ఇది... మన దేశంలో మొట్ట మొదటి పెట్రోల్‌ పంపు | India first petrol pump opened in 1928 on Hughes Road in Mumbai | Sakshi
Sakshi News home page

ఇది... మన దేశంలో మొట్ట మొదటి పెట్రోల్‌ పంపు

Apr 11 2026 6:14 AM | Updated on Apr 11 2026 6:14 AM

India first petrol pump opened in 1928 on Hughes Road in Mumbai

వైరల్‌

ముంబైలోని హ్యూస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్ట మొదటి పెట్రోల్‌ పంపుకు సంబంధించి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు తప్ప వీడియోలు చూసే అవకాశం చా....లా తక్కువ. అయితే ఏ.ఐ. తలచుకుంటే వీడియోలకు కొరతా! మన మొట్టమొదటి పెట్రోల్‌ పంప్‌కు సంబంధించిన ఏఐ–జనరేటెడ్‌ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. 

చేతితో నడిపే డిస్పెన్సర్‌ల నుండి నేటీ హై–స్పీడ్‌ ఫ్యుయలింగ్‌ స్టేషన్‌ల వరకు మారుతున్న కాలం, పెట్రోల్‌కు పెరుగుతున్న డిమాండ్, రాకెట్‌ వేగంతో పట్టణ వృద్ధి... ఈ అంశాలను ప్రతిబింబిస్తూ, భారతదేశపు ఆటోమోటివ్‌ పరిణామంలో నగరం ఎలా కేంద్రంగా నిలిచిందో చూపే వీడియో క్లిప్‌ ఇది. చరిత్ర, సాంకేతిక అద్భుతంతో రూపొందించిన ఈ  వీడియోను చూసి నెటిజనులు ‘ఆహా’ అంటున్నారు. 

ఆరోజుల్లో రోడ్లపై పెద్దగా వాహనాలు కనిపించేవి కావు. అందుకే పెట్రోల్‌కు డిమాండ్‌ అంతగా ఉండేది కాదు. ఈ వీడియో క్లిప్‌ ఆ కాలాన్ని కళ్లకు కడుతుంది. సూట్, టోపీ ధరించిన ఇద్దరు వ్యక్తులు కారులో రాగా, ధోతీ, ధరించిన భారతీయుడు చేతితో పనిచేసే డిస్పెన్సర్‌ను ఉపయోగించి కారులో పెట్రోల్‌ నింపుతూ కనిపిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాటి ప్రశాంతమైన ముంబైని ఆవిష్కరించే వీడియో క్లిప్‌ ఇది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement