కేకేఆర్‌-పంజాబ్‌ మ్యాచ్‌ వర్షార్పణం | KKR vs PBKS, IPL 2026: Kolkata score first point as match called off due to rain | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌-పంజాబ్‌ మ్యాచ్‌ వర్షార్పణం

Apr 6 2026 11:05 PM | Updated on Apr 6 2026 11:05 PM

KKR vs PBKS, IPL 2026: Kolkata score first point as match called off due to rain

ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

అయితే తొలుత తేలికపాటి వర్షం పడడంతో తగ్గముఖం పడుతుందని అభిమానులు భావించారు. కానీ తర్వాత నెమ్మదిగా వర్షం తీవ్రత పెరిగింది. దాదాపు రెండు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అప్పటికే ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో పాటు కట్-ఆఫ్ టైమ్ కూడా దగ్గరపడడం కాణంగా అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కింగ్స్‌(5) అగ్రస్థానానికి చేరుకుంది. కేకేఆర్‌ ఖాతాలో తొలిపాయింట్‌ వచ్చి చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement