పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో, 12 మంది సభ్యుల ఒపెక్ , విస్తృత 22-సభ్యుల ఒపెక్+ కూటమి రెండింటి నుంచి నిష్క్రమిస్తున్నట్లు యూఏఈ ఏప్రిల్ 28నప్రకటించింది. ఈ నిర్ణయం భారతదేశానికి లాభం చేకూరుస్తుందా? లేక మరింత సంక్షోభం లోకి కూరుకుపోనుందా? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు?
పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి (OPEC), OPEC+ నుండి తప్పుకుంటున్నట్లు యూఏఈ ప్రకటించింది. మే 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ పరిణామం భారతదేశానికి సానుకూల అంశమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారని మనీ కంట్రోల్ తనకథనంలోపేర్కొంది. ఒపెక్ నుండి యూఏఈ నిష్క్రమణతో భారతదేశానికి చమురు సరఫరా పెరిగిచ, ధరలు తగ్గుతాయని, అంతిమంగా ఇది దేశానికి మేలు జరగవచ్చు అంటున్నారు.
ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
భారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు:
ఇప్పటివరకు యూఏఈ 'ఓపెక్' నిర్దేశించిన కోటాల ప్రకారం పరిమితంగానే చమురును ఉత్పత్తి చేసేది. ఇప్పుడు కూటమి నుండి బయటకు వచ్చిన కారణంగా ఇండియా భారీగానే ఉత్పత్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.
భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ధరలు తగ్గితే దేశంపై విదేశీ మారకద్రవ్య భారం తగ్గి, ఇన్‌ప్లేషన్ అదుపులోకి వస్తుంది. అలాగే యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2027 నాటికి రోజుకు 5 మిలియన్ బారెల్స్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భౌగోళికంగా భారత్‌కు దగ్గరగా ఉండటం వల్ల, అత్యవసర సమయాల్లో చమురును సులభంగా దిగుమతి చేసుకోవచ్చు.
ప్రపంచ సరఫరాలో యూఏఈ వాటా 3 - 4 శాతంగా ఉండగా, భారత చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా సుమారు 10 శాతంగా ఉంది.
సౌరవ్ మిత్ర (గ్రాంట్ థోర్న్టన్ భరత్): యూఏఈ నిష్క్రమణ వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో మరింత సరళత వస్తుంది. ధరలపై ఒత్తిడి తగ్గి భారత్‌కు ఊరట లభిస్తుంది.
ప్రశాంత్ వశిష్ట్ (Icra): ఓపెక్ కూటమిలో కీలక దేశమైన యూఏఈ బయటకు వెళ్లడం వల్ల ధరలను నియంత్రించే ఆ కూటమి శక్తి తగ్గుతుంది. భారత్ తన చమురు వనరులను మరింత వైవిధ్యపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం.
ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్‌కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల చమురు రవాణాకు ఆటంకాలు కలుగుతున్నప్పటికీ, మధ్యస్థ కాలంలో యూఏఈ నిర్ణయం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:


