భారత్‌ వృద్ధి అంచనాలు అప్‌ | India GDP growth is projected to be 6. 9percent in fiscal year 2026 | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనాలు అప్‌

Apr 11 2026 3:53 AM | Updated on Apr 11 2026 3:53 AM

India GDP growth is projected to be 6. 9percent in fiscal year 2026

2026–27లో జీడీపీ వృద్ధి 6.9%

పొంచి ఉన్న పశ్చిమాసియా రిస్క్ లు 

ఏడీబీ నివేదిక

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్‌ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్‌లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. 

అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా  వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement