్యతకు పరీక్షగా మారాయి.#WATCH | Delhi: Foreign Minister of Iran, Syed Abbas Araghchi arrives in India for the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/l5c8DqzYLc— ANI (@ANI) May 13, 2026 -
నీట్ నిందితులతో బీజేపీ నేతల ఫొటోలు లీక్.. కలకలం..
నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం కోసం లక్షలాది మంది అమాయక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇండియా టుడేలో వచ్చిన ఓ క్లిప్‌ను ఆయన పోస్ట్ చేశారు.So, it seems that the NEET paper leak accused is closely associated to the BJP! They are playing with the lives of millions of innocent students for dirty money! pic.twitter.com/PPYhbPWmFb— Prashant Bhushan (@pbhushan1) May 13, 2026దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘‘నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ నిందితుడు దినేశ్ బిన్వాల్తో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర, పలువురు బీజేపీ నాయకుల ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ప్రశ్నపత్రం లీక్ రాకెట్లో బీజేపీ ఎంతగా భాగస్వామ్యమైందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ మాఫియాకు రక్షకుడిగా బీజజేపీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు, భావోద్వేగాలతో బీజేపీ ఆటలాడుతోంది. ఈ ప్రశ్నపత్రం లీక్ మోసాల వల్ల అమాయక విద్యార్థులు ఇంకా ఎంతకాలం బాధపడాలి?’’ అని నిలదీసింది.రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌తో నీట్ లీక్ నిందితుడి ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఇండియా టుడేలో వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రతో కూడా నిందితుడి ఫొటో కనిపించిందని క్లిప్‌లో ఇండియా టుడే తెలిపింది.ప్రస్తుతం దీనిపై పరిశీలన జరుగుతోంది. నీట్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుల అరెస్టులు జరిగాయి. లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారు రూ.30 లక్షలకు లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష రాస్తుండటంతో అతనికి ఆ ప్రశ్నపత్రం ఇచ్చారని అభియోగం ఉంది.అదే కాకుండా, ఆ లీకైన ప్రశ్నాపత్రాన్ని మరికొందరికీ అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీక్ ఈ ఏడాదికే పరిమితం కాదని, 2025లో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే నిందితుల కుటుంబానికి చెందిన నలుగురు 2025లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని వారు వెల్లడించారు. అరెస్టైన నిందితులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.మంగీలాల్, దినేష్ ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వీరే నీట్ 2026 లీకైన ప్రశ్నపత్రం వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 2025లో కూడా ప్రశ్నపత్రం ఎలా లీకైందన్న విషయంపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం పంపినట్టు సమాచారం. Photos of NEET Exam paper leak accused Dinesh Binwal with Rajasthan Education Minister Madan Dilawar, BJP MLA Mahendra and several BJP leaders have now surfaced publicly.This clearly shows how deeply the BJP is involved in the paper leak racket, not as a silent spectator, but… pic.twitter.com/cP9LTwGTxF— Congress (@INCIndia) May 13, 2026 -
మరింత పెరిగిన పాల ధరలు.. ఎంతంటే?
అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి రానున్నాయని తాజాగా ఆయా సంస్థలు విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా వెల్లడైంది. పెంచిన ధరలు ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, బఫెలో మిల్క్, ప్రీమియం రకాల పాలపై కూడా వర్తిస్తాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విక్రయించే అమూల్ పాలు లీటర్‌కు రూ.1-2 వరకు పెరిగాయి. అమూల్ గోల్డ్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.68 నుంచి రూ.70కి చేరింది. అమూల్ లీటర్ పాలు రూ.55 నుంచి రూ.57కు చేరింది.బఫెలో మిల్క్, కౌ మిల్క్, స్లిమ్ అండ్ ట్రిమ్, టీ స్పెషల్ రకాల ధరలను కూడా అమూల్ పెంచింది. అమూల్ బఫెలో మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.38 నుంచి రూ.39కి చేరింది. కౌ మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.30కి చేరింది.మదర్ డెయిరీ ధరలు ఇలా.. మదర్ డెయిరీ కూడా పలు స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలు పెంచింది. మే 13న డిస్ట్రిబ్యూటర్లు, రవాణాదారులకు పంపిన సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. కొత్త ధరల ప్రకారం మదర్ డెయిరీ బఫెలో మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.75 నుంచి రూ.80కి పెరిగింది. 500 మిల్లీ లీటర్ల బఫెలో మిల్క్ ప్యాక్ ధర కూడా రూ.76 నుంచి రూ.80కి మారిందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.69 నుంచి రూ.72కి చేరింది. 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.70 నుంచి రూ.72కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, ప్రో మిల్క్ రకాల ధరలు కూడా సంస్థ సవరించింది.మే 13 రాత్రి నుంచి సరఫరా అయ్యే పాలపై ఈ కొత్త ధరలు వర్తిస్తాయని, మే 14 ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ఈ ధరల ప్రకారమే జరుగుతాయని సర్క్యులర్‌లో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా పాల సేకరణ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు సంస్థలు పలుమార్లు పాల ధరలు సవరించాయి. ఈ ధరల పెంపు వినియోగదారులపై మరింత భారం మోపనుంది.పశువుల మేత, రవాణా, ప్యాకేజింగ్, పాల సేకరణ ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని పాల సంస్థలు గతంలో వెల్లడించాయి. 2022 నుంచి సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రాష్ట్రాల వారీగా విడతల వారీగా ధరలు సవరించాయి. అమూల్, మదర్ డెయిరీ, నందిని వంటి సంస్థలు ప్రాంతాల వారీగా పాల సేకరణ పరిస్థితులు, ముడి ఖర్చుల ఆధారంగా వేర్వేరు సమయాల్లో ధరలు మార్చాయి.భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. పట్టణ కుటుంబాల వినియోగంలో ప్యాకెట్ పాలు కీలక భాగంగా ఉన్నాయి. పాల సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు తీసుకునే ధరల నిర్ణయాలు పాల సేకరణ ఖర్చులు, సీజనల్ సరఫరా పరిస్థితులు, పంపిణీ వ్యయాలపై ఆధారపడి ఉంటాయి. -
అచ్చం భారతీయ స్త్రీలా రష్యన్ మహిళ..!
ఇంతవరకు చాలామంది భారత్ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేసుకుంది. ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్ జోడించి మరి వీడియోని పోస్ట్ చేసింది.నేర్చుకున్న ఐదు అలవాట్లు..1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్‌లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్‌లో రాసింది.2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్‌గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె. 4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్ చేస్తానని చెబుతోంది.నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝑫𝒆𝒔𝒊𝒍𝒊𝒇𝒆 |𝑩𝒆𝒂𝒖𝒕𝒚 |𝑰𝒏𝒅𝒊𝒂 (@sofia_desilife) (చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్) -
NEET వివాదం: చైనా మోడల్‌తో ఏ లీకులు ఉండవ్!
భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్ తెర మీదకు తెచ్చారు. భారత్‌లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన. చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.ఏంటీ గావ్కావో (Gaokao)? గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్‌లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.ఈ ఎంట్రెన్స్‌లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..అందుకే భారత్‌కు అవసరం!భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్‌ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్‌లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రూపాయి కొత్త కనిష్టానికి
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బతో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణిస్తోంది. తాజాగా మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 40 పైసలు పడిపోయి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 95.68కి పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలరుతో పోలిస్తే క్రితం ముగింపు (95.28) కన్నా తక్కువగా 95.57 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత ఒక దశలో 95.74కి కూడా పతనమైంది. చివరికి 40 పైసల క్షీణతతో ముగిసింది. సోమవారం నాడు కూడా దేశీ కరెన్సీ 79 పైసలు క్షీణించిన సంగతి తెలిసిందే. -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ టాప్
-
పెట్రోల్, గ్యాస్ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇంధనం ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.పశ్చిమాసియాలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం మనపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయంతో అధికంగా కొనుగోలు చేయొద్దు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) శర్మ మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారత్‌కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినా అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని చెప్పారు.దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని శర్మ తెలిపారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థిక భారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధానమంత్రి వాటిపై ఆదివారం ఆ పిలుపును ఇచ్చారని చెప్పారు. సరఫరాలపై ప్రభావం అత్యల్పంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇంధన పొదుపు లక్ష్యంతోనే..అవసరంలేని ప్రయాణాలు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని అధికారులు తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఇంధనం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.అనేక దేశాల నుంచి దిగుమతులువిదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణ, సరఫరా చర్యల్లో భాగంగా భారత్ అనేక దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, ప్రణాళికలు ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.పశ్చిమాసియా పరిస్థితులపై భారత్ వైఖరిని కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మొదటి నుంచే శాంతి, చర్చలకు భారత్ మద్దతు ఇస్తోందని తెలిపారు. భారత నౌకలు సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నాయని పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒపేష్ శర్మ తెలిపారు. భారత జెండా ఉన్న 10 నౌకలు ఇప్పటివరకు అదనపు రుసుములు చెల్లించకుండా హార్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా 13 భారత జెండా నౌకలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నౌక సిబ్బంది సంక్షేమం, వారి అవసరాలను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, పెట్రో ధరల పెంపుపై మాత్రం కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. -
పాక్ మునీర్ నోటి దురుసు.. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్.. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని పేర్కొన్నారు. భారత్‌పై మరోసారి పలు ఆరోపణలు చేశారు.ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మునీర్.. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్థాన్ జాతీయ ఐక్యతతో, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా-ఎ-హక్ కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని వ్యాఖ్యానించారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు.అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అన్నారు. భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకుని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధవిమానాల కొనుగోళ్ల ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునీర్ తెలిపారు.మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన హక్కును వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలను ఇక సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటిస్తోంది. ఇక, భారత్ కూడా.. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. పాక్ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్ పేర్కొంది. -
సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్డీ పూర్తి చేసి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్ సిస్టమ్స్‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.ప్రమాణాల్లో తేడా నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్డీ స్టైపెండ్ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్ డ్రింక్స్ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్‌లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.2026 నాటికి, ఒక సగటు అమెరికన్ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్మెంట్ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.వలసల వెనుక అసలు నిజంవలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్‌హోల్’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!సైన్స్ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్ నంబ్నెస్‘ (ఆనందాన్ని ఫీల్ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్ (డోపమైన్, సెరోటోనిన్) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
భవిష్యత్తు భారత్‌లోనే.. అమెరికాలో కాదు!
చేయడానికి ఒక ఉద్యోగం, మంచి జీతం వస్తే చాలు, అనుకునేవాళ్లే సంఘంలో చాలామంది ఉన్నారు. ఇందులో కొందరికి సొంతంగా ఏదైనా బిజినెస్ లేదా నచ్చినపని చేయాలని ఉన్నప్పటికీ.. భయం లేదా ఇతరత్రా కారణాల వల్ల ముందడుగు వేయరు. కానీ.. అమన్ గోయల్ అనే యువకుడు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఇంటర్న్‌షిప్ వదిలి, సొంతగడ్డపై స్టార్టప్ ప్రారంభించాలని స్వదేశానికి వచ్చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో చదువుతున్నప్పుడే అమన్ గోయల్.. కేవలం 20 సంవత్సరాల వయసులో అమెరికాలోని రుబ్రిక్ అనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందాడు. ఆ సమయంలో ఆయన జీతం నెలకు 8,000 డాలర్లు (రూ.7.5 లక్షలు). కానీ ఇది అతనికి అంతగా నచ్చలేదు.తన భవిష్యత్తు అమెరికాలో కాకుండా.. భారతదేశంలో ఉందని అమన్ గోయల్ గ్రహించాడు. నేను కూడా ఒక కంపెనీని నిర్మించాలి, నా దేశంలోనే ఎదగాలి అనే ఆలోచన అతనిలో బలపడింది. అందుకే తిరిగి భారతదేశానికి వచ్చి, కేవలం ఇంజనీరింగ్ జ్ఞానంతో సరిపెట్టుకోకుండా.. వ్యాపారం నిర్మాణం గురించి కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.Ten years ago, I landed in San Francisco as a 20-year-old kid from IIT Bombay, headed to Palo Alto to intern at @rubrikInc's Software Engineering Team.I was earning $8,000 a month. It felt like a dream.My mentor was an @CSE_IITBombay senior, who made me fall in love with… pic.twitter.com/EjphbHWNs9— Aman Goel (@amangoeliitb) May 9, 2026కాలేజీలో చదువుతున్న చివరి సంవత్సరంలోనే వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ప్రొడక్ట్ డిజైన్, సేల్స్ వంటి విషయాలను అభ్యసించాడు. “ఇంజనీరింగ్ నా బలం అయినా, వ్యాపారం నిర్మించడం నా అసలు లక్ష్యంగా మారింది” అని అమన్ గోయల్ చెప్పాడు.ఇదీ చదవండి: ఉద్యోగులకు సీఈఓ మదర్స్ డే గిఫ్ట్!కొన్ని సంవత్సరాల తరువాత, అతడు స్థాపించిన GreyLabs AI అనే సంస్థ 85 మందికి పైగా ఉద్యోగులతో పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించి, ప్రతి సంవత్సరం మూడు రెట్లు వృద్ధిని సాధిస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా వృద్ధిలోకి రాలేదు. ఎన్నో రిస్కులు, కష్టాలు, అనిశ్చితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గొప్ప వృద్ధిని సాధించగలిగింది. -
లోక కళ్యాణమే వీరి వివాహ బంధం..
సాక్షి, స్పెషల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి బ్రహ్మచారి కావడంతో దేశంలో బ్రహ్మచారులు పాలకులుగా ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో రాణిస్తుండడం ఆసక్తి గొలుపుతోంది. బ్రహ్మచర్యం అనేది కేవలం పెళ్లి చేసుకోకపోవడం మాత్రమే కాదు.. అది అంతకంటే లోతైన అర్థం కలిగిన ఒక జీవన విధానం. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఉన్నతమైన లక్ష్యం కోసం తన శక్తిని మళ్లించడమే బ్రహ్మచర్యం.శాస్త్రీయంగా చూస్తే ‘బ్రహ్మ’అంటే పరమాత్మ లేదా సత్యం. ‘చర్యం’అంటే నడుచుకోవడం. అంటే సత్య మార్గంలో పయనించడం అని అర్థం. ఆధ్యాత్మిక కోణంలో దీనికి మూడు ప్రధాన పునాదులు ఉన్నాయి. అవి క్రమశిక్షణ (శారీరక, మానసిక కోరికలపై నియంత్రణ కలిగి ఉండటం), ఏకాగ్రత (ప్రాపంచిక సుఖాల కంటే సమాజ హితం లేదా ఆధ్యాత్మిక ఉన్నతిపై దృష్టి పెట్టడం), నిస్వార్థం (వ్యక్తిగత కుటుంబ పరిధిని దాటి లోకాన్నే తన కుటుంబంగా భావించడం).కలాం, వాజ్‌పేయిల సందేశం.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నత పదవులను అధిరోహించి సమాజానికి పలు సందేశాలు అందించారు.దేశమే ప్రథమ ప్రాధాన్యత: వారికి సొంత కుటుంబం, వారసులనే బంధాలు లేవు. తీసుకునే నిర్ణయాల్లో పక్షపాతం లేదా ‘నా వారు’అనే స్వార్థం ఉండదు. సమాజాన్నే కుటుంబంగా భావిస్తారు.అంకితభావం: కుటుంబ బాధ్యతలు లేకపోవడంతో పూర్తి సమయాన్ని, శక్తిని ప్రజాసేవకే కేటాయించగలరు. అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా రాత్రింబవళ్లు శ్రమించడమే దీనికి నిదర్శనం.నిరాడంబరత: అత్యున్నత పదవుల్లో ఉన్నా సాదాసీదాగా జీవిస్తారు. పదవి అనుభవించడానికి కాదు.. బాధ్యతను నెరవేర్చడానికని వీరు నిరూపించారు.నైతిక బలం: బ్రహ్మచర్యం ఇచ్చే ఆత్మనిగ్రహం వల్ల ఒత్తిళ్లకు లొంగరు. అవినీతికి ఆస్కారంలేని పాలనను అందించడానికి ఈ మానసిక స్థితి ఎంతో దోహదపడుతుంది. బ్రహ్మచారిగా ఉండటం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు.. మరింత పెద్ద బాధ్యతను (దేశాన్ని/సమాజాన్ని) భుజాన వేసుకోవడం. అబ్దుల్ కలాం, వాజ్‌పేయి ల జీవితాలే ఇందుకు నిదర్శనం. దేశం కోసం జీవితాలను అంకితం చేసి నిస్వార్థంగా పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతామని నిరూపించారు.వీరంతా బ్రహ్మచారులే.. దేశంలో బ్రహ్మచారులుగా ఉండి ఉన్నత పదవుల్లో రాణించినవారు చాలా మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందుత్వవాది. గోరఖ్‌నాథ్ మఠానికి మహంత్. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ (దీదీ) కూడా అవివాహితురాలే. 24 ఏళ్లపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నవీన్ పట్నాయక్ సైతం బ్రహ్మచారే. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెళ్లి చేసుకోకుండానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అవివాహితుడే. ప్రధాని నరేంద్ర మోదీ పెళ్లి చేసుకున్నప్పటికీ గృహస్థ జీవితానికి దూరంగా బ్రహ్మచారిగానే ఉంటూ దేశ సేవకు అంకితమయ్యారు. -
వృద్ధి రేటు 6.6తగ్గొచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ తెలిపింది. గతంలో 7.1 శాతం వృద్ధి అంచనాను ప్రకటించడం గమనార్హం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. వీటిని అధిగమించేందుకు భారత్ తగినన్ని ఇంధన నిల్వలు సమకూర్చుకోవాలంటూ.. ఇందుకు వీలుగా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం ఆర్థిక వృద్ధిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి పేర్కొన్నారు. ఆహార భద్రతకు రిస్క్ పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా శీతాకాలం పంటలకు ఎరువుల కొరత ఏర్పడొచ్చని జోషి అంచనా వేశారు. భారత్ ఇంధన, ఆహార భద్రత, ఎరువుల రంగంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత్ వివిధ దేశాలతో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా తగిన ప్రయోజనాలను అందుకోవాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని.. ఎఫ్‌టీఏలతో మరిన్ని మార్కెట్ అవకాశాలు లభించినప్పటికీ, వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టినప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని నివేదిక తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఒక దశలో 126 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల స్థాయిలో ఉండడం గమనార్హం. యుద్ధానికి ముందు 60–70 డాలర్ల మధ్యే ఉంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తోంది. ఎక్సైజ్ ట్యాక్స్ వరకు తగ్గించడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ)పై అధిక చమురు ధరల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్నకు జోషి స్పందిస్తూ.. అంతర్జాతీయంగా అధిక ధరలు ఉన్నప్పటికీ భారత్‌లో వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనట్టు చెప్పారు. దీని కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది గరిష్ట స్థాయి అయిన 3.4 శాతానికి పెరగ్గా.. టోకు ద్రవ్యోల్బణం 38 నెలల గరిష్ట స్థాయి 3.88 శాతానికి చేరడం తెలిసిందే. -
ఆరు ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నప్పటికీ, దేశీయ ఐపీఓ మార్కెట్ మాత్రం ఆశావహ సంకేతాలు ఇస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడం, కార్యకలాపాలను విస్తరించుకోవడం, డైవర్సిఫికేషన్ లక్ష్యాలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన ఆరు కంపెనీలకు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. తద్వారా ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఐపీఓలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విభిన్న రంగాలకు చెందిన జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్, హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్, సర్జివేర్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హోటల్ పోలో టవర్స్ అక్టోబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మే 4 నుంచి 8 మధ్య ఈ దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీఓలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. రాబోయే ఐపీవోల వివరాలివీ.. జెప్టో రూ.11,000 కోట్ల ఇష్యూ క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో ప్రస్తుతం మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి దిగ్గజాలతో పోటీపడుతోంది. త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమిక మార్కెట్ నుంచి దాదాపు రూ.11 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సెబీ తాజా అనుమతులతో షేరు ధరల శ్రేణి, సబ్ర్స్కిప్షన్ తేదీలు, లిస్టింగ్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీ సన్నద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్, స్టార్టప్ ఐపీఓలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ జెప్టో పబ్లిక్ ఆఫర్‌కు రావడం గమనార్హం. లిస్టింగ్ పూర్తైతే ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీల్లో ఉన్న జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది. ధూత్ ట్రాన్స్మిషన్ ఆటో ఉపకరణాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ ద్వారా దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,258 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాలను విక్రయించబోరని సమాచారం. కంపెనీలో బెయిన్ క్యాపిటల్ పెట్టుబడులు ఉన్నాయి. → జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్ సంస్థలు ‘కాని్ఫడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ రూట్’ను ఎంచుకున్నాయి. ఈ విధానం ద్వారా ముసాయిదా పత్రాలను బహిరంగపరచకుండానే సెబీ నుంచి ప్రాథమిక అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్ ఐపీఓ ద్వారా రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఓఎఫ్ఎస్ లేదు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.2,250 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. సర్జివేర్ఉత్తరప్రదేశ్కు చెందిన మెడికల్ డివైసెస్ తయారీ సంస్థ సర్జివేర్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఐపీఓకు సిద్ధమైంది. తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ. 370 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ ఘనశ్యామ్ దాస్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ.370 కోట్ల ఈక్విటీలను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త యంత్రాల కొనుగోలు, తయారీ సామర్థ్యాల పెంపు, రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ వ్యవసాయ పంటల రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతో ఐపీఓకు రానుంది. అదనంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 74.05 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఎఫ్‌సీ ఎమర్జింగ్ ఆసియా ఫండ్ వాటాలను విక్రయించనున్నాయి. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థ సఫైర్ క్రాప్ సైన్స్ మూలధన అవసరాలు, భవిష్యత్ కొనుగోళ్లు, వ్యూహాత్మక విస్తరణకు వినియోగించనుంది. హోటల్ పోలో టవర్స్ హాస్పిటాలిటీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్ పోలో టవర్స్ సంస్థ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా 71.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధి, అప్పుల తగ్గింపు, మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా ఈశాన్య, తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ‘పోలో’, ‘మ్యాక్స్’ బ్రాండ్ల పేరుతో అప్స్కేల్, మిడ్‌స్కేల్ హోటళ్లు, రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.మే 12న ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ఇష్యూ షురూ.. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీదారు ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ప్యాక్ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 47–50గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.35.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ 70.65 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.35.32 కోట్ల సమీకరించనుంది. మే 11న యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ ఉంటుంది. -
దివ్యాస్త్రం దిగ్విజయం
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతను జోడించిన అగ్ని–5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వేదిౖకైంది. ఎంఐఆర్వీ సాంకేతికతను జతచేసి అగ్ని క్షిపణికి శుక్రవారం పరీక్షించామని రక్షణశాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘మిషన్ దివ్యాస్త్ర’అని పేరుపెట్టారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్(ఎంఐఆర్వీ) సాంకేతికత సాయంతో ఒకే క్షిపణి ద్వారా పలు వార్హెడ్లను ఏకకాలంలో ప్రయోగించవచ్చు. క్షిపణి కోసం శుక్రవారం తొలుత హిందూ మహాసముద్రజలాల్లో, భూతలంపై సుదూరాల్లోని వేర్వేరు ప్రాంతాలను లక్ష్యాలుగా నిర్దేశించారు. ‘‘కలాం ప్రయోగకేంద్రంలోని లాంచర్ నుంచి దూసుకెళ్లిన అగ్ని–5 క్షిపణి నింగిలోకి అత్యంత ఎత్తుకు చేరాక కిందకు తిరిగొస్తూ వేర్వేరు ప్రాంతాల్లోని లక్షిత ప్రదేశాలను ఢీకొట్టేలా పేలోడ్లను జారవిడిచింది. ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయి. పేలోడ్ల వేగం, పథం నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయి. దీంతో ఎంఐఆర్వీ సాంకేతికతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది’’అని రక్షణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భూతలంపై, నౌకలపై మోహరించిన ట్రాకింగ్ వ్యవస్థల సాయంతో ఈ ప్రయోగం ఫలితాలను విశ్లేషించి పరీక్ష విజయవంతమైందని నిర్ధారించుకున్నారు. 5,000 కిలోమీటర్ల పరిధిలో... అగ్ని–1 క్షిపణి మొదలు అగ్ని–4 క్షిపణి దాకా అగ్నిరకం మిస్సైళ్లు 700 నుంచి గరిష్టంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. అగ్ని–5 ఏకంగా 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు. ఈ క్షిపణిని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధిచేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లోని రక్షణరంగ తయారీసంస్థల సహకారంతో ఈ క్షిపణిని తయారుచేశారు. ఎంఐఆర్వీ టెక్నాలజీని జోడించిన అగ్ని–5ను గత ఏడాది మార్చినెలలో తొలిసారిగా పరీక్షించిన విషయం తెల్సిందే. తాజా ప్రయోగం విజయవంతంకావడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఆనందం వ్యక్తంచేశారు. పరిశోధన, ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్డీవో, భారత సైన్యం, సంబంధిత పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులోంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునేందుకు 2024 ఏప్రిల్‌లో భారత్ తొలిసారి ఎండో–అటా్మస్ఫిరిక్ ఇంటర్సెప్టార్ మిస్సైల్‌ను తొలిసారిగా పరీక్షించింది. తర్వాత ప్రతిష్టాత్మక బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మరోసారి అగ్ని–5 ఎంఐఆర్వీ సాంకేతికత సఫలంతో భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యం మరింత పటిష్టంకానుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీని అందిపుచ్చుకున్న అతికొద్ది ప్రపంచదేశాల సరసన భారత్ చేరింది. గతంలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్దే ఈ టెక్నాలజీ ఉండేది. డీఆర్డీవో శాస్త్రవేత్తల కృషితో ఇప్పుడీ టెక్నాలజీ భారతపరమైంది. -
నిజంగానే వచ్చేస్తున్నాయా?
ఈసారైనా వర్షాలు టైంకి పడతాయా? అనే కోట్లాది దేశ ప్రజలకు మదిలో మెదిలే ప్రశ్న. ప్రతీసారి అంచనాలు వేయడం.. అవి తప్పడం.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చూస్తున్నది. అయితే ఈసారి కచ్చితమైన సమాచారం ఉందని.. ఆన్ టైంకే వర్షాలు పడతాయని బల్ల గుద్ది మరీ చెబుతోంది భారత వాతావరణ శాఖ. మునుపెన్నంతగా.. ఈ మే నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ.. పుదుచ్చేరిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనిని రుతుపవనాల రాకకు సంకేతంగానే భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. వాళ్ల అంచనా ప్రకారం.. మరో రెండు వారాల్లోనే అండమాన్, నికోబార్ దీవులకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి.. జూన్ 1వ తేదీనాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయన్నమాట. ఇందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా.. తమ దేశంలో వర్షాకాలం ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు అది మరో దేశపు వెదర్ బులిటెన్ మాత్రమే కావొచ్చు. భారత రుతుపవనాల కదలికలను గమనించే వాతావరణ శాస్త్రజ్ఞులకు మాత్రం ఈ ప్రకటన ఎంతో కీలకం. ఈ ప్రకటన ఆధారంగానే భారత్‌కు రుతుపవనాల రాకను అంచనా వేస్తారు.భారత మాన్సూన్ను అర్థం చేసుకోవాలంటే.. భూమధ్యరేఖ చుట్టూ తిరుగుతూ ఉండే ఒక అజ్ఞాత మేఘాల బెల్ట్‌ను ఊహించుకోవాలి. భూమధ్యరేఖ వద్ద ఉన్న ఈ మేఘాల బెల్ట్ ప్రతి సంవత్సరం సూర్యుడి కదలికను అనుసరిస్తూ దిశ మార్చుకుంటుంది. అంటే.. ఉత్తరార్థగోళం వేసవిలో ఉత్తర దిశగా, దక్షిణార్థగోళం వేసవిలో దక్షిణ దిశగా కదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను మోసుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో దక్షిణ భాగం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడది కచ్చితంగా ఉత్తర దిశగా కదిలి, సముద్రం నుంచి తేమతో నిండిన గాలులను దక్షిణ ఆసియాకు లాగి వర్షాలు కురిపిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రుతుపవనాలు సమయానికి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ బెల్ట్ ఉత్తర దిశగా భూమధ్యరేఖ దాటి మాల్దీవులు, శ్రీలంక వైపు కదిలి, భారతదేశంలోని అండమాన్–నికోబార్ దీవులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది కేరళ తీరానికి చేరి, దేశమంతా వర్షాలను విస్తరింపజేస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటన.. భారత్‌కు రుతుపవనాలు సకాలంలో వస్తాయన్న స్పష్టమైన సంకేతంగా భావించబడుతోంది. ఈ సహజ చక్రం వల్ల.. మే–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల రాకతో భారత్‌లో వర్షాలు పడతాయి. సెప్టెంబర్ చివరికి ఈ బెల్ట్ తిరిగి దక్షిణ దిశగా కదిలి, ఆస్ట్రేలియాలో వర్షాకాలం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపిస్తుండడం.. సరైన దిశలో మేఘాల బెల్ట్ కదలికలు ఉండడంతో.. రుతుపవనాల రాక సమీపిస్తోందని వాతావరణ శాఖ ధీమాగా చెబుతోంది. అయితే.. ఈసారైనా ఆ అంచనా ఫలిస్తుందో చూడాలి. -
సామాన్యుడి జేబుకు చిల్లు.. పెరగనున్న పెట్రోల్, డీజిల్
-
భారత్‌లో ఎడోబ్ విస్తరణ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎడోబ్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీకి ఇది దేశీయంగా ఏడో ఆఫీసు. ఇందులో 700 మంది పైగా ఉద్యోగులు ఉంటారు. 1997లో ఇంజినీరింగ్ ఆర్అండ్డీ సెంటరుగా భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ఎడోబ్ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం అమెరికా వెలుపల చూస్తే ఇక్కడే అత్యధికంగా 8,000 మందికి పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీ మార్కెట్లో కంపెనీ ఇటీవలి కాలంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రెడిషన్ ఉన్న సంస్థల విద్యార్థులకు ఫైర్‌ఫ్లై, ఫొటోషాప్, యాక్రోబ్యాట్లాంటి ఏఐ ఆధారిత టూల్స్‌ని ఉచితంగా అందించేలా 2026 ఫిబ్రవరిలో కంపెనీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కి చెందిన 36 కోట్ల మంది యూజర్లకు ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. -
భారత్‌పై చైనా బండారం బట్టబయలు.. పాక్‌కు సాయం
బీజింగ్: గతేడాది భారత్‌తో జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్‌కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధ్రువీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఏవీఐసీ) సంస్థ అధీనంలోని చెంగ్దు ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అధికారి ఝాంగ్ హెంగ్ తాజాగా అధికార చైనా టీవీకిచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయం వెల్లడించారు. ఈ సంస్థ చైనా అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్ల డిజైన్లను రూపొందిస్తుంటుంది. గతేడాది మేలో ఆపరేషన్ సిందూర్ ప్రకటించిన భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలతోపాటు వైమానిక, సైనిక స్థావరాలపైనా దాడులు చేసి, తీవ్రంగా దెబ్బతీయడం తెలిసిందే. ఆ నాలుగు రోజుల యుద్ధం సమయంలో పాకిస్తాన్‌కు సాంకేతిక మద్దతిచ్చామని ఝాంగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ వద్దనున్న జె–10సీఈ యుద్ధ విమానాలు ఏవీఐసీ అనుబంధ సంస్థ తయారు చేసినవే కావడం గమనార్హం. ‘ఆ నాలుగు రోజులపాటు జెట్ విమానాల శబ్ధాలు, హెచ్చరిక సైరన్ల మోతలతోపాటు ఉదయం వేళలోనే 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో పనిచేయడం మాకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పెద్ద పరీక్షగా అనిపించింది. అయితే, మేం తయారు చేసిన జె10సీఈ యుద్ధ విమానాలు సామర్థ్యానికి తగ్గట్లుగా పనిచేసేలా చూడటం మా బాధ్యత’అని ఝాంగ్ వివరించారు. భారత్‌తో నాలుగు రోజుల యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు సాయం అందించారన్న ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ, సైనికాధికారులు ఇప్పటికీ సూటిగా సమాధానం ఇవ్వకపోకవడం గమనార్హం. -
భారత్‌కు బిగ్ షాకిచ్చిన బంగ్లాదేశ్
బీజింగ్: తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్ కాంప్రెహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టు(టీఆర్‌సీఎంఆర్‌పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి కలీలుర్ రహ్మన్ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్‌లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్‌లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది. కాగా.. భారత, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.చైనా బిగ్ ప్లాన్?మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్‌కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.భారత్ భద్రతకు ముప్పు.. ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్‌కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్‌లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
కాషాయ భారతం: 21 రాష్ట్రాలు.. రాజ్యసభలో 113 సీట్లు
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పెను ప్రకంపనలు సృష్టించాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైనది కాదు.. అది దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి ముగింపు లాంటిది. 2014 నుండి విస్తరిస్తున్న బీజేపీ జాతీయ రాజకీయ యంత్రాంగం ఇప్పుడు తూర్పు భారతదేశంలోకి విజయవంతంగా ప్రవేశించి, తన లక్ష్యాలను పూర్తి చేసింది. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 21 చోట్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలో ఉంటూ అత్యధిక భౌగోళిక ప్రాంతంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.తూర్పు భారత్‌పై కాషాయ పట్టుఒకప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు ఏమాత్రం చోటులేదని భావించిన రాష్ట్రాలలో ఇప్పుడు ఆ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. బిహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ పిలిచే ‘అంగ, వంగ, కళింగ’ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2024లో ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ను గద్దె దించడం ద్వారా మొదలైన ప్రయాణం, 2025లో బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తప్పుకున్న తర్వాత సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు బెంగాల్‌ను హస్తగతం చేసుకోవడం ఆ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు నిదర్శనం.మమతా బెనర్జీ శకానికి ముగింపుపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి దాదాపుగా తెరపడింది. ముఖ్యంగా మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం ప్రాంతీయ ఆధిపత్య పతనానికి ప్రతీకగా మిగిలింది. 2026 ఓట్ల లెక్కింపు టీఎంసీకి తుది వీడ్కోలు పలుకుతుందని హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో చేసిన జోస్యం అక్షరాలా వాస్తవరూపం దాల్చింది.హిందీ బెల్ట్ దాటి అప్రతిహత విస్తరణప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత చరిష్మా, అమిత్ షా సంస్థాగత వ్యూహాల కలయికతో బీజేపీ ఎన్నికల యంత్రాంగం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో 45 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో అజేయంగా నిలుస్తున్న ఆ పార్టీ, కొత్త ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. 2022లో గుజరాత్లో 182కి 156 స్థానాలు గెలుచుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమ్మకమైన ఓటు బ్యాంకుగా మలచుకోవడం బీజేపీ బలపడేందుకు కారణమైంది.సంస్థాగత మార్పులు, పెరుగుతున్న ప్రభావంబీజేపీ ఎదుగుదల కేవలం ఓట్ల శాతానికే పరిమితం కాలేదు. ప్రభుత్వ వ్యవస్థల రూపురేఖలను సైతం మారుస్తోంది. రాష్ట్ర ఎన్నికల్లో వరుస విజయాలతో రాజ్యసభలో 2014లో 65గా ఉన్న సభ్యుల సంఖ్యను నేడు 113కి పెంచుకోగలిగింది. తద్వారా గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న అనేక కీలక చట్టాలను సులభంగా ఆమోదించుకుంటోంది. న్యాయవ్యవస్థపై కూడా రాజకీయ ప్రభావం పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆధార్ (Aadhaar) కేసులో జస్టిస్ చంద్రచూడ్ అసమ్మతి తెలిపినప్పటికీ, బిల్లును మనీ బిల్లుగా 4-1 మెజారిటీతో ఆమోదించడం, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ కావడం ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు.వ్యూహాత్మక ఎన్నికల విధానాలుచట్టపరమైన, ఎన్నికల యంత్రాంగాలను తమకు అనుకూలంగా వాడుకోవడంలో ప్రస్తుత పాలకులు ఎంతో నైపుణ్యం కనబరుస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు దగ్గరి నుంచి, అస్సాంలో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలను 35 నుంచి 22కి తగ్గించిన డీలిమిటేషన్ ప్రక్రియ వరకు బీజేపీ తన మార్కును చూపించింది. 2026 బెంగాల్ ఎన్నికలలో కూడా ఎన్నికల సంఘం ముందుగా 96 లక్షల ఓట్లను తొలగించి, ఆ తర్వాత 25 లక్షలకు సర్దుబాటు చేయడం తుది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్, అస్సాం ఎన్నికలను ఎన్నికల సంఘం మద్దతుతో హైజాక్ చేశారని రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.ఏక పార్టీ వ్యవస్థ దిశగా భారత్?భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా కాషాయమయమవుతున్న తరుణంలో, దేశం ఏక-పార్టీ పాలన దిశగా పయనిస్తోందా అనే చర్చ ముమ్మరమైంది. రాజ్యాంగబద్ధంగా మనం చైనా లాగా ఏక-పార్టీ వ్యవస్థ కాకపోయినా, ప్రస్తుత అధికార కేంద్రీకరణ ఇందిరా గాంధీ కాలాన్ని గుర్తు చేస్తోంది. ప్రతిపక్షాల స్థానం బాగా కుంచించుకుపోతోందని, తమ పోరాటానికి మరింత సహనం అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంగీకరిస్తున్నారు. దక్షిణాదిన తమిళనాడు, కేరళలో ఇంకా సవాళ్లు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాలను ఇప్పుడు ఒకే ఒక శక్తి నిర్దేశిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
భారత్, వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వచ్చే నాలుగేళ్లలో 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యమే లక్ష్యంగా భారత్, వియత్నాం మరో అడుగు ముందుకేశాయి. మూడ్రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బుధవారం హైదరాబాద్‌హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు వాణిజ్యం, రక్షణ, అరుదైన మూలకాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అరుదైన భూఅయ స్కాంతాలు, ఫార్మాసూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి మొత్తంగా 13 ఒప్పందాలపై సంతకాలుచేశారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడంతో ఇండో–పసిఫిక్‌లో మారుతున్న పరిణామాలపై ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘దశాబ్దకాలం క్రితమే ఆసియాన్ కూటమి నుంచి భారత్‌కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా మారిన తొలి దేశం వియత్నాం. ఈ పదేళ్లలో మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అవి ఇప్పుడు విస్తృతస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. భవిష్యత్తులో ఈ బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుద్దాం. సాంస్కృతిక సంబంధాలు మొదలు అనుసంధానత, సామర్థ్యం పెంపు, భద్రత, సుస్థిరాభివృద్ధి, సరఫరా గొలుసుల పటిష్టత దాకా ప్రతిరంగంలో సమన్వయం పెంచుకుంటూ సమున్నత స్థాయికి ఎదుగుదాం. 2030 ఏడాదినాటికి 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సామర్థ్యం సాధిద్దాం’’అని మోదీ అన్నారు. మా ద్రాక్ష రుచి చూస్తారు.. ‘‘ఇకపై భారతీయ ఔషధాలు వియత్నాంవాసులకూ అందుబాటులోకి వస్తాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశుసంబంధ ఉత్పత్తులు ఇప్పుడు వియత్నాం ప్రజలకు చవగ్గా దొరకనున్నాయి. భారతీయ ద్రాక్ష, దానిమ్మ రుచిని త్వరలోనే వియత్నాంవాసులు రుచి చూడబోతున్నారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా నవీకరిస్తాం. అరుదైన మూలకాలు, భూఅయస్కాంతాలు మొరలు ఇంధనరంగంలో సహకాం ద్వారా కీలక వాణిజ్యం, పెట్టు బడుల్లో సరస్పర సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. ఇరుదేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంచుతాం. ఇండియాలో అమలవుతున్న యూపీఐ పేమెంట్ వ్యవస్థను, వియత్నాంలోని పాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో అనుసంధానిస్తాం. ఇరు దేశాల రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య సైతం అనుసంధానం రెట్టింపుకానుంది’’అని మోదీ అన్నారు. -
అమెరికాలో భారత్ కంపెనీలు: ఒక్కరోజే భారీ పెట్టుబడులు!
అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్‌లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.Under President Trump’s leadership investment is flowing back into the United States at record levels! Indian companies plan to invest over $20.5 billion in various sectors including tech, manufacturing, and pharmaceuticals. This includes the 12 Indian companies who announced…— Ambassador Sergio Gor (@USAmbIndia) May 6, 2026ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
పాక్‌తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు!
పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించి భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేదని క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. అయితే భారత్‌లో జరిగే మల్టీ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్య, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సంయుక్తంగా సర్క్యులర్ విడుదల చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు 2036 ఒలింపిక్స్‌ను నిర్వహణకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ క్రీడా మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిపింది. అయితే పాకిస్తాన్‌తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఐసీసీ, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్‌తో తలపడుతుందని క్రీడాశాఖ పునరుద్ఘాటించింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌తో పాకిస్తాన్‌తో ప్రస్తుతం ఉన్న క్రీడా విధానం యథాతథంగా కొనసాగనుంది. దీంతో సమీప భవిష్యత్తులో అటు భారత్‌లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ సహా ఇతర క్రీడా సిరీస్‌లు జరగవు. అయితే పాకిస్తాన్ అథ్లెట్లకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందని, ఎందుకంటే వారి వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని పేర్కొంది. భారత్‌లో జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడానకి అవకాశమిస్తామని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. గతేడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్‌లు తలపడుతున్నాయి. చివరగా 2026 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడిన భారత్ ఘన విజయాన్ని సాధించింది.చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు! -
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పత్తి ఉత్పత్తి పెంపు మిషన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5,659 కోట్ల రూపాయలతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాషన్ టు ఫారిన్ అనే లక్ష్యంతో మిషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎయిర్ లైన్స్ సంస్థల కోసం 5,000 కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎమ్ఈలు, నాన్ ఎంఎస్ఎమ్ఈలకు ఆర్థిక సహకారం కోసం పథకానికి ఆమోదముద్ర వేసింది. చెరుకు పంటకు క్వింటాలు 365 రూపాయల మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వదినారులో షిప్ రిపేర్ ఫెసిలిటీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని వల్ల 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.రెండు నూతన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,936 కోట్ల రూపాయలతో గుజరాత్లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. 2,230 మంది నిపుణులకు ఉపాధికి అవకాశం దక్కనుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇతర నిర్ణయాలు* 2026-27 చక్కెర సీజన్‌కు FRP (Fair & Remunerative Price) రూ. 365/క్వింటాల్‌గా నిర్ణయం* ECLGS-5 కింద రూ. 18,100 కోట్ల ప్యాకేజీకి ఆమోదం* గుజరాత్లో వడినార్‌లో నౌకల మరమ్మతు కేంద్రం – రూ. 1,570 కోట్లు* రెండు కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం (రూ. 3,068 కోట్లు + రూ. 868 కోట్లు)* నాగ్దా–మథుర 3,4వ రైల్వే లైన్ (568 కి.మీ) – రూ. 16,403 కోట్లు* గుంటకల్–వాడి రైల్వే లైన్ (230 కి.మీ) – రూ. 4,758 కోట్లు* బుర్హ్వాల్–సీతాపూర్ రైల్వే లైన్ (103 కి.మీ) – రూ. 2,276 కోట్లు -
"భారత్ పేరుతో అమెరికా కొత్తనాటకం"
అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం" అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.చైనాపై ఆరోపణలుకాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్ చైనాను విమర్శించారు."ఇరాన్‌కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్‌పింగ్‌ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఇరాన్ దగ్గర సత్తా లేదుయుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు. వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు. -
హార్మూజ్‌ను దాటిన ఎల్పీజీ నౌక
న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పిజీ) కొరత కొంతవరకు తీరిపోయే అవకాశం వచ్చింది. 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పిజీతో ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటేసి భారత్ దిశగా పయనం సాగిస్తోందని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక పేరు ఎంటీ సర్వశక్తి. అందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 18 మంది భారతీయులే. ఈ నెల 2న హార్మూజ్‌లో కీలకమైన చెక్‌పాయింట్‌ను విజయవంతంగా దాటేసింది. ఈ నెల 13వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చేరుకుంటుందని అంచనా. భారత్‌లో సగంరోజు అవసరానికి సరిపడా ఎల్పీజీ ఈ నౌకలో ఉంది. గంటకు 12 నుంచి 14 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఆదివారం సాయంత్రానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్నట్లు తెలిసింది. సర్వశక్తి నౌకలోని సిబ్బంది, ఎల్పీజీ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. గతంలో పర్షియన్ గల్ఫ్, భారత్‌లోని ఓడరేవుల మధ్య రాకపోకలు సాగించిన ఈ అతిపెద్ద గ్యాస్ నౌకను భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్దెకు తీసుకుంది. ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత హార్మూజ్‌ను దాటిన మొదటి భారత అనుబంధ చమురు నౌక సర్వశక్తి కావడం విశేషం. భారత జెండా లేదా భారత యాజమాన్యంలోని 14 నౌకలు ఇప్పటికీ హార్మూజ్ జలసంధి పశ్చిమ భాగంలో చిక్కుకుపోయి ఉన్నాయి. -
మెడికల్ టూరిజం హబ్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ ‘గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్’గా మారిందని కేంద్రం తెలిపింది. మెడికల్ టూరిజం, వెల్నెస్ టూరిజం భారత మోడల్‌కు రెండు బలమైన స్తంభాలుగా ఉన్నాయంది. యోగా, ఆయుర్వేదం, నేచురోపతి, సిద్ధ, యునాని వంటి సంప్రదాయ వైద్య విధానాలు కలగలిసి భారత్‌ను సమగ్ర ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మార్చాయని తెలిపింది. వైద్య పర్యాటకంలో ప్రధానంగా గుండె శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్స, న్యూరో సర్జరీ, ఎముకల చికిత్స, ఫెర్టిలిటీ సేవలు, కాస్మెటిక్ సర్జరీ, డెంటల్ కేర్ వంటి అధునాతన వైద్య సేవల అందుబాటులో ఉన్నాయి. అదేసమయంలో, వెల్నెస్ టూరిజంలో ప్రధానంగా యోగా, ధ్యానం, ఆయుర్వేదం, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి విధానాల్లో నివారణాత్మక, సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందుతోందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రం వివరించింది. ఈ రెండూ కలిపి భారత్‌ను చికిత్స కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య పునరుద్ధరణ, మానసిక ప్రశాంతత, జీవనశైలి మార్పు కోసం కూడా ప్రత్యేక గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని తెలిపింది.అంతర్జాతీయంగా భారత్‌కు 10వ స్థానంమెడికల్ టూరిజం ఇండెక్స్ ప్రకారం..ప్రపంచంలోని 46 గమ్యస్థానాల్లో భారత్ 10వ స్థానంలో ఉంది. ప్రపంచ టాప్ 20 వెల్నెస్ మార్కెట్లలో 12వ స్థానంలో, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని టాప్ –10 వెల్నెస్ డెస్టినేషన్లలో 5వ స్థానంలో నిలిచింది. 2025–26 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం విదేశీ పర్యాటకుల్లో మెడికల్ టూరిజం 5.22 శాతం వాటా కలిగి ఉంది. ఈ రంగం ద్వారా సుమారు 8.46 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించాయి. 2025లోనే వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చిన విదేశీయులు 5,07,244 మంది కాగా, వీరిలో బంగ్లాదేశ్ నుంచి 3,25,127 మంది, ఇరాక్ నుంచి 30,989 మంది, ఉజ్బెకిస్తాన్ నుంచి 13,699 మంది, సోమాలియా నుంచి 11,506 మంది, తుర్క్మెనిస్తాన్ నుంచి 10,231, ఒమన్ నుంచి 9,738 మంది, కెన్యా వాసులు 9,357 మంది వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ మెడికల్ వాల్యూ ట్రావెల్ మార్కెట్ 2022లో సుమారు 115.6 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదవగా, 2030 నాటికి ఇది 286.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని, పరిశ్రమ అంచనాల ప్రకారం 2025 నాటికి భారత వైద్య పర్యాటక రంగం విలువ 8.7 బిలియన్ డాలర్లకు చేరగా, 2030 నాటికి 16.2 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదగనుందని వివరించింది. భారత్ ఆరోగ్య వ్యవస్థలో ప్రస్తుతం 69,364 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 43,486 ప్రైవేట్, 25,778 ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులు. అదేవిధంగా, దేశంలో 12 లక్షల నమోదిత వైద్యులు ఉన్నారని కేంద్రం తెలిపింది. అమెరికా, యూరప్ ఖండాల్లోని దేశాలతో పోలిస్తే భారత్‌లో గుండె, క్యాన్సర్, ఆర్థోపెడిక్, ఫెర్టిలిటీ వంటి చికిత్సలు చాలా తక్కువ ఖర్చుతో అందుతున్నాయి. వేచి ఉండే సమయం కూడా తక్కువ కలిసి భారత్ వైపు చూసేందుకు దోహదం చేస్తున్నాయని తెలిపింది. -
హార్మూజ్‌ను దాటుకుని వస్తున్న భారత నౌక
బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్‌తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్‌తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్‌తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్‌లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్‌తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్‌ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు. -
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్ పరువు తీసిన కియోసాకి
ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్‌లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
మహేంద్రగిరి స్వదేశీ సిరి
న్యూఢిల్లీ: అత్యాధునిక యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో భారత్ క్రమంగా స్వయం సమృద్ధి సాధిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను తయారు చేస్తోంది. ఇతర దేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకుంటోంది. శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ, అత్యాధునిక సెన్సర్ల సమూహంతో కూడిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ‘మహేంద్రగిరి’ని భారత నౌకాదళానికి లాంఛనంగా అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 30న ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎస్ఎల్)లో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. నీలగిరి–క్లాస్(ప్రాజెక్టు 17ఏ) శ్రేణిలో ఇది ఆరో యుద్ధ నౌక కావడం విశేషం. ప్రాజెక్ట్ 17ఏ యుద్ధనౌకలు సముద్ర రంగంలో ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురు కాబోయే సవాళ్లను పరిష్కరించడానికి రూపొందించిన బహుముఖ, బహుళ–కార్యనిర్వహణ నౌకలు అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. మహేంద్రగిరి స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌకల నిర్మాణంలో భారతదేశ ఆత్మనిర్భరతకు ఒక ప్రశంసనీయమైన చిహ్నంగా నిలుస్తున్నట్లు హర్షం వ్యక్తంచేసింది. ఈ అత్యాధునిక ఫ్రిగేట్ నావల్ డిజైన్, ఫైర్‌పవర్, ఆటోమేషన్, మనుగడ సామర్థ్యంలో ఒక గొప్ప పురోగతికి ప్రతీక అని వెల్లడించింది. → మహేంద్రగిరి యుద్ధనౌకను ముంబై ఎండీఎస్‌ఎల్‌లో చాలావరకు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతం పేరును ఈ నౌకకు పెట్టారు. → వార్‌షిప్ ఓవర్‌సీయింగ్ టీమ్ పర్యవేక్షణలో వార్íÙప్ డిజైన్ బ్యూరో(డబ్ల్యూడీబీ) మహేంద్రగిరిని డిజైన్ చేసింది. → ప్రాజెక్టు 17ఏ కింద తయారైన ఫ్రిగేట్లు స్వదేశీ నౌకా రూపకల్పన, స్టెల్త్ సామర్థ్యం, మనుగడ సాగించే శక్తి, పోరాట సామర్థ్యాలలో గొప్ప ముందడుగును ప్రతిబింబిస్తాయి. → నిర్దేశిత కాలపరిమితిలోపే నౌకను నావికా దళానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. → పీ17 (శివాలిక్ శ్రేణి) నౌకలతో పోలిస్తే పీ17ఏ నౌకలకు అధునాతన ఆయుధాలు, సెన్సర్ల వ్యవస్థను అమర్చారు. → ఈ నౌకల్లో కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ ప్లాంట్లు అమర్చి ఉంటాయి. వీటిలో ఒక డీజిల్ ఇంజిన్, గ్యాస్ టర్బైన్, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఐపీఎంఎస్) ఉంటాయి. → శక్తివంతమైన ఆయుధాలు, సెన్సర్ల సమూహంతో శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములపై సులువుగా దాడి చేయొచ్చు. → ప్రాజెక్టు 17ఏలో భాగంగా తొలి యుద్ధనౌక(నీలగిరి)ను 2024 డిసెంబర్ 20న భారత నావికాదళానికి అప్పగించారు. కేవలం 17 నెలల వ్యవధిలోనే ఆరో నౌకను సైతం అప్పగించడం గమనార్హం. → మహేంద్రగిరి స్టెల్త్ ఫ్రిగేట్‌ను అప్పగించడం మన స్వదేశీ రూపకల్పన, నౌకా నిర్మాణం, ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రతీక అని అధికార వర్గాలు తెలిపాయి. → 75 శాతం స్వదేశీ భాగస్వామ్యంతో కూడిన ఈ ప్రాజెక్టులో, 200కు పైగా ఎంఎస్ఎంఈలు పాలుపంచుకున్నాయని, తద్వారా సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించినట్లు రక్షణ శాఖ తెలియజేసింది. → సూపర్‌సానిక్ క్షిపణులతో సహా అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ‘తారాగిరి’ని ఏప్రిల్ 3న భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. → తాజాగా మహేంద్రగిరి రాకతో భారత నావికాదళం మరింత శక్తివంతంగా మారినట్లు అధికార వర్గాలు స్పష్టంచేశాయి. -
యూజ్డ్ కార్లే ముద్దు
ముంబై: యూజ్డ్ కార్ల (అప్పటికే మరొకరు వినియోగించిన) మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. 2031 నాటికి 70 బిలియన్ డాలర్ల విలువకు (రూ.6.58 లక్షల కోట్లు) యూజ్డ్ కార్ల మార్కెట్ చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. ప్రస్తుతం ఈ మార్కెట్ పరిమాణం 35 బిలియన్ డాలర్లుగా ఉంది. కార్లను వేగంగా మార్చడం, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో కొత్త కార్లు మార్కెట్ ప్రవేశం చేస్తుండడం, భద్రతా ప్రమాణాల్లో మార్పులు, వినియోగదారుల ప్రాధాన్యతలు, కొనుగోలు చేసే స్థాయిలో ధరలు (అందుబాటు) ఉండడం తదితర అంశాలతో అంతర్జాతీయంగా యూజ్డ్ కార్లకు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా మారినట్టు రెడ్‌సీర్ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా యూజ్డ్ కార్లలో ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా ఉంటే, ఈ దశాబ్దం చివరికి అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకోనుంది. 2030–31 సంవత్సరంలో రిటైల్ యూజ్డ్ కార్ల విక్రయాలు కోటి యూనిట్లుగా ఉంటాయని ఈ నివేదిక అంచనా. సగటున ఒక్కో కారు విక్రయ ధర రూ.6.5–6.9 లక్షలుగా ఉంటుందని రెడ్‌సీర్ పేర్కొంది.4–5 ఏళ్లకే మార్చేస్తున్న వైనం.. దేశంలో పునర్వినియోగ కార్ల మార్కెట్ వృద్ధికి ఎన్నో అంశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. 2020–21 నాటికి ఒక కారును 7–8 ఏళ్లు వినియోగించిన తర్వాతే కొత్త కారుకు అప్‌గ్రేడ్ అయ్యే వారు. 2030–31 నాటికి కార్లను మార్చే కాల వ్యవధి 4–5 ఏళ్లకు తగ్గిపోనుందని రెడ్‌సీర్ అంచనా. ముఖ్యంగా మెట్రోలు, టైర్–1 నగరాలు ఈ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. అసంఘటిత రంగం నుంచి.. నిర్మాణాత్మక, విశ్వసనీయ మార్కెట్‌గా ఇది మార్పు చెందుతోందని రెడ్సీస్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేట్ పార్ట్నర్ కుశాల్ భట్నాగర్ పేర్కొన్నారు. ఒకవైపు పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, మరోవైపు యూజ్డ్ కార్లకు రుణ సదుపాయం లభిస్తుండడం డిమాండ్, సరఫరాను పెంచుతున్నాయని చెప్పారు. 2031 మార్చి నాటికి భారత్‌లో 28 కోట్ల గృహాలకు యూజ్డ్ కార్ల కొనుగోలు సామర్థ్యం ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. యూజ్డ్ కార్ల రుణ మార్కెట్ సైతం 30–40%కి పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం యూజ్డ్ కార్ల అమ్మకాల్లో 80% అసంఘటితంగానే జరుగుతున్నాయంటూ.. ఈ మార్కెట్ వృద్ధికి భారీ అవకాశాలున్నాయని తెలిపింది. -
ఇక నో హార్మూజ్.. భారత్‌కు గుడ్‌న్యూస్
ఇరాన్, అమెరికా యుద్ధం వేళ చమురు విషయంలో భారత్‌కు శుభవార్త. చమురు ఉత్పత్తి, తరలింపు విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా(Fujairah) ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్‌కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.యూఏఈ రెండు రోజుల క్రితమే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) బయటకు వచ్చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ అవసరాలు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇరాన్ హార్మూజ్ అవసరం లేకుండా.. బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు వెల్లడించింది.After leaving OPEC, the UAE can now freely increase its oil production, thanks to the Fujairah Pipeline that bypasses the Strait of Hormuz.The Emirates had planned and developed this independent export route for years, enabling it to add up to 2 million barrels per day.A… pic.twitter.com/rqQpwq7hB0— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) April 28, 2026ఇక, యూఏఈ ఒపెక్ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్‌ను ఎగుమతి చేయవచ్చు. దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్‌కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు.. భారీ సంఖ్యలో భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్ ఇలా.. హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్‌లైన్‌ను, ఇరుకైన హార్మూజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్‌ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది.ఫుజైరా నుంచి భారత్‌కు ఆయిల్ సరఫరా గణాంకాలు..యూఏఈ సరఫరా (ఏప్రిల్ 2026): రోజుకు 619,000 బ్యారెల్స్గత ఆర్థిక సంవత్సర సగటు: రోజుకు 433,000 బ్యారెల్స్వృద్ధి: సుమారు 43% పెరుగుదలభారత్ మొత్తం క్రూడ్ దిగుమతి (ఏప్రిల్ 1–26, 2026): రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ (ఫిబ్రవరి 5.2 మిలియన్ బ్యారెల్స్‌తో పోలిస్తే 15% తక్కువ)భారత్‌లో ఇంధన ధరలపై ప్రభావంహార్మూజ్లో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ, ఫుజైరా పైప్‌లైన్ వల్ల భారత్‌కు స్థిరమైన సరఫరా లభిస్తోంది.ఇది ధరల పెరుగుదల ఒత్తిడిని తగ్గిస్తోంది.యూఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్/రోజు చేరుతుంది.ఒపెక్ పరిమితులు లేకుండా యూఏఈ ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది.దీంతో, భారత్‌కు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం.. ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. -
దేశంలో అప్పట్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అదే జరిగి..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలపై అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ చాలాసార్లు ఏయే పార్టీలు గెలుస్తాయో సరిగ్గా అంచనా వేశాయి. ఆయా పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.. ఎప్పుడెప్పుడో చూద్దాం..లోక్‌సభ ఎన్నికల్లో..2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 280-300 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 336 స్థానాలు దక్కాయి.2019 లోక్‌సభలో కూడా ఇదే ధోరణి కనిపించింది. అంచనాలు 300-350 స్థానాల మధ్య ఉండగా, ఎన్డీఏ 353 స్థానాలు గెలుచుకుంది.1998 లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 260 స్థానాలు వస్తాయని అంచనా, అప్పుడు 254 స్థానాలు వచ్చాయి.1999 లోక్‌సభలో 280 స్థానాలు అంచనా వేయగా, 303 స్థానాలు గెలిచింది.రాష్ట్రాల ఎన్నికల్లో..2006 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్కు 95-105 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 99 స్థానాలు వచ్చాయి.2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఏడీఎంకే+కు 140-160 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 150 స్థానాలు గెలుచుకుంది.2016 తమిళనాడు ఎన్నికల్లో ఎఐఏడీఎంకేకు 130-150 స్థానాలు అంచనా ఉండగా, 136 స్థానాలు సాధించింది.2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 210-230 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 211 స్థానాలు వచ్చాయి.అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. -
భారత్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఫోన్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు బుధవారం సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించి, సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్ చేసింది. అమెరికా-ఇరాన్ పక్షాలు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా పరిణామాలు, భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జైశంకర్, అబ్బాస్ అరఘ్చిర్చించారని తెలిపింది.ఎక్స్‌లో జైశంకర్ పోస్ట్ చేస్తూ.. “ఇవాళ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తతలు పెరిగితే అసాధారణ పద్ధతులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఆర్జీసీ నౌకాదళ రాజకీయ వ్యవహారాల ఉపాధికారి మొహమ్మద్ అక్బర్జాదెహ్ అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే ఆ దేశం ఆశ్చర్యపోయేలా అమలుచేసే వ్యూహాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి ఐఆర్జీసీ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ నసుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులపై గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడులు చేసింది. దీని వల్ల సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడింది.During a phone conversation between Seyed Abbas @araghchi, Foreign Minister of Iran, and Subrahmanyam Jaishankar, Minister of External Affairs of India, the two sides discussed and exchanged views on the latest developments related to the ceasefire, bilateral relations, as well… pic.twitter.com/Vx6B5hoezx— Iran in India (@Iran_in_India) April 29, 2026Received a phone call from Foreign Minister Seyed Abbas Araghchi of Iran this evening. @araghchi Had a detailed conversation about various aspects of the current situation. We agreed to remain in close touch.— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 29, 2026 -
యూఏఈ నిర్ణయం: ఇండియాలో ఆయిల్ ధరలు తగ్గుతాయ్!
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో, 12 మంది సభ్యుల ఒపెక్ , విస్తృత 22-సభ్యుల ఒపెక్+ కూటమి రెండింటి నుంచి నిష్క్రమిస్తున్నట్లు యూఏఈ ఏప్రిల్ 28నప్రకటించింది. ఈ నిర్ణయం భారతదేశానికి లాభం చేకూరుస్తుందా? లేక మరింత సంక్షోభం లోకి కూరుకుపోనుందా? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు?పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి (OPEC), OPEC+ నుండి తప్పుకుంటున్నట్లు యూఏఈ ప్రకటించింది. మే 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ పరిణామం భారతదేశానికి సానుకూల అంశమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారని మనీ కంట్రోల్ తనకథనంలోపేర్కొంది. ఒపెక్ నుండి యూఏఈ నిష్క్రమణతో భారతదేశానికి చమురు సరఫరా పెరిగిచ, ధరలు తగ్గుతాయని, అంతిమంగా ఇది దేశానికి మేలు జరగవచ్చు అంటున్నారు.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కుభారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు:ఇప్పటివరకు యూఏఈ 'ఓపెక్' నిర్దేశించిన కోటాల ప్రకారం పరిమితంగానే చమురును ఉత్పత్తి చేసేది. ఇప్పుడు కూటమి నుండి బయటకు వచ్చిన కారణంగా ఇండియా భారీగానే ఉత్పత్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ధరలు తగ్గితే దేశంపై విదేశీ మారకద్రవ్య భారం తగ్గి, ఇన్‌ప్లేషన్ అదుపులోకి వస్తుంది. అలాగే యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2027 నాటికి రోజుకు 5 మిలియన్ బారెల్స్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.భౌగోళికంగా భారత్‌కు దగ్గరగా ఉండటం వల్ల, అత్యవసర సమయాల్లో చమురును సులభంగా దిగుమతి చేసుకోవచ్చు.ప్రపంచ సరఫరాలో యూఏఈ వాటా 3 - 4 శాతంగా ఉండగా, భారత చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా సుమారు 10 శాతంగా ఉంది. సౌరవ్ మిత్ర (గ్రాంట్ థోర్న్టన్ భరత్): యూఏఈ నిష్క్రమణ వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో మరింత సరళత వస్తుంది. ధరలపై ఒత్తిడి తగ్గి భారత్‌కు ఊరట లభిస్తుంది. ప్రశాంత్ వశిష్ట్ (Icra): ఓపెక్ కూటమిలో కీలక దేశమైన యూఏఈ బయటకు వెళ్లడం వల్ల ధరలను నియంత్రించే ఆ కూటమి శక్తి తగ్గుతుంది. భారత్ తన చమురు వనరులను మరింత వైవిధ్యపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్‌కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలుప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల చమురు రవాణాకు ఆటంకాలు కలుగుతున్నప్పటికీ, మధ్యస్థ కాలంలో యూఏఈ నిర్ణయం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: -
'మే' లో మహా ప్రళయమే.. సూపర్ మెగా ఎల్ నినో వచ్చేస్తోంది జాగ్రత్త
-
యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-ఒపెక్ (OPEC), ఒపెక్+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఒపెక్‌కు ఝలక్..1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఒపెక్‌లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్‌లో ఒపెక్ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్ ఎఫెక్ట్.. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాకిస్తాన్ పాత్ర..అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్‌పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.దీంతో, 2026 ఏప్రిల్‌లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్కి చెల్లించబడింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.యూఏఈలో 1.6 మిలియన్‌కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.తాజాగా యూఏఈ, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.సౌదీ-పాకిస్తాన్ బంధం..యూఏఈ డిమాండ్ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్‌కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.దీంతో, పాకిస్తాన్ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.యూఏఈ నిర్ణయం ప్రభావం..ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.భారత్‌కి అవకాశాలు:తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్‌కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్కి పెరిగింది.యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
మహిళే మహారాణి
న్యూఢిల్లీ: మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర కార్మీక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఉపాధి కల్పన రేటు 2017లో ఉన్న 22 శాతం నుంచి 2025లో 39 శాతానికి పెరిగినట్టు చెప్పారు. మహిళా కార్మీకుల భాగస్వామ్య రేటు 2017–18లో 23.3 శాతంగా ఉంటే, 2025లో 40 శాతానికి చేరినట్టు వెల్లడించారు.మహిళల నిరుద్యోగ రేటు ఇదే కాలంలో 5.6 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గిందని.. ఉపాధి కోరుకుంటున్న మహిళలు నేడు ఆ దిశగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలూ భాగస్వాములు కావడం అత్యావశ్యకమే కాకుండా.. ఆర్థికంగానూ తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మహిళా సాధికారతను కేంద్రబిందువుగా పేర్కొన్నారు. మెరుగైన సామాజిక భద్రత సామాజిక భద్రత కవరేజీ గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు మంత్రి మాండవీయ తెలిపారు. 2015లో ఉన్న 19 శాతం నుంచి 2025లో 64.3 శాతానికి చేరినట్టు చెప్పారు. కార్మీక సంస్కరణలు, డిజిటల్ సేవలు, లకిష్యత సంక్షేమ ఫలాల బదిలీ కోసం చేపట్టిన స్థిరమైన విధానాలు ఇందుకు దోహదం చేసినట్టు తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మీకులను అధికారికంగా గుర్తిస్తూ 2020లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ (సీవోఎస్‌ఎస్)ను ప్రవేశపెట్టినట్టు మంత్రి మాండవీయ గుర్తు చేశారు.వీరిలో ఇప్పుడు చాలా మంది మహిళలు ఉన్నారని.. వారికి చట్టపరమైన గుర్తింపుతోపాటు సామాజిక భద్రత ఏర్పడినట్టు చెప్పారు. మహిళా డెలివరీ కార్మీకులు వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడమే కాకుండా, సామాజిక పురోగతికి పాటుపడుతున్నట్టు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోనే స్విగ్గీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన మహిళా డెలివరీ పార్ట్నర్లను మంత్రి సన్మానించారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో శ్రీహర్ష మాజేటి, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డీ-కంపెనీకి గట్టి దెబ్బ
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో నడుస్తున్న నెట్ వర్క్‌కు గట్టి దెబ్బ తగిలింది. దావూద్ సన్నిహితుడు, డ్రగ్ కింగ్‌పిన్ సలీం డోలాను టర్కీ(తుర్కీయే) భారత్‌కు అప్పగించింది. తాజాగా ఇస్తాంబుల్‌లో అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి డిపోర్ట్ చేసినట్లు సమాచారం. ఇది డీ-కంపెనీపై భారత ప్రభుత్వం చేపట్టిన భారీ అణచివేత చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కొన్ని దశాబ్దాలుగా అండర్‌వరల్డ్ మాఫియా నడిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్, ఆయుధాలు, అక్రమ వ్యాపారాల నెట్‌వర్క్‌ను నడిపిస్తూ వచ్చింది. హవాలా లావాదేవీల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తూ వచ్చాడు. ఈ నెట్వర్క్ ద్వారా వచ్చిన సొమ్మును పాకిస్తాన్ ఐఎస్ఐకి కూడా చేరుతుందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. 70వ దశకంలో ముంబై బేస్డ్గా ప్రారంభమై.. ఇప్పటికీ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా రీజియన్లలో క్రైమ్-టెర్రర్ నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. అయితే.. దావూద్ అనుచరుడు సలీం డోలా వంటి సహచరులు ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. డోలా దావూద్‌కు అత్యంత సన్నహితుడిగా తెలుస్తోంది. ఇతని అరెస్టు, భారత్‌కు డిపోర్ట్ కావడంతో ఈ నెట్‌వర్క్‌లోని కీలక లింక్ తెగిపోవడం గ్యారెంటీ అని అధికారులంటున్నారు. తద్వారా దావూద్ ఇబ్రహీం కంపెనీకి గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ చర్యను ఒక ఘన విజయంగా చెబుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంలో భారత్ తన శక్తిని చూపిందని.. టర్కీతో ఉన్న సహకారం ఈ ఆపరేషన్ విజయానికి దోహదపడిందని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్ మాఫియాపై పోరాటంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించింది. -
తొలిసారి మహిళల రగ్బీ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది మొదటిసారి పురుషుల కోసం భారత్‌లో రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) జరగ్గా... రెండో ఏడాది ఏకకాలంలో పురుషులతోపాటు మహిళల రగ్బీ లీగ్‌ను నిర్వహించనున్నారు. జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం రగ్బీ ప్రీమియర్ లీగ్‌కు ఆతిథ్యమిస్తుంది. క్రితంసారి పురుషుల విభాగంలో ఆరు జట్లు పోటీపడ్డాయి. ఆ ఆరు పురుషుల జట్లలో నుంచి నాలుగు జట్లతో (చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్) మహిళల విభాగం పోటీలు నిర్వహిస్తారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సహకారంతో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈనెల 30న హైదరాబాద్‌లో వేలం కార్యక్రమం జరగనుంది. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్‌తోపాటు హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ ఆర్పీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. గత ఏడాది ముంబైలో జరిగిన తొలి సీజన్లో చెన్నై బుల్స్ టైటిల్ సాధించింది. ‘మహిళల విభాగంలోనూ రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని కల కన్నాం. రెండో ఏడాదే మా కల నిజమవుతోంది. ఈ విషయంలో జీఎంఆర్ స్పోర్ట్స్‌ను, మా ఫ్రాంచైజీలను అభినందించాలి’ అని రగ్బీ ఇండియా అధ్యక్షుడు, సినీ నటుడు రాహుల్ బోస్ తెలిపాడు. -
వాణిజ్య బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య స్నేహసంబంధాల్లో మరో అడుగు ముందుకు పడింది. కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు, తోలు పాదరక్షలు, రత్నాలు. ఆభరణాలతో సహా 100 శాతం ఎగుమతులపై న్యూజిలాండ్‌లో సుంకాలు సున్నాకు చేరుకుంటాయి. సుంకాలు లేకుండానే భారత్ తమ ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఈ ఒప్పందానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. భారత్‌లో కేంద్ర మంత్రివర్గం ఈ ఎఫ్‌టీఏను ఇప్పటికే ఆమోదించింది. ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాన్ మెక్‌క్లే సోమవారం ఢిల్లీలో సంతకాలు చేశారు. ఎఫ్టీఏతో ఇరుదేశాల మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇండియా, న్యూజిలాండ్ మధ్య 2010లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో నిలిచిపోయాయి. గతేడాది మార్చిలో చర్చలు పునఃప్రారంభం కాగా, డిసెంబర్లో ముగిశాయి. తాజాగా సంతకాలు జరిగాయి. ఎఫ్టీఏతో ప్రయోజనాలు → న్యూజిలాండ్‌కు భారత్ చేసే 100% ఎగుమతులకు ఎలాంటి సుంకం ఉండదు. గతంలో న్యూజిలాండ్ సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలతో సహా పలు భారతీయ ఉత్పత్తులపై 10 శాతం వరకు సుంకాలను విధించేది. → ఎఫ్‌టీఏలో భాగంగా రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించింది. → భారతీయ వృత్తి నిపుణులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారికి మూడేళ్ల కాలపరిమితి ఉండే వీసాలు ఇస్తారు. → భారత్ నుంచి సుంకం రహిత వైన్, స్పిరిట్స్ ఎగుమతులు జరుగుతాయి. అదే సమయంలో న్యూజిలాండ్ నుంచి మద్యం రాయితీ సుంకంతో భారత్‌లోకి ప్రవేశిస్తుంది. పదేళ్లలో ఈ సుంకాన్ని మరింత తగ్గిస్తారు. → న్యూజిలాండ్ నుంచి వచ్చేవాటిలో 54.11 శాతం ఉత్పత్తులపై సుంకాలను భారత్ సున్నాకు తగ్గిస్తుంది. ఇందులో గొర్రె మాంసం, ఉన్ని, బొగ్గు, అటవీ, కలప ఉత్పత్తులు ఉన్నాయి. భారత్‌లో వాటి ధరలు తగ్గుతాయి. → న్యూజిలాండ్ యాపిల్, కివీ పండ్లు, తేనె, మిల్క్ అల్బుమిన్పై సుంకాల్లో రాయితీలు ఇస్తారు. అలాగే కొన్ని రకాల సముద్ర ఉత్పత్తులపై సుంకాలను రాబోయే ఏడేళ్లలో పూర్తిగా తగ్గిస్తారు. → న్యూజిలాండ్ నుంచి దిగుమతి అయ్యే ఐరన్, స్టీల్, స్క్రాప్ అల్యూమినియం వస్తువులపై సుంకాలను పదేళ్లు లేదా అంతకంటే ముందే పూర్తిగా రద్దుచేస్తారు. → భారతదేశ రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాడి, జంతు ఉత్పత్తులు(గొర్రె మాంసం మినహా), కూరగాయలు, చక్కెర, రాగి, అల్యూమినియంపై కేంద్ర ప్రభుత్వంన్యూజిలాండ్కు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. సుసంపన్నమైన భవిష్యత్తు: మోదీ ఇండియా–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దీంతో మన రైతులు, యువత, మహిళలు, ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తుల నిపుణులు, కళాకారులు, స్టార్టప్ కంపెనీలు, విద్యార్థులు, నవీన ఆవిష్కర్తలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఒక తరంలో ఒక్కసారే: క్రిస్టోఫర్ లక్సన్ ఎఫ్‌టీఏను ‘ఒక తరంలో ఒక్కసారి మాత్రమే కుదిరే ఒప్పందం’గా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఎగుమతులు చేసే అవకాశం న్యూజిలాండ్‌కు లభిస్తుందని పేర్కొన్నారు. -
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_) -
థామస్ కప్‌లో సంచలనం.. క్వార్టర్స్‌కు భారత్
ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0తో విజయం సాధించింది. ఇప్పటికే కెనడాను 4-1తో మట్టికరిపించిన భారత్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ స్థానంలో హెచ్ఎస్ ప్రణయ్ ఆడాడు.తొలుత సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-14, 21-16తో స్టీఫెన్ సామ్‌పై విజయం సాధించాడు. ఆ తర్వాత మరో సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధండ్‌పై విజయం సాధించడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి 21-14, 21-16తో రిజ్కీ హిదయత్-జాక్ యూ జంటపై గెలుపొందింది. ఆ తర్వాత రివర్స్ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21-11, 21-17తో రిషి హొండా భూపతిని, డబుల్స్‌లో హరిహరన్-అర్జున్ జోడి 21-12, 21-10తో అండికా రమడియన్-సామ్ జంటపై విజయం సాధించడంతో భారత్ 5-0తో స్పష్టమైన ఆధిక్యంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక బుధవారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ చైనాతో తలపడనుంది. గత థామస్ కప్‌లో చైనా చేతిలో ఓడిన భారత్ క్వార్టర్స్‌కే పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉంది.Thomas Cup: India march into QF with 5-0 win over Australia in their 2nd group stage tie. India will take on powerhouse China in their final group stage clash. #ThomasCup2026 pic.twitter.com/DCeqYEeXZq— India_AllSports (@India_AllSports) April 27, 2026చదవండి: వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా? -
భారతీయ మేధస్సుపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆత్మగౌరవానికి దెబ్బ
నేడు ప్రపంచ యవనికపై ఒక వికృత దృశ్యం ఆవిష్కృతమైంది. ఏ దేశమైతే స్వేచ్ఛకు, సమానత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుందో.. ఏ దేశమైతే వలసదారుల రక్తం, చెమట మీద నిర్మించబడిందో.. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతీయ వలసదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవి. భారతీయులు నరకం నుంచి వస్తున్నారంటూ ఒక లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత దారుణమైన విషయం. ఇది కేవలం ఒక దేశాధ్యక్షుడు చేయాల్సిన ప్రకటన కానే కాదు, ఇది ఒక జాతి మేధస్సుపై చేసిన దాడి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి తగిలిన గాయం. అధ్యక్షుడు ట్రంప్ గారూ మీరూ… ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేయండి. మీ అహంకారపు పునాదుల కింద ఉన్నది భారతీయ మేధస్సు అని మర్చిపోకండి!అమెరికా వెన్నెముక.. భారతీయులే అన్న విషయాన్ని విస్మరించకండి. అసలు భారతీయులు లేని అమెరికాను ఊహించడం అసంభవం. గణాంకాలు ఏం చెబుతున్నాయో మీరే చూడండి. సుందర్ పిచాయి లేని గూగుల్, సత్య నాదెళ్ల లేని మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ లేని IBM, శంతను నారాయణ్ లేని అడోబ్.. ఇవి కేవలం పేర్లు కావు, అమెరికాను ప్రపంచానికి నాయకుడిగా నిలబెట్టిన మేధావులు. మీరు ఈ రోజు వాడుతున్న విండోస్ నుంచి సెర్చ్ చేస్తున్న గూగుల్ వరకు ప్రతి అణువులోనూ భారతీయుడి మేధస్సు ఉంది. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన 500 కంపెనీల్లో దాదాపు 35 శాతం కంపెనీల సారథులు భారతీయులే. సుందర్ పిచాయి, సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. లీనా నాయర్ (చానెల్), రవి కుమార్ (కాగ్నిజెంట్), నిమేష్ షా.. ఇలా ఒక సుదీర్ఘమైన జాబితా ఉంది. వీరు లేకపోతే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది.అమెరికా జనాభాలో భారతీయులు కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ అమెరికా చెల్లించే మొత్తం ఆదాయపు పన్నులో భారతీయుల వాటా దాదాపు 6 శాతం. అంటే 300 పై చిలుకు బిలియన్ డాలర్లు. అంత పెద్ద మొత్తంలో ఖజానాకు పన్నుల రూపంలో ఇస్తున్నది భారతీయులే. అంతే కాదు అమెరికాలో ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు భారతీయులే. భారతీయులు గనుక ఒక్క రోజు సమ్మె చేస్తే అమెరికా ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి ఏమిటో అమెరికా అధ్యక్షుడు ఒక సారి గుర్తు చేసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకవేళ భారతీయులు అక్కడ నరకాన్ని సృష్టిస్తే, ఆ నరకంలో నుంచి అమెరికన్లను కాపాడే దేవుళ్లు ఎవరు? అంతెందుకు మీరు గొప్పగా చెప్పుకునే నాసా లోని శాస్త్రవేత్తలలో 36 శాతం మంది భారతీయులే. అంటే అమెరికా జెండా అంతరిక్షంలో రెపరెపలాడాలన్నా, వెనక ఉండాల్సింది భారతీయుడి మేధస్సే.అమెరికా గత 50 ఏళ్లుగా గ్రీన్ కార్డ్ ఆశ చూపి మన దేశంలోని అత్యుత్తమ మేధస్సును దోచుకుంది. ఐఐటీలు, ఐఐఎంలలో మన ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే.. ఆ మేధస్సును వాడుకుని అమెరికా లాభపడింది. తీరా పనయ్యాక, ఇప్పుడు నరకం అని ముద్ర వేస్తారా? ఇదేనా మీ సంస్కారం? గత అమెరికా అధ్యక్షులు తెలివైన వారు కాబట్టే భారత్ నుంచి మేధో వలసను ప్రోత్సహించారు. తద్వారా అమెరికా నేడు అగ్రరాజ్యమైంది. కానీ నేడు ట్రంప్ ఆ మేధావులను నరకం నుంచి వచ్చిన వారుగా సంబోధించడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ. ఏ నోటితో అయితే భారతీయులను దూషిస్తున్నారో, అదే నోటితో మళ్ళీ భారతీయ ఐటీ కంపెనీల సాయం కోరడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. అమెరికా అభివృద్ధి చెందింది వారి సొంత తెలివితేటలతో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను, ముఖ్యంగా భారతీయులను ఆకర్షించి, వారిని వాడుకోవడం వల్ల మాత్రమే. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? మన దేశ గడ్డపై పుట్టి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడ చదువుకుని.. అమెరికాను నిర్మిస్తున్న మన మేధావులను అవమానిస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మన టెక్కీలను, డాక్టర్లను, సైంటిస్టులను తిరిగి రండి.. మీ దేశాన్ని నిర్మించండని పిలిచే దమ్ము మన దేశ నాయకత్వానికి లేదా?పొరుగున ఉన్న చైనా గూగుల్ లేకుండా నడవగలుగుతోంది, వాట్సాప్ లేకుండా ఉండగలుగుతోంది. మరి భారత్ ఎందుకు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లపై ఆధారపడాలి? మన డేటాను వారు వాడుకుంటూ, మన దేశం నుంచి బిలియన్ డాలర్ల కొద్దీ వ్యాపారం చేస్తూ మనపైనే అహంకారం ప్రదర్శిస్తే ఎందుకు మౌనంగా ఉండాలి? మేకిన్ ఇండియా అనేది కేవలం నినాదం కాదు, అదొక నిప్పు కణిక కావాలి. మన మేధావులతో సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తీసుకురావాలి. భారతీయులను గౌరవించని దేశాల యాప్‌లను మన దేశంలో ఎందుకు అనుమతించాలి? చైనా తరహాలో మనం కూడా మన సొంత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కేవలం ఖండనలతో సరిపెట్టకూడదు. మా టెక్కీలను, మా డాక్టర్లను వెనక్కి రమ్మని భారత ప్రధాని ఎందుకు పిలుపు ఇవ్వకూడదు? గూగుల్ లేదా ఏఐ సెర్చ్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా మనం సెర్చ్ ఇంజిన్ తయారు చేయలేమా? వాట్సాప్ కు బదులు మన సొంత మెసేజింగ్ యాప్ తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మన డేటాతో అమెరికా కంపెనీలు బిలియన్ల లాభాలు గడిస్తున్నాయి. ఆ డేటాను మన దేశంలోనే ఎందుకు భద్రపరచుకోకూడదు?మేకిన్ ఇండియా - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? చైనా తన దేశంలో విదేశీ యాప్‌లను నిషేధించి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. భారత్ ఆ సాహసం ఎందుకు చేయకూడదు? మన దగ్గర ప్రతిభ ఉంది, కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. భారతీయులను అవమానించే నాయకులు ఉన్న దేశం నుంచి వస్తున్న టెక్నాలజీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్ ఇది కేవలం వస్తువుల తయారీకే పరిమితం కాకూడదు. ఇది సాఫ్ట్వేర్, డిజిటల్ రంగాల్లో కూడా ప్రతిబింబించాలి.చివరగా, అధ్యక్షుడు ట్రంప్ గారూ.. వినండి! మీరు నిర్మిస్తున్న గోడలు మనుషులను వేరు చేయవచ్చు కానీ మేధస్సును ఆపలేవు. అమెరికా తన వినాశనాన్ని తనే కోరుకుంటుందని మీ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. భారతీయులు లేని అమెరికా ఒక శూన్యం. ఇకనైనా మన భారతీయ యువత ఆలోచించాలి. ఎన్నాళ్లు పరాయి దేశానికి ఊడిగం చేస్తాం? మన మేధస్సు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. విదేశీ యాప్‌లను బహిష్కరిద్దాం.. స్వదేశీ పరిజ్ఞానాన్ని వెలిగిద్దాం. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అమెరికా కల మనకు వద్దు! భారతీయ మేధస్సు.. ప్రపంచానికి దిక్సూచి కావాలి. - కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ. -
వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం
-
ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల తంతు కొనసాగుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో పలు విశేషాలను పంచుకున్నారు. ఆదివారం జరిగిన తన 133వ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో స్వచ్ఛమైన ఇంధనం, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, అణుసామర్థ్యంలో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని ఆయన వివరించారు.పవన విద్యుత్‌లో పవర్ ఫుల్ రికార్డ్ప్రపంచ పవన విద్యుత్ రంగంలో భారతదేశం సరికొత్త చరిత్ర లిఖిస్తున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. అదృశ్యమైన గాలి శక్తి దేశ పురోగతికి ఎలా చోదక శక్తిగా మారిందో వివరిస్తూ, దేశం ఇటీవల సాధించిన మైలురాయిని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 56 గిగావాట్లను దాటిందని, తద్వారా ఈ ఇంధన సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ఆయన తెలిపారు.కల్పక్కం రియాక్టర్.. అణుశక్తిలో అరుదైన ఘనతభారత అణు కార్యక్రమానికి సంబంధించి మోదీ ఒక కీలక ఘట్టాన్ని ప్రస్తావించారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’క్రిటికాలిటీ దశకు చేరుకుందని, అంటే రియాక్టర్ ఆపరేషన్ దశ ప్రారంభమైందని వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రియాక్టర్.. దేశ పారిశ్రామిక వృద్ధి, ఇంధన, ఆరోగ్య రంగాలకు, అలాగే ఆధునిక రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఇది మన శాస్త్రవేత్తల అద్భుత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.బుద్ధుని బోధనలు.. ప్రపంచ శాంతికి మార్గంశాస్త్ర సాంకేతిక విజయాలతో పాటు రాబోయే పండుగల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. మే నెలలో రానున్న బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల పరిస్థితుల్లో గౌతమ బుద్ధుని శాంతి సందేశం ఎంతో ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. శాంతి అనేది మన అంతరంగం నుంచే మొదలవుతుందని, తనను తాను జయించడమే అత్యుత్తమ విజయమన్న బుద్ధుని బోధనలను ప్రధాని గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ -
మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు రెండో వారమూ పెరిగాయి. ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో 2.362 బిలియన్ డాలర్లు పెరిగి 703.308 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు(ఏప్రిల్ 10) వారంలో ఇవి 3.825 బిలియన్ డాలర్లు పెరిగి 700.946 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది. ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.481 బిలియన్ డాలర్లు పెరిగి, 557.463 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 790 మిలియన్ డాలర్లు పెరిగి 122.133 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
మల్లెల్లో మనమే టాప్!
వేసవి వచ్చేసింది. వేసవిలో ఎండల ధాటి ఎలా ఉన్నా, మల్లెల పరిమళాలు మనసుకు ఊరటనిస్తాయి. మల్లెల పరిమళాలే లేకుంటే, వేసవి తాపాన్ని భరించడం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. వసంతారంభం నుంచి గ్రీష్మం ముగిసే వరకు మల్లెలు విరివిగా పూస్తాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు సహా మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెలు అత్యధికంగా పూసే దేశాలలో మన దేశం అగ్రగామిగా ఉంటుంది. మల్లెలు విరివిగా పూసే దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మల్లెల ఉత్పాదనలో మన దేశం మొదటి స్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో మల్లెల ఉత్పాదన స్థాయిలోనే స్థానిక వినియోగం కూడా భారీగానే జరుగుతుండటం దీనికి కారణం. -
2040లో చంద్రుడిపై మన జెండా
పిల్లలూ, రాత్రి పూట ఆకాశంలో నవ్వుతూ కనిపించే చందమామ మీదకు మనం వెళ్లొచ్చా? వెళ్లడమే కాదు, అక్కడ మన మువ్వన్నెల జెండా కూడా పాతేయొచ్చా? పాతేయొచ్చు’ అని గట్టిగా చెప్పారు నారాయణన్. హైదరాబాద్‌లో ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ‘2040 సంవత్సరానికి ఒక భారతీయుడు చందమామ మీద కాలు పెడతాడు. చేతిలో త్రివర్ణ పతాకం ఉంటుంది’ అని మాట ఇచ్చారు. నారాయణన్ చెప్పిన విశేషాలు ఇలా అర్థం చేసుకోవాలి.మొదట గగనయాన్చందమామ చాలా దూరం. వెళ్లడం చాలా కష్టం. అందుకే మన సైంటిస్ట్‌లు ఇప్పటి నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. మొదట 2027లో ‘గగనయాన్’ మిషన్ నిర్వహిస్తారు. అంటే ముగ్గురు వ్యోమగాములను భూమి చుట్టూ తిప్పి తీసుకువస్తారు. ఇందుకోసం నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ సింగ్, కమాండర్ శుభాంశు శుక్లా లను సెలెక్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వెళ్లి వస్తారు.చంద్రయాన్– 4,5:చంద్రయాన్‌లో భాగంగా 2027లో ఎ20 ఉపగ్రహం పంపుతారు. అది ఆకాశంలోంచి భూమిని చూస్తూ, ‘అమ్మో, ఇక్కడ కాలుష్యం ఎక్కువైంది, అక్కడ వర్షాలు తక్కువైయ్యాయి’ లాంటి వార్తలు చేరవేస్తుంది. 2028కి వచ్చేసరికి అంతరిక్షంలో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం. దాని పేరు ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’. మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు. ఇక చంద్రయాన్–4లో మన రాకెట్‌ని పంపి, చందమామ మీద వాలేలా చేస్తారు. అది అక్కడి మట్టిని, రాళ్లను ఒక డబ్బాలో పెట్టుకుని మళ్లీ భూమి మీదకు తీసుకొస్తుంది. ఆ మట్టిలో ఏముందో ల్యాబ్‌లో చూస్తాం. 2030లో నిర్వహించే చంద్రయాన్–5 ఇంకా పెద్దది. అది ఒక పెద్ద ల్యాండర్‌ని, చిన్న కారు లాంటి రోవర్‌ని చందమామ మీద దింపుతుంది. ఆ రోవర్ వంద రోజులు చందమామ వీధులన్నీ తిరిగి ఫోటోలు, వీడియోలు పంపుతుంది. ఇవన్నీ అయ్యాక, అన్నీ సక్సెస్ అయ్యాక... 2040లో ‘మానవ సహిత చంద్రయాన్’ నిర్వహిస్తారు. ఆ రోజున మన భారతీయుడు రాకెట్ ఎక్కి, చందమామ మీద దిగి, ‘భారత్ మాతా కీ జై’ అని అక్కడ మన జెండా పాతుతాడు. ఇదీ చదవండి: సెలబ్రిటీ చెఫ్‌కు నీతా అంబానీ అద్భుత గిఫ్ట్, వీడియో వైరల్మీరూ వెళ్లొచ్చుపిల్లలూ... ఇప్పుడు నీకు 12 ఏళ్లా? 2040కి మీకు 28 ఏళ్లు. అంటే ఆ రాకెట్ ఎక్కేది మీరే కావచ్చు! అందుకే ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. లెక్కలు, సైన్స్ అంటే భయపడకూడదు. ఆటలు ఆడాలి. అన్నం బాగా తిని బలంగా తయారవ్వాలి. చందమామ మన కోసం చూస్తున్నాడు. వెళ్లి ‘జైహింద్’ చెప్పొద్దూ? -
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం మనదేశంలో తరాలుగా వస్తున్న ఆనవాయితీ! ఐపీఎల్ వచ్చాక వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. అరచేతిలో ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య కోట్లు దాటేసింది. ఇదే బాటలో బ్యాడ్మింటన్ లీగ్, రెజ్లింగ్ లీగ్, టేబుల్ టెన్నిస్ లీగ్, ఖో ఖో లీగ్, ప్రీమియర్ టెన్నిస్ లీగ్, ఆర్చరీ లీగ్ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్‌లు కాస్తో కూస్తో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... క్రికెట్ తరహాలో దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకుంది. మట్టి ఆటతో మనకున్న అనుబంధాన్ని మ్యాట్‌పై చూపించడంతో గ్రామీణ ప్రేక్షకులు పీకేఎల్‌కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎటొచ్చి యావత్ ప్రపంచం వీపరీతంగా ఆదరించే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ పోటీలకు మాత్రం మన దేశంలో ఆదరణ చాలా తక్కువ. మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్‌కప్ జరగనున్నా... ఇప్పటి వరకు మనదేశంలో ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది అభిమానులు కూడా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్‌కప్ ప్రత్యక్ష ప్రసార తీరు తెన్నులపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరానికి సమయం దగ్గరపడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్ మహాసంగ్రామం జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాగనుంది. నాలుగేళ్ల క్రితం ఖతర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇప్పుడు మూడు దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుండగా... మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. గత వరల్డ్‌కప్‌లో కేవలం 64 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా... ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. దీంతో సాధారణంగా ఆసక్తి కూడా మరింత పెరిగింది. ప్రపంచంలో 200కు పైగా దేశాల్లో ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నారు. అందులో దాదాపు అన్నీ దేశాల్లో ఈ వరల్డ్‌కప్ ప్రసారాలు సాగనున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ ముగిసిన 11 రోజులకే... ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతుండటంతో... ఎక్కడ చూసినా ఫోర్లు, సిక్స్‌లు, స్కోర్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీతో ఐపీఎల్ ముగియనుండగా... ఆ తర్వాత 11 రోజులకే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంలా భావించే మనదేశంలో మొదటి నుంచి ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతంతమాత్రమే... ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల తప్ప ఫుట్‌బాల్‌పై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువ. మన దేశ ఫుట్‌బాల్ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేక పోతుండటంతో పాటు... దక్షిణ అమెరికా, యూరప్ దేశాల హవా సాగే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌పై మనవాళ్లకు ఆసక్తి తక్కువే. ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంటే... ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. 100 నుంచి 35 మిలియన్ డాలర్లలకు... తాజా ప్రపంచకప్‌తో పాటు 2030లో జరగనున్న వరల్డ్‌కప్‌ను కలిపి సంయుక్త ప్రసార హక్కులను భారత మార్కెట్లో 100 మిలియన్ డాలర్లకు నిర్వాహకులు విక్రయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు టోర్నీల ప్రసార హక్కులను 35 మిలియన్ డాలర్లకు తగ్గించినా... ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ‘భారత్‌లో ఫుట్‌బాల్ వీక్షణ గత కొంతకాలంగా బాగా క్షీణిస్తోంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను చూస్తే 2013–14లో దాని విలువ 145 మిలియన్ డాలర్లు ఉండేది... అది ఇప్పుడు 60 మిలియన్ డాలర్లకు పడిపోయింది’ అని స్పోర్ట్స్ గేమింగ్ రంగ నిపుణుడు తెలిపాడు. చేతులు కాల్చుకున్న సోనీ, రిలయన్స్ 2014, 2018 ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోర్నీలను భారత్‌లో సోనీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. వీటితో 2016 యూరో కప్‌ను కలిపి మొత్తం 90 మిలియన్ డాలర్లకు వాణిజ్య హక్కులు దక్కించుకుంది. ఆ తర్వాత 2022 వరల్డ్‌కప్ ప్రసార హక్కులను 60 మిలియన్ డాలర్లకు రిలయన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆశించిన లాభాలు గడించలేకపోయాయి. దీంతో ఈసారి ప్రసార హక్కుల విషయంలో తర్జన భర్జన ఇంకా సాగుతోంది.‘భారత్‌లో కేవలం అభిమానులు లేకపోవడమే కాక... మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుట్‌బాల్ వీక్షణల విషయంలో జపాన్‌తో భారత్‌ను పోల్చడం అవివేకం’ అని స్పోర్ట్స్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ లైవ్ మేనేజింగ్ పార్ట్నర్ రోహిత్ అన్నారు. టైమింగ్‌తో తలనొప్పి... ఈసారి ఫుట్‌బాల్ పండగ జరుగుతున్న కెనడా, మెక్సికో, అమెరికా కాలమానంతోనూ మనకు ఇబ్బంది ఎదురవుతోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామునే ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో వీక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎంత ప్రధానమైన ఈవెంట్ అయినా... ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే సమయంలో కాకుండా... అర్ధరాత్రి, అపరాత్రి ప్రసారం చేస్తే వీక్షణలు తగ్గడం సహజమే. ఈ టోర్నమెంట్‌లోని 104 మ్యాచ్‌ల్లో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రికి ముందు ప్రారంభం కానున్నాయి. 2022 ఖతర్ వేదికగా జరిగిన టోర్నమెంట్‌లోని 64 మ్యాచ్‌ల్లో 44 మ్యాచ్‌లు ‘ప్రైమ్ టైమ్’లోనే ప్రసారమయ్యాయి. లాభాలు లేకే... మన దేశంలో 2022 ప్రపంచకప్ స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. జియో సినిమా యాప్‌లో ఉచితంగా లైవ్ అందించగా... స్పోర్ట్స్–18 ఛానల్ మాత్రం ఈ మెగా టోర్నీ కోసం నెలకు 12 రూపాయలు వసూలు చేసింది. ఫుట్‌బాల్ దేశాల్లో ఈ ధర ఎంత భారీగా ఉన్నా... వాటి వీక్షణల్లో ఎలాంటి మార్పు రాదని... కానీ మనదేశంలో మాత్రం ఫుట్‌బాల్ కోసం సభ్యత్వం తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో అయినా లాభాలు రాకపోతే దాన్ని కొనసాగించడం కష్టమే కాబట్టి... ఏ రకంగా చూసుకున్న మన దేశంలో ఫిఫా ప్రపంచకప్‌నకు ఆదరణ పెద్దగా ఉండదనే ఉద్దేశంతోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాణిజ్య ప్రకటనలకు సమయమేది? భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో సైతం అభిమానులు లైవ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రోజురోజుకూ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. గత ఏడాది కాలంలో ఐఎస్ఎల్ ప్రసార హక్కుల విలువలో 97 శాతం తగ్గుదల నమోదైంది. క్రికెట్లో అయితే ఓవర్‌కు ఓవర్‌కు మధ్య వచ్చే వాణిజ్య ప్రకటనలతో ప్రసార కర్తలకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది. కానీ... ఫుట్‌బాల్‌కు మన దేశంలో అంతటి ఆదరణ ఉండదని ప్రసార సంస్థల నిపుణులు అంటున్నారు. ‘క్రికెట్లో ఓవర్ మారినా, వికెట్ పడినా... వాణిజ్య ప్రకటనలకు వీలు ఉంటుంది. టెన్నిస్‌లోనూ సెట్ తర్వాత స్లాట్లు ఉంటాయి. కానీ ఫుట్‌బాల్‌లో మ్యాచ్‌లకు ముందు, తర్వాత, విరామంలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం చాలా తక్కువ’ అని ఆయన అన్నారు. దూరదర్శన్‌కే చాన్స్... మనదేశంలోని ప్రముఖ ప్రసారకర్తలు జియో హాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, సోనీ స్పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్లతో చర్చలు నిర్వహించాలని ‘ఫిఫా’ భావిస్తోంది. ఒకవేళ ప్రసార కర్తలు ఎవరూ ముందుకు రాకపోతే... ప్రభుత్వ ప్రసారకర్త దూరదర్శన్‌లో వరల్డ్‌కప్ ప్రసారమయ్యే అవకాశముంది. 1998, 2002, 2006 ప్రపంచకప్‌లోని పలు మ్యాచ్‌లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 1998 ప్రపంచకప్ ప్రసార హక్కుల ద్వారా దూరదర్శన్ రూ. 3.5 కోట్ల లాభం కూడా పొందడం విశేషం. -
ఒలింపిక్స్‌కు 'సై' అంటున్న ఇండియా
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సైఅంటోంది. అహ్మదాబాద్ లో 2036లో ఈ పోటీలకు ఆతిథ్యం వహించేందుకు భారత్ అధికారికంగా బరిలోకి దిగింది. ఖతార్ (దోహాలో), చిలీ (శాంటియాగోలో), తుర్కియే (ఇస్తాంబుల్‌లో) ఈ పోటీలు నిర్వహిస్తామంటూ మనకు ప్రస్తుతానికి పోటీగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికా కూడా ముందుకొచ్చిందికానీ, ఏ నగరంలో నిర్వహించదలచుకున్నదీ పేర్కొన లేదు. బెర్లిన్, కలోన్, హ్యాంబర్గ్, మ్యూనిక్‌లలో ఎక్కడో ఒకచోట నిర్వహించాలని జర్మనీ యోచిస్తోంది. సెప్టెంబర్‌లో తుది నిర్ణ యాన్ని ప్రకటించవచ్చు. అయితే, బెర్లిన్, మ్యూనిక్ నగరాలు చేదు జ్ఞాపకాలనే రేపుతాయి. జర్మనీ 2036 అవకాశాన్ని దక్కించుకోలేక పోతే, 2040 లేదా 2044లలో నిర్వహించేందుకు ప్రయత్నించవచ్చు. అపఖ్యాతిని మూటగట్టుకున్న జర్మనీజర్మనీ నేడున్నట్లుగా సమైక్యంగా ఉన్నప్పుడు 1936లో బెర్లిన్‌లో ఒకసారి ఒలింపిక్స్ నిర్వహించింది. ఆ తర్వాత, 1972లో ఆనాటి పశ్చిమ జర్మనీలోని మ్యూనిక్‌లోనూ నిర్వహించారు. 1936లో ఎక్కడ పోటీలు నిర్వహించాలో 1931లో నిర్ణయించారు. ఆ మరుసటి ఏడాది (1932లో) అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఆ క్రీడోత్సవాలను ప్రాపగాండా వ్యవహారంగా మార్చేశారు. తమను ఆధిపత్య (ఆర్య) జాతికి చెందినవారుగా చాటుకోవాలని హిట్లర్ చేసిన ప్రయత్నంతో, అవి ‘నాజీ ఒలింపిక్స్’గా అపకీర్తిని మూటగట్టుకున్నాయి. దాని ప్రతీకార జ్వాలను మ్యూనిక్ 1972లో చవిచూసింది. పాలస్తీనా విమోచన సంస్థకు చెందినవారు ఒలింపిక్ గ్రామంలోకి అథ్లెట్ల ముసుగులో అడుగుపెట్టి, ఇజ్రాయెల్ క్రీడాకారుల బసలోకి ప్రవేశించి కొందరిని బందీలుగా పట్టుకుని, ఆ తర్వాత వారిని హత మార్చారు. మొత్తం 11 మంది క్రీడాకారులను బలి తీసుకున్న ఆ ఉదంతం క్రీడా చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. జర్మన్లకు వారి నాజీ గతం ఇబ్బందికరంగానే ఉంది. బెర్లిన్ను 2036 క్రీడలకు ఎంచుకుంటే, పాత గాయాలను రేపినట్లు అవుతుందేమోనని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్–వాల్టర్ స్టెయిన్మయర్ ఆందోళన వ్యక్తపరచారు. అపఖ్యాతి పాలైన ‘నాజీ ఒలింపిక్స్’కు సరిగ్గా ఆ ఏడాదిలోనే నూరేళ్ళు నిండుతాయి. హిట్లర్‌కు ప్రీతిపాత్రమైన జాతి సిద్ధాంతం బెర్లిన్‌లో తుత్తు నియలైంది. ఆఫ్రో–అమెరికన్ జెస్సీ ఓవెన్స్ ఆ పోటీల్లో 100 మీటర్ల, 200 మీటర్ల , 4గీ100 మీటర్ల రిలే, లాంగ్ జంప్ విభాగాల్లో స్వర్ణాలు సాధించి శాశ్వత కీర్తిని గడించారు. 1936 ఒలింపిక్స్‌లో ఇండియాబ్రిటన్ పతాకం కింద భారత బృందం పాల్గొన్న చివరి ఒలింపిక్స్‌గా కూడా 1936 ఒలింపిక్స్ లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ధ్రువతార ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని హాకీ జట్టు, నలుగురు రన్నర్లు, బర్మా (నేటి మయన్మార్) నుంచి వచ్చిన ఒక వెయిట్ లిఫ్టర్ కూడా ఉన్నారు. అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో బర్మా భాగంగాఉండేది. బెర్లిన్ (1936) ఒలింపిక్స్‌లో భారత్ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా, నేటి సోషల్ మీడియాయుగంలో కల్పనల నుంచి వాస్తవాలను వేరు చేసి చూడటం కష్టం. వీఐపీ బాక్స్‌లో కూర్చున్న హిట్లర్ వంక చూస్తూ కుడివైపు తిరిగి శాల్యూట్ చేయడానికి అమెరికాతోపాటు తిరస్కరించిన ఏకైకబృందం భారతదేశానిదేనని ఒక కథ ప్రచారంలో ఉంది. దాన్ని మన ధైర్యానికి, లొంగనితత్వానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. కవాతులో పాల్గొన్న 49 బృందాలలో నాజీ వందనం సమర్పించింది ఆతిథేయ దేశమైన జర్మనీ మాత్రమే. జర్మన్ ఒలింపిక్ చరిత్రకారుల పితామహుడు, ముఖ్యంగా, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌కు సంబంధించిన నిపుణుడు ఫోల్కా క్లట్జ్ ప్రకారం, నాజీ శాల్యూట్‌కి, ఒలింపిక్ శాల్యూట్‌కి మధ్యనున్న సారూప్యత కారణంగా రకరకాల అపోహలు తలె త్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ శాల్యూట్‌కి 1946లో స్వస్తి పలికింది. సాటిలేని భారత హాకీ జట్టు 1928, 1932 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుని, 1936లో హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంచేసింది. దానికి తగ్గట్లుగానే ఫైనల్లో జర్మనీతో తలపడి 8–1 గోల్స్ తేడాతో దాన్ని ఓడించింది. ఆగస్టు 14న జరగవలసిన ఆ పోటీ భారీ వర్షం వల్ల వాయిదా పడి ఆ మరుసటి రోజైన ఆగస్టు 15న ఉదయం 11 గంటలకు జరిగింది. ఆ తర్వాత, ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్–జర్మనీల మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు హిట్లర్ వచ్చారనీ, ధ్యాన్‌చంద్ హాకీ స్టిక్ ఒడుపులు చూసి, ఆయన కళ్లు చెదిరాయనీ చెప్పే కథనంలో కూడా వాస్తవం లేదని క్లట్జ్ అంటారు.ఒలింపిక్స్‌లో క్రీడా జర్నలిస్ట్!ఈ సందర్భంగా చార్లెస్ సెబాస్టియన్ అరుళ్ స్వామి గురించి కూడా చెప్పుకోవాలి. మన స్వామి ఎంత ఘటికుడో తెలుసా? ‘హిట్లర్ అంతటివాడిని టీ తాగేందుకు వేచి ఉండేటట్లు చేశాడు’ అని క్రీడా జర్నలిస్టులు ఆయనను ఆటపట్టిస్తూ ఉండేవారు. స్పోర్ట్స్ జర్నలిజంలో ఆయనే నాకు గురువు. ఇంతకూ ఏం జరిగిందంటే, ఆ ఒలింపిక్స్ మారథాన్‌లో స్వామి పాల్గొన్నారు. ఆయన ఆపసోపాలు పడుతూ చివరలో ఎప్పటికో వచ్చారనీ, ఫలితంగా ముగింపు వేడు కలో జాప్యం జరిగిందనీ జర్నలిస్టులు ఆ విధంగా ఎద్దేవా చేసేవారు. వాస్తవం ఏమిటంటే, మారథాన్ పూర్తి చేసిన 42 మందిలో స్వామి 37వ వ్యక్తిగా నిలిచారు. ఆ రోజు 14 మంది దాన్ని పూర్తి చేయలేకపోయారు. కనుక, స్వామి దృఢత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. పైగా, జ్వరంతో కోలుకుని మరీ ఆ పోటీలో పాల్గొన్నారు. సుదీర్ఘ నౌకాయానం వల్ల పారాటైఫాయిడ్ బారినపడ్డారు. ఫలితంగా, 3 వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో, మార థాన్‌ను చివరకు మార్చారుకానీ, అప్పట్లో అది ముందే ఉండేది. స్వామి తన 83వ ఏట, కోయంబత్తూరులో 1997లో కన్ను మూశారు. భారతదేశపు క్రీడా జర్నలిజం వైతాళికు లలో ఆయనొ కరు. స్వామి గట్టి పోటీనివ్వగల షూటర్ కూడా. ఫుట్‌బాల్ కోచ్‌గా, రిఫరీగా కూడా వ్యవహరించారు. ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న ఏకైక క్రియాశీల జర్నలిస్ట్ ఆయనొక్కరేనని చెబుతారు. -వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)-గులు ఇజికియల్ -
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్ కొత్త చైర్మన్‌గా నియమితులైన శ్రీకాంత్ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు.ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్ వివరించారు. -
భారత్ ఓ నరకకూపం అంటూనే.. ఊసరవెల్లిలా మాట మార్చిన ట్రంప్
-
‘ఓసారి భారత్ రండి’.. ట్రంప్‌నకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఘాటుగా స్పందించాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారత్, చైనా వంటి దేశాలను నరక కూపాలు(Hell-holes)గా అభివర్ణించడమే కాకుండా.. అక్కడి నుండి వచ్చే వలసదారులను ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అంటూ విమర్శించారు.ఈ క్రమంలో ‘భారత్ వచ్చి చూడండి’ అంటూ ముంబాయిలోని ఇరాన్ ఎంబసీ.. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడాలంటూ సూచించింది ‘భారత్‌లోని అభివృద్ధి, సంప్రదాయాలు ట్రంప్‌నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకురావాలి’’ అంటూ పోస్ట్ పెట్టింది. భారత్ అందాలు ప్రశంసిస్తూ.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హెవెన్ మోడ్(స్వర్గంలా)ఉంటాయని... సాంస్కృతిక విలువలు ఎంతో గొప్పవని ఇరాన్ పేర్కొంది. మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా, ట్రంప్ ‘నరకం’ వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని.. అత్యంత దారుణంగా ఉన్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య ఉన్న పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే "బర్త్‌రైట్ సిటిజన్‌షిప్"(జన్మతః పౌరసత్వం) రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుండి వచ్చే వలసలను విమర్శిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే, పరిస్థితి ముదురుతుండటంతో అమెరికా రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ట్రంప్ గతంలో భారత్‌ను "గొప్ప దేశం" అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. -
భారత్‌ను లొంగదీసుకోవడం చాలాకష్టం: అమెరికా
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అంత సులువుగా లొంగే దేశం కాదని అమెరికా చట్ట సభల్లో మాట్లాడుతూ అన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో వారి దేశ ప్రయోజనాలను ఎట్టిపరిస్థితుల్లో వారు పణంగా పెట్టరని తేల్చిచెప్పారు.ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ప్రతినిధుల బృందం అమెరికాతో వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్కు వెళ్లింది. అమెరికా తరపున చర్చలకు దక్షిణ మరియు మధ్య ఆసియాకు సంబంధించిన అసిస్టెంట్ USTR అయిన బ్రెండన్ లించ్ నేతృత్వం వహించారు. మూడు రోజుల పాటు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, ఎథనాల్ మరియు సుంకాల తగ్గింపుపై ఇరు దేశాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. అనంతరం భారత ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసర్ గ్రీర్ చట్టసభల్లో ప్రస్థావించారు.జేమీసర్ గ్రీర్ అమెరికా చట్టసభల్లో మాట్లాడుతూ... "ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. అది చాలాకాలంగా వ్యవసాయ మార్కెట్లకు సంరక్షురాలిగా ఉంది, కనుక ఆ రంగలో రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. భారత్ అంత సులువుగా లొంగదు. ఆ దేశాన్ని లొంగదీయడం చాలా కష్టం" అన్నారు. భారత్ తన మార్కెట్‌ను అంత సులభంగా అమెరికాకు వదిలిపెట్టడం లేదని, చర్చల్లో భారత్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తోందని గ్రీర్ అభిప్రాయపడ్డారు.ఏ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుఅమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే, భారత ప్రభుత్వం మన దేశ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినమైన నిబంధనలను, టారిఫ్‌లను (సుంకాలను) అమలు చేస్తోంది. వాటిని తగ్గించాలని అమెరికా ప్రతినిధులు కోరగా భారత్ దేశ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఒప్పుకోనట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను (ముఖ్యంగా ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు) కొనుగోలు చేసే దిశగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్ నరకం ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.ట్రంప్ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్‌ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన వివాదాస్పద లేఖను తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.కాగా దీనిపై తాజాగా భారత్ స్పందించింది " మేము ట్రంప్ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.మళ్లీ భారత్‌ను పొగిడిన ట్రంప్కాగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.అసలేం జరిగింది ?ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
బిలియనీర్ల హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. బిలియన్ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా చెబుతారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన నైట్‌ఫ్రాంక్ ఈ మేరకు 20వ ఎడిషన్ ‘ద వెల్త్ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్ మార్కెట్స్ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది. రాజధానిగా ముంబై.. దేశంలోని అల్ట్రా హెచ్ఎన్ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్ఎన్ఐల జనాభా పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. -
ఇండియా గ్రేట్ కంట్రీ
న్యూఢిల్లీ: ట్రూత్ సోషల్‌లో తాను చేసిన రీపోస్టు వివాదాస్పదంకావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నష్టనివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు(నరేంద్ర మోదీ) నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అయితే, ఇండియా గ్రేట్ కంట్రీ అంటూ ట్రంప్ ఎక్కడ, ఎప్పుడు వ్యాఖ్యానించారో స్పష్టం చేయలేదు. -
ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్‌పై మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్‌పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్‌పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్‌లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలుఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందనఅటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు. -
‘అవి నరకాలు కావు..మానవాళికి మహోన్నత దేశాలు’
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్‌లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడింది. చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్‌పై విషం కక్కిన ట్రంప్ -
భారత్‌కు రాలేము.. కీలక టోర్నీ నుంచి పాకిస్తాన్ అవుట్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్‌ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్‌బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్‌ఫ్ టోర్నీలో భారత్‌కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్‌గిర్‌లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్‌కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్‌తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్‌కు వెళ్లలేదు. తమ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
హర్మూజ్ జల సంధిలో భారత్ నౌకను సీజ్ చేశాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్‌కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.భారత్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB— IRGC (@IRGC_Press) April 22, 2026 -
భారత్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్
వాషింగ్టన్: వలసల విషయంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్‌ను నరకంతో పోల్చిన ఓ లెటర్‌ను ట్రంప్ షేర్చేశారు. ఇండియా, చైనా దేశాలను అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్.. నరకకూపాలతో పోల్చగా.. ఆయన రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు. జన్మహక్కు పౌరసత్వం గురించి మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థిస్తూ ఆ పోస్టు షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. ఆ జాత్యహంకార లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చేస్తున్న వాదనలను విమర్శిస్తూ సావేజ్ రాసిన లేఖతో పాటు వీడియోను కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పంచుకున్నారు.ఇక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం ఇచ్చే విధానంపై సావేజ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా భారత్, చైనా వలసదారులు ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు.. వీళ్లు మనల్ని దోచుకున్నారు. ఈ గ్యాంగ్స్టర్లు అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది.. మొత్తం కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మనల్ని రెండో తరగతి పౌరులుగా చూశారు’’ అంటూ సావేజ్ రాసుకొచ్చారు. అమెరికా జెండాను భారతీయులు తొక్కేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
భారత్‌లో 500 హోటల్స్ లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్‌లో 2030 నాటికి ప్రాపర్టీల సంఖ్యను 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాడిసన్ హోటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎలీ యూనిస్ తెలిపారు. దీనితో 60,000–80,000 వరకు ఉద్యోగావకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా రిక్రూట్ చేసుకోవడం కోసం ఉద్యోగార్థులకి శిక్షణ కలి్పంచేందుకు టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్, స్థానిక వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాడిసన్‌కి 200 పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రథమ నుంచి నాలుగో శ్రేణి నగరాలవ్యాప్తంగా కొత్త హోటల్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు యూనిస్ చెప్పారు. వీటిల్లో 15 శాతం ఫైవ్ స్టార్‌వి, 45–50 శాతం అప్స్కేల్, త్రీ–స్టార్, ఫోర్–స్టార్ హోటల్స్ ఉంటాయని వివరించారు. కొత్తగా చేపట్టే వాటిల్లో 55 శాతం ప్రాజెక్టులు ప్రథమ శ్రేణి, 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటాయని యూనిస్ వివరించారు. 10 శాతం రిసార్టుల్లో, ఇంకో 10 శాతం ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఉంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం యథావిధిగానే నడుస్తోందని యూనిస్ వివరించారు. దుబాయ్, సౌదీ అరేబియాలాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయంగా టాప్ 3 కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. -
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్‌పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్‌ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్‌ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది. -
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
ఢాకా: దశాబ్దం తర్వాత భారత్ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్‌లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్) దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్ ‘ఎ’లో నేపాల్ (87వ ర్యాంక్), శ్రీలంక (162), భూటాన్ (164)... గ్రూప్ ‘బి’లో భారత్ (69వ ర్యాంక్), బంగ్లాదేశ్ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి. భారత్ తమ లీగ్ మ్యాచ్‌లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ జూన్ 3న జరుగుతాయి. ఫైనల్‌ను జూన్ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్ సాధించింది. -
మాడిపోతున్న ఉత్తరాది.. తడిసిపోతున్న దక్షిణాది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా భానుడి ప్రతాపానికి సాధారణ జీవనం స్తంభించిపోతోంది. ఒకవైపు పర్యాటకులు వడదెబ్బకు గురవుతుంటే, మరోవైపు రాత్రుళ్లు సైతం వేడి గాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.ఢిల్లీలో ‘వాటర్ బెల్స్’.. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు, ప్రతి 45-60 నిమిషాలకు ఒకసారి విధిగా ‘వాటర్ బెల్’ మోగించాలని పాఠశాలలను ఆదేశించింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, ప్రయాగ్‌రాజ్ లో ఏకంగా 44.6 డిగ్రీలు నమోదు కాగా, 26 జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఆరుగురు పర్యాటకులు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. ఎండల భయానికి రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్‌పూర్ వంటి పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి.రాత్రి పూట కూడా వీడని ‘వేడి’సాధారణంగా పగలు ఎండలు మండినా, రాత్రికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడమే కాకుండా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5°C నుంచి 6.4°C మేర పెరగడంతో వాతావరణ శాఖ ‘వార్మ్ నైట్’ (వెచ్చని రాత్రి) అలర్ట్ జారీ చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పైగా నమోదవుతూ, వేడి గాలులు వీస్తుండటం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది.మున్ముందు మరింత ఉక్కపోతభగభగమండే ఎండల నుంచి ఉపశమనం కోసం రైల్వే స్టేషన్లు, రోడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ (43.8°C) స్టేషన్లో మిస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగా, బీహార్ (42°C) లో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై నీళ్లు చల్లుతోంది. వాతావరణ అంచనాల ప్రకారం.. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు హీట్ వేవ్ కొనసాగనుంది. అదే సమయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఛార్ ధామ్‌లో చిరు వ్యాపారం.. లైఫు సెట్టు! -
నిప్పుల కొలిమి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బందాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. యూపీతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 నగరాల్లో 19 మన దేశంలోనివే కావడం గమనార్హం. మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్లో యూపీ, హరియాణా, జార్ఖండ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణానికి మించి వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.వీటితోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులుంటాయని హెచ్చరించారు. మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 జాబితాలో యూపీలోని బందా, బిహార్‌లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నగరాలు న్నాయి. ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీటితోపాటు బిహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్లతోపాటు యూపీ, పశ్చిమ బెంగాల్‌లలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. టాప్–20 నగరాల్లో మనదేశంలో లేని ఏకైక నగరం నేపాల్‌లోని లుంబిని మాత్రమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా భోపాల్‌లో ‘నైట్ హీట్ వేవ్’(రాత్రిపూట వడగాల్పులు) హెచ్చరికలు జారీ అయ్యాయి. -
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఎండతో గుండెకు ముప్పు.. తప్పేదెలా?
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు గుండెపై అదనపు ఒత్తిడి తెచ్చి ప్రాణాల మీదకు తేవొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరం చల్లబడేందుకు గుండె ఎక్కువగా పని చేసే క్రమంలో అలసిపోతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మాగ్నీషియం) కోల్పోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్(రక్తపోటు) పడిపోవడం కూడా జరగొచ్చు. వీటితో పాటు..వేసవిలో అధిక ఉప్పు, కొవ్వు, మద్యం తీసుకోవడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. అవుట్‌సైడ్ ఫ్యాకర్లుగా.. కాలుష్యం కూడా ఓ ముప్పుగా మారుతోంది.ఎవరికీ ఎక్కువ ప్రమాదం?వృద్ధుల్లో.. చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవడం వల్లే ఎక్కువ రిస్క్ ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు.. గుండెపై అదనపు ఒత్తిడి పడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవా ఇప్పటికే బలహీనమైన గుండె మరింత ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. డయూరెటిక్స్(వాటర్ పిల్స్), బీటా బ్లాకర్స్(గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తాయి). NSAIDs మెడిసిన్స్ వాడేవాళ్లలో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను పెంచుతాయి. ఈ మందులు వేసవిలో వాడేవారు నీరు ఎక్కువగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.వేసవిలో గుండెపోటు నివారణకు జాగ్రత్తలుతగినంత నీరు తాగండి.. రోజుకు కనీసం 8 గ్లాసులు, బయటకు వెళ్లేవాళ్లు మరింత ఎక్కువగాకాఫీ, మద్యం, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి – ఇవి డీహైడ్రేషన్‌ను పెంచుతాయి.ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో (10 AM – 4 PM) బయటకు వెళ్లకండి.తేలికపాటి, గాలి చొరబడే దుస్తులు ధరించండి.. కాటన్, లినెన్ ఉత్తమం.తీవ్రమైన వ్యాయామం వేసవిలో మధ్యాహ్నం చేయకండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయడం మంచిది.ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు.. వేడి నుంచి రక్షణ కోసం ఏదైనా ఉపయోగించండి.వేసవిలో ఆహారం నియంత్రించండి – ఉప్పు, కొవ్వు, మద్యం తగ్గించండి.హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి అప్రమత్తం కావాలి. అధిక చెమట, తల తిరగడం, గందరగోళం, వేడి చర్మం, అధిక జ్వరం. ఇవి ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. -
అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్‌కు బహుళ ప్రయోజనం!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలలో కొత్త శకానికి నాంది పలుకుతూ, వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చలు అత్యంత వేగంగా, విజయవంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.ముగింపు దశలో కీలక చర్చలువాషింగ్టన్ డీసీలో భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు అత్యంత సానుకూలంగా, ఉత్పాదక దిశగా కొనసాగుతున్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక చర్చల్లో భారత బృందానికి దర్పణ్ జైన్ నాయకత్వం వహిస్తుండగా, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం తరపున బ్రెండన్ లించ్ నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యాయని, కేవలం కొన్ని చిన్నపాటి అంతరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘ఎక్కువ భాగం పూర్తయింది, ఇక మిగిలి ఉన్నవి చాలా తక్కువే’ అని వారు పేర్కొన్నారు.ఇరు దేశాలకు భారీ ప్రయోజనంఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో మేలు చేస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని ఇరువురికి లాభదాయకమైన ‘విన్-విన్’ ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. సుంకాలు తగ్గించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చాలా కాలంగా ఈ చర్చలు సాగుతున్నాయి. కాగా తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు దేశాలు అంగీకారం తెలపడం ఈ డీల్‌లో కీలక ముందడుగు.భవిష్యత్తును మార్చేలా బహుముఖ బంధంఈ ఒప్పందంలో భారతదేశ ప్రయోజనాలను పూర్తిగా కాపాడామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొదటి దశ ఒప్పందం దాదాపు సిద్ధమైందని తెలిపిన ఆయన.. పోటీ దేశాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, సాంకేతికత, కీలక ఖనిజాలు, రక్షణ రంగాలలో భాగస్వామ్యంతో కూడిన బహుముఖ బంధమని ఆయన పేర్కొన్నారు. ఇది భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే రెండు బలమైన దేశాల కలయిక అని అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ -
ఇక బలీయ బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, దక్షిణ కొరియా నిర్ణయించుకున్నాయి. వార్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని తీర్మానించాయి. అంతేకాకుండా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఏడాది లోగా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సోమవారం ఢిల్లీలో సమావేశయ్యారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సరస్పర సహకారానికి సంబంధించి ఇరుదేశాల మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇంధనం, రక్షణ, అరుదైన ఖనిజాలు, నౌకా నిర్మాణం, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ, లీ జే మ్యూంగ్ నిర్ణయించారు. ఇండియా–సౌత్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఒక ఉమ్మడి వ్యూహాత్మక విజన్‌ను ఆవిష్కరించారు. నౌకా నిర్మాణం, నౌకా రవాణా, సముద్ర రవాణా రంగాల్లో భాగస్వామ్యం కోసం ఒక సమగ్ర విధానాన్ని భారత్, దక్షిణ కొరియా విడుదల చేశాయి. ఇంధన భద్రతపై ఒక సంయుక్త ప్రకటనను సైతం వెలువరించాయి. భారత్‌లో కొరియన్ పారిశ్రామిక టౌన్షిప్ 2010లో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉన్నతీకరించడమే లక్ష్యంగా చర్చలను పునఃప్రారంభించడంపై ఒక ఉమ్మడి ప్రకటనపై భారత్, దక్షిణకొరియా సంతకాలు చేశాయి. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకొనే చర్యల్లో భాగంగా భారత్‌లో కొరియన్ పారిశ్రామిక టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. వాతావరణ మార్పు, ఆర్కిటిక్, సముద్ర సహకారంపై చర్చల కోసం న్యూఢిల్లీ, సియోల్ ‘ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్’తోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖల ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రారంభించాయి. పశ్చిమాసియా పరిణామాలపై మోదీ, లీ జే మ్యూంగ్ చర్చించుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు పెరుగుతుండడం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తామని భారత్, దక్షిణ కొరియా తేల్చిచెప్పాయి. అవి రెండు దేశాల డీఎన్ఏలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తమ రెండు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశాన్ని అందిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు చెప్పారు. దీన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, చట్టబద్ధమైన పాలన పట్ల గౌరవం అనేవి రెండు దేశాల డీఎన్ఏలో ఉన్నాయని ఉద్ఘాటించారు. -
ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్ 15 నుంచి 2026 జులై 15 వరకు మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. ఇవి 18,262 ట్రిప్స్ నడుస్తాయి. వాటిలో 660 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు. ఇవి 11,294 ట్రిప్స్ కు సంబంధించినవి. దీని వల్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, మీ జర్నీ ప్లాన్‌ను రూపొందించడం సులభమవుతుంది. సెలవులు, పండుగలు, పీక్ ట్రావెల్ సమయాల్లో ఇటువంటి ప్రత్యేక సర్వీసులు ఎంతో కీలకంగా మారతాయి. వేసవి ప్రత్యేక రైళ్ల నిర్వహణ భారతీయ రైల్వేల అన్ని ప్రధాన జోన్లలో జరుగుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే 124 రైళ్లు (1,184 ట్రిప్స్)కు ఆమోదం తెలిపి, 76 రైళ్లు (324 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్రన్ రైల్వే 106 రైళ్లు (2,078 ట్రిప్స్) ఆమోదం తెలిపి 92 రైళ్లు (1,667 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (2,245 ట్రిప్స్) ఆమోదం తెలిపి 62 రైళ్లు (1,878 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్తర్న్ రైల్వే 76 రైళ్లు (2,090 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (1,535 ట్రిప్స్) నోటిఫై చేసింది.సెంట్రల్ రైల్వే 74 రైళ్లు (3,082 ట్రిప్స్) ఆమోదం తెలిపి 70 రైళ్లు (2,238 ట్రిప్స్) నోటిఫై చేసింది.సదర్న్ రైల్వే 72 రైళ్లు (558 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (133 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ సెంట్రల్ రైల్వే 64 రైళ్లు (2,711 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (1,060 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ సెంట్రల్ రైల్వే 54 రైళ్లు (1,163 ట్రిప్స్) ఆమోదం తెలిపి 46 రైళ్లు (688 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఈస్ట్రన్ రైల్వే 52 రైళ్లు (814 ట్రిప్స్) ఆమోదం తెలిపి 34 రైళ్లు (477 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్ కోస్ట్ రైల్వే 28 రైళ్లు (410 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (88 ట్రిప్స్) నోటిఫై చేసింది.వెస్ట్ సెంట్రల్ రైల్వే 28 రైళ్లు (408 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (192 ట్రిప్స్) నోటిఫై చేసింది.ఈస్ట్రన్ రైల్వే 24 రైళ్లు (392 ట్రిప్స్) ఆమోదం తెలిపి 10 రైళ్లు (276 ట్రిప్స్) నోటిఫై చేసింది.నార్త్ ఫ్రంట్ియర్ రైల్వే 24 రైళ్లు (220 ట్రిప్స్) ఆమోదం తెలిపి 20 రైళ్లు (141 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్రన్ రైల్వే 20 రైళ్లు (276 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (250 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 10 రైళ్లు (122 ట్రిప్స్) ఆమోదం తెలిపి 8 రైళ్లు (70 ట్రిప్స్) నోటిఫై చేసింది.సౌత్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (509 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (277 ట్రిప్స్) నోటిఫై చేసింది.వేసవి ప్రత్యేక రైళ్ల వల్ల పీక్ సీజన్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. అదనపు బెర్తులు లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అధిక డిమాండ్ ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి. -
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
భారతదేశంలో ట్రైన్ జర్నీ అనేది కేవలం గమ్యస్థానాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దాదాపు అందరూ కూడా సాధారణ రైళ్లలో ప్రయాణం చేసి ఉంటారు. కానీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణం చాలా అరుదు. ఈ రకమైన ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన కిటికీల (విండోస్) గుండా బయట ప్రపంచాన్ని చూడటం ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ కథనంలో మన దేశంలోని డబుల్ డెక్కర్ రైలు మార్గాలు ఏవి? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.ముంబై - అహ్మదాబాద్డబుల్ డెక్కర్ రైలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ముంబై - అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇది రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతూ వ్యాపారవేత్తలు, తరచూ ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజులో జర్నీ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సౌకర్యవంతమైన చైర్ కార్ సీటింగ్, పెద్ద కిటికీలు ఉండటం వల్ల మీ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.ఢిల్లీ - జైపూర్ఢిల్లీ-జైపూర్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దేశ రాజధాని ఢిల్లీని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌తో కలుపుతుంది. ఈ మార్గంలో ఏడాది పొడవునా పర్యాటకులు, రోజువారీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇందులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు.చెన్నై - బెంగళూరుచెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ప్రయాణించే రైళ్లలో ఒకటి. ఉద్యోగులు, విద్యార్థులు, వారాంతపు ప్రయాణికులు ఎక్కువగా ఈ రైలును ఉపయోగిస్తారు. పరిమితమైన స్టాప్‌లు, సమర్థవంతమైన షెడ్యూలింగ్ వంటివి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రైలుకు అధిక డిమాండ్ ఉండటం వల్ల.. టికెట్లు త్వరగా అమ్ముడవుతాయి.విశాఖపట్నం - విజయవాడవిశాఖపట్నం - విజయవాడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ సర్వీసు సాధారణ ప్రయాణికులకు, ఆఫీసులకు వెళ్లేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. విశాఖ పట్టణం, విజయవాడలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ డబుల్ డెక్కర్ మంచి ఎంపిక.హౌరా - ధన్బాద్హౌరా-ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. కోల్‌కతాను జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలుపుతూ నడుస్తుంది. దీనిని వ్యాపారులు, ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.సాధారణ రైళ్లు మాదిరిగా.. డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండవు. దీనికి కారణం ప్రత్యేకమైన మౌలిక వసతులు. ఉదాహరణకు.. ప్లాట్‌ఫారమ్ ఎత్తు, ట్రాక్ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల భారతీయ రైల్వేలు అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాలలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
అప్పుడు మాత్రమే హర్మూజ్‌ను దాటండి: భారత్
హర్మూజ్ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్‌ను జలసంధిని దాటే క్రమంలో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్ నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్‌ను దాటుతున్నప్పటికీ ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్‌ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్.. ఇక చేసేది లేక హర్మూజ్‌ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అప్పటివరకూ హర్మూజ్‌ను దాటకండిఈ పరిస్థితుల నడుమ భారత్ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్‌ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ నౌకలు.. ఇరాన్ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లారాక్ ద్వీపంఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది. -
హర్మూజ్ భద్రతకై భారత్‌తో పనిచేస్తాం.. లీ-జే-మ్యూంగ్
సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించడం తప్పనిసరన్నారు. ఈ అంశంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి సౌత్ కొరియా సిద్ధంగా ఉందని తెలిపారు.దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న (ఆదివారం) భారత్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ అభివృద్ధి చెందుతున్న దేశాలైన సౌత్ కొరియా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దిగుమతుల విషయంలో ఏ ఒక్క దేశంపైనా పూర్తిస్థాయిలో ఆధారపడకూడదని అది దేశ మనుగడకే ప్రశ్నార్థకమవుతుందన్నారు.హర్ముజ్ జలసంధిపై మాట్లాడుతూ.. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా, భారత్ రెండూ దేశాలు ముడి చమురు,సహజ వాయువుతో సహా తమ ఇంధన సరఫరాలలో మెజారిటీ వాటా కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల, మన ప్రజల భద్రతకు మరియు మన దేశాల మనుగడకే కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం అత్యవసరం. హర్ముజ్ జలసంధిలో అన్ని నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు కొరియా, భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఈ ఉమ్మడి నిబద్ధతను నిలబెట్టుకోవడానికి సంబంధిత అంతర్జాతీయ వేదికలలో కూడా మేమిద్దరం కలిసి పనిచేయడం కొనసాగిస్తాము". అని అన్నారుప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాలు చమురుకోసం మరో మార్గాన్ని ఎంచుకోవడం కూడా అవసరం అని ఆయన అన్నారు. ఇటీవల హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.కాగా ఈ రోజు (సోమవారం)ష్ట్రపతి భవన్లో లీ -జే-మ్యూంగ్‌కు అధికారికంగా సైనిక వందనంతో స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్‌తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్‌కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా?
న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్‌లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. ప్రస్తుతం భారత్‌కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్ఎన్జీ నిల్వలు, 40 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్‌కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
721 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. → వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది. → బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది. → అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది. → స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మహిళా కోటా బిల్లు అమలును ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర సర్కారుకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 18) రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్షాలను “దోషులు” అని ప్రధాని మోదీ అన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షం వైఖరిని ఆయన తప్పు అని పేర్కొని, భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.కాగా, లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిన విషయం తెలిసిందే. 352 ఓట్లు రావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే వచ్చాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేశారు 230 మంది విపక్ష సభ్యులు. మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. దీంతో ఆ తర్వాత సవరణతో పాటు మిగతా రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు. విపక్షాలు మాత్రం బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామని అంటున్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ శనివారం బీజేపీ మహిళా నేతలు నిరసనలు తెలుపుతునున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అవకాశం ఉంది. -
టాప్ 3 మార్కెట్లలో భారత్
చెన్నై: రాబోయే రోజుల్లో భారత్ తమ టాప్ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో గ్లోబల్ గ్రూప్ సీఈవో ఫ్రాంకోయిస్ ప్రొవోస్ట్ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు.అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్ నుంచి ఏటా 2 బిలియన్ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్ వివరించారు. కాంపాక్ట్ ఎస్యూవీ ’బ్రిడ్జర్ కాన్సెప్ట్’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా, తమ విద్యుత్ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్ చెప్పారు. -
దేశంలో తొలిసారి ఇంటింటి ఆదాయ సర్వే..
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యంగణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.సర్వే ఎలా చేస్తారంటే.. నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రపంచ దేశాల సరసన భారత్ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!NSO, MoSPI is undertaking India’s first National Household Income Survey (NHIS) from April 2026 to March 2027, capturing income to strengthen evidence-based policy formulation.Visit MoSPI’s official website for related updates and official information: https://t.co/V2xm331pY2… pic.twitter.com/1mmaukq88v— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) April 17, 2026 -
వంట గ్యాస్ సంక్షోభం : రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్
ఇరాన్ వార్ నేపథ్యంలో నెలకొన్న వంట గ్యాస్ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్లైన్ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటేచెర్లపల్లి – నాగ్‌పూర్ పైప్లైన్శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్లైన్పారాదీప్ – రాయ్‌పూర్ పైప్లైన్ఝాన్సీ – సీతార్గంజ్ పైప్లైన్ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యంప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్‌లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనాఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్‌సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్‌గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్‌లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్‌లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్‌టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్‌ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్‌కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్‌స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్‌ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్‌కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్‌కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
టాప్ 3 మార్కెట్లలో భారత్: ప్రముఖ సీఈఓ
రాబోయే రోజుల్లో భారత్ తమ టాప్ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో గ్లోబల్ గ్రూప్ సీఈవో ఫ్రాంకోయిస్ ప్రొవోస్ట్ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు. అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్ నుంచి ఏటా 2 బిలియన్ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్ వివరించారు.కాంపాక్ట్ ఎస్యూవీ ’బ్రిడ్జర్ కాన్సెప్ట్’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా, తమ విద్యుత్ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్ చెప్పారు. -
భారత్‌కు అమెరికా ఎనర్జీ షాక్
అమెరికా తన మిత్రదేశం భారత్‌కు షాకిచ్చింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేసింది. ఈ ప్రభావం భారత్‌కు లభిస్తున్న తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది.ఆ రెండు దేశాల నుంచి మార్చి 11కి ముందు లోడ్ చేసిన చమురు సరఫరాకు మాత్రమే అమెరికా భారత్ సహా కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ స్టాక్ ఇప్పుడు పూర్తయింది. ఇకపై రష్యా, ఇరాన్ చమురు కొనుగోలు చేసే దేశాలు(భారత్ సహా) సెకండరీ సాంక్షన్స్(ద్వితీయ శ్రేణి ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది భారత్‌కు ఒక ఎనర్జీ షాక్ లాంటిదే. ఇప్పటివరకు రష్యా నుండి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి భారత్ తన ఇంధన ఖర్చులను తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో ఆ సరఫరా తగ్గిపోవచ్చు. దీని వల్ల దేశీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం రష్యా నుండి భారీగా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది గణాంకాల ప్రకారం.. రోజుకు సుమారు 2.08 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అయితే కొన్నినెలలపాటు రష్యా నుండి దిగుమతులు తగ్గినా.. డిస్కౌంట్ ధరలు కారణంగా మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో భారత్ రష్యా నుండి 5.3 బిలియన్ యూరోల విలువైన(47,700 కోట్ల రూపాయల) క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి మాత్రం 7 సంవత్సరాల తర్వాత 2026లో మొదటిసారి సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసింది.తాజా పరిణామాల దృష్ట్యా భారత్ తన ఎనర్జీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విభిన్న సరఫరా మార్గాలు (పశ్చిమాసియా.. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా) అన్వేషించుకోవాల్సి ఉంటుందని.. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా మార్గాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా "మాక్సిమమ్ ప్రెషర్" విధానాన్ని మళ్లీ అమలు చేస్తూ, ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ చమురు ధరలపై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు..అమెరికా ఇరాన్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ నెట్‌వర్క్‌పై కొత్త ఆంక్షలు విధించింది. సుమారు రెండు డజన్ల కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో కొందరు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం. -
ఏఐ వినియోగంలో భారత్ టాప్.. కానీ..
న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్‌లాంటి అంశాల్లో భారత్ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్‌లో మిగతా ప్రాంతాల కన్నా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్ఏఐ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్ వినియోగంలో కూడా భారత్‌కి పటిష్టమైన ర్యాంకింగ్ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ కోడెక్స్ (కోడింగ్ టూల్) యాప్‌ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్డ్ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్డ్ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్ సిటీల్లో డేటా అనాలిసిస్ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్ (కోడెక్స్) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్‌లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్‌గఢ్‌లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి. -
కొనేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు
సాక్షి, స్పెషల్ డెస్క్ : తమ కంటెంట్ ద్వారా జనం మదిలో స్థానం సంపాదించుకుంటున్న క్రియేటర్లు.. ఇప్పుడు రిటైల్ రంగంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఎంతలా అంటే.. వారు సూచించిన ఉత్పత్తులను జనం కొనుగోలు చేసేంతగా. ఇంకేముంది.. వాణిజ్యానికి ఒక ప్రధాన ఇంజన్‌గా క్రియేటర్లు అవతరించారు. గత ఐదేళ్లలో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందంటే ప్రజలకు ఉన్న ఆసక్తిని, పెరుగుతున్న వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. క్రియేటర్లు సృజనాత్మక కంటెంట్ ద్వారా విభిన్న ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. లైవ్ డెమోలు, సమీక్షలు, సలహాలు ఇస్తూ వినియోగదారులకు వాటిని చేరుస్తున్నారు. వస్తువు ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూపించడం వల్ల వినియోగదారులకు కొనుగోలుపై గట్టి నమ్మకం కలుగుతుంది. ఫ్యాషన్, టెక్నాలజీ, సౌందర్య ఉత్పత్తుల వంటి విభాగాల్లో నిపుణులైన క్రియేటర్లు ఇచ్చే సలహాలు కస్టమర్లకు సరైన వస్తువును ఎంచుకోవడంలో సహాయపడుతున్నాయి. డెలాయిట్–గూగుల్ నివేదిక ప్రకారం 2030 నాటికి భారత ఈ–కామర్స్ రంగానికి క్రియేటర్ల నేతృత్వంలోని వాణిజ్యం 25 బిలియన్ డాలర్లను జోడించనుంది. క్రియేటర్ల సంఖ్య.. 2020: 9–10 లక్షలు 2025: 35–45 లక్షలు48 కోట్లు – ఆన్లైన్ వీడియోలు, కంటెంట్ చూసేవారు. 33 కోట్లు – వీడియోలు చూస్తారు. కానీ ఆన్లైన్లో షాపింగ్ చేయరు. 18 కోట్లు– ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసేవారు.భారత లైవ్ కామర్స్.. ప్రస్తుత వ్యాపారం: సుమారు 100 కోట్ల డాలర్లు2030 నాటికి అంచనాలు: తక్కువలో తక్కువగా 500 కోట్ల డాలర్లు. సాధారణంగా: 700–800 కోట్ల డాలర్లు. గరిష్టంగా: వెయ్యి–1,200 కోట్ల డాలర్లు. వినియోగదారుల ధోరణి 28% – క్రియేటర్ల ద్వారా కొత్త ఉత్పత్తులను తెలుసుకుంటున్నారు. 63% – వస్తువుల సమాచారం, సిఫార్సుల కోసం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్ముతున్నారు. 68% – లైవ్ షాపింగ్ ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నారు.» క్రియేటర్ల ప్రభావంతో ఐదేళ్లలో ద్వితీయశ్రేణి నగరాలు, చిన్న పట్టణాల నుంచి 5–6 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతారని అంచనా. » సంప్రదాయ ప్రకటనల కంటే తమకు ఇష్టమైన ్రక్రియేటర్ల సిఫార్సులను వినియోగ దారులు 2.5 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. 2030 నాటికి ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ల స్టోర్ ఫ్రంట్స్ ద్వారానే జరుగుతుంది.» 2030 నాటికి లైవ్ కామర్స్ 800 కోట్ల డాలర్ల మార్కెట్‌గా ఎదుగుతుంది. » కోట్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నవారి కంటే తక్కువ మంది ఉన్నా పటిష్టమైన అనుబంధం ఉన్న క్రియేటర్ల ద్వారా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. » పెద్ద కంపెనీలు మార్కెటింగ్ బడ్జెట్లో 20–30% ఇన్‌ఫ్లుయెన్సర్లకే కేటాయిస్తున్నాయి.టాప్ కేటగిరీలు..ఫ్యాషన్, లైఫ్‌స్టైల్: ‘గెట్ రెడీ విత్ మీ’వీడియోలు, ‘ఫ్యాషన్ హాల్స్’ద్వారా ప్రజలు కొత్త ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నారు. ఈ కేటగిరీలో 25–30% ఆన్లైన్ అమ్మకాలు నేరుగా క్రియేటర్ల సిఫార్సుల వల్లే జరుగుతున్నాయి. బ్యూటీ, పర్సనల్ కేర్: మేకప్ ట్యుటోరియల్స్, స్కిన్ కేర్ రివ్యూలకు డిమాండ్ ఉంది. క్రియేటర్లు తమ ముఖంపై ఉత్పత్తులను వాడి చూపే లైవ్ డెమోలను వినియోగదారులు 3 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్: 70%పైగా భారతీయులు యూట్యూబ్‌లో అన్బాక్సింగ్, రివ్యూ వీడియోలను వీక్షిస్తున్నారు. టెక్ క్రియేటర్లు ఇచ్చే బడ్జెట్ గైడెన్స్ వల్ల చిన్న పట్టణాల్లో ఎల్రక్టానిక్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఆరోగ్యం, ఫిట్నెస్: ఇంట్లో వ్యాయామం, డైట్ ప్లాన్స్, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఫుడ్, కుకింగ్: ప్రాంతీయ భాషల్లో వంటల వీడియోలకు కోట్లకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. కిచెన్ అప్లయెన్సెస్, మసాలా బ్రాండ్లు ఈ క్రియేటర్లపై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి -
ఎల్పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా ఎల్పీజీ దిగుమతుల్లో కష్టాలు, నష్టాలు, అధిక ఖర్చులు, సరఫరా అంతరాయాలు లాంటి సమస్యలు తప్పడం లేదు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్యలు ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు ఎంత కాలం పట్టవచ్చు? ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిందా లేక శాశ్వత నష్టం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఎల్పీజీ సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి నాలుగు ఏళ్లు పట్టవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పెరుగుతున్న దిగుమతి నష్టాలు, వ్యయ ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, ప్రభావిత సరఫరాదారుల నుండి అందిన సమాచారం ప్రకారం, పునరుద్ధరణకు కనీసం మూడేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆ అధికారి పేరు వెల్లడించకుండా తెలిపారు.మరోవైపు దేశంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. దొరుకుతుందా లేదా అనే ఆందోళన ప్రజల్లో రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోంది. నిల్వలు కేవలం 15 రోజుల డిమాండ్‌కు మాత్రమే సరిపోతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల్లో నష్టం తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది స్పష్టంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.ఇండియా- సవాళ్లుభారతదేశం తన ఎల్పీజీ సరఫరాల కోసం పశ్చిమ ఆసియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. తన మొత్తం వినియోగంలో 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం, ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడుల కారణంగా ఆ సరఫరాలు దెబ్బతిన్నాయి.ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటంతో ప్రస్తుత సంక్షోభంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా గతంలో 90 శాతం దిగుమతులు ఈ మార్గం ద్వారానే వచ్చేవి. యుద్ధ వాతావరణం వల్ల మార్చి 24 నాటికి ఇది 55 శాతానికి పడిపోయింది. రూబిక్స్ డేటా సైన్సెస్ , వయానా ట్రేడ్ఎక్స్ఛేంజ్ ఏప్రిల్ నివేదిక ప్రకారం, దారి మళ్లించినా,ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ, సరఫరాలో 40-50 శాతం వరకు ఉండవచ్చు.15 రోజులకు మాత్రమే నిల్వ సామర్థ్యందేశంలో సరిపడా ఎల్పీజీని నిల్వ చేసుకునే సామర్థ్యం కేవలం 15 రోజులకు మాత్రమే పరిమితం. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటినుంచీ 14.2 కేజీల డొమెస్టింగ్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలపై భారం తీవ్రంగా పడుతోంది. అలాగే చమురు కంపెనీలపై సబ్సిడీ ఒత్తిడి పెరుగుతోంది.ప్రభుత్వ చర్యలుసరఫరా అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలపై దృష్టి సారిస్తోంది. కోవిడ్ సమయంలో అనుసరించిన పద్ధతుల్లో ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచుకోవడంతోపాటు, స్థానిక ఉత్పత్తిపై దృష్టి సారించింది. రిఫైనరీల ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని భావిస్తోంది. తద్వారా గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఉండాలని భావిస్తోంది. (ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు మరో షాక్!)గల్ఫ్ దేశాలపై ఆధారపడటం2025 ఆర్థిక సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఎల్పీజీ వినియోగానికి 92 శాతాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ , ఒమన్ దేశాలు కలిసి సరఫరా చేశాయి. ఇరాన్ దాడుల తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొన్న యూఏఈ, దిగుమతులలో 41 శాతం వాటాను కలిగి ఉండగా, ఖతార్ 22 శాతం వాటాను కలిగి ఉంది అక్కడ యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి, చివరికి వినియోగదారునిపై భారం పడుతోంది.ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా? -
అదే జరిగితే.. భారత్‌కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్‌లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్‌ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్‌లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్‌కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్‌బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్‌లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్‌కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్‌కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్‌గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్‌లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. భారత్ మధ్యవర్తిత్వం?
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం మరో కీలక దశకు చేరుకుంది. ఏప్రిల్ 16 రేపు ( గురువారం) ఇరాన్-అమెరికా మధ్య రెండో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత్ సైతం మధ్యవర్తిత్వం వహించచ్చన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారత్ మాత్రమేన్ననారు.సెర్గియా గోర్ ఇటీవలే వాషింగ్టన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్థావించారు. ఇరాన్- అమెరికా యుద్ధం విషయంలో భారత్ మధ్యవర్తిత్వం వహించవచ్చా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఇలా మాట్లాడారు"పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడంలో భారత్ మధ్యవర్తిత్వాన్ని అమెరికా స్వాగతిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపడంలో ఏదేశాలైనా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆ అవకాశం ఉంది. ఈ విషయంలో ట్రంప్ ఏ ఒక్క దేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం కోసం ఎవరొచ్చినా స్వాగతిస్తారు". అని అన్నారు.అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలు కీలక నేతలతో సమావేశం నిర్వహించానని వారు పలు కీలక విషయాలను ప్రస్థావించారని పేర్కొన్నారు. వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలపై మరో కొద్ది రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు. అయితే అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత గల హర్ముజ్ జలసంధిని కేవలం ఒక్క దేశం దిగ్భందించిందని ఇది చాలా ప్రమాదకరమని ఇరాన్ పేరు ప్రస్థావించకుండా మాట్లాడారు.కాగా నిన్న (మంగళవారం) నరేంద్ర మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగింది. " నా స్నేహితుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. యుద్ధ ఉద్రిక్తతల వేళ ఇరు దేశాధినేతల చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. -
భారత్ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది?
వాషింగ్టన్: అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) . ఇప్పుడీ ఎఫ్‌బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రజల సాయం కోరుతూ ట్వీట్ చేసింది. మయూషీ భగత్ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్ చేసింది.అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.ఈ క్రమంలో ఏప్రిల్ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్ నెంబర్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. The #FBI offers a reward of up to $10,000 for info leading to the location or recovery of Mayushi Bhagat, and the identification, arrest, and conviction of those responsible. She was last seen in the evening hours of April 29, 2019, leaving her Jersey City, NJ apartment:… pic.twitter.com/CDt1WJjLhM— FBI (@FBI) April 13, 2026 -
హర్ముజ్ బ్లాకేడ్‌తో భారత్‌పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రిక్వెస్ట్‌లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్‌తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్‌కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్‌పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్‌పై ఫోకస్ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, బల్క్ డ్రగ్స్ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ని (సీడీఎస్‌సీవో) పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. -
భారత్‌లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్‌ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్‌లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్‌లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్‌లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు. -
భారత్‌కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!
అమెరికా ఇటీవల ఇచ్చిన తాత్కాలిక అనుమతిని ఉపయోగించుకొని, ఇరాన్ నుంచి చమురు భారత్ పోర్టులకు మళ్లీ చేరడం ప్రారంభమైంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇరాన్ చమురు భారతదేశానికి వస్తుండటం గమనార్హం. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (LSEG) షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. రెండు భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు భారత పోర్టులకు చేరుకున్నాయి.భారత పోర్టులకు చేరుకున్న రెండు ట్యాంకర్లలో.. ఒకటి ఇరాన్ జెండా ఉన్న 'ఫెలిసిటీ' అనే VLCC నౌక పశ్చిమ భారతదేశంలోని సిక్కా పోర్టుకు చేరింది. మరొకటి కురాకావో జెండా ఉన్న 'జయా' అనే నౌక ఒడిశా తూర్పు తీర పోర్టుకు చేరుకుంది. VLCC అనేది సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా చేయగల భారీ నౌక.భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. అయితే.. అమెరికా ఒత్తిడితో 2019 మే నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపు కారణంగా భారత రిఫైనరీలు మళ్లీ ఇరాన్ చమురు కొనుగోలు చేయగలిగాయి. ఈ మినహాయింపు ఏప్రిల్ 19న ముగియనుంది. -
‘హార్మూజ్ వద్ద భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదు’
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించాయని వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్-ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఒకే రకమైన ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఇరాన్‌కు టోల్ చెల్లింపులు చేసే నౌకలను అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.“ఇప్పటి వరకు ఇరాన్ ఏమైనా వసూలు చేసిందా? అని మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు” అని మహమ్మద్ ఫతాలి ఇరాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.ఎల్పీజీ తీసుకెళ్తున్న 9 నౌకలు బయలుదేరేందుకు ఎలాంటి టోల్ చెల్లించలేదని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్‌లో 15 భారత జెండా ఉన్న నౌకలు ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాయని భారత్ చెబుతోంది. భారత్ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాల్లో సుమారు సగం హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతించలేదు. తమ మిత్రదేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చింది.నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటిని నాశనం చేస్తామని ఇరాన్ చెప్పింది. వాటి సురక్షిత ప్రయాణం కోసం ఫీజులు వసూలు చేస్తామని కూడా తెలిపింది. అయితే, టోల్ చెల్లించడం సరైన మార్గం కాదని ట్యాంకర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్టాంకో సంస్థకు చెందిన ఫిలిప్ బెల్చర్ చెప్పారు. -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వినియోగదారులు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.దీని ప్రభావం భారత్‌లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది. చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.భారత్ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. -
అరుణాచల్ ప్రాంతాలకు కల్పిత పేర్లా: భారత్ ఫైర్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్యను దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఇదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీసే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. ‘‘తప్పుడు వాదనలు, నిరాధార కథనాల సృష్టిని చైనా మానుకోవాలి. అరుణాచల్ సహా ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటాయి. చైనా చర్యలు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ, ఏమాత్రమూ మార్చలేవు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. -
తక్కువ ధరకే లభించే వంట గ్యాస్ ఏది?.. ఎల్పీజీనా, ఎలక్ట్రిక్నా, హైడ్రోజన్నా?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ దేశాలకు దిగుమతయ్యే సింహభాగం గ్యాస్ సరఫరా దెబ్బతింది. ఇతర సహజ వనరులు కూడా ప్రభావితమయ్యాయి.ఫలితంగా వంటింట్లో విరివిగా వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్‌లు, హైడ్రోజన్ స్టవ్‌లను వినియోగించడం ప్రారంభించారు. అదే సమయంలో తక్కువ ధరలో లభించే వంట గ్యాస్‌ను ఎంచుకుంటూ, తమ బడ్జెట్‌కు అనుగుణంగా వినియోగంలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో లభించే వంట గ్యాస్ ధరలు, అనుకూల,ప్రతి కూలతలు గురించి ఆరా తీస్తున్నారు.ఎల్పీజీ వంట గ్యాస్ఎల్పీజీ కోట్లాది మంది భారతీయ కుటుంబాలకు ప్రధాన వంట గ్యాస్‌గా కొనసాగుతోంది. ఇది విస్తృతంగా లభిస్తుంది. విద్యుత్ అవసరం లేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడినా వంట చేసుకోవచ్చు. అయితే, ధరలు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. చాలా నగరాల్లో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.900–రూ.1100 మధ్య ఉంటుంది. ఒక సిలిండర్ సాధారణంగా 25–30 రోజుల వరకు వస్తుంది. అంచనా నెలవారీ ఖర్చు: రూ.900 నుంచి రూ.1,200ప్రయోజనాలు:దేశంలో సులభంగా అందుబాటులో ఉంటుందివిద్యుత్ అవసరం లేదుఅందరికీ తెలిసిన గ్యాస్, వినియోగం సులభంప్రతికూలతలు:ధరలు మారుతూ ఉంటాయితరచుగా రీఫిల్ చేయాలిజాగ్రత్తగా వాడకపోతే భద్రతా సమస్యలుఎలక్ట్రిక్ వంట గ్యాస్నగరాల్లో ఎలక్ట్రిక్ వంట, ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరుగుతోంది. ఇది శుభ్రంగా ఉంటుంది. నిర్వహణ సులభం, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అవసరం ఉండదు. ఇండక్షన్ స్టవ్‌లలో శక్తి సామర్థ్యం ఎక్కువ. ఎందుకంటే అవి నేరుగా పాత్రలను వేడెక్కిస్తాయి.అయితే మొత్తం ఖర్చు రాష్ట్రాల వారీగా మారే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది.అంచనా నెలవారీ ఖర్చు: రూ.700–రూ.1100ప్రయోజనాలు:కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కంటే చవకగా ఉంటుందిరీఫిల్ అవసరం లేదుగ్యాస్ లీక్ సమస్యలు లేక భద్రత ఎక్కువప్రతికూలతలు:విద్యుత్ సరఫరాపై ఆధారపడుతుందిపవర్ కట్ సమయంలో ఉపయోగించలేముప్రత్యేక పాత్రలు అవసరంహైడ్రోజన్ వంట గ్యాస్ హైడ్రోజన్ స్టవ్‌లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. గృహ వినియోగానికి విస్తృతంగా అందుబాటులో లేవు. హైడ్రోజన్ గ్యాస్ నీటి నుంచి తయారు చేస్తారు. కొన్ని కంపెనీలు, శాస్త్రవేత్తలు హైడ్రోజన్ ఆధారిత వంట గ్యాస్ సిస్టమ్‌లను పరీక్షిస్తున్నారు. ఇవి ఇంకా విస్తృత వినియోగానికి సిద్ధంగా లేవు.అంచనా నెలవారీ ఖర్చు: ఇంకా అందుబాటులో లేదుప్రయోజనాలు శుభ్రమైనది, పర్యావరణానికి అనుకూలంఫాసిల్ ఫ్యూయల్స్‌పై ఆధారాన్ని తగ్గిస్తుందిప్రతికూలతలు:వాణిజ్యపరంగా అందుబాటులో లేదుఎక్కువ ఖర్చు, మౌలిక వసతుల అవసరంఖర్చు ఇంకా స్పష్టంగా లేదుప్రస్తుత ధోరణులువిద్యుత్ సరఫరా స్థిరంగా, చవకగా ఉన్న నగరాల్లో ఎలక్ట్రిక్ వంట ఎల్పీజీ కంటే కొంత చవకగా ఉంటుంది.విద్యుత్ అస్థిరంగా ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ అత్యంత ప్రాక్టికల్, నమ్మదగిన ఎంపిక.హైడ్రోజన్ ఇంకా రోజువారీ వినియోగానికి సరైన సమయం కాదు.వినియోగదారుల నిర్ణయంనగరాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా ఉంటే, ఎలక్ట్రిక్ వంట ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. తరచుగా పవర్ కట్లు ఎదుర్కొనే ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ భద్రతా పరంగా వినియోగంలో ఉంది. హైడ్రోజన్ భవిష్యత్తులో ఆశాజనకమైనది. కానీ ప్రస్తుతానికి వినియోగం సులభం కాదు. ఎల్పీజీ ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్.. హైడ్రోజన్ వంట ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరుగుతోంది. చాలా కుటుంబాలకు ఎల్పీజీ ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినదే. కానీ ఎలక్ట్రిక్ వంట వైపు మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. భవిష్యత్తు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. -
ఉద్రిక్తతల నడుమ యూఏఈకి జై శంకర్
యూఏఈ భారత్‌కు ఎల్లప్పుడూ ప్రధాన భాగస్వామి అని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. యూఏఈ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు జరిపిన నేపథ్యంలో ఆ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మట్లాడుతూ భారత్‌కు యూఏఈ ఒక అత్యంత ముఖ్యమైన మరియు నమ్మకమైన భాగస్వామన్నారు. రక్షణ, వాణిజ్యం మరియు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దృఢంగా ఉన్నాయని తెలిపారు. యూఏఈ అభివృద్ధిలో మరియు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయడంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మరియు పెట్టుబడుల రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. అనంతరం యూఏఈ ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం మరియు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. కాగా ఇటీవల ఇరాన్ గల్ఫ్ దేశాలలలోని అెమెరికా స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నడుమ జైశంకర్ యూఏఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్.. సబ్స్క్రైబర్ల నంబర్ ఎంతో తెలుసా?
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారత మార్కెట్లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్‌లో అమలు చేసిన ఈ ప్లాన్ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్‌తో భారత ప్రజలను అలరించిన అమెజాన్ ప్రైమ్ వీడియోను దాటి నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చేసింది.నివేదికల ప్రకారం, భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు. ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్‌ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్‌ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది. అయితే, భారత్‌లో జియోహాట్‌స్టార్ టాప్‌లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు. -
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్ వైట్ కొత్త కోచ్‌గా ఎంపికయ్యాడు. 2023 నుంచి మన అమ్మాయిల జట్టుకు తుషార్ ఖండేకర్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా... అతడి స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన వైట్‌ను హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్‌గా నియమించింది. కోచ్ మార్పునకు కారణం వెల్లడించని హాకీ ఇండియా... వైట్ ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటాడనే అంశంలోనూ స్పష్టతనివ్వలేదు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వైట్ తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బెల్జియం, ఆ్రస్టేలియా జూనియర్ జట్లకు కూడా వైట్ కోచ్‌గా పనిచేశాడు. వైట్ శిక్షణలో బెల్జియం అండర్ –21 మహిళల జట్టు జూనియర్ ప్రపంచకప్ కప్‌లో కాంస్య పతకం నెగ్గింది. 2021 నుంచి 2024 వరకు బెల్జియం సీనియర్ జట్టుతోనూ వైట్ కలిసి పనిచేశాడు. ఆ సమయంలో విశేషంగా రాణించిన బెల్జియం జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానం నుంచి మూడో ‘ప్లేస్’కు చేరింది. ఆస్ట్రేలియాకు కోచ్‌గా వ్యవహరించిన సయమంలో జూనియర్ ప్రపంచకప్‌లో ఆ జట్టు కాంస్యం గెలిచింది. ‘తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు కోచ్‌గా భారత్‌లో చాలా సమయం గడిపా. అక్కడి హాకీ ఘన సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్ వరల్డ్‌కప్‌లో భాగంగా... భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల సమయంలో యువ నైపుణ్యం నన్ను కట్టిపడేసింది. అలాంటి అత్యుత్తమ అథ్లెట్లతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. సీనియర్ జట్టులో స్థానం కోసం పోటీపడగల సామర్థ్యం ఉన్న పటిష్టమైన ప్లేయర్లను తయారు చేయడమే నా లక్ష్యం. అటాకింగ్ గేమ్‌కు పదును పెడుతూనే... డిఫెన్స్‌లోనూ మరింత క్రమశిక్షణ పెంచాలని భావిస్తున్నా. మైదానంలో అడుగు పెట్టిన తర్వాత 60 నిమిషాల పాటు అత్యున్నత స్థాయిలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. ఒత్తిడిలోనూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. సీనియర్ స్థాయి ప్లేయర్లను సైతం ఓడించగల ఆత్మస్థైర్యం ఉన్న ప్లేయర్లను తీర్చిదిద్దుతా’ అని వైట్ అన్నాడు. కొత్త కోచ్ రాకతో మన హాకీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. ‘ఆస్ట్రేలియా, బెల్జియం జూనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న వైట్... భారత జట్టుతో చేరడంతో మన ప్లేయర్ల నైపుణ్యాలు కూడా మరింత పెరుగుతాయి. అతడి అనుభవం మనజట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని టిర్కీ పేర్కొన్నాడు. చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
ఇది... మన దేశంలో మొట్ట మొదటి పెట్రోల్ పంపు
ముంబైలోని హ్యూస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్ట మొదటి పెట్రోల్ పంపుకు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తప్ప వీడియోలు చూసే అవకాశం చా....లా తక్కువ. అయితే ఏ.ఐ. తలచుకుంటే వీడియోలకు కొరతా! మన మొట్టమొదటి పెట్రోల్ పంప్‌కు సంబంధించిన ఏఐ–జనరేటెడ్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. చేతితో నడిపే డిస్పెన్సర్ల నుండి నేటీ హై–స్పీడ్ ఫ్యుయలింగ్ స్టేషన్ల వరకు మారుతున్న కాలం, పెట్రోల్‌కు పెరుగుతున్న డిమాండ్, రాకెట్ వేగంతో పట్టణ వృద్ధి... ఈ అంశాలను ప్రతిబింబిస్తూ, భారతదేశపు ఆటోమోటివ్ పరిణామంలో నగరం ఎలా కేంద్రంగా నిలిచిందో చూపే వీడియో క్లిప్ ఇది. చరిత్ర, సాంకేతిక అద్భుతంతో రూపొందించిన ఈ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహా’ అంటున్నారు. ఆరోజుల్లో రోడ్లపై పెద్దగా వాహనాలు కనిపించేవి కావు. అందుకే పెట్రోల్‌కు డిమాండ్ అంతగా ఉండేది కాదు. ఈ వీడియో క్లిప్ ఆ కాలాన్ని కళ్లకు కడుతుంది. సూట్, టోపీ ధరించిన ఇద్దరు వ్యక్తులు కారులో రాగా, ధోతీ, ధరించిన భారతీయుడు చేతితో పనిచేసే డిస్పెన్సర్‌ను ఉపయోగించి కారులో పెట్రోల్ నింపుతూ కనిపిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాటి ప్రశాంతమైన ముంబైని ఆవిష్కరించే వీడియో క్లిప్ ఇది. -
భారత్ వృద్ధి అంచనాలు అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం. -
భారత్‌కు విశ్వసనీయ సరఫరాదారుగా ఉంటాం
న్యూఢిల్లీ: భారత్‌కు ఇక ముందు విశ్వసనీయమైన ఇంధన సరఫరాదారుగా ఉంటామని ఖతార్ హామీ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి రెండు రోజుల దోహా పర్యటన (9, 10 తేదీలు) సందర్భంగా, అక్కడి ఇంధన మంత్రి సాద్ షెరీదా ఆల్‌కాబితో చర్చలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వానికి ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఖతార్ నాయకత్వానికి భారత ప్రధాని సంఘీభావాన్ని ఈ సందర్భంగా మంత్రి పురి తెలియచేశారు. ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్, ఖతార్ స్వాగతించాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలు ఏర్పడిన దృష్ట్యా ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని పేర్కొన్నాయి. భారత్ అవసరాల్లో 45 శాతం ఎల్ఎన్జీ, 20 శాతం ఎల్పీజీని ఖతార్ సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా మంత్రి పురి ఖతార్ పర్యటనకు వెళ్లడం గమనార్హం. -
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్‌లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్‌ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.ఇదీ చదవండి: 'యాప్‌లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓకొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు. -
రష్యా యుద్ధంలో భారతీయులు..?
ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో రష్యా భారతీయులను బలవంతంగా వాడుకుంటుందని నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీనిని తీవ్ర ఆందోళన విషయంగా పేర్కొన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్దం మెుదలై దాదాపు నాలుగేళ్లు పూర్తైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులను లాగారనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ మేరకు బాధితులకు సంబంధించిన 26 కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.ఈ తరహా కేసులు రష్యాలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్రం వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల నుంచి మోసపోయిన భారతీయులు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేయబడ్డారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్- అక్టోబర్ కాలంలో వ్యక్తులు కుప్యాన్స్క్, సెలిడోవ్, మాకివ్కా మరియు చెలియాబిన్స్క్ వంటి సున్నిత ప్రదేశాలలో వారిని మోహరించారని తెలిపారు. వారి క్షేమ సమాచారంపై ఇప్పటి వరకూ ఏలాంటి సమాచారం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే వారి సమాచారంపై మాస్కోలోని రాయభార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏలాంటి స్పందన లేదని తెలిపారు.ఈ కేసు పూర్వాపరాలను పరీశీలించిన సుప్రీంకోర్టు దీనిని అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్లకు వెంటనే వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున హాజరైన తుషార్ మోహతా ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆదేశాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.కాగా రష్యాకు భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఇరు దేశాలు మంచి స్నేహ సంబంధం గలవి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ భారతీయులలో కొంత ఆందోళన రేకేత్తిస్తుంది. -
భారత్‌లో బ్యాన్ చేస్తే మళ్లీ వైరల్ అవుతున్న ఫోటోలు
గత ఏడాదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత పాకిస్తానీ నటీమణులు హానియా అమీర్, మహిరా ఖాన్ తదితరుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. దీంతో వారి అకౌంట్లు ఇక్కడ కనిపించవు. అయితే, సడెన్‌గా వారి ఇన్‌స్టాలోని పోస్టులతో పాటు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు అందుబాటులో లేవు. అవి మళ్ళీ చూపించలేదని గుర్తించారు.పాక్ సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు మళ్లీ భారతదేశంలో కనిపించడంతో నిషేధాన్ని ఎత్తివేశారా..? అనే అంశంపై నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు మళ్లీ కనిపించకపోవడంతో, ఇది సాంకేతిక లోపం కావచ్చునని కూడా చాలామంది పోస్ట్ చేశారు.పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ కేంద్రంగా కొనసాగుతున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు భారత్‌లో నిలిపివేస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాతో పాటు స్టార్ క్రికెటర్స్ సోషల్‌మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేశారు. -
ఇది భారత్ పవర్.. కల్పకంలో వెయ్యేళ్లు సరిపడే విద్యుత్
-
సవాళ్లున్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలను తట్టుకునేలా భారత్ పటిష్టమైన స్థితిలోనే ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, మరింతగా వ్యయం చేయగలిగే సామర్థ్యాల వల్ల గ్లోబల్ ఇంధన షాక్‌లను ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభంలోకి పటిష్టమైన స్థితిలోనే అడుగుపెట్టిందని వరల్డ్ బ్యాంక్ రీజనల్ ప్రాక్టీస్ డైరెక్టర్ (దక్షిణాసియా) సెబాస్టియన్ ఎకార్ట్ తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడంతో పాటు సానుకూల పాలసీలు మొదలైన అంశాలు భారత్ అధిక వృద్ధి సాధించేందుకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, మిగతా వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌తో పాటు ప్రాంతీయంగా మిగతా దేశాలు పటిష్టమైన వృద్ధి సాధించగలవని భావిస్తున్నాం‘ అని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న భారత్ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, ఎగుమతులు మెరుగ్గా నమోదు కావడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరపు అంచనాలు అంతకన్నా తక్కువగా 6.6 శాతంగానే ఉన్నప్పటికీ, జనవరిలో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కన్నా కొంత ఎక్కువే కావడం గమనార్హం. వేగవంతమైన వృద్ధి..: ఎగుమతులపై అత్యధిక టారిఫ్‌లను ఎదుర్కొన్నప్పటికీ గతేడాది భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన ఎకానమీగా నిల్చిందని ఇండియాకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ లీడ్ ఎకానమిస్ట్ ఆరిలియెన్ క్రూస్ తెలిపారు. ఆదాయ పన్ను కోతలు, జీఎస్టీ రేట్ల తగ్గింపులాంటివి దేశీ వినియోగం పెంచడానికి దోహదపడ్డాయన్నారు. ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందని, అయితే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో రిస్క్ లు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధిపై ప్రభావం పడొచ్చని క్రూస్ పేర్కొన్నారు. -
సరైన విజన్‌తో విశ్వగురువుగా అవతరిస్తాం
న్యూఢిల్లీ: భారత్ విశ్వగురువుగా, సూపర్ ఎకానమీగా అవతరించాలంటే అందుకు భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి దార్శనికత అవసరమని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 11వ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. టెక్నాలజీ, ఆర్థికంగా లాభసాటి, ముడి సరకుల లభ్యత, తుది ఉత్పత్తుల మార్కెట్‌కు ఆధారంగా నిలిచే పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. ఎగుమతుల మార్కెట్ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలంటూ.. వ్యవసాయం, అనుబంధ రంగాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. బ్లూ ఎకానమీలో (సముద్ర, తీర ప్రాంత వనరుల ఆధారిత)ఒక్క మత్స్యరంగమే రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌గా అవతరించగలదన్నారు. ఇందులో సగం మేర ఎగుమతులు చేయొచ్చన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని మంత్రి సూచించారు. సవాళ్లను ఎదుర్కోగలం ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోగలదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పరిపూర్ణత కలిగిన ప్రజాస్వామ్యం, దౌత్యం, వైవిధ్యం, నిర్ణయాత్మక చర్యలతో దీన్ని అధిగమిస్తామని చెప్పారు. ఏఐఎంఏ సదస్సులో భాగంగా మంత్రి సింధియా మాట్లాడారు. ‘‘భారత్ నేడు పలు దేశాలతో సంప్రదింపులు నిర్వహించగలదు. హర్మూజ్ జలసంధి ద్వారా భారత్ ఓడలు నేడు తీరాలకు చేరుకుంటున్నాయి’’అని మంత్రి సింధియా వివరించారు. ప్రతీ గ్రామాన్ని బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించేందుకు ప్రభుత్వం రూ.1.39 లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు. దీంతో బ్రాడ్‌బ్యాండ్ వృద్ధి 10 శాతం పెరుగుతుందన్నారు. వచ్చే ఐదు, పదేళ్లలో భారత్ జీడీపీ పరిమాణం మరో 1.5–2 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందన్నారు. కీలక ఖనిజాలు ఎంతో అవసరం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంధన వనరుల్లో వైవిధ్యం, కీలక ఖనిజాల లభ్యత ఎంతో అవసరమని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సవాళ్లు సహజమేనన్నారు. వైవిధ్యంలోనూ సమస్యలు ఉన్నాయంటూ.. దిగుమతులపై ఆధారపడడం కాకుండా, అవి నిరాటంకంగా సాగేలా రాజకీయ సమ్మతి కూడా అవసరమేనన్నారు. ప్రపంచం విశ్వసనీయమైన భాగస్వాముల కోసం చూస్తోందంటూ.. భారత్ ఎగుమతుల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదన్నారు. ఏఐతో కలసి నడవాల్సిందే.. వచ్చే దశాబ్ద కాలాన్ని కృత్రిమ (ఏఐ) మేధ శాసించనుందని.. ఏఐని సది్వనియోగం చేసుకునేందుకు, ఏఐ ఆధారిత టెక్నాలజీలకు మారేందుకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యా సంస్కరణలు అవసరమని వెటరన్ బ్యాంకర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఖరీదైన ఫౌండేషన్ మోడళ్ల కంటే వాస్తవ పరిష్కారాలపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను సృష్టించడం కాకుండా, వాటి అవసరం ఎక్కడో ఉందో చూడాలన్నారు. ఏఐ సామర్థ్యాల పెంపునకు, వ్యయాల తగ్గింపునకు, కస్టమర్లకు మెరుగైన అనుభవానికి సాయపడుతుందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలని, పాఠ్యాంశాల్లో సమగ్రమైన మార్పు కూడా అవసరమేనన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. భారత్‌లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు నియంత్రిత పరిధిలో ఉన్నట్టు చెప్పారు. సంక్షోభాలతో అవకాశాలు: శక్తికాంతదాస్ అంతర్జాతీయ సంక్షోభా ల్లో భారత్ స్థిరంగా నిలబడడమే కాకుండా, వాటిని అవకాశాలుగా మలుచుకుని మరింత బలంగా అవతరించినట్టు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రియల్ జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా (అంచనా) ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు గత ఐదేళ్లలో సగటు వృద్ధి 7.8 శాతంగా ఉండడాన్ని గుర్తు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో నిలకడ, మౌలిక వసతుల ఆధారిత వృద్ధి, బలమైన దేశీ వినియోగ డిమాండ్‌ను దాస్ ఏఐఎంఏ సదస్సులో భాగంగా ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అస్థిరతలు, సరఫ రా వ్యవస్థలో అవరోధాలు, వృద్ధిలో అసమానతలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోందని.. ఈ రిస్క్‌లు ప్రతికూలంగా ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ.. ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. వేగవంతమైన డిజిటలైజేషన్, తయారీ రంగ వృద్ధిని గుర్తు చేశారు. కరోనా విపత్తు సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా (2018 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్) దాస్ పాలసీ చర్యలతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవడం తెలిసిందే. -
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్లలో హన్సిక 6–1తో అరుకె కదిర్‌బెక్ (కిర్గిస్తాన్)పై, నేహా 10–4తో బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచారు. మీనాక్షి క్వార్టర్ ఫైనల్లో 15–4తో ఎస్‌బోసినోవా (ఉజ్బెకిస్తాన్)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్ జిన్ జాంగ్‌తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్‌కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణ, రజతాలు భారత్‌కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ శీతల్‌పై భారత్‌కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్‌కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్‌లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్‌కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్‌గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్‌పై గెలవడం పాయల్‌కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్‌షిప్‌లోనూ శీతల్‌పై పాయల్ పైచేయి సాధించింది. -
యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం?
ఇరాన్ యుద్ధం భారత్ శక్తి, ఆహార భద్రతలలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. ఆర్థిక కోణంలోనే కాకుండా సైనిక భద్రతా కోణంలో కూడా ఇరాన్ యుద్ధం భారత్‌కు గుణపాఠాలు నేర్పుతున్నది. సాధారణంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఉంటుంది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో అది ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్నది. మన దేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతులలో 50 శాతం, ఎల్పీజీ దిగుమతులలో సుమారుగా 80–90 శాతం హార్మూజ్ జల సంధి నుండే రావాలి. ముడిచమురును మనం రష్యా, యూఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో మొదలగు దేశాల నుండి అదనంగా కొనటం ద్వారా పూరించుకోగలుగుతున్నాము. సుమారుగా 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము. కానీ ఎల్పీజీ (వంటగ్యాస్) దిగుమతులు ప్రధానంగా ఖతర్ నుండి హార్మూజ్ జలసంధి ద్వారానే రావాలి. యుద్ధం ప్రారంభం కావడా నికి ముందు బ్యారెల్‌కి 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరుకొంది. కాల్పుల విరమణ వార్తలు చమురు ధరలకు కాస్త ఉపశమనం కలుగజేస్తున్నాయి. బ్యారెల్‌కు ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన సుమారుగా 15–16 బిలియన్ డాలర్లు చమురు దిగుమతికి అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. సౌదీ, యూఏఈ, ఖతర్ దేశాల చమురు క్షేత్రాలు, చమురుశుద్ధి కేంద్రాలకు నష్టం వాటిల్లటంతో, యుద్ధం ముగిసిన తరువాత కూడా చమురు ధరలు తగ్గకపోవచ్చు. చమురు, తత్సంబంధ ఉత్పత్తుల లభ్యతలో సమస్యలు ఉండవచ్చు.ఎరువుల ఉత్పత్తికి దెబ్బఇరాన్ యుద్ధం నేపథ్యంలో చర్చ ఎక్కువగా ముడిచమురు, ఎల్పీజీ మీదనే కేంద్రీకృతమయింది. ఇంతకంటే పెనుముప్పు దాగున్నది. ఎరువుల తయారీకి కావలసిన సహజ వాయువు, ఎల్ఎన్జీ, అమోనియా, ఫాస్పారిక్ ఆమ్లం, గంధకం, పొటాష్ వంటి ముడిసరుకుల కొరకు మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడు తున్నాము. బొగ్గు ఆధారిత ఎరువుల ఉత్పత్తిని గత రెండు దశా బ్దాలుగా సహజవాయువు/ఎల్ఎన్జీ ఆధారంగా మార్చివేశాం. ఎల్ఎన్జీ విషయంలో సుమారుగా 50 శాతం దిగుమతులపై ఆధార పడుతున్నాము. ఖతర్ నుండి ఎల్ఎన్జీ; యూఏఈ, ఒమన్‌ల నుండి ఎల్ఎన్జీ/సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నాము. యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువుల తయారీకి వాడే అమో నియాను సౌదీ, ఖతర్, ఒమన్, యూఏఈ నుండి దిగుమతి చేసు కుంటున్నాము. సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పీ) తయారీకి వాడే గంధకం ప్రధానంగా సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ల నుండి దిగుమతి అవుతున్నది. ఎమ్ఓపీ (మ్యురేట్ ఆఫ్ పొటాష్)లో వాడే పొటాష్ దిగుమతిలో 42 శాతం సౌదీ నుండి వస్తున్నది. ఒమన్ నుండి సుమారుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. యుద్ధం వలన ఎరువుల ముడిసర కుల దిగుమతికి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా ధరలు కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చును. రానున్న ఎల్‌నినో వాతావరణ నేపథ్యంలో, ఎరువుల సమస్య అగ్నికి ఆజ్యంలా తోడయితే మన ఆహార భద్రత ప్రమాదంలో పడవచ్చు.ఆర్థిక మాంద్యం తప్పదా?పరోక్షంగాయుద్ధ ప్రభావం, ఫార్మాస్యూటికల్, ప్యాకేజింగ్, నిర్మాణ సామగ్రి, అల్యూమినియం, సెమికండక్టర్ తయారీ రంగా లపై కూడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీమా ఖర్చులు పెరగటంతో అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయం పెరిగి అన్ని వస్తువుల దిగుమతులు మరింత ప్రియమవుతాయి. కోవిడ్ దెబ్బ నుండి కోలు కొని అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చూపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం ద్రవ్యోల్బణాన్ని మంచి నియంత్రణలో ఉంచగలిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 4 శాతం కిందకు పడిపోయింది. అయితే, దిగుమతుల వ్యయం, ధరల పెరుగుదల వలన బడ్జెట్ లోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి క్రమంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సంవత్సర కాలంగా రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. పెట్టుబడులు భారత దేశం నుండి తరలిపోతున్నాయి. యుద్ధ అనిశ్చితి నేపథ్యంలో మొదటగా బంగారం, తరువాత డాలర్ (అమెరికన్ మార్కెట్) వైపు పెట్టుబ డులు తరలిపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించటంతో దిగుమ తులు ఖరీదవుతున్నాయి. పెరిగిన చమురు ధరల ప్రభావం నుండి సామాన్య పౌరుడిని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించ టానికి చమురు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధనాల ధరలను మాత్రం పెంచారు. యుద్ధం మరో నెల పైన కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ 150 డాలర్లకు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడిక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచక తప్పదు. బహుశా ప్రభుత్వం ఐదు రాష్ట్రాలలో ఎన్ని కలు పూర్తయ్యేవరకు వేచి చూస్తుంది. ఆస్ట్రేలియా, ద.కొరియా, నేపాల్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, యూఎస్ఏ మొదలగు దేశాలలో ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన పొదుపుపై ఆ దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇంధన పొదుపు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించటం; పనివేళలు, పని దినా లను తగ్గించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువులను ఎదుర్కోవాలంటే...మన వంటిల్లు హార్మూజ్ జలసంధికి బందీ అవటం, మన ఎరువుల ఉత్పత్తికి గల్ఫ్ దేశాలపై ఆధారపడటం దేశ శక్తి భద్రత, ఆహార భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇంధన శక్తి, ఆహార ఉత్పత్తి దేశ మనుగడను శాసిస్తాయి. ఇలాంటి కీలక రంగాలలో స్వయం సమృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి. చమురు, సహజ వాయువుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. బొగ్గు, జల విద్యుచ్ఛక్తి, సౌర శక్తి, పవన శక్తి వంటి శక్తి వనరుల అభివృద్ధి మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాలి. సౌర శక్తి, పవన విద్యుచ్ఛక్తి ప్లాంట్ల నిర్మాణానికి కావలసిన పరికరాలకు చైనామీద ఆధారపడుతున్నాము. కీలక రంగాలలో దిగు మతులపై ఆధారపడకూడదు. ముఖ్యంగా అస్థిర (గల్ఫ్) దేశాల మీద, శత్రు దేశాల (చైనా) మీద అసలు ఆధారపడకూడదన్నది యుద్ధం మనకు నేర్పుతున్న గుణపాఠం. ఇరాన్ యుద్ధంలో విద్యుచ్ఛక్తి కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేంద్రాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవటం శత్రువుకు కలిసివస్తుంది. భారతదేశం కూడా చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తే, మొదటి దెబ్బ మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పైన, క్షిపణి కేంద్రాలపైన, యుద్ధయాన స్థావరాలపైన ఉంటుంది. డ్రోన్ల దండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మన విద్యుచ్ఛక్తి కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు దాడికి గురవుతాయి. ప్రాంతీయంగా వీటిని వికేంద్రీ కరించాల్సి ఉంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన స్పైమాస్టర్..!
దేశాన్ని కాపాడేది కనబడే సైనికులు, సైనిక వ్యవస్థ. అలాగే కనిపించని కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేసి తమ ఉనికి కూడా చరిత్రలో లేకుండా పోరాడిన యోధులు ఎంతో మంది ఉన్నారు. హెడ్‌లైన్స్‌లో కనిపించని లెజెండ్ RAW పుట్టుక వెనుక, సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన భారత స్పైమాస్టర్ కథ ఇది. ఇవాళ సినిమాల్లో దూరందర్ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి, కనిపించకుండా తిరిగి, తెలివితోనే దెబ్బ తీసి, దేశాన్ని కాపాడుతున్నట్టు... ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాది వేసిన అసలు గొప్ప మనిషి ఎవరో తెలుసా? ఆయనే రమేశ్వర్ నాథ్ కౌ (R.N. Kao).భారతదేశ గూఢచారి వ్యవస్థకు పునాది వేసిన గొప్ప వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు కాదు… యుద్ధరంగంలో తుపాకీ పట్టిన సైనికుడు కూడా కాదు…కానీ ఆయన తెలివి, ఆయన ప్లాన్లు దేశ భవిష్యత్తును మార్చేశాయి.రీసెర్చ అండ్ ఎనాలిసిస్ వింగ్ (R&AW) అనే భారత విదేశీ గూఢచారి సంస్థను నిర్మించిన అసలైన శిల్పి ఆయనే. అసలు ‘రా’ ఎలా పుట్టిందో ఓసారి చూద్దాం. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్థాన్ యుద్ధం ఈ రెండు సంఘటనలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పాయి: బలమైన గూఢచార వ్యవస్థ లేకపోతే దేశం ఎదురు దెబ్బలు తినాల్సిందే. అప్పుడు అప్పటి ప్రభుత్వం, అధికారులు గట్టిగా ఆలోచించి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు దేశానికి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలి. ఆ బాధ్యత ఒక్కరికి అప్పగించారు… అతనే ఆర్ ఎన్ కౌ 1968లో ఆయన స్థాపించిన సంస్థేనే ‘రా’ ఇది కేవలం ఒక సంస్థ కాదు… భారతదేశం ప్రపంచ వేదికపై కనిపించని బలంగా మారిన క్షణం. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో R&AW పాత్ర చరిత్రలో ప్రత్యేకం. ఆర్. ఎన్. కౌ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్థాన్‌లో రహస్య గూఢచారి నెట్వర్క్ నిర్మించారు. ముక్తి బాహిని యోధులకు శిక్షణ ఇచ్చి పాకిస్థాన్ సైన్యం కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందించారు. ఫలితంగా ప్రపంచ చరిత్రలో అతి వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 93,000 వేలమంది పాకిస్తాన్ సైనికులు లొంగుబాటు.దాంతోపాటు బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది. యుద్ధంలో సైన్యం కనిపించింది… కానీ విజయానికి పునాది వేసింది మాత్రం కౌ ఇంటెలిజెన్స్. ఈయన స్పైమాస్టర్ స్టైల్ ఏంటంటే శబ్దం లేకుండా ప్రభావం చూపించడం ఆర్ ఎన్ కౌ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆయన ఫోటోలు చాలా అరుదు, ఇక ఇంటర్వ్యూలు దాదాపుగా లేవు, అలా అని ఆయన పబ్లిక్ స్పీచ్‌లు కూడా చేయలేదు. ఆయన నమ్మకం ఒక్కటే “Real intelligence works in silence.” ఆయన ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో లేరు కాని ఆ హెడ్ లైన్స్ రావడానికి కారణం ఆయనే. అయితే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉండేది. సీఐఏ, ఎమ్ 16 వంటి ప్రపంచ గూఢచారి సంస్థలు కూడా కౌ వ్యూహాలను గౌరవించేవి. అణు కార్యక్రమ రహస్యాలను రక్షించడం, విదేశీ రాజకీయ పరిణామాలను ముందే అంచనా వేయడం, శత్రు దేశాల వ్యూహాలను పసిగట్టడం...ఇవన్నీ ఆయన నిర్మించిన వ్యవస్థ వల్లే సాధ్యమయ్యాయి.దేశం కోసం పని చేసిన రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో ఉంటారు. సైనికులు యుద్ధ గాథల్లో ఉంటారు. కానీ… దేశాన్ని కనిపించకుండా కాపాడిన గూఢచారులు మాత్రం కనిపించకుండా కదిలే కాలంలో కలిసిపోతారు. ఆ గూఢచారుల్లో అత్యున్నత స్థానం ఆర్ ఎన్ కౌది.ఆయన ఎప్పుడూ పేరు కోసం పని చేయలేదు. పతకాలు కోసం జీవించలేదు. దేశం సురక్షితంగా ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జీవించారు. ఆ లక్ష్యాన్ని మరింత బలంగా చేసి, ముందుకు తీసుకెళ్తున్న మరో గొప్ప మనిషి ప్రస్తుత భారత ఇంటెలిజెన్స్ అధినేత అజిత్ దోవల్ గారు. దాదాపు దోవల్ గారు కూడా కౌ సాబ్ బాటలోనే నడిచారు... కానీ తన స్టైల్లో మార్చేశారు. ఐపీఎస్ అధికారిగా 1968లో జాయిన్ అయిన ఆయన, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా ఏళ్లు పని చేసి, రహస్య ఆపరేషన్లలో లెజెండ్ అయ్యారు. గోల్డెన్ టెంపుల్‌లోకి ISI ఏజెంట్‌గా దూసుకెళ్లి, మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జీవించి, ముఖ్యమైన సమాచారం సేకరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్స్ (Operation Black Thunder)కు పునాది వేశారు. పాకిస్థాన్‌లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండి (కొన్ని కథనాల ప్రకారం 7+ ఏళ్లు), శత్రు భూమిలో భారత్ కోసం పని చేశారు. మిజోరం, పంజాబ్, కాశ్మీర్లో తిరుగుబాట్లను అడ్డుకున్న ఆపరేషన్లు... అన్నీ ఆయన ప్లాన్ల వల్లే సాధ్యమయ్యాయి. ఇవాళ NSAగా దోవల్ గారు కౌ సాబ్ వారసత్వాన్ని “రక్షణ + దాడి” స్ట్రాటజీగా మలిచారు. సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ (2019), డోక్లాం స్టాండ్-ఆఫ్, కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు — ఇవన్నీ ఆయన తంత్రాల వల్లే జరిగాయి. సినిమాల్లో చూసే “దూరందర్” లాంటి థ్రిల్... దోవల్ గారి జీవితంలో నిజంగా జరిగింది, కానీ ఆయన ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రాలేదు.అటు కౌ సాబ్ కి ఇటు దోవల్‌కి కావలసింది ఒక్కటే — దేశం సురక్షితంగా ఉండాలి. అయితే కౌ సాబ్ రహస్యంగా పునాది వేశారు. దోవల్ ఆ పునాదిని భారత బలంగా మార్చేశారు. ఇలాంటి తెలియని హీరోలు ఉన్నంత కాలం... భారతదేశం ఎప్పుడూ అజేయమే! -
భారత్‌లో యువతను రెచ్చగొడుతున్న ఆకిబ్‌కు ఏటీఎస్ షాక్
లక్నో: దుబాయ్‌లో ఉన్న ఐసిస్ మాస్టర్‌మైండ్ ఆకిబ్‌పై ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గ్లోబల్ అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గాలింపు చర్యలను ప్రారంభించింది. భారత్‌లో ఇటీవల బహిర్గతమైన ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ప్రధాన సూత్రధారి అతడేనన్న అనుమానాలు ఉన్నాయి.ఉగ్రవాద కార్యకలాపాల కోసం స్థానికంగా నియమితులైన వ్యక్తులు, పాకిస్థాన్ హ్యాండ్లర్ల మధ్య ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. సఖిబ్ అలియాస్ “డెవిల్”, అర్బాబ్, లోకేష్, వికాస్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ విచారణ కొనసాగుతోంది. వీరు ఢిల్లీ, ముంబై, హరియాణాలో దాడులకు ప్రణాళిక వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆకిబ్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. సఖిబ్ అలియాస్ “డెవిల్” నేతృత్వంలోని మాడ్యూల్‌ను ఈ నెల ప్రారంభంలో ఏటీఎస్ బహిర్గతం చేసింది. సఖిబ్‌తో పాటు అర్బాబ్, లోకేష్, వికాస్ విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో దేశ వ్యతిరేక చర్యలకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఉన్నాయి.విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సఖిబ్ను పాకిస్థాన్ హ్యాండ్లర్లతో కలపడంలో ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. తర్వాత సఖిబ్ స్థానిక స్థాయిలో నెట్వర్క్ ప్రారంభించి, యువకులను చేర్చుతూ ఉగ్రవాద ప్రచారాన్ని వ్యాప్తి చేశాడు.సఖిబ్ టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో పదికి పైగా గ్రూపులు సృష్టించాడు. ఈ గ్రూపుల్లో రెచ్చగొట్టే, దేశ వ్యతిరేక వీడియోలు, పోస్టులు చేస్తూ సభ్యులను హింసాత్మక సిద్ధాంతాలను నమ్మే దృక్పథం వైపుగా లాగే ప్రయత్నం చేశాడు.సఖిబ్‌తో పాటు అర్బాబ్, లోకేష్, వికాస్‌కు ఉగ్రవాదులు పద్ధతిగా శిక్షణ ఇచ్చారు. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా సూచనలు చేశారు. ఈ గ్రూపులతో వందలాది మందికి సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. వారి గుర్తింపు, పాత్రపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
ఈ సారి వర్షాలు తక్కువ.. కష్టాలు ఎక్కువ.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. స్కైమెట్ అధికారిక అంచనాను విడుదల చేసి వివరాలు తెలిపింది. గత అనేక సంవత్సరాల సగటు వర్షపాతాన్ని (దీర్ఘకాల సగటు వర్షపాతం)ఎల్పీఏ అంటారు. ఇది సాధారణంగా 868.6 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ సారి అందులో సుమారు 94 శాతం మాత్రమే ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. దీనికి 5 శాతం ఎక్కువ లేదా తక్కువగానూ వర్షాలు పడవచ్చని చెప్పింది. స్కైమెట్ అంచనాలో ముఖ్యాంశాలుమొత్తం వర్షపాతం: ఎల్పీఏలో 90-95%గా ఉండనుంది, అంటే సగటుతో పోలిస్తే తక్కువ వర్షాలు పడతాయి.ఈఎన్ఎస్ఓ ప్రభావం (ఈఎన్ఎస్ఓ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత మార్పులు ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపే వ్యవస్థ): దీర్ఘకాల లా నినా తర్వాత పసిఫిక్ సముద్రం ఈఎన్ఎస్ఓ-న్యూట్రల్ దశకు మారింది. వర్షాకాలం సమయంలో ఎల్ నినో బలపడుతుంది. ఇది ముఖ్యంగా జులై-సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువ పడేలా చేసే అవకాశం ఉంది.భారత మహాసముద్ర ద్విధ్రువం (ఐఓడీ): న్యూట్రల్ లేదా కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. జూన్‌లో వర్షాలు బాగా పడడానికి సాయం చేస్తుంది. కానీ, ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదు.ప్రాంతాల వారీగామధ్య, వాయవ్య భారత్ (పంజాబ్, హరియాణా, రాజస్థాన్) ప్రాంతాల్లో ముఖ్యంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. తూర్పు, ఈశాన్య భారత్‌లో సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉంది.నెలవారీగా అంచనాజూన్: ఎల్పీఏలో సుమారు 101% (మంచి ప్రారంభం)జూలై: సుమారు 95%ఆగస్టు: సుమారు 92%సెప్టెంబర్: సుమారు 89% (అత్యల్ప వర్షాలు)ఇలా జరిగే అవకాశాలూ ఉన్నాయ్..అధిక వర్షపాతం (>110% ఎల్పీఏ) అవకాశం 0% (అంటే ఈ సారి అధిక వర్షపాతం పడే ఛాన్స్ లేదు)సాధారణం కంటే ఎక్కువ 10%సాధారణం 20%సాధారణం కంటే తక్కువ 40%వర్షాభావం (<90% ఎల్పీఏ) 30%తక్కువ వర్షపాత ప్రభావాలుమధ్య, పశ్చిమ భారత వర్షాధార ప్రాంతాల్లో రైతులు నీటి కొరతను ఎదుర్కోవచ్చు.ప్రభుత్వ అధికారులు తూర్పు, ఈశాన్యంలో అనుకూల వాతావరణ పరిస్థితులు, వాయవ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసుకోవాలి.సీజన్ రెండో భాగంలో అస్థిరంగా పడే వర్షాలు పంటల దిగుబడి, నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
నితేశ్‌కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్లో భారత రెజ్లర్లు నితేశ్ (97 కేజీలు) రజత పతకం దక్కించుకోగా... ప్రిన్స్ (82 కేజీలు), సచిన్ సెహ్రావత్ (67 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ మొహమ్మధాది సరావి (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో నితేశ్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. దిదార్ అమన్‌జరోవ్ (తుర్క్మెనిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో ప్రిన్స్ 10–1తో విజయం సాధించాడు. అబ్దుమలిక్ అమినోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సచిన్ 6–5 పాయింట్ల తేడాతో గెలిచాడు. ఓవరాల్‌గా గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 195 పాయింట్లతో ఇరాన్ గ్రీకో రోమన్ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. 154 పాయింట్లతో కిర్గిస్తాన్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. బుధవారమే మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత రెజ్లర్లు హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) నేడు కాంస్య పతకాల కోసం పోటీపడతారు. సెమీఫైనల్లో హన్సిక 1–11తో యుజువాన్ లీ (చైనా) చేతిలో, నేహా 5–12తో మెంగ్యు జి (చైనా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన కాజల్ (76 కేజీలు), నీలమ్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. -
ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరికలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్‌లోని భారతీయుల కోసం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలంటూ బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని.. ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదంటూ అందులో కీలక సూచన చేసింది. మరిన్ని వివరాల కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతూ.. +989128109115; +989128109109; +989128109102; +989932179359 హెల్ప్‌లైన్ నెంబర్లతో పాటు cons.tehran@mea.gov.in మెయిల్ ఐడీని సంప్రదించాలని తెలిపింది. రెండు వారాల యుద్ధ విరమణ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లు స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఇరాన్‌లోని భారతీయుల క్షేమసమాచారాలను కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది. -
ఈ–కామర్స్ @ 250 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. జెన్ జెడ్ షాపర్స్, క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్లైన్ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్ జెడ్ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.దేశీయంగా ప్రజల షాపింగ్ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్ కీలక దశలో ఉందని గూగుల్ ఇండియా ఎండీ (కనెక్టెడ్ కన్జూమర్ కామర్స్) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్ శకం వైపు మార్కెట్ మళ్లుతోందని డెలాయిట్ దక్షిణాసియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ పేర్కొన్నారు. డిజిటల్ జనులైన జెన్ జెడ్ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్ కూడా అందించే జనరేటివ్ కామర్స్ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ⇒ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్ కామర్స్ మార్కెట్ రాబోయే రోజుల్లో 50 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. ⇒ 2030 నాటికి మొత్తం క్విక్ కామర్స్ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్‌లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి. ⇒ క్రియేటర్ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ స్టోర్ఫ్రంట్ ద్వారా జరుగుతుంది. లైవ్ కామర్స్ 8 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ⇒ పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది. -
పాకిస్థాన్ మరిన్ని ముక్కలవ్వడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ: పాకిస్థాన్‌కు భారత రక్షణశాఖ రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ‘కోల్‌కతాపై దాడి’ వ్యాఖ్యల్ని ఖండించారు. పశ్చిమ బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.మంగళవారం ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అసిఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్‌కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ పాక్ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.1971లో పాక్ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్‌కతాపై దాడి చేస్తే పాక్‌లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్‌కు మరింత విభజన తప్పదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. -
పెట్టుబడులకు బూస్ట్.. వడ్డీరేట్ల కట్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్‌కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్‌లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ముందుంది గడ్డుకాలం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్‌కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్‌కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు. జోగిందర్, సన్నీ కుమార్‌లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ నుంచి భారత రెండు డబుల్స్ స్టార్స్ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపాడు. డబుల్స్‌లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్ స్టార్స్ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్‌కు సింగిల్స్‌లో మరో స్వర్ణ పతకం లభించలేదు. -
ఇరాన్ మాస్టర్ మైండ్.. పశ్చిమాసియా యుద్ధంలోకి భారత్?
వాష్టింగన్: హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేదంటే ఇరాన్లో విధ్వంసం తప్పదని హూంకరిస్తున్నారు. అయితే, ట్రంప్ బెదరింపుల్ని ఇరాన్ ఖాతరు చేయడం లేదు. హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెబుతోంది. అమెరికాను ఏకాకిని చేస్తూ.. పశ్చిమాసియా యుద్ధంలో తమకు భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు తమకు అండగా ఉన్నాయని తెలిసేలా సెటైరికల్ ట్వీట్లు వేస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తున్నాయి. ఆ ట్వీట్లలో దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ట్రంప్:హర్మూజ్ జలసంధిని తెరవండి అని ఇరాన్ అడుగుతుంటే మిగిలిన దేశాలు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశాయని అర్ధం వచ్చేలా ట్వీట్లలో హైలెట్ చేశాయి. భారత్: హర్మూజ్ జలసంధిని మూసేశారా?పాకిస్థాన్: హర్మూజ్ జలసంధిని మూసేసింది. రష్యా: విచిత్రంగా ఉంది…దక్షిణాఫ్రికా: లేదు హర్మూజ్ జలసంధి తెరిచే ఉందిఫ్రాన్స్: అబ్బే అలా ఏం లేదే. హర్మూజ్ జలసంధిని చూస్తుంటే మాకు అలా అనిపించడం లేదేచైనా: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. మేం ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం’అని ట్వీట్లలో పేర్కొంది. బల్గేరియా ఎంబసీ: ‘టేక్ ఇట్ ఈజీ టైగర్, కీప్ యువర్ కూల్’ అంటూ ట్రంప్‌ను ఎగతాళి చేసింది జింబాబ్వే ఎంబసీ: “ట్రంప్, నాతో మాట్లాడు. మాకు చాలా బోర్‌గా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించింది మరికొన్ని ఎంబసీలు ‘తాళాలు పోయాయి’ అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్ ట్వీట్లలో భారత్, చైనా వంటి దేశాల పేర్లు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉంది. తాను ఒంటరిగా లేనని, తనకు మిత్రదేశాలు అండగా ఉన్నాయని ప్రపంచానికి సంకేతం ఇవ్వడమే. అమెరికాను ఏకాకిగా చూపించడమే కాకుండా, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉందని అంతర్జాతీయ సమాజానికి ధైర్యం చెప్పడమేనని వారు విశ్లేషిస్తున్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇక్కడి ఉద్రిక్తతలు చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి.ఇటీవలి అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి చేశాయి. సౌదీ అరేబియా, కువైట్, యుఎఈ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. టెహ్రాన్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.ఇరాన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తే, మరోవైపు ప్రపంచానికి “మా వెనుక ఇతర దేశాలు ఉన్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే సందేశాన్ని పంపుతున్నాయి. అయితే, హర్మూజ్ వివాదం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Trump: "Open the Strait of Hormuz!"India: "Is it closed?"Pakistan: "Closed?"Russia: "Strange…"South Africa: "but it's Open, of course"France: "Doesn't look like it…"China: "Open… we just passed through! 🚢😏"Trump: 🙁 https://t.co/vnNc1EQy54— Iran Embassy SA (@IraninSA) April 5, 2026


