డీ-కంపెనీకి గట్టి దెబ్బ | Indias victory: Blow to D Company | Sakshi
Sakshi News home page

డీ-కంపెనీకి గట్టి దెబ్బ

Apr 28 2026 10:47 AM | Updated on Apr 28 2026 11:12 AM

Indias victory: Blow to D Company

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కనుసన్నల్లో నడుస్తున్న నెట్‌ వర్క్‌కు గట్టి దెబ్బ తగిలింది. దావూద్‌ సన్నిహితుడు, డ్రగ్ కింగ్‌పిన్ సలీం డోలాను టర్కీ(తుర్కీయే) భారత్‌కు అప్పగించింది. తాజాగా ఇస్తాంబుల్‌లో అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి డిపోర్ట్ చేసినట్లు సమాచారం. ఇది డీ-కంపెనీపై భారత ప్రభుత్వం చేపట్టిన భారీ అణచివేత చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.  

దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ కొన్ని దశాబ్దాలుగా అండర్‌వరల్డ్‌ మాఫియా నడిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్, ఆయుధాలు, అక్రమ వ్యాపారాల నెట్‌వర్క్‌ను నడిపిస్తూ వచ్చింది. హవాలా లావాదేవీల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తూ వచ్చాడు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా వచ్చిన సొమ్మును పాకిస్తాన్‌ ఐఎస్‌ఐకి కూడా చేరుతుందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. 70వ దశకంలో ముంబై బేస్డ్‌గా ప్రారంభమై.. ఇప్పటికీ ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌, ఉత్తర అమెరికా రీజియన్‌లలో క్రైమ్-టెర్రర్‌ నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. అయితే.. 

దావూద్‌ అనుచరుడు సలీం డోలా వంటి సహచరులు ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. డోలా దావూద్‌కు అత్యంత సన్నహితుడిగా తెలుస్తోంది. ఇతని అరెస్టు, భారత్‌కు డిపోర్ట్‌ కావడంతో ఈ నెట్‌వర్క్‌లోని కీలక లింక్‌ తెగిపోవడం గ్యారెంటీ అని అధికారులంటున్నారు. తద్వారా దావూద్‌ ఇబ్రహీం కంపెనీకి గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషిస్తున్నారు. 

భారత ప్రభుత్వం ఈ చర్యను ఒక ఘన విజయంగా చెబుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంలో భారత్‌ తన శక్తిని చూపిందని.. టర్కీతో ఉన్న సహకారం ఈ ఆపరేషన్ విజయానికి దోహదపడిందని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్ మాఫియాపై పోరాటంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement