80 వేల ఉద్యోగాల కల్పన
రాడిసన్ హోటల్ గ్రూప్ అంచనాలు
న్యూఢిల్లీ: భారత్‌లో 2030 నాటికి ప్రాపర్టీల సంఖ్యను 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాడిసన్ హోటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎలీ యూనిస్ తెలిపారు. దీనితో 60,000–80,000 వరకు ఉద్యోగావకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా రిక్రూట్ చేసుకోవడం కోసం ఉద్యోగార్థులకి శిక్షణ కలి్పంచేందుకు టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్, స్థానిక వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాడిసన్‌కి 200 పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రథమ నుంచి నాలుగో శ్రేణి నగరాలవ్యాప్తంగా కొత్త హోటల్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు యూనిస్ చెప్పారు. వీటిల్లో 15 శాతం ఫైవ్ స్టార్‌వి, 45–50 శాతం అప్‌స్కేల్, త్రీ–స్టార్, ఫోర్–స్టార్ హోటల్స్ ఉంటాయని వివరించారు. కొత్తగా చేపట్టే వాటిల్లో 55 శాతం ప్రాజెక్టులు ప్రథమ శ్రేణి, 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటాయని యూనిస్ వివరించారు.
10 శాతం రిసార్టుల్లో, ఇంకో 10 శాతం ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఉంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం యథావిధిగానే నడుస్తోందని యూనిస్ వివరించారు. దుబాయ్, సౌదీ అరేబియాలాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయంగా టాప్ 3 కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు.


