ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ | Indian Railways to operate 18262 summer special train trips nationwide over three months | Sakshi
Sakshi News home page

ఎండాకాలం వేళ రైళ్లలో ప్రయాణం చాలా ఈజీ

Apr 20 2026 9:33 PM | Updated on Apr 20 2026 9:35 PM

Indian Railways to operate 18262 summer special train trips nationwide over three months

న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ‍్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్ 15 నుంచి 2026 జులై 15 వరకు మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. 

ఇవి 18,262 ట్రిప్స్ నడు‍స్తాయి. వాటిలో 660 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు. ఇవి 11,294 ట్రిప్స్ కు సంబంధించినవి. దీని వల్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, మీ జర్నీ ప్లాన్‌ను రూపొందించడం సులభమవుతుంది. సెలవులు, పండుగలు, పీక్ ట్రావెల్ సమయాల్లో ఇటువంటి ప్రత్యేక సర్వీసులు ఎంతో కీలకంగా మారతాయి. వేసవి ప్రత్యేక రైళ్ల నిర్వహణ భారతీయ రైల్వేల అన్ని ప్రధాన జోన్లలో జరుగుతోంది. 

  • సౌత్ సెంట్రల్ రైల్వే 124 రైళ్లు (1,184 ట్రిప్స్)కు ఆమోదం తెలిపి, 76 రైళ్లు (324 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • వెస్ట్రన్ రైల్వే 106 రైళ్లు (2,078 ట్రిప్స్) ఆమోదం తెలిపి 92 రైళ్లు (1,667 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • నార్త్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (2,245 ట్రిప్స్) ఆమోదం తెలిపి 62 రైళ్లు (1,878 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • నార్తర్న్ రైల్వే 76 రైళ్లు (2,090 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (1,535 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • సెంట్రల్ రైల్వే 74 రైళ్లు (3,082 ట్రిప్స్) ఆమోదం తెలిపి 70 రైళ్లు (2,238 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • సదర్న్ రైల్వే 72 రైళ్లు (558 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (133 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • ఈస్ట్ సెంట్రల్ రైల్వే 64 రైళ్లు (2,711 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (1,060 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • నార్త్ సెంట్రల్ రైల్వే 54 రైళ్లు (1,163 ట్రిప్స్) ఆమోదం తెలిపి 46 రైళ్లు (688 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • నార్త్ ఈస్ట్రన్ రైల్వే 52 రైళ్లు (814 ట్రిప్స్) ఆమోదం తెలిపి 34 రైళ్లు (477 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • ఈస్ట్ కోస్ట్ రైల్వే 28 రైళ్లు (410 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (88 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • వెస్ట్ సెంట్రల్ రైల్వే 28 రైళ్లు (408 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (192 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • ఈస్ట్రన్ రైల్వే 24 రైళ్లు (392 ట్రిప్స్) ఆమోదం తెలిపి 10 రైళ్లు (276 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • నార్త్ ఫ్రంట్ియర్ రైల్వే 24 రైళ్లు (220 ట్రిప్స్) ఆమోదం తెలిపి 20 రైళ్లు (141 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • సౌత్ ఈస్ట్రన్ రైల్వే 20 రైళ్లు (276 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (250 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 10 రైళ్లు (122 ట్రిప్స్) ఆమోదం తెలిపి 8 రైళ్లు (70 ట్రిప్స్) నోటిఫై చేసింది.

  • సౌత్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (509 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (277 ట్రిప్స్) నోటిఫై చేసింది.

వేసవి ప్రత్యేక రైళ్ల వల్ల పీక్ సీజన్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. అదనపు బెర్తులు లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అధిక డిమాండ్ ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement