టాప్‌ 3 మార్కెట్లలో భారత్‌ | India to be Among Renaults Top 3 Global Markets 7 New Models by 2030 | Sakshi
Sakshi News home page

టాప్‌ 3 మార్కెట్లలో భారత్‌

Apr 17 2026 9:34 PM | Updated on Apr 17 2026 9:34 PM

India to be Among Renaults Top 3 Global Markets 7 New Models by 2030

చెన్నై: రాబోయే రోజుల్లో భారత్‌ తమ టాప్‌ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో గ్లోబల్‌ గ్రూప్‌ సీఈవో ఫ్రాంకోయిస్‌ ప్రొవోస్ట్‌ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు.

అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్‌ నుంచి ఏటా 2 బిలియన్‌ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్‌ వివరించారు. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’బ్రిడ్జర్‌ కాన్సెప్ట్‌’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనంగా, తమ విద్యుత్‌ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.

తమ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్‌ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement