వేసవి వచ్చేసింది. వేసవిలో ఎండల ధాటి ఎలా ఉన్నా, మల్లెల పరిమళాలు మనసుకు ఊరటనిస్తాయి. మల్లెల పరిమళాలే లేకుంటే, వేసవి తాపాన్ని భరించడం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. వసంతారంభం నుంచి గ్రీష్మం ముగిసే వరకు మల్లెలు విరివిగా పూస్తాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు సహా మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెలు అత్యధికంగా పూసే దేశాలలో మన దేశం అగ్రగామిగా ఉంటుంది. మల్లెలు విరివిగా పూసే దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...

మల్లెల ఉత్పాదనలో మన దేశం మొదటి స్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో మల్లెల ఉత్పాదన స్థాయిలోనే స్థానిక వినియోగం కూడా భారీగానే జరుగుతుండటం దీనికి కారణం.


