డాలరుతో పోలిస్తే 95.68కి డౌన్
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బతో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణిస్తోంది. తాజాగా మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 40 పైసలు పడిపోయి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 95.68కి పతనమైంది.
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలరుతో పోలిస్తే క్రితం ముగింపు (95.28) కన్నా తక్కువగా 95.57 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత ఒక దశలో 95.74కి కూడా పతనమైంది. చివరికి 40 పైసల క్షీణతతో ముగిసింది. సోమవారం నాడు కూడా దేశీ కరెన్సీ 79 పైసలు క్షీణించిన సంగతి తెలిసిందే.


