ఈ సారి వర్షాలు తక్కువ.. కష్టాలు ఎక్కువ.. ఎందుకంటే? | Key Highlights from Skymet's Outlook Overall Rainfall | Sakshi
Sakshi News home page

ఈ సారి వర్షాలు తక్కువ.. కష్టాలు ఎక్కువ.. ఎందుకంటే?

Apr 9 2026 11:39 AM | Updated on Apr 9 2026 12:09 PM

Key Highlights from Skymet's Outlook Overall Rainfall

న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. స్కైమెట్ అధికారిక అంచనాను విడుదల చేసి వివరాలు తెలిపింది. గత అనేక సంవత్సరాల సగటు వర్షపాతాన్ని (దీర్ఘకాల సగటు వర్షపాతం)ఎల్‌పీఏ అంటారు. ఇది సాధారణంగా 868.6 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ సారి అందులో సుమారు 94 శాతం మాత్రమే ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. దీనికి 5 శాతం ఎక్కువ లేదా తక్కువగానూ వర్షాలు పడవచ్చని చెప్పింది.  

స్కైమెట్ అంచనాలో ముఖ్యాంశాలు
మొత్తం వర్షపాతం: ఎల్‌పీఏలో 90-95%గా ఉండనుంది, అంటే సగటుతో పోలిస్తే తక్కువ వర్షాలు పడతాయి.

ఈఎన్ఎస్ఓ ప్రభావం (ఈఎన్ఎస్ఓ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత మార్పులు ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపే వ్యవస్థ): దీర్ఘకాల లా నినా తర్వాత పసిఫిక్ సముద్రం ఈఎన్ఎస్ఓ-న్యూట్రల్ దశకు మారింది. వర్షాకాలం సమయంలో ఎల్ నినో బలపడుతుంది. ఇది ముఖ్యంగా జులై-సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువ పడేలా చేసే అవకాశం ఉంది.

భారత మహాసముద్ర ద్విధ్రువం (ఐఓడీ): న్యూట్రల్ లేదా కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. జూన్‌లో వర్షాలు బాగా పడడానికి సాయం చేస్తుంది. కానీ, ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదు.

ప్రాంతాల వారీగా
మధ్య, వాయవ్య భారత్ (పంజాబ్, హరియాణా, రాజస్థాన్) ప్రాంతాల్లో ముఖ్యంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. 
తూర్పు, ఈశాన్య భారత్‌లో సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉంది.

నెలవారీగా అంచనా
జూన్: ఎల్‌పీఏలో సుమారు 101% (మంచి ప్రారంభం)
జూలై: సుమారు 95%
ఆగస్టు: సుమారు 92%
సెప్టెంబర్: సుమారు 89% (అత్యల్ప వర్షాలు)

ఇలా జరిగే అవకాశాలూ ఉన్నాయ్‌..
అధిక వర్షపాతం (>110% ఎల్‌పీఏ) అవకాశం 0% (అంటే ఈ సారి అధిక వర్షపాతం పడే ఛాన్స్‌ లేదు)
సాధారణం కంటే ఎక్కువ 10%
సాధారణం 20%
సాధారణం కంటే తక్కువ 40%
వర్షాభావం (<90% ఎల్‌పీఏ) 30%

తక్కువ వర్షపాత ప్రభావాలు

  • మధ్య, పశ్చిమ భారత వర్షాధార ప్రాంతాల్లో రైతులు నీటి కొరతను ఎదుర్కోవచ్చు.

  • ప్రభుత‍్వ అధికారులు తూర్పు, ఈశాన్యంలో అనుకూల వాతావరణ పరిస్థితులు, వాయవ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసుకోవాలి.

  • సీజన్ రెండో భాగంలో అస్థిరంగా పడే వర్షాలు పంటల దిగుబడి, నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement