నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌.. సబ్‌స్క్రైబర్ల నంబర్‌ ఎంతో తెలుసా? | Netflix Subscribers count beat Prime Video in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌ జోరు.. అమెజాన్‌ను దాటిన సబ్‌స్క్రైబర్లు

Apr 11 2026 4:56 PM | Updated on Apr 11 2026 5:12 PM

Netflix Subscribers count beat Prime Video in India

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారత మార్కెట్‌లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్‌లో అమలు చేసిన ఈ ప్లాన్‌ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్‌తో భారత ప్రజలను అలరించిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను దాటి నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు వచ్చేసింది.

నివేదికల ప్రకారం, భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు.  ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్‌ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్‌ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. 

భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్‌స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది.  అయితే, భారత్‌లో జియోహాట్‌స్టార్‌ టాప్‌లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement