పెట్రోల్‌ బంక్‌ వద్ద భారీ క్యూ.. ట్యాంకర్‌ రాగానే భీకర పోరు | Diesel shortage turns violent in Maharashtras Washim | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌ వద్ద భారీ క్యూ.. ట్యాంకర్‌ రాగానే భీకర పోరు

May 17 2026 7:18 PM | Updated on May 17 2026 8:06 PM

Diesel shortage turns violent in Maharashtras Washim

వాషిం జిల్లా: పెట్రోల్‌ బంక్‌ వద్ద బారులు తీరి, క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు జనాలు. డీజిల్‌ లేదని వాహనదారులకు సిబ్బంది చెప్పారు. కొద్దిసేపటికి అక్కడకు డీజిల్‌ ట్యాంకర్‌ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డీజిల్‌ కోసం జనాలు తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా, అకోలా నాకా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. 

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. జిల్లాలో ఇంధన కొరత పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో డీజిల్ నింపించుకునేందుకు ఓ బంక్‌ వద‍్ద ఎదురుచూస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మొదట వెయిట్‌ చేసే సమయంలో వాహనదారుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత డీజిల్ ట్యాంకర్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఇంకా అదుపుతప్పింది. భౌతిక దాడుల వరకు వెళ్లింది. రెండు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. డీజిల్ డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్ బంక్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడడం వీడియోలో చూడొ​‍చ్చు. 

డీజిల్ నింపించుకునేందుకు ఎదురుచూస్తున్న వారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో వాహనాలు, జనాలతో భారీ రద్దీ మధ్య జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గాయాలు, అరెస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా వాషిం జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత కొనసాగుతోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement