నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్‌తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్‌జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్‌కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.
ఏం జరిగింది?
శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.
షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.
కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.
#BREAKING
Audio clip emerges from attacked Indian oil tanker!
"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian Navy
Clearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026


