'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం' | US Based NRI Couple To Return To India After Oracle Layoffs Reddit Post Viral | Sakshi
Sakshi News home page

'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం': NRI జంట

Apr 10 2026 6:33 PM | Updated on Apr 10 2026 7:44 PM

US Based NRI Couple To Return To India After Oracle Layoffs Reddit Post Viral

అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్‌లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి  కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.

ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్‌ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.

ఇదీ చదవండి: 'యాప్‌లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ

కొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement