దేశంలో అప్పట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెప్పాయో అదే జరిగి.. | 8 Times Exit Polls Got It Right | Sakshi
Sakshi News home page

దేశంలో అప్పట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెప్పాయో అదే జరిగి..

Apr 30 2026 3:26 AM | Updated on Apr 30 2026 4:03 AM

 8 Times Exit Polls Got It Right

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలపై అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడంలో చాలా సార్లు విజయవంతమయ్యాయి. గతంలో ఎగ్జిట్ పోల్స్  చాలా సార్లు ఏయే పార్టీలు గెలుస్తాయో సరిగ్గా అంచనా వేశాయి. ఆయా పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.. ఎప్పుడెప్పుడో చూద్దాం..

లోక్‌సభ ఎన్నికల్లో..

  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు 280-300 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 336 స్థానాలు దక్కాయి.

  • 2019 లోక్‌సభలో కూడా ఇదే ధోరణి కనిపించింది. అంచనాలు 300-350 స్థానాల మధ్య ఉండగా, ఎన్‌డీఏ 353 స్థానాలు గెలుచుకుంది.

  • 1998 లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 260 స్థానాలు వస్తాయని అంచనా, అప్పుడు 254 స్థానాలు వచ్చాయి.

  • 1999 లోక్‌సభలో 280 స్థానాలు అంచనా వేయగా, 303 స్థానాలు గెలిచింది.

రాష్ట్రాల ఎన్నికల్లో..

  • 2006 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు 95-105 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 99 స్థానాలు వచ్చాయి.

  • 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఏడీఎంకే+కు 140-160 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 150 స్థానాలు గెలుచుకుంది.

  • 2016 తమిళనాడు ఎన్నికల్లో ఎఐఏడీఎంకేకు 130-150 స్థానాలు అంచనా ఉండగా, 136 స్థానాలు సాధించింది.

  • 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 210-230 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, 211 స్థానాలు వచ్చాయి.

  • అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement