వర్షం కారణంగా పంజాబ్‌-కేకేఆర్‌ మ్యాచ్‌ రద్దు | IPL 2026: kolkata knight riders vs Punjab kings live updates | Sakshi
Sakshi News home page

IPL 2026 KKR vs PBKS: వర్షం కారణంగా పంజాబ్‌-కేకేఆర్‌ మ్యాచ్‌ రద్దు

Apr 6 2026 7:06 PM | Updated on Apr 6 2026 11:07 PM

IPL 2026: kolkata knight riders vs Punjab kings live updates

IPL 2026 KKR vs PBKS Live Updates: ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.

ఈడెన్‌ గార్డెన్స్‌లో భారీ వర్షం
ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్‌ ఇప్పటిలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కన్పించడం లేదు. మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు.

వ‌ర్షం అంత‌రాయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆట నిలిచిపోయే సమయానికి కేకేఆర్‌ స్కోర్‌:25-2

కేకేఆర్‌కు భారీ షాక్‌
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జేవియర్ బార్టలెట్  వేసిన రెండో ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్లు ఫిన్ అలెన్‌(6),కామెరూన్ గ్రీన్(4) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. 

ఐపీఎల్‌-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌ స్టార్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ దూరమయ్యారు.

వారిద్దరి స్ధానంలో నవ్‌దీప్ సైనీ, పావెల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా పంజాబ్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉండగా.. కేకేఆర్‌ మాత్రం ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌లు: బ్లెస్సింగ్ ముజారబానీ, మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement