ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు | Cameron Greens Horror Run Continues In IPL 2026, | Sakshi
Sakshi News home page

IPL 2026: ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు

Apr 6 2026 8:21 PM | Updated on Apr 6 2026 8:53 PM

Cameron Greens Horror Run Continues In IPL 2026,

ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్‌.. త‌న ఆట ప‌రంగా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. ఈ ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు.

ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గ్రీన్ కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్రీన్‌.. ఆ తర్వాత బంతికి మాత్రం వికెట్ల వెనక దొరికిపోయాడు. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం రెండు పరుగులు చేశాడు. 

ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా గ్రీన్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లు కలిపి గ్రీన్ కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో అతడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ.25.2 కోట్ల దండగ అని పోస్టులు పెడుతున్నారు. 

కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా మాత్రమే తన సేవలను అందిస్తున్నాడు. గాయం కారణంగా అతడికి బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుం‍చి ఇంకా అనుమతి లభించలేదు.
చదవండి: IPL 2026: అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు?

Advertisement
 
Advertisement
Advertisement