వైదొలిగిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag pair withdraw from Asian Badminton Championship | Sakshi
Sakshi News home page

వైదొలిగిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Apr 7 2026 4:08 AM | Updated on Apr 7 2026 4:08 AM

Satwik and Chirag pair withdraw from Asian Badminton Championship

నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌ నుంచి భారత రెండు డబుల్స్‌ స్టార్స్‌ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్‌ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్‌ కోచ్‌ టాన్‌ కిమ్‌ హెర్‌ తెలిపాడు. 

డబుల్స్‌లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్‌ స్టార్స్‌ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్‌ శెట్టి, కిడాంబి శ్రీకాంత్‌... మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్‌ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్‌కు సింగిల్స్‌లో మరో స్వర్ణ పతకం లభించలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement