న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్‌ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్‌లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్‌లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్‌లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు.


