సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు | Cabinet Key Approvals on Agriculture and Industry | Sakshi
Sakshi News home page

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

May 5 2026 10:46 PM | Updated on May 5 2026 10:46 PM

Cabinet Key Approvals on Agriculture and Industry

ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పత్తి ఉత్పత్తి పెంపు మిషన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5,659 కోట్ల రూపాయలతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాషన్ టు ఫారిన్ అనే లక్ష్యంతో మిషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎయిర్ లైన్స్ సంస్థల కోసం 5,000 కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎమ్ఈలు, నాన్ ఎంఎస్ఎమ్ఈలకు ఆర్థిక సహకారం కోసం పథకానికి ఆమోదముద్ర వేసింది. చెరుకు పంటకు క్వింటాలు 365 రూపాయల మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వదినారులో షిప్ రిపేర్ ఫెసిలిటీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని వల్ల 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

రెండు నూతన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,936 కోట్ల రూపాయలతో గుజరాత్‌లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. 2,230 మంది నిపుణులకు ఉపాధికి అవకాశం దక్కనుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ఇతర నిర్ణయాలు

* 2026-27 చక్కెర సీజన్‌కు FRP (Fair & Remunerative Price) రూ. 365/క్వింటాల్‌గా నిర్ణయం
* ECLGS-5 కింద రూ. 18,100 కోట్ల ప్యాకేజీకి ఆమోదం
* గుజరాత్‌లో వడినార్‌లో నౌకల మరమ్మతు కేంద్రం – రూ. 1,570 కోట్లు
* రెండు కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం (రూ. 3,068 కోట్లు + రూ. 868 కోట్లు)
* నాగ్దా–మథుర 3,4వ రైల్వే లైన్ (568 కి.మీ) – రూ. 16,403 కోట్లు
* గుంటకల్–వాడి రైల్వే లైన్ (230 కి.మీ) – రూ. 4,758 కోట్లు
* బుర్హ్వాల్–సీతాపూర్ రైల్వే లైన్ (103 కి.మీ) – రూ. 2,276 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement