గత ఏడాదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత పాకిస్తానీ నటీమణులు హానియా అమీర్, మహిరా ఖాన్ తదితరుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. దీంతో వారి అకౌంట్లు ఇక్కడ కనిపించవు. అయితే, సడెన్‌గా వారి ఇన్‌స్టాలోని పోస్టులతో పాటు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు అందుబాటులో లేవు. అవి మళ్ళీ చూపించలేదని గుర్తించారు.
పాక్ సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు మళ్లీ భారతదేశంలో కనిపించడంతో నిషేధాన్ని ఎత్తివేశారా..? అనే అంశంపై నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు మళ్లీ కనిపించకపోవడంతో, ఇది సాంకేతిక లోపం కావచ్చునని కూడా చాలామంది పోస్ట్ చేశారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ కేంద్రంగా కొనసాగుతున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు భారత్‌లో నిలిపివేస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాతో పాటు స్టార్ క్రికెటర్స్ సోషల్‌మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేశారు.


