భారత్‌ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది? | FBI searching for Mayushi Bhagat Searching For Since 2019 | Sakshi
Sakshi News home page

భారత్‌ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది?

Apr 14 2026 6:56 PM | Updated on Apr 14 2026 7:33 PM

FBI searching for Mayushi Bhagat Searching For Since 2019

వాషింగ్టన్‌:  అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) . ఇప్పుడీ ఎఫ్‌బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్‌ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో  ప్రజల సాయం కోరుతూ ట్వీట్‌ చేసింది. మయూషీ భగత్‌ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్‌ చేసింది.

అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్‌ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.

ఈ క్రమంలో ఏప్రిల్‌ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్‌ నెంబర్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్‌ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement