భారత్‌కు రాలేము.. కీల‌క టోర్నీ నుంచి పాకిస్తాన్‌ అవుట్‌ | Pakistan Withdraw From SAFF Womens Championship In India | Sakshi
Sakshi News home page

భారత్‌కు రాలేము.. కీల‌క టోర్నీ నుంచి పాకిస్తాన్‌ అవుట్‌

Apr 23 2026 5:12 PM | Updated on Apr 23 2026 6:52 PM

Pakistan Withdraw From SAFF Womens Championship In India

భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సౌత్ ఏషియ‌న్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) మ‌హిళ‌ల ఛాంపియ‌న్‌షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ధ్రువీక‌రించింది. ఇరు దేశాల మ‌ధ్య‌ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. పాక్‌ వైదొలగడంతో ఈ టోర్నమెంట్‌ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.

ఈ ఫుట్‌బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదిక‌గా జరగనుంది. మొత్తం ఆరు జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్‌, శ్రీలంక‌, భూటాన్‌.. గ్రూపు-బిలో భార‌త్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. అయితే సాఎఫ్‌ఫ్ టోర్నీలో భార‌త్‌కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.

కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భార‌త్ వేదిక‌గా జ‌రిగే టోర్నీల‌కు పాక్ దూరంగా ఉండ‌డం ఇదేమి తొలిసారి కాదు. గ‌తేడాది తమిళ‌నాడులో జ‌రిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంత‌కుముందు రాజ్‌గిర్‌లో ఆసియా కప్‌-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్‌ పంపలేదు.

భార‌త్ కూడా పాక్ వేదిక‌గా క్రీడా ఈవెంట్ల‌ను బాయ్‌కాట్ చేస్తూ వ‌స్తుంది. ఆసియా టీ20 క‌ప్‌తో పాటు, ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ జ‌ట్టు పాక్‌కు వెళ్ల‌లేదు. త‌మ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక‌, దుబాయ్ వేదిక‌ల‌గా ఆడింది.
చదవండి: IPL 2026: సీఎస్‌కే జట్టులోకి యార్కర్ల కింగ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement