పెళ్లి చేసుకున్న మ‌హిళా క్రికెట‌ర్లు.. ఫోటోలు వైరల్‌ | England's Amy Jones And Australias Piepa Cleary tied the knot on April 4 | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న మ‌హిళా క్రికెట‌ర్లు.. ఫోటోలు వైరల్‌

Apr 6 2026 9:39 PM | Updated on Apr 6 2026 9:39 PM

England's Amy Jones And Australias Piepa Cleary tied the knot on April 4

ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అమీ జోన్స్  వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి , ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ పీపా క్లియరీని జోన్స్ పెళ్లి చేసుకుంది. 2022 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరిద్ద‌రూ  గ‌తేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. 

ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఏప్రిల్ 4న వీరిద్దిరి వివాహం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీ జోన్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. వీరి వివాహ వేడ‌క‌కు ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. కాగా మ‌హిళ‌ల బిగ్ బాష్ లీగ్‌-2023లో సంద‌ర్భంగా జోన్స్‌-పీపాకు ప‌రిచయం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ పెర్త్ స్కార్చ‌ర్స్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం హహిస్తున్నారు.

ఇక‌ ఇటీవ‌ల మ‌హిళ‌ల క్రికెట్‌లో సేమ్ జేండ‌ర్ పెళ్లిల్లు కామ‌న్ అయిపోయాయి. వీరికంటే ముందు న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌- సహచరి లియా, ఇంగ్లండ్ స్టార్‌ ప్లేయ‌ర్లు స్కివ‌ర్-కేథ‌రిన్ బ్రంట్‌, ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్- కాప్‌, డానియెల్‌ వ్యాట్‌- జార్జీ హోడ్జ్ జంట‌లు పెళ్లి చేసుకుని అంద‌రిని షాక్‌కు గురి చేశారు. అమీ జోన్స్ ఇంగ్లండ్ జ‌ట్టులో కీల‌క స‌భ్యురాలిగా కొన‌సాగుతోంది.
చదవండి: IPL 2026: ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement