breaking news
Mahabubnagar
-
ఔత్సాహికులకు నిరుత్సాహం
మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లు ఔత్సాహిక క్రీడాకారులకు వరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ (హకీంపేట), కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదట జిల్లాస్థాయి అనంతరం రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరుగుతాయి. రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభచాటిన విద్యార్థులు ఈ మూడు స్కూళ్లలో ప్రవేశాలు పొందుతారు. ప్రతి పాఠశాలలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జిల్లాస్థాయి సెలక్షన్స్‌కు ముగిశాయి. చిన్నారులను స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్పించాలనే సంకల్పం ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు స్పోర్ట్స్ స్కూళ్లే ఉండటంతో చాలా మంది విద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు. వనపర్తిలో స్థల సేకరణ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనైనా రెండు స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థల సేకరణ చేపట్టారు. వెంటనే వనపర్తిలో స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించాలని ఆ ప్రాంత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన క్రీడా వసతులు గతేడాది రాష్ట్రంలోని మూడు స్పోర్ట్ స్కూళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది విద్యార్థులు 4వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వనపర్తితోపాటు ఉమ్మడి జిల్లాలో మరోచోట స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటైతే మరింత ఎక్కువ మంది చిన్నారులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికవుతారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులకు ఎన్నో మెరుగైన క్రీడావసతులు అందుబాటులోకి వస్తాయి. పెద్ద పెద్ద భవనాలతోపాటు ఫుట్‌బాల్, హాకీ, అథ్లెటిక్స్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీతోపాటు ఇతర క్రీడల కోర్టులను ఏర్పాటు చేస్తారు. తొలుత చిన్నారులకు ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో పరీక్షించి వారు ఏ క్రీడల్లో రాణించే అవకాశం ఉందో అందులో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆయా క్రీడల్లో నిష్ణాతులైన కోచ్‌లను నియామకం చేసి చిన్నారులకు మెరుగైన క్రీడాశిక్షణ అందజేస్తాయి. అదేవిధంగా క్రీడా శిక్షణతోపాటు చదువుకూ ప్రాధాన్యం ఉంటుంది. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఆహారపరంగా కూడా ప్రత్యేకమైన మెనూ అమలుచేస్తారు. డైటీషియన్ పర్యవేక్షణలో ప్రత్యేకమైన భోజనం అందిస్తారు. క్రీడా విద్యార్థులకు ఎలాంటి పోషక పదార్థాలు అవసరమో ముందుగానే మెనూ నిర్ణయించి దానికనుగుణంగా భోజన సౌకర్యం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు నోచుకోని స్పోర్ట్స్ స్కూల్ క్రీడా పాఠశాలలో చేరికకు చాలా మంది ఆసక్తి స్థానికంగా లేకపోవడంతో కొందరికే అవకాశం తెలంగాణ క్రీడా పాలసీలోనైనా చోటు కల్పించాలని వేడుకోలు -
ముంపు ముప్పు తప్పేనా..?
●దుకాణంలోకి వస్తున్నాయి.. పెద్ద వర్షం పడిందంటే చాలు ప్రధాన రోడ్డుపైకి నీళ్లు వచ్చి మా దుకాణం మొత్తం నిండిపోతుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. నల్లకుంట నుంచి వచ్చే కాల్వ సాఫీగా రాకుండా మలుపు ఉండటంతో నీళ్లన్నీ రోడ్డుపైకి వచ్చి మా దుకాణాల్లోకి వస్తున్నాయి. అలాగే రోడ్డుకు ఇరువైపులా పెద్ద కాల్వలు నిర్మిస్తేనే సమస్య తీరుతుంది. – వెంకటయ్య, బాదేపల్లి వర్షం వచ్చిందంటే.. వర్షం వచ్చిందంటే చాలు భయం వేస్తుంది. రోడ్డుపైకి నీళ్లు చేరి మా దుకాణం మొత్తం నిండిపోతుంది. రాత్రిళ్లు అయితే చాలా ఇబ్బందిగా ఉంటది. వర్షం తగ్గాక దుకాణం శుభ్రం చేసుకునేందుకు తిప్పలవుతుంది. దుర్వాసన భరించలేక రెండు మూడు రోజులు ఒక రకంగా ఉంటాం. నీళ్లు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలి. – అస్లాం, బాదేపల్లి కాల్వ కట్ చేయడంతో.. వీరశివాజీనగర్లో పెద్దకాల్వను కట్ చేసి నిర్మాణం చేయకుండా వదిలేయడంతో వరద నీరు రోడ్డుపై పారుతూ ఇళ్లలోకి వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా ఆ రోజంతా ఇబ్బందే. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. కట్ చేసిన కాల్వను సరిచేయడంతో పాటు పైనుంచి వచ్చే వరద సాఫీగా వెళ్లేలా పెద్ద కాల్వ నిర్మించాలి. – సంతోష్‌చారి, వీరశివాజినగర్ ఈఎన్సీలో జాప్యం.. మున్సిపాలిటీలో వరద నీటిని ఎదుర్కొనేందుకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు మంజూరయ్యాయి. దీని ద్వారా మొత్తం 10 పెద్ద కాల్వలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే సింగిల్ టెండరు రావడం వల్లే ఈఎన్సీలో జాప్యం అవుతుంది. టెండరు వేసిన సంస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పనులు అప్పగిస్తారు. వచ్చే ఏడాదికి ముంపు నుంచి పూర్తిగా బయటపడతాం. – లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల జడ్చర్ల టౌన్: వర్షాకాలం వచ్చిందంటే చాలు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు జలమయమవుతున్నాయి. పాలకులకు ముందుచూపు లేకపోవడం, పాటు కాల్వలు, కల్వర్టులు కబ్జా చేయటంతో పాటు నల్లకుంటను తీసివేయడంతో ప్రతి ఏటా వానాకాలంలో పట్టణ ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ముంపును నివారించేందుకు గానూ టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు విడుదలైనా ఏడాదికాలంగా టెండరు ప్రక్రియలోనే మగ్గుతోంది. పది కాల్వల నిర్మాణం.. మున్సిపాలిటీలో వరద ముంపును నివారించేందుకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొత్తం 10 కాల్వలు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి.. టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే సింగిల్ టెండర్ మాత్రమే రావడంతో ఈఎన్సీ అధికారులు పెండింగ్‌లో పెట్టారు. టెండర్ వేసిన సంస్థ గురించి క్షుణ్ణంగా అధ్యయనం కోసం ఎవాల్యుషన్ చేస్తున్నారు. దీంతో ఏడాదిగా పనులు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా వర్షాకాలంలో మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుత వర్షాకాలంలో మున్సిపాలిటీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. జడ్చర్ల మున్సిపాలిటీలో కనిపించని వరద నివారణ చర్యలు చిన్నపాటి వర్షాలకే జలమయమవుతున్న పట్టణం టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.14 కోట్లు మంజూరైనా టెండర్ ప్రక్రియలోనే పాటు కాల్వలు, కల్వర్టుల కబ్జాతోనే ప్రమాద ఘంటికలు ఈ వర్షాకాలంలోనూ తిప్పలు తప్పవంటున్న పట్టణవాసులు -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్
కొత్తకోట రూరల్: ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్లతోపాటు ఓ ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ సమీపంలో ఎన్‌హెచ్–44పై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బీహెచ్ఈఎల్కు ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున కొత్తకోట సమీపంలో మదర్ థెరిస్సా జంక్షన్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా డివైడర్‌ను ఢీకొని రోడ్డు దాటి వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుధాకర్‌తోపాటు మరో డ్రైవర్ మడెం నాగరాజు, ప్రయాణికురాలు పావనికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురికి గాయాలు -
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మంగళవారం టీఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వత్థామారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేయక ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్‌ను గెలిపించడానికి ఆర్టీసీ ఉద్యోగులు వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో 90 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. గతం కంటే దారుణంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, రెండు పేస్కేల్ చెల్లించాలని, చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి వారి పిల్లలకు శాశ్వత పద్ధతిన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో సమ్మె అనివార్య పరిస్థితికి తీసుకురావద్దని కోరారు. ఒకవేళ సమ్మె వస్తే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శంకర్, కోశాధికారి రాజలింగం, రాష్ట్ర కార్యదర్శులు యాదయ్య, నిరంజన్, సత్యనారాయణ, బీఎస్.రెడ్డి, ఎండీ.వహీద్, నాగయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీసీఎస్రెడ్డి, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె,రవీందర్‌రెడ్డి, డీఎస్‌చారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, ప్రచార కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి తోపాటు రీజియన్‌లో ఆయా డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి -
మేము చెప్పినోళ్లకేఅడ్మిషన్ ఇవ్వాలి!
ఆంగ్ల మాధ్యమం కావడంతో.. మరికల్ కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండటంతో 6వ తరగతిలో ప్రవేశాలకు పోటీ పెరిగింది. మొత్తం 40 సీట్లు ఉండగా.. 413 దరఖాస్తులు వచ్చాయి. ఒక సీటుకు 10 మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. అయితే మరికల్ మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాము చెప్పిన విద్యార్థినులను చేర్పించుకోవాలని రాజకీయ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో నాయకుడు 5 నుంచి 10 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇప్పించేందుకు ఫైరవీలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యే, మంత్రులచే ఫోన్లు చేయించడానికి కూడా వెనకడాటం లేదు. అంతే కాకుండా 7నుంచి 10 వరకు కూడా ఒక్కో తరగతికి 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సీట్లకు కూడా ఫైరవీలు చేస్తున్నారు. పేదలకు మొదటి ప్రాధాన్యత.. గ్రామాల నుంచి వలస వెళ్లిన వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేని పిల్లలు, బడిబయటి పేద బాలికలకు విద్యనందించేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను స్థాపించారు. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో అర్హులైన బాలికలకు సీట్లు రావడం లేదని తెలుస్తోంది. కేజీబీవీలో తమ పిల్లలను చేర్పించేందుకు వచ్చే తల్లిదండ్రులకు సీట్లు లేవని చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికల్: ‘‘మేము చెప్పినోళ్లకే 6వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలి.. లేదంటే ఇక్కడి నుంచి పంపిస్తాం’’ అంటూ రాజకీయ పార్టీల నాయకులు మరికల్ కేజీబీవీ ప్రత్యేకాధికారిణిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకానొక దశలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఒత్తిళ్లతో కేజీబీవీ ఎస్ఓ, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ నాయకుడు ఎస్ఓతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెతో గొడవ పడిన ఘటనను వీడియో రికార్డు చేసి ఎమ్మెల్యే, డీఈఓకు పంపిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటే భయమేస్తుందని కేజీబీవీ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికల్ కేజీబీవీ ప్రత్యేకాధికారిణిపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఆరో తరగతిలో ప్రవేశానికి ఫైరవీల జోరు 40 సీట్లకు 413 దరఖాస్తులు భయపెట్టిస్తున్నారు.. రాజకీయ పార్టీల నాయకులు తీసుకొచ్చిన విద్యార్థినులకు సీట్లు ఇవ్వకుంటే భయపెట్టిస్తున్నారు. నాతో గొడవకు దిగుతున్నారు. ఓ మహిళా అధికారిణి అని కూడా చూడకుండా గొడవ పడుతూ అగౌవర పరుస్తున్నారు. ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా అర్హులైన పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం. – రాజ్యలక్ష్మి, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి, మరికల్ -
అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అదనపు (రెవెన్యూ) కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న అదనపు కలెక్టర్ మోహన్‌రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో స్పెషల్ కలెక్టర్ (భూ సేకరణ)గా పనిచేస్తున్న మధుసూదన్‌నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అలాగే కలెక్టరేట్ పరిపాలన అధికారిగా డీ సెక్షన్ సూపరింటెండెంట్ జె.సువర్ణరాజ్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఓగా ఉన్న శంకర్ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్ ఫైళ్ల వివరాలను విభాగాల వారీగా సమీక్షించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇరిగేషన్ సీఈగా చక్రధరం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇరిగేషన్ శాఖ జిల్లా సీఈగా చక్రధరం నియమితులయ్యారు. సీఈగా ఉన్న బద్దం వెంకటరమణారెడ్డి పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఇరిగేషన్ సర్కిల్–1 ఎస్ఈగా ఉన్న చక్రధరంను పూర్తిస్థాయి సీఈగా నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఉద్యోగ ధర్మం గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని సూచించారు. టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, తెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దామోదర్ తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఇరిగేషన్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి నర్మద, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్, రాష్ట్ర క్యాదర్శి వెంకట్‌రెడ్డి, డీఈలు మధు, మురళిధర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ, అభూఖాన్సిద్ధిఖీ, బాలనరహరి తదితరులు పాల్గొన్నారు. -
3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..
మరమ్మతుల కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా.. పట్టింపు లేకుండాపోయింది. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత మరమ్మతులకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదన చేయగా.. మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. ప్రాజెక్ట్‌లోని ఎనిమిది గేట్ల రోప్‌లు అత్యవసరంగా మార్చాలని భావించగా.. వీటి కోసం ఫిబ్రవరి నెలలో రూ.కోటి మంజూరు చేశారు. ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా.. పురోగతి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘దళితుల భూములు లాక్కొని మొక్కలు నాటారు’
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని ఏనుగొండ రెవెన్యూ శివారులో గల దళితుల భూములను ఫారెస్టు అఽధికారులు బలవంతంగా లాక్కొని మొక్కలు నాటారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ (టీఎస్) దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్ బాధిత రైతులతో కలిసి మంగళవారం కలెక్టర్ విజయేందిర బోయికి ఫిర్యాదు చేశారు. 431 సర్వే నంబర్లో 20 ఎకరాలకు పైగా భూమిని, 435 సర్వే నంబర్లో 6.37 ఎకరాల భూమిని ఫారెస్టు అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారని వాపోయారు. దీంతో ఆ భూముల యజమానులైన దళితులు పూర్తిగా జీవనోపాధి కోల్పోయారని కలెక్టర్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ విచారణ చేసి, తగిన చర్యలు తీసుకుంటానని బాధిత రైతులకు హామీ ఇచ్చారు. ఇసుక తరలింపుపై అన్నదాతల ఆగ్రహం మాగనూర్: మండల కేంద్రంలో ఇసుక తరలింపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపుపై గొడవలు చెలరేగడంతో తహసీల్దార్ మంగళవారం గ్రామస్తులతో చర్చించారు. మాగనూర్ సమీపంలో కాకుండా మరెక్కడైనా ఇసుక తీసుకోవాలని తేల్చి చెప్పడంతో తహసీల్దార్ అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో సదరు కొండగల్, నారాయణపేట కాంట్రాక్టర్లు ఆర్డీఓ రాంచదర్తో కలిసి ఇసుక తరలింపునకు ప్రయత్నాలు మొద లు పెట్టారు. దీంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వాగు దగ్గరకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇసుక తరలించడం ద్వారా గ్రామానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో పాటు సమీపంలోని వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ శాఖకు చెందిన ప్రముఖ మంత్రి ప్రోద్బలంతోనే అధికారులు ఇంతలా అత్యుత్సాహం చూయిస్తున్నారని మండిపడ్డారు. స్పందించిన ఆర్డీఓ రాంచందర్ ప్రజలు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సహకరించాలని, మాగనూర్ గ్రామ సమీపంలోని ఇసుక కేవలం ఒక మీటర్ లోతు మాత్రమే తరలిస్తామని సర్ధిచెప్పి పంపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగలక్ష్మి, మైనింగ్ ఆర్ఐ ప్రతాప్‌రెడ్డి, డీటీ సురేశ్‌కుమార్, ఇరిగేషన్ ఎస్సీ శ్రీధర్, భూగర్భ జలాల అధికారి నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ‘ఖిల్లా’ వాసి అనుమానాస్పద మృతి
ఖిల్లాఘనపురం: హైదరాబాద్‌లో ఖిల్లాఘనపురం మండల కోతులకుంట తండాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హన్మంతు(38) తనభార్య జమున కుమారుడు రవితోపాటు హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం హన్మంత్ తను నివాసం ఉంటున్న ప్రాంతానికి సమీపంలో గొంతు తెగి రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గమనించి అప్పులు ఎక్కువై ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మృతదేహాన్ని అక్కడి నుంచి సొంత గ్రామ మైన కోతులకుంట తండాకు సాయంత్రం తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా గోపన్‌పల్లి ప్రాంతానికి చెందిన పోలీసులు ఖిల్లాఘనపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొత్తకోట సీఐ రాంబాబు పర్యవేక్షణలో మండల ఇన్చార్జ్ ఎస్ఐ జయన్న సిబ్బందితో తండాకు చేరుకున్నారు. మృతదేహాన్ని వచ్చిన అంబులెన్సులోనే తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. మృతదేహం మెడకు కత్తిగాట్లు ఉండటంతోపాటు హన్మంతు మృతికి సంబందించిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్చేయడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తండావాసులు చర్చించుకుంటున్నారు. మృతికి కారణం ఏమై ఉంటుందని వారు ప్రశ్నించుకుంటున్నారు. మృతదేహాన్ని తండాకు తీసుకురాగా.. తిప్పి పంపిన పోలీసులు -
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 1.26 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి 87 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ప్రాజెక్టు 9 క్రస్ట్గ్రేట్లను ఎత్తి 60,075 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం 30,722 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు, కుడి కాలువకు 280 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు కలిసి ప్రాజెక్టు నుంచి మొత్తం 92,985 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.590 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు వెల్లడించారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువన 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు కలిపి మొత్తం 435 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయంలో మంగళవారం 874.8 నీటిమట్టం వద్ద 162.4372 టీఎంసీలుగా ఉంది. జూరాలలో ఆనకట్ట గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 60,075 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 30,722 మొత్తం 90,797 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం వస్తున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 9.504 మిలియన్ యూనిట్ల విద్యుత్పత్తి చేసి 19,031 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 6.068 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 11,061 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. 87 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు 9 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నుంచి 92,985 క్యూసెక్కుల నీరు దిగువకు -
భూగర్భ కేంద్రాన్ని సందర్శించిన హైడెల్ డైరెక్టర్
దోమలపెంట: టీఎస్ జెన్కో హైడెల్ డైరెక్టర్ బాలరాజు మంగళవారం శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల ఆయన జెన్కో హైడెల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయనకు కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణ, ఎస్ఈ(ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ(సివిల్) రవీంద్రకుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైడెల్ డైరెక్టర్ మొదట కేంద్రం మొత్తం తిరిగి అన్ని యూనిట్లను పరిశీలించారు. నాలుగో యూనిట్‌కు సంబంధించి చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించి ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందికి సూచనలు తెలిపారు. అనంతరం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, టీజీ స్టేట్ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శులు మదన్మొహన్రెడ్డి, చరణ్ ఆధ్వర్యంలో ఇంజినీర్లు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా కోవిడ్ 2020 నుంచి జెన్కోలో బదిలీలు కొంతవరకే జరుగుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యుత్తు ఉత్పత్తి స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇంజినీర్లు పదేండ్లుగా బదిలీలుకాక కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా వ్యథ చెందుతున్నారని వాపోయారు. కనీసం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు, భార్యాపిల్లలకు దూరంగా, వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉంటున్న ఇంజినీర్లను గుర్తించి వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, బదిలీలు త్వరతిగతిని చేపట్టాలని విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారానికి సీఎండీ దృష్టికి తీసుకెళ్తానని హైడెల్ డైరెక్టర్ తెలిపినట్లు ఇంజినీర్లు చెప్పారు. అంతకుముందు ఇంజినీర్ల సంఘం నాయకులు, ఇంజినీర్లు హైడెల్ డైరెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. -
రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను మంగళవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారిణులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఫుట్‌బాల్‌లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టిస్ చేయడం వల్ల క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, ఉపాధ్యక్షులు రమేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, కోచ్ వెంకట్రాములు, ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ నికేష్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ -
నైపుణ్యాలు వెలికి..
స్పోర్ట్స్ స్కూళ్లతో చిన్నారుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం ఆయా క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలామంది స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన వారే. – శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ క్రీడాభివృద్ధికి కృషి.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నూత న క్రీడా పాలసీ తీసుకురావడం సంతోషంగా ఉంది. సీఎం రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లు చిన్నారులకు ఒక మంచి వేదికలా ఉపయోగపడుతాయి. క్రీడాపాలసీతో భవిష్యత్‌లో మనకూ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. – బాలరాజు, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఈసీ మెంబర్, మహబూబ్‌నగర్ ● -
కన్న కొడుకులు గెంటేశారు.. ఆదుకోండి సారూ...!
‘కడుపున పుట్టిన పిల్లలు పట్టెడన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు.. పైగా నా పేరున ఉన్న భూమిని కూడా లాక్కున్నారు’ అంటూ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు సోమవారం గద్వాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ బీఎం సంతోష్‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్‌కు చెందిన పాపమ్మకు 4 కుమారులు. వృద్ధాప్యంలో అండగా నిలబడాల్సిన వారు ఆమె పేరిట ఉన్న 2.37 ఎకరాల భూమిని వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేగాకుండా కనీసం రోజు భోజనం కూడా పెట్టకుండా ఇంటి నుంచి గెంటేశారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. – గద్వాల -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
జడ్చర్ల: గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గుట్టుగా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్లవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. మండలంలోని మాచారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహేంద్రపాల్, సత్యం ఎండు గంజాయిని ఆరు గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.300కు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న తాము వారిపై దాడి చేసి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 240 గ్రాముల గంజాయితోపాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్ఐ కార్తీక్‌రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
బాల కార్మికులను గుర్తించాలి
మహబూబ్‌నగర్ క్రైం: బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం సూచించారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పిపోయిన చిన్నారులతో పాటు పలు రకాల కార్మాగారాల్లో పనిచేస్తున్న బాలబాలికలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి.. వారితో పని చేయిస్తున్న యాజమానులపై పీడీ యాక్ట్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు అవసరం అయితే కౌన్సెలింగ్ నిర్వహించి కేర్ హోమ్‌కు తరలించాలన్నారు. బాలకార్మికులు కన్పిస్తే డయల్ 100 లేదా 1098 టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ నెల రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం తనిఖీలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ నయిముద్దీన్, ఏస్టర్ గ్రేస్, డెమో మంజుల, డీసీపీఓ నర్మద, ఎస్ఐ కుర్మయ్య, ఉమెన్ ఎస్ఐ సుజాత పాల్గొన్నారు. -
డ్రెయినేజీ నిర్మించాలి
పద్మావతికాలనీలోని అయ్యప్పగుట్టకు వెళ్లే మార్గంలో 20 ఏళ్ల క్రితమే ఇళ్లు నిర్మించుకున్నాం. ఇప్పటివరకు అధికారులు అధికారులు ఈ గుట్ట ప్రాంతంలో సీసీరోడ్డు, డ్రెయినేజీ ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టి రోడ్లపై వరద కొట్టికొచ్చి పాయలుగా మారుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఆస్కారం లేకుండాపోయింది. కనీసం నడవడానికి కూడా వీలులేదు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు. – పగడం మల్లేష్, అయ్యప్పగుట్ట ప్రాంతం, మహబూబ్‌నగర్ -
పులులకు ఏకాంతం కల్పించేందుకు..
పులులకు ఏకాంత వాతావరణాన్ని కల్పించేందుకు అడవిలోకి ప్రవేశించకుండా పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నాం. ఇందుకు ప్రజలు, యాత్రికులు సహకరించాలి. అనుమతులు లేకుండా అడవిలోకి ప్రవేశించడంపై ఆంక్షలు నిరంతరం కొనసాగే ప్రక్రియ. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పెద్దపులి జతకట్టే రోజులు కావడంతో మూడు నెలలపాటు యాత్రికులను అనుమతించడం లేదు. పర్హాబాద్ వ్యూ పాయింట్ సఫారీ సేవలు నిలిపివేశాం. ప్రధాన రహదారి గుండా వాహనదారులు 30కిలోమీటర్ల వేగం మించకుండా వెళ్లాలి. – రోహిత్‌గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి -
భూగర్భ కేంద్రం సీఈగా కేవీవీ సత్యనారాయణ
దోమలపెంట: టీఎస్జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్‌గా కేవీవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన విద్యుత్ సౌధ, హైదరాబాద్‌లో ఎస్ఈ, జనరేషన్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వొద్దని కోర్టులో స్టే ఉండడం వల్ల ఇన్చార్జి సీఈగా భూగర్భ కేంద్రానికి వచ్చారు. ఆయన జెన్కోలో సీనియర్ కావడంతో జెన్కో యాజమాన్యం ఈ బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా ఆయనకు భూ గర్భ కేంద్రం ఇంజినీర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటి వరకు కేంద్రం సీఈగా విధులు నిర్వహించిన కె.రామసుబ్బారెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్రం ఇంజినీర్లు, ఉద్యోగులు రామసుబ్బారెడ్డి సేవలను కొనియాడి ఘనంగా వీడ్కోలు పలికారు. -
పాముల భయం ఉంది
మా వీధిలో డ్రెయినేజీ, సీసీ రోడ్డు నిర్మించకపోవడంతో చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్లలో మురుగు చేరి దుర్గంధం వెదజల్లుతోంది. ముఖ్యంగా దోమలు, ఈగలు ముసురుకుంటున్నాయి. మా ఇంట్లోని ఇద్దరు చిన్నపిల్లలను బయటకు తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఇటీవల పొదలలో నుంచి మా ఇంటి వద్ద మట్టిరోడ్డు పైకి ఓ పాము వచ్చిపోయింది. కుటుంబసభ్యులందరమూ ఎంతో ఆందోళనకు గురయ్యాం. చివరకు మున్సిపల్ జవాన్‌కు చెప్పి పారిశుద్ధ్య కార్మికులతో పొదలు తొలగించి మోరీని శుభ్రం చేయించాం. – ప్రతిభ, గృహిణి, విఘ్నేశ్వరకాలనీ, మహబూబ్‌నగర్ -
చిరుత సంచారంతో కలకలం!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రం పరిధిలోని వీరన్నపేట హెచ్ఎన్ ఫంక్షన్ హాలు సమీపంలోని గుట్టలో బండరాయిపై చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుట్ట మీద ఉన్న బండరాయిపై సంచరిస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మహ్మద్ కమాలుద్దీన్ పర్యవేక్షణలో 8 మంది ఫారెస్టు అధికారులు, సిబ్బంది బృందం చిరుత తిరిగిన, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చిరుత సంచారం ఆనవాళ్లు కనిపించలేదు. మూడు రోజుల క్రితం చిన్నదర్పల్లి అటవీ ప్రాంతానికి సమీపంలో పంట పొలాల వద్ద రాత్రి వేళలో ఆవుదూడపై దాడి చేసినట్లు గ్రామ రైతులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో చిరుతలు సంచరిస్తున్న విషయానికి బలం చేకూరుతోంది. భయాందోళనతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం 8 మంది అధికారుల బృందం పరిశీలన -
రెండు బైక్‌లు ఢీ : యువకుడి దుర్మరణం
అయిజ: రెండు బైక్‌లు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసరావు కథనం మేరకు.. మేడికొండకు చెందిన చరణ్ (26) ఆదివారం పట్టణం నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో పుర పరిధిలోని తుపత్రాలకు చెందిన రమేష్ బైక్‌పై అయిజకు వస్తుండగా తుపత్రాల సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చరణ్‌కు గాయాలుకాగా అంబులెన్స్‌లో గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి.. మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతదేహానికి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వెల్దండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం కర్నూల్ జిల్లాలోని నంద్యాల–శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెల్దండ మండల కేంద్రానికి చెందిన బచ్చు రాఘవేందర్(34) కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలో పాలసీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. నంద్యాలలో ఉంటున్న స్నేహితుడి వద్దకు తల్లి పద్మమ్మతో కలిసి వెళ్లాడు. తల్లిని స్నేహితుడి కుటుంబ సభ్యుల వద్ద ఉంచి రాఘవేందర్, స్నేహితుడు కారులో శ్రీశైలం వెళ్లారు. మార్గంమధ్యలో కారు నిలిపి సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా నంద్యాల–శ్రీశైలం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాఘవేందర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెల్దండలోని బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లారు. రాఘవేందర్ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. అతనికి తల్లిదండ్రులు పద్మ, సత్యనారాయణ, అక్క రాజేశ్వరి ఉన్నారు. -
కనిపించే దైవం..
దేవుడు మనిషికి జన్మనిస్తే.. వైద్యుడు తన వైద్యంతో పునర్జన్మనిస్తాడు. వారి ఆత్మీయ స్పర్శ రోగికి అపరసంజీవని. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరూ వైద్యుడిలో దేవుడిని చూస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తమను నమ్ముకొని వచ్చే వారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా సేవలందించే దైవంగా అందరి మన్ననలు అందుకుంటున్నారు వైద్యులు. మంగళవారం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. – పాలమూరు నేడు జాతీయ వైద్యుల దినోత్సవం ఎంత గొప్ప వ్యక్తి అయినా.. పేదవాళ్లు అయినా చేతులెత్తి నమస్కరించేది కేవలం వైద్యులకు మాత్రమే. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ప్రమాదంలో గాయపడినా.. ఎలాంటి ఆపద వచ్చినా గుర్తుకు వచ్చేది వైద్యులే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, వాతావారణంలో వస్తున్న మార్పుల కారణంగా కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. రోజుకు వేల మంది రోగులకు వైద్యులు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నారు. కొందరు వైద్యులు మానవత్వంతో అభాగ్యులకు సేవలందిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. మరికొందరు వృతి ధర్మానికి కట్టుబడి మానవతా విలువలతో వైద్యసేవలు అందిస్తున్నారు. ● మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల 2016లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌ల విద్యార్థులు వైద్యవిద్యను పూర్తిచేసుకున్నారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో 150మంది చొప్పున మొత్తం 450మంది ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని బయటకు వెళ్లారు. ప్రస్తుతం 2019 బ్యాచ్‌లో 175మంది హౌజ్ సర్జన్లుగా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ప్రతి బ్యాచ్‌లో 175 మందికి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి కొత్తగా మరో 175మందికి అవకాశం కల్పించారు. ప్రసవాలపై ప్రత్యేక దృష్టి.. నేను దామరగిద్ద మెడికల్ ఆఫీసర్‌గా వచ్చిన తర్వాత ప్రతినెలా 15 కాన్పులు చేస్తున్నాం. ఈ నెలలో 26 సాధారణ కాన్పులు చేశాం. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ.. సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాం. 2016లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లో పనిచేశాను. దామరగిద్దకు డిసెంబర్లో వచ్చాను. గతంలో ప్రతినెలా ఐదు వరకు మాత్రమే సాధారణ కాన్పులు జరిగేవి. – డా.సుదీష్ణ, మెడికల్ ఆఫీసర్, దామరగిద్ద ఏడాదిలో 315 సాధారణ కాన్పులు.. ఏడాది కాలంలో దేవరకద్ర పీహెచ్సీలో 315 సాధారణ కాన్పులు చేశాం. సాధారణ ఓపీతో పాటు ప్రసవాలపై ఎక్కువగా దృష్టి పెట్టాను. పీహెచ్‌సీల వారీగా పరిశీలిస్తే.. జిల్లాలో అత్యధిక కాన్పులు ఇక్కడే అవుతాయి. హైరిస్క్ ఉన్న కేసులను సైతం బాధ్యతగా తీసుకుని ప్రసవాలు చేస్తున్నాం. నేను 2015లో ఎంబీబీఎస్ పూర్తిచేశాను. ఆ తర్వాత లట్టుపల్లి, బిజినేపల్లి, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్‌లో పనిచేశాను. ప్రస్తుతం దేవరకద్రలో పనిచేస్తున్నా. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నాం. – డా.శరత్చంద్ర, దేవరకద్ర పీహెచ్సీ కరోనా సమయంలో ఇంటింటికెళ్లి.. కరోనా సమయంలో ఇంటింటికెళ్లి చికిత్స అందించడం, ప్రతి ఒక్కరికీ ధైర్యం కల్పించడం నా జీవితంలో మరిచిపోలేను. నేను 2014లో కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తిచేశా. 2017లో సర్వీస్‌లోకి వచ్చాను. మొదట మిడ్జిల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా విధుల్లో చేరాను. డెంగీ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. – డా.శివకాంత్, మెడికల్ ఆఫీసర్, మిడ్జిల్ ●ప్రతి గ్రామానికి వెళ్లి సేవలు.. కొల్లాపూర్ ఏరియాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి వైద్యసేవలు అందించా. ఓ అమ్మాయి డెంగీ బారినపడి పరిస్థితి ఇబ్బందిగా ఉండగా.. ఆమె ఇంటికి వెళ్లి పర్యవేక్షించాను. నేను 2015లో కడప రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేశాను. ఆ తర్వాత ఎన్ఆర్సీ, హైదరాబాద్ బస్తీ దవాఖానలో, కొల్లాపూర్‌లో పనిచేశా ను. గతేడాది జనవరి 1నుంచి ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లో ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. మంచి గైనకాలజిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. – డా.శిరీష, ఆర్ఎంఓ, జిల్లా జనరల్ ఆస్పత్రి -
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్‌కు 142 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తు అర్జీదారులకు సమాచారం తెలియజేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ వసతి గృహా లు, కేజీబీవీలు, అంగన్వాడీలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలును ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండల అధికారులతో పర్యవేక్షణ చేయాలన్నారు. హాస్టళ్లు, అంగన్వాడీల్లో సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, పరిశుభ్రత తదితర కార్యక్రమాలు పర్యవేక్షించి రిపోర్టు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2025 కార్యక్రమం కింద గ్రామాలకు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించేలా సిటిజన్ ఫీడ్ బ్యాకప్ ద్వారా తెలిపేలా అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఆర్డీఓ నర్సిములు, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి,అధికారులు పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడ అంటే..?
కొత్తగా వెలిసిన ఏనుగొండలోని పోచమ్మకాలనీ, సగర కాలనీ, శ్రీరామకృష్ణా కాలనీ, ద్వారకాపురి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, మర్లులోని శాంతినగర్, విఘ్నేశ్వర కాలనీ, ఎస్ఆర్ నగర్, శ్రీరామ కాలనీలలో సగం వరకు డ్రెయినేజీలు నిర్మించలేదు. క్రిస్టియన్‌పల్లి, ఏనుగొండలోని బీసీ కాలనీ, ఎస్సీకాలనీ, పద్మావతికాలనీ ఎస్బీఐ బ్రాంచికి ఎదురుగా ఉన్న వీధిలో, పాత పాలమూరులోని హరిజనవాడ, దోబీవాడ, గోల్ మసీదు ప్రాంతంలోని గచ్చిబౌలి, కురిహినిశెట్టికాలనీతో పాటు కిసాన్‌నగర్, వీరన్నపేట, ఝాన్సీనగర్, హనుమాన్‌నగర్, న్యూగంజ్, కొత్తచెరువు రోడ్, మోతీనగర్, బోయపల్లి, గొల్లబండ తండాలలో పాత డ్రెయినేజీలు దెబ్బతిన్నాయి. -
బాధితులకు న్యాయం అందించాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ దగ్గరకు వచ్చే బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంతో స్వీకరించి, వినతులను సమగ్రంగా పరిశీలించి.. అవసరమైన విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలన్నారు. ప్రజలలో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాటి పరిష్కారం కోసం నిత్యం సమీక్ష చేసుకోవాలన్నారు. డిజిటల్ పద్ధతిలో జరిమానాలు వసూలు చేయాలి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు చేయడం, జరిమానాలు విధించడం నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, వాహనాల జరిమానా వసూళ్లు తదితర అంశాలను తనిఖీలు చేశారు. ట్రాఫిక్ క్రమపద్దతులను పాటించడంలో సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై సీఐ దగ్గర ఆరా తీశారు. ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ పద్ధతిలో జరిమానాలు వసూలు చేయాలని, ప్రతి ఒక్కరికి రశీదు తప్పక ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ పాయింట్లలో సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని, పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి పాల్గొన్నారు. -
రూ.50 కోట్లు మంజూరు..
తాజాగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే సుమారు రూ.30 కోట్లతో వివిధ చోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. మిగతా రూ.20 కోట్లకు సంబంధించిన పనులకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఈ నిధులను ముందుగా నగరంలో డ్రెయినేజీ వ్యవస్థకు, ఆ తర్వాతే సీసీ రోడ్లకు వెచ్చిస్తాం. దశలవారీగా అన్ని పనులు పూర్తి చేయిస్తాం. – టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్ -
నగరం.. కంపు కంపు
ఇది ఏనుగొండలోని శ్రీరామకృష్ణా కాలనీ వీధి నం.3 వద్ద పరిస్థితి ఇదీ. ఇటీవల ఈ కాలనీలో సీసీ రోడ్డు వేసినా పక్కనే ఇళ్లు లేవనే నెపంతో సగం వరకే డ్రెయినేజీ నిర్మించారు. వర్షాకాలం కావడంతో ఓపెన్ ప్లాట్లలో మురుగుతో పాటు వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విపరీతంగా దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలకు ఆవాసంగా మారడంతో చుట్టుపక్కల ఇబ్బందులకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కొన్నేళ్లుగా మహబూబ్‌నగర్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఆ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కొత్త కాలనీలు, విలీన గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ ఏడాది కాలంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లతో పాటు యూజీడీ నిర్మించారు. మరికొన్ని చోట్ల రోడ్డు మాత్రమే నిర్మించి డ్రెయినేజీ మాత్రం మరిచారు. అసలే వర్షాకాలం.. ఆపై లోతట్టు ప్రాంతాల్లో వరదతో పాటు మురుగు మొత్తం పేరుకుపోతోంది. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక కొన్ని వీధుల్లో పాత డ్రెయినేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తవి నిర్మించకపోవడంతో మురుగుఏరులై పారుతూ రోడ్లపైకి వస్తుండటంతో కంపుకొడుతున్నాయి. మహబూబ్‌నగర్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ అయి ఐదు నెలలైనా సౌకర్యాల కల్పనలో ఎలాంటి మార్పు రాలేదని నగర ప్రజలు వాపోతున్నారు. పాలమూరులో డ్రెయినేజీలు అస్తవ్యస్తం విలీన గ్రామలు, కొత్త కాలనీల్లో తీవ్ర ఇబ్బందులు ఓపెన్ ప్లాట్లలో ఎక్కడికక్కడ నిలుస్తున్న మురుగు వర్షం వస్తే.. రోడ్లపైకి చేరుతున్న వైనం కార్పొరేషన్‌గా మారినా ప్రయోజనం దక్కలే -
ట్రాక్ మరమ్మతుల కోసం రైల్వేగేటు మూసివేత
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ నుంచి పిల్లలమర్రి రోడ్డు రైల్వే గేటు నంబర్ 58 వద్ద 111/8–9 నూతన ట్రాక్ పునరుద్ధరణ కోసం సోమవారం నుంచి బుధవారం (జూలై 2) వరకు రైల్వే గేటును మూసివేస్తున్నట్లు రైల్వే మహబూబ్‌నగర్ (పీడబ్ల్యూఏవై) సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రాంప్రసాద్‌గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వాహనాలను ఎల్సీ నంబర్ 59.. అనగా బోయపల్లి గేటు, బీఆర్ 243 వద్ద ఉన్న మోతీనగర్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు జరిగిన ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతిపాలమూరు: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం 175 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కళాశాలలో పర్యటించిన ఎన్ఎంసీ బృందం పలు లోపాలు ఉన్నట్లు నోటీసులు జారీ చేయడంతో దీనికి సదరు అధికారులు లోపాలపై ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ఎన్ఎంసీ సీట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలను రాబోయో నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది.మొక్కజొన్న @ రూ.2,348జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,348, కనిష్టంగా రూ.1,900 ధరలు లభించాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,684, కానుగు పలుకులు రూ.4,663 ధరలు పలికాయి.ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలిస్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించాలిమహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.వెంకటేశ్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మిక సంఘం టీయూసీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెవెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి సాంబశివుడు, కురుమన్న, వెంకటేశ్, బాలమ్మ పాల్గొన్నారు. -
అలంపూర్ ఆలయాల్లో బోనాల సందడి
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారికి ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని నల్లపోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బోనాలు సమర్పించారు. కమిటీ సభ్యులు సుమారు 500 మంది మహిళలు అలంపూర్‌కు చేరుకొని బోనపు కుండలను తలపై పెట్టుకొని కళాకారుల డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. వెండి బోనం, జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలతో ఆలయాలకు చేరుకున్న సభ్యులకు ఈఓ పురేందర్‌కుమార్ స్వాగతం పలికారు. మొదట బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు, ఒక వెండి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను శేషవస్త్రాలతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. అమ్మవారికి వెండి బోనం, పట్టువస్త్రాల సమర్పణ -
ముగిసిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500కుపైగా విద్యార్థులు హాజరయ్యారు. రెండోరోజు బాల, బాలికలకు వేర్వేరుగా కిక్‌బాక్సింగ్ పోటీలు జరిగాయి. నాలుగు సింథెటిక్ కోర్టుల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపొందిన వారికి తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ.పద్మాచారి పోటీలను ప్రారంభించి గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసులు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్, కోశాధికారి శ్రీనివాస్, ప్రముఖ కవి రఘువీర్‌ప్రతాప్, హరిసింగ్, మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, సలహాదారులు విజయ్‌కుమార్, ీసీనియర్ విద్యార్థులు నిఖిల్, రోహిత్, యామిని, జయదీప్‌సింగ్, వర్షిని తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలు పాయింట్ ఫైట్– 33 కేజీల విభాగంలో షర్వీశుక్లా ప్రథమ, శ్రీనికరెడ్డి ద్వితీయ, అన్విత తృతీయ, నిహారిక నాలుగో స్థానంలో నిలిచారు. 37 కేజీల విభాగంలో వినిత ప్రథమ, అక్షర ద్వితీయ, రక్షిత తృతీయ, కె.వివేకా నాల్గో స్థానం, 50 కేజీల విభాగంలో యక్షిక ప్రథమ, తన్వి చౌదరి ద్వితీయ, శ్రీప్రజ్ఞ తృతీయ, సిగ్ధారెడ్డి నాలుగో స్థానం, 63 కిలోల కేటగిరిలో శివప్రసాద్ ప్రథమ, 37 కిలోల కేటగిరిలో రేవంత్‌రెడ్డి ప్రథమ స్థానాల్లో నిలిచారు. అలాగే మరికొన్ని విభాగాల్లో విద్యార్థులు ప్రతిభచాటి ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచి పతకాలు సాధించారు. హోరాహోరీగా తలపడిన క్రీడాకారులు గెలుపొందిన వారికి మెడల్స్ అందజేత -
‘ర్యాలంపాడు లీకేజీల పాపం గత ప్రభుత్వానిదే’
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన ర్యాలంపాడు జలాశయం ఆనకట్ట అడుగుభాగం, కుడి, ఎడమ తూముల అడుగు భాగంలో లీకేజీలు ఏర్పడటం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులదేనని మాజీ ఎమ్మెల్యే డీకే భరత్‌సింహరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ర్యాలంపాడు, జూరాల జలాశయాలను సందర్శించి మాట్లాడారు. ర్యాలంపాడు జలాశయం నిర్మాణ సమయంలో నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తున్నారంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, ఆ క్రమంలో తనపై అవినీతి ఆరోపణలు కూడా చేశారన్నారు. తాము ఇచ్చిన ఆధారాలతో విచారణ చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనుల బిల్లులను నిలిపివేసిందని తెలిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు విడుదల చేసి తమకు రావాల్సిన కమీషన్లు దండుకుందని ఆరోపించారు. ర్యాలంపాడు జలాశయం నెట్టెంపాడు ప్రాజెక్టుతో పాటు కొత్తగా నిర్మిస్తున్న గట్టు లిఫ్ట్‌కు సైతం గుండె లాంటిదని.. అంతటి ప్రాధాన్యత ఉన్న జలాశయం లీకేజీలతో పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. మళ్లీ నిర్మాణం చేయాలంటే సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని.. ఇంత పెద్ద తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని రికవరీ చేయాలన్నారు. అదేవిధంగా త్వరితగతిన మరమ్మతు చేసి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని కోరారు. జూరాల ప్రాజెక్టు నిర్వహణలో అప్పటి బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని.. దీని ఫలితమే ప్రాజెక్టు గేట్ల రోప్‌లు తెగిపోయి ప్రమాదంలో పడిందన్నారు. రోప్‌లు తెగిపోవడం, రబ్బర్ సీల్స్ దెబ్బతినడం స్పష్టంగా కనిపిస్తుంటే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటనలు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని జూరాల మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టి కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంజీవ్ భరధ్వాజ్, మీర్జాపురం రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం
గండేడ్: అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారం చెలాయించి చేసిన పాపాలకు వారు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందన్నారు. రేవంత్‌ది దమ్మున్న సర్కారని.. రాబోయే రోజులు కూడా కాంగ్రేస్వేనని జోస్యం చెప్పారు. స్థానిక ఎన్నికల సమరం ప్రారంభమైందని.. సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు చిన్న పెద్దా తేడా లేకుండా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వివిధ పథకాలతో పాటు రైతుభరోసా నిధులు 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమచేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సత్తా చాటారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, కో–అబ్జర్వర్ రాంశెట్టి నరేందర్, పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పుల్లారెడ్డి, జిల్లాపార్టీ ఉపాధ్యక్షుడు అనంతలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
రోగులను గాలికొదిలేసి.. క్యాండీ క్రష్‌గేమ్
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలను కొందరు వైద్యులు తుంగలో తొక్కుతున్నారు. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆదివారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓ వైద్యురాలు రోగులను పట్టించుకోకుండా ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడటాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘును వివరణ కోరగా.. సదరు వైద్యురాలికి మెమో జారీ చేశామని, ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫోన్లో గేమ్ ఆడుతున్న వైద్యురాలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యురాలి నిర్వాకం -
పత్తి లారీ దగ్ధం
కోస్గి: పత్తి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీకి ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం తెల్లవారుజామున పట్టణ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ యజమాని, డ్రైవర్ భరత్ మహారాష్ట్రలో పత్తిని నింపుకొని ఆంధ్రప్రదేశ్‌లోని నగరి మిల్లుకు తీసుకెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కోస్గి శివారులోని బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలో పత్తికి మంటలు వ్యాపించడం గుర్తించి లారీని నిలిపారు. అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికి పత్తి పూర్తిగా కాలిపోగా.. పొక్లెయిన్ సాయంతో నిప్పంటుకున్న పత్తిని లారీ పైనుంచి కిందకు తోశారు. ఈ ప్రమాదంలో లారీ సైతం దగ్ధమైంది. మార్గమధ్యంలో షార్ట్ సర్క్యూట్‌తో పత్తికి నిప్పంటుకొని మంటలు చెలరేగి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందని లారీ యజమాని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాలిపోయిన లారీ -
లాడ్జీల్లో విస్తృతంగా తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని లాడ్జీల్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పలువురు చీకటి కార్యకలాపాలకు స్థానిక లాడ్జీలను ఎంపిక చేసుకున్నారు. కొందరు యువత, ప్రముఖులు, కూలీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి లాడ్జీల్లో తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. లాడ్జీలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు బస చేస్తున్న వారి వివరాలు, ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారనే వివరాలను యజమానుల నుంచి సేకరించినట్లు తెలిపారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తనిఖీల్లో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. బాలిక ఆత్మహత్యాయత్నం ధరూరు/అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజె క్టు వద్ద బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా బ్లూకోర్టు పోలీసులు గమనించి కాపాడిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. అయిజ మండలం ఉప్ప ల గ్రామానికి చెందిన హనుమంతు తన కుమార్తె(12)ను ఆదివారం మరికల్‌లోని జ్యోతిరావు పూలే స్కూల్లోని హాస్టల్లో వదిలి వెళ్లాడు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేని బాలిక అక్కడి నుంచి పారిపోయి సాయంత్రం 7 గంటల సమయంలో జూరాల లెఫ్ట్ కెనాల్ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చింది. అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతున్న బాలికను గమనించిన ధరూరు బ్లూకోర్టు పోలీసులు వినోద్, విక్రమ్ అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
జూరాలకు భారీ వరద
ధరూరు/ దోమలపెంట/ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది. శనివారం ప్రాజెక్టుకు 1.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం సాయంత్రానికి 1.50 లక్షలకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 1,16,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు– 1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 150 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.729 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,16,064 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 25,707 మొత్తం 1,41,771 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఎంజీకేఎల్‌ఐకు నీటి విడుదల జరగలేదు. కాగా.. ఆదివారం శ్రీశైలం జలాశయంలో 871.2 అడుగుల వద్ద 146.9200 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత వేగంగా విద్యుదుత్పత్తి జూరాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 153.734 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. -
పోలీసులా.. మజాకా
కోస్గి: పోలీసులకు ఎవరైనా దొంగ పట్టుబడితే పూర్తిస్థాయిలో విచారించి చోరీ సొత్తు రికవరీ చేయాలి. మరోసారి చోరీకి పాల్పడకుండా చర్యలు చేపట్టాలి. కానీ కోస్గి పోలీసుల నిర్వాహకంతో ఓ దొంగ యథేచ్ఛగా మరో చోరీకి పాల్పడ్డాడు. అచ్చం సినీ స్టోరీని తలపించే ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. తాగిన మైకంలో ఉన్న ఓ వ్యక్తి ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి కోస్గికి ఆటోలో వచ్చాడు. స్థానికంగా పాత సామగ్రి కొనుగోలుచేసే రఫి అనే వ్యాపారి వద్దకు అతడు వెళ్లి తన ఆటో అమ్ముతానని చెప్పాడు. అయితే ఆటో కొత్తగానే ఉండటంతో అనుమానం వచ్చిన సదరు వ్యాపారి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆటో అమ్మేందుకు వచ్చిన వ్యక్తిని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి.. ఆటో నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. సంబంధిత ఆటో మహబూబ్‌నగర్‌లో చోరీకి గురైందని.. యజమాని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు నిర్ధారించుకొని అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటోను కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పట్టుబడిన దొంగకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తీసుకోకుండానే తాగిన మైకంలో ఉన్నాడంటూ వదిలేశారు. అతడు దర్జాగా కోస్గి ఆటో స్టాండ్‌కు చేరుకొని అక్కడ నిలిపి ఉంచిన మరో ట్రాలీ ఆటోతో పరార్ కావడం కలకలం రేపింది. చోరీ చేసిన ఆటోతో పట్టుబడిన దొంగ తాగిన మైకంలో ఉన్నాడంటూ వదిలేసిన కోస్గి పోలీసులు మరో ఆటోతో ఉడాయించిన నిందితుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్.. అప్రమత్తమైన ఆటో డ్రైవర్లు హన్వాడ సమీపంలో ఆటోతో సహా పట్టివేత ఆటో దొంగ విషయమై ఎస్ఐ బాల్‌రాజ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. సీఐ సైదులును సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన సైతం అందుబాటులోకి రాలేదు. స్టేషన్ ఇన్చార్జిగా ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులును ఈ విషయమై అడగగా.. తాగిన మైకంలో ఉండి వివరాలు చెప్పకపోవడంతో ఆటోను స్వాధీనం చేసుకొని అతడిని వదిలేశామన్నారు. ఇక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులకు అప్పగిస్తామన్నారు. ఏదేమైనా స్థానిక పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కోస్గి పోలీసులా.. మజాకా అంటూ చర్చించుకోవడం కనిపించింది. -
నీటి గుంతలో పడి మహిళ మృతి
ఊర్కొండ: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని ఊర్కొండపేటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన చిక్కొండ కోటయ్యకు ఊర్కొండపేట శివారులో పొలం ఉంది. ఆదివారం ఆయన పొలంలో గుంటుక తోలుతుండగా భార్య చిక్కొండ పద్మమ్మ (45) అతడి వెంటే ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తుండేది. నీళ్లు తీసుకురావడానికి గుంత వద్దకు వెళ్లిన పద్మమ్మ ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయింది. చాలా సమయం వరకు తిరిగి రాకపోవడంతో కోటయ్య వెళ్లి చూడగా నీటిలో కనిపించింది. పరిసర పొలాల రైతుల సాయంతో బయటకు తీసి పరిశీలించగా పద్మమ్మ అప్పటికే మృతిచెందింది. కృష్ణానదిలో పడి యువకుడు మృతి కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న కృష్ణానదిలో పడి కర్నూలుకు చెందిన భరత్ (30) మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. భరత్ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం పర్యాటక ప్రాంతమైన సోమశిలకు కారులో వచ్చాడు. నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. తోటి స్నేహితులు కేకలు వేసి అక్కడ ఉన్న కొందర్ని పిలిచారు. వారు వచ్చి నదిలోకి దిగి భరత్‌ను ఒడ్డుకు తీసుకొచ్చి వెంటనే కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భరత్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. లారీ, బైక్ ఢీ : యువకుడి దుర్మరణం దేవరకద్ర రూరల్: లారీ, బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దేవరకద్రకు చెందిన కాటం నవీన్‌గౌడ్ (20) మన్యంకొండ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ హౌస్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. రోజులాగే విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్‌బంక్ దగ్గర లారీ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలంటూ మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ నాయకులు భూట్టో రాము, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేయగా భగీరథ కంపెనీ హెచ్ఆర్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేయాలి
కొత్తకోట: ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పరిమితి లేని క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట పట్టణంలోని తపస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించడంతో పాటు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని, జీహెచ్ఎంసీ, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. అదే విధంగా కేజీబీవీ ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలన్నారు. గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్‌గౌడ్, గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘లేనిపోని ఆరోపణలు చేస్తే సహించం’
జడ్చర్ల: ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇస్తూనే.. ఆయనపై తిరిగి ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం తమపై బురద జల్లితే ఊరుకోబోమన్నారు. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి అంబేడ్కర్ చౌరస్తాలో డివైడర్ కటింగ్ ద్వారా పాత బస్టాండ్ వైపు ఆర్టీసీ బస్సులు వెళ్లే పరిస్థితి స్పష్టంగా ఉండగా.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నెహ్రూ చౌరస్తాలో యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అలాగే ఎర్రగుట్టలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో డబ్బులు తీసుకుని ఇచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అందులో ఉన్న అర్హులకు ఇళ్లు ఇవ్వాలని లేకపోతే ఆందోళన చేస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రి వద్ద తమ కుటుంబీకులపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే తనకు పోలీస్ ఎస్కార్ట్ వద్దంటూనే తన తల్లికి పోలీస్ ఎస్కార్ట్ ఇస్తూ అధికారిక కార్యక్రమాల్లో తల్లి, సోదరుడిని భాగస్వామ్యం చేస్తూ రాజరిక పాలనను తలపిస్తున్నాడని ధ్వజమెత్తారు. తాను తమ పార్టీకి చెందిన వారు ఒక్క గుంట భూమి ఎక్కడా కబ్జా చేయలేదని అలా చేస్తే నిరూపించాలని సవాల్ విసిరారు. నల్లకుంటను ఎమ్మెల్యే కబ్జా పెట్టారని ఆరోపించారు. రంగారెడ్డిగూడలో ఆలయ భూముల ఆదాయం ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాను అరికడ్తామంటూనే యథేచ్ఛగా హైదరాబాద్‌కు తరలించారని దుయ్యబట్టారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలకు ఇంకా ఎందుకు పెంచలేదన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నంద, జ్యోతి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత ●సమస్యలు పరిష్కరించాలి.. గ్రామాల్లో భూ సర్వేకు సంబంధించిన సమస్యలతోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. గెట్టు పంచాయితీలు, సర్వే నంబర్, సబ్ డివిజన్ సర్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. రీ సర్వే చేసి రికార్డులు, మ్యాపులు కొత్తవి సిద్ధం చేయాలి. పూర్తిస్థాయిలో సర్వేయర్లను నియమించి రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే సమస్యలను పరిష్కరించాలి. – మల్లేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు, హన్వాడ మండలం లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపిక.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేయర్ల కొరత తీర్చేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నాం. వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం. ఎఫ్‌లైన్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూస్తాం. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణ సర్వే పనుల్లో సర్వేయర్లు ఉండటంతో కాస్త ఆలస్యం జరుగుతుంది. – కిషన్‌రావు, సర్వే ల్యాండ్ ఏడీ, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు 2 వేలకుపైగానే ఎఫ్‌లైన్ అర్జీల పెండింగ్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు -
కనులపండువగా రథోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 33వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. పురవీధుల గుండా స్వామివారి రథోత్సవ ఊరేగింపు సాగింది. రథోత్సవంలో భజన మండలి కీర్తనలు అలరించాయి. రథోత్సవ ఊరేగింపులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షుడు శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రశర్మ, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
దేవరకద్రకు కోర్టు మంజూరు
దేవరకద్ర రూరల్: ఎట్టకేలకు దేవరకద్రలో కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం ఆదివారం జారీ చేసింది. అయితే 2022లో స్థానికంగా కోర్టు ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నట్లు గత ప్రభుత్వం గుర్తించినా ఏర్పాటుకు మాత్రం నోచుకోలేకపోయింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. స్వతహాగా న్యాయవాది అయిన మధుసూదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో దేవరకద్రలో కోర్టు ఏర్పాటుకు కృషి చేయాలని స్థానికులు, కక్షిదారులు ఆయనను కోరారు. ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి కోర్టు మంజూరు చేయాలని పలుమార్లు కోరగా.. తాజాగా దేవరకద్రకు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు నూతనంగా 9 కోర్టులను మంజూరు చేయగా, అందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి దేవరకద్రలో కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనున్న ఇబ్బందులు.. దేవరకద్రలో కోర్టు ఏర్పాటుతో నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి. గతంలో కేసుల కోసం కక్షిదారులు 65– 70 కిలోమీటర్లు ప్రయాణించి ఆత్మకూర్, గద్వాల కోర్టులకు వెళ్లేవారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రం ఏర్పాటు అనంతరం ఇక్కడి కేసులన్నీ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కోర్టులకు బదిలీ చేశారు. దీంతో దేవరకద్ర, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, కౌకుంట్ల మండలాల పరిధిలో నుంచి 2500– 3000 వరకు సివిల్, క్రిమినల్ కేసులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా కోర్టు ఏర్పాటుతో ఆయా మండలాల కక్షిదారులకు, ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తప్పనున్నాయి. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
అలరించిన ‘పాటల పల్లకీలో’..
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో ఆదివారం నిర్వహించిన ‘పాటల పల్లకీలో– 12 గంటలు పాలమూరులో ’అనే కార్యక్రమం అలరించింది. కళాకారులు తెలంగాణ ఉద్యమ, జానపద పాటలు పాడడంతోపాటు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అంతకు ముందు ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ర్యాలీగా కళాభవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా పాటల పల్లకీలో కార్యక్రమం కొనసాగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కళాకారులకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కళాకారుల పాట లేనిదే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. ఉద్యమంలో కళాకారుల పాత్ర విలువ కట్టలేనిదన్నారు. కవులు, కళాకారులు, గాయకులు వారి పాట, ఆటలతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఊరు, వాడా అనే తేడా లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కళాకారులు అందరూ సఫలీకృతం అయ్యారన్నారు. ప్రజా ప్రభుత్వం కళాకారులపట్ల సానుకూల దృక్పథంతో ఉందన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని ఏకం చేసి హైదరాబాద్‌లో ధూంధూం నిర్వహించాలని, మీ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిషోర్, టీపీసీసీ సాంస్కృతిక సేన అధ్యక్షుడు చక్రాల రఘు, జిల్లా కళాకారులు టంకర శ్రీనివాసులు, ఎదిర నర్సింహులు, బాలస్వామి, రమాదేవి, డప్పుస్వామి, మురళీ, జక్క గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన కళాకారులు -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. ప్రాజెక్టులకు రక్షణ లేదు.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. జూరాల క్రస్ట్ గేట్ల రోప్‌లు తెగుతున్నాయంటే.. వాటితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని మాట్లాడే వ్యక్తి నీటి పారుదల శాఖ మంత్రి కావడం మన దురదృష్టం అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తూ రైతులకు సాగునీరు అందించేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు పంపడమే పనిగా పెట్టుకుందని.. అలాంటి పాలకులపై ప్రజలు తిరగబడుతున్నారని, ప్రజలు మరోమారు బీఆర్ఎస్ పాలనే రావాలంటూన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జనాభాలో అధికులకే అన్యాయం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జనాభా అత్యధికంగా ఉన్న బీసీలకే అన్యాయం జరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఆలిండియా ఓబీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జనాభాలో అధికభాగం ఉన్నప్పటికీ వారికి రాజకీయంతోపాటు ఏరంగాల్లో కూడా న్యాయం జరగడం లేదన్నారు. 42శాతం ఉన్న బీసీలకు అదే దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హక్కులు సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. పాలమూరులో గతంలో పనిచేయడం గొప్ప అనుభూతని, ఇక్కడి ప్రజలు చాలా మంచి వారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు పీయూలో ఆలిండియా ఓబీసీ విద్యార్థుల సంఘం సెమినార్ -
మరణంలోనూ వీడని బంధం
● రెండ్రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి పాన్‌గల్: మండలంలోని కేతేపల్లిలో రెండ్రోజుల వ్యవధిలోనే వృద్ధ భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గడమల నర్సింహ (70), గడమల బాలమ్మ (65) భార్యాభర్తలు. అనారోగ్యంతో నర్సింహ బుధవారం మృతిచెందగా.. దిగాలుతో భార్య బాలమ్మ శనివారం మృతిచెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యుదాఘాతంతోరైతు మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని పాటిగడ్డ తండాకు చెందిన పాత్లావత్ నార్యానాయక్(65) పంటను పందుల బెడద నుంచి కాపాడేందుకు శుక్రవారం రాత్రి పొలం చుట్టూ తీగలను ఏర్పాటు చేసి విద్యుత్‌షాక్ పెట్టి ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగా శనివారం ఉదయం పంటను చూసేందుకు వెళ్లాడు. వైర్లు తెగిపోయి పడి ఉన్నాయి. దీనిని గమనించకుండా తీగలపై రైతు కాలుపెట్టడంతో విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉండగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. గోపాల్పేట ఎస్ఐ నరేష్‌కుమార్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. క్షణికావేశంలో మహిళ ఆత్మహత్య నవాబ్‌పేట: క్షణికావేశంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. కొండాపూర్‌కు చెందిన పసుపుల శివలీల(35) కుటుంబ తగాదాలతో క్షణికావేశానికి లోనై ఉరేసుకొంది. మృతురాలి భర్త మల్లేశ్ తరచూ మద్యంతాగి భార్యతో గొడవ పడేవాడని.. శుక్రవారం గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొంది. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి రాములు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. శివలీలకు కుమారుడు, కూతురు ఉన్నారు. గొర్రెల మంద వద్దకు వెళ్తూ అనంతలోకాలకు.. బిజినేపల్లి: మండలంలోని వెల్లగొండకు చెందిన గొర్రెలకాపరి ఈర్ల మాసయ్య (65) శనివారం రాత్రి కొట్టాల్‌గడ్డ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. వెల్లగొండకు చెందిన ఈర్ల మాసయ్య వృత్తిరీత్యా గొర్రెలకాపరి. శనివారం చీకటి పడిన తర్వాత గొర్రెల మంద వద్దకు వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో కొట్టాల్‌గడ్డ వద్ద రోడ్డు దాటుతున్న అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు
మన్ననూర్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మన్ననూర్లోని జంగాల కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం అటవీశాఖ విశ్రాంతి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు సమావేశమై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా తదితర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ పేరున పేదల సొంతింటి కలను సాకారం చేయడం గర్వంగా ఉందన్నారు. గుడిసెలు లేని గ్రామాలు ఉండాలన్నదే ఇందిరాగాంధీ ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, మన్ననూర్ తదితర గ్రామాల్లో కోతులు అధికమై పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు పంటల సాగుకు దూరమవుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినారాయణ టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన.. ఈ ప్రాంతంలోని ఆదివాసీ చెంచులు, ఇతర వర్గాల వారికి వ్యవసాయపరంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సబ్సిడీతో బోరు, సోలార్ విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. సాంకేతిక కారణాలతో రైతుభరోసా అందని రైతులకు త్వరలోనే వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యేలా చూస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ -
జూరాలకు నిలకడగా వరద
11యూనిట్లలో 435 మెగావాట్ల ఉత్పత్తి దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈమేరకు శనివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 68.180 మిలియన్ యూనిట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 79.215 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 147.395 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వరద పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు లక్షా5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో లక్షా 24వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 86, 340 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27, 790 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,15,978 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.571 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 1.24లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత కొనసాగుతున్న విద్యుదుత్పత్తి దిగువకు 1,15,978 క్యూసెక్కులు -
నారుమడిలో యాజమాన్య పద్ధతులు
నాటు వేసుకునే విధానం... నాటు వేసే నారులో ఆకు లేతగా, ఆకుమచ్చ గడ ఉంటే చేసు తొందరగా తిరుగబెడుతుంది. 4 నుంచి 6 ఆకులు ఉన్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నారు లోతులో కాకుండా ౖపైపెన నాటితే ఎక్కువగా పిలకలు వచ్చే అవకాశం ఉటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని బట్టి వానాకాలంలో చదరపు మీటర్‌కు 44 దంట్లు (నారు మొలకలు) ఉండేలా నాటుకోవాలి. కోస్గి: అధునాతన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ.. విత్తన శుద్ధి చేసి తగు జాగ్రత్తలతో వరి నారుమడి వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వరిసాగు చేసే రైతులు నారు పోసుకునేందుకు కరిగెట్టు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది వానాకాలంలో ప్రధానంగా బీపీటీ, తెలంగాణ సోనాతో పాటు వివిధ రకాల సన్న రకం వరి విత్తనాలను సాగు చేసుకోవడంతో దిగుబడి బాగుండడంతో పాటు ధాన్యం అమ్ముకునే విషయంలో ఇబ్బందులు ఉండవన్నారు. విత్తన శుద్ధి.. నారు పోసే ముందు విత్తన శుద్ది చేస్తే పలు రకాల కీటకాలు, తెగుళ్లు ఆశించకుండా నివారించుకోవచ్చు. కిలో విత్తనాలను 2.5 గ్రాముల కార్బండిజమ్‌తో కలిపి 24 గంటలు నానబెట్టాలి. లేదా కిలో విత్తనాలకు 3 గ్రాముల కాస్టన్ మందు కలిపి మడిలో చల్లుకోవాలి. దీనివల్ల నారుమడిలో ఆకుతినే పురుగు, ఉల్లికోడు, మువ్వ పురుగు ఆశించకండా ఉంటాయి. నారుమడి తయారీ.. ● నారు పోయాల్సిన మడిని 10 నుంచి 12 రోజుల్లో మూడు దఫాలుగా దున్ని చదును చేయాలి. నీరు పెట్టడానికి, ఎక్కువైతే తీయడానికి అనుకూలంగా ఎత్తుగా నారుమడులు తయారు చేసుకోవాలి. ● ఎకరా పొలం నాటడానికి 5 సెంట్లు (500 చదరపు మీటర్లు) నారుమడి అవసరం. సెంటు భూమికి 5 కిలోల విత్తనాలు వాడాలి. ● 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ ఉండే ఎరువులు వాడాలి. ● సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులను వాడితే తక్కువ ఖర్చుతో పాటు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు. నారులో కలుపు నివారణ ● నారుమడిలో కలుపు నివారణకు ఎకరాకు బూటాక్లోర్ 1.5 లీటర్లు, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 లేదా 8వ రోజున మడిలో నీటిని తొలగించి పిచికారీ చేయాలి. ● విత్తిన 10 రోజుల్లో కార్బోప్యూరాన్ 3జీ గుళికలు సెంటు నారుమడికి 150 గ్రాముల చొప్పున వేయాలి. లేదా మోనో క్రోటోపాస్ 1.6 మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి విత్తిన 10 రోజులకు పిచికారి చేయాలి. ● విత్తిన 15 రోజులకు సైహాలోపాస్ బ్యూబైట్ 10 శాతం మందు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటిలో 2 గ్రాముల జింక్ పాస్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● నారు 20 నుంచి 25 రోజుల వయస్సున్నప్పుడు 4 నుంచి 6 ఆకుల దశలో నాటుకోవడం వల్ల దిగుబడి అధికంగా వస్తుంది. పాడి–పంట జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ -
బూర్గుపల్లిలో విషాదం
జడ్చర్ల: మండలంలోని బూర్గుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావలి శివప్రసాద్ (22) హైదరాబాద్‌లోని ఓ న్యాయ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుండేవాడు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని బల్కంపేటలోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో కారు నిలిపే సమయంలో జరిగిన గొడవలో ఓ యువకుడు పదునైన ఆయుధంతో తలపై పొడవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చికిత్స కోసం నిమ్స్‌కు తరలించగా ఈ నెల 27న బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలు నలుగురికి ఉపయోగపడాలన్న సదాశయంతో అవయవ దానానికి అంగీకరించారు. దీంతో శనివారం రెండు కిడ్నీ లు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంబులెన్స్‌లో బాదేపల్లి రాజీవ్‌నగర్ కాలనీలో ఉంటున్న ఇంటికి అక్క డినుంచి స్వగ్రామం బూర్గుపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కగానొక్క కు మారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు మహాలక్ష్మి, నర్సింహులు కన్నీరు మున్నీరయ్యారు. ● గ్రామానికి చెందిన లా విద్యార్థిహైదరాబాద్లో హత్య ● అవయవదానంతో పలువురికి స్ఫూర్తి -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
నాగర్‌కర్నూల్ క్రైం: వ్యక్తి అదృశ్యం కేసు నమోదయినట్లు ఎస్సై గోవర్దన్ శనివారం తెలిపారు. మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామానికి చెందిన రమేష్ ఈ నెల 5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రమేష్ తల్లి తిరుపతమ్మ శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒండ్రు మట్టి తరలింపు అడ్డగింత ధన్వాడ: మండల కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి తరలిస్తున్న ఒండ్రుమట్టిని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి శనివారం అడ్డుకున్నారు. కాంగ్రెస్ పాలనలో అక్రమ సంపద కోసం చెరువులోని ఒండ్రు మట్టిని సైతం వదలడంలేదని ఆరోపించారు. వెంటనే పనులు నిలిపివేయాలని జిల్లా ఇరిగేషన్ అధికారి బ్రహ్మనందంకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులు, వాగుల నుంచి ఇసుక తరలిస్తూ అధికార పార్టీ నాయకులు డబ్బులు వెనకేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. ధన్వాడ పెద్ద చెరువుకు నీరు తీసుకువస్తామని, ఇందు కోసం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో డీపీఆర్‌లో చేర్చమని చెప్పుకొని తిరుతున్నారని, కానీ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో ధన్వాడ పెద్ద చెరువుకు నీరు తీసుకువచ్చేందుకు ఎలాంటి ప్లాన్ లేదని అన్నారు. కేవలం ఒండ్రు మట్టి తరలించుకునేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు పైపులైన్ నిమిత్తం రూ.100 కోట్ల బిల్లులు పెట్టారని, ఇది సాధ్యం కాదని వారికి కూడా తెలుసని అన్నారు. వెంటనే పనులు నిలిపివేయాలని చెప్పి ఒండ్రు మట్టి తరలించే వాహనాలను చెరువులో నుంచి బయటకు పంపించి వేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ అమ్మకోల్ల శ్రీనివాస్, కొండారెడ్డి ఉన్నారు. -
‘ఫేక్ మెసేజ్’తో రూ.57,700 మాయం
అడ్డాకుల: ‘ఎల్ఐసీ డబ్బులు రూ.24 వేలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేశాం.. మరో రూ.84 వేలు పంపిస్తాం’ అంటూ ఓ సైబర్ మోసగాడు రూ.57,700 కాజేశాడు. బాధితుడు మురళి కథనం మేరకు.. మండలంలోని పొన్నకల్‌కు చెందిన లక్ష్మి హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. శుక్రవారం మధ్యాహ్నం మూసాపేటలో ఉండే తల్లి కొండమ్మ వద్దకు వచ్చింది. రూ.24 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తప్పుడు సందేశం పంపించి ఫోన్ చేసి మాట్లాడాడు. రూ.24 వేలు ఎల్ఐసీ డబ్బులు జమ చేశామని.. మరో రూ.84 వేలు పంపిస్తామని, మరో బ్యాంకు ఖాతా నంబర్ పంపించాలని అడిగాడు. తనకు వివరాలు తెలియవని.. కుమారుడు శివకుమార్‌కు ఫోన్ చేయాలని అతడి నంబర్ చెప్పింది. తర్వాత శివకుమార్‌కు ఫోన్ చేసిన నేరగాడు వివరాలన్నీ చెప్పి ఖాతానంబర్ అడిగాడు. తన తల్లి మూసాపేటలో ఉంటుందని.. అక్కడ ఉండే ఆటో మెకానిక్ మురళి పేరు చెప్పి అతడికి ఫోన్ చేశాడు. ఎల్ఐసీ ఏజెంట్ డబ్బులు వేస్తాడు.. నీ బ్యాంకు ఖాతా వివరాలు అతడికి చెప్పమని కోరాడు. వెంటనే నేరగాడు మురళికి ఫోన్‌చేసి వివరాలు తీసుకుని మొదట అతడి ఖాతాలో ఉన్న రూ.7,700 కాజేశాడు. తర్వాత మురళి ఆత్మకూర్‌లో ఉండే తోడల్లుడు రాములుకు ఉదయం రూ.50 వేలు పంపడంతో దాన్ని గుర్తించి రాములు అకౌంట్‌కు వేస్తానంటూ అతడి నంబర్ తీసుకున్నాడు. రాములుకు ఫోన్‌చేసి గూగుల్ పే ద్వారా కొంత నగదు పంపినట్లుగా టైప్ చేయాలని కోరాడు. రాములు రూ.5000 టైప్ చేయగా వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి ఖాళీ అయ్యాయి. తర్వాత మిగిలిన రూ.45 వేలు కూడా కాజేశాడు. మొత్తంగా రాములుతో రూ.50 వేలు, మురళితో రూ.7,700 సైబర్ నేరగాడి పాలయ్యాయి. వెంటనే బాధితుడు మురళి మూసాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరంపై విచారణ చేయిస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. -
ఆ ఉపాధ్యాయుడు.. ఆదర్శప్రాయుడు
బైక్‌పై పిల్లలతో ఉపాధ్యాయుడు గాజుల వెంకటేశ్ సర్కారీ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్న చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు.. వారి పిల్లలను మాత్రం ప్రైవేట్‌లో చదివిస్తున్నారు. కానీ ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు గాజుల వెంకటేశ్ మాత్రం తన పిల్లలను తాను పనిచేసే పాఠశాలలోనే చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈయన నిత్యం తనతోపాటు ఇద్దరు పిల్లలను అచ్చంపేట నుంచి బైక్‌పై తీసుకొచ్చి ఇక్కడి చదివిస్తుండటంతో స్థానికుల్లో నమ్మకం ఏర్పడి తమ పిల్లలను కూడా అదే పాఠశాలకు పంపిస్తున్నారు. ఒకప్పుడు 20 మంది విద్యార్థులు కూడా లేని ఈ పాఠశాలలో ప్రస్తుతం 90 మంది ఉన్నారు. వెంకటేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ బోధిస్తుండటంతో ఐదేళ్లలో 49 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యారు. దాతల సాయంతో ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్ ఇతర పరికరాలు సమకూర్చుకొని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్తో పాటు కంప్యూటర్ బోధన అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పునాదులు వేస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేష్ కృషిని అందరూ అభినందిస్తున్నారు. – ఉప్పునుంతల తను పనిచేసే ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివిస్తున్న వెంకటేశ్ -
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో వచ్చేనెల 6వ తేదీన 23న జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే (అండర్–10, 12, 14 ఏళ్లలోపు బాలబాలికలు) జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఆదివారం జిల్లా కేంద్రం మెయిన్‌స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఉద యం 9 గంటలకు అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తామని, క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, తహశీల్దార్ ద్వారా కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని కోరారు. మొక్కజొన్న @ రూ.2,331 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో శనివారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,331, కనిష్టంగా రూ.1,731 ధరలు లభించాయి. వేరుశనగకు రూ.3,001, ధాన్యం హంస రూ.1,731, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,089, కనిష్టంగా రూ.1,869 ధరలు పలికాయి. మెప్మా కార్యక్రమాలకు సహకారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో శనివారం ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దీనిని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో మహిళా సంఘాల పాత్ర కీలకమన్నారు. ‘వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను విజయవంతం చేయాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు కార్పొరేషన్ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, దేవమ్మ, యాదయ్య, నిర్మల తదితరులు పాల్గొన్నారు. కాగా, మహిళా సంఘాల సభ్యులు సుమారు 20 మంది తాము తయారీ చేసిన వివిధ రకాల పచ్చళ్లు, తినుబండారాలు ప్రదర్శనగా ఉంచారు. స్వరాష్ట్రంలోనూ ప్రజల కష్టాలు తీరలేదు పాలమూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా వనరులను వినియోగించి ప్రజల కష్టాలు తీరుస్తారని భావించినా ఇప్పటికీ పూర్తి కాలేదని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవా చారి అన్నారు. ఉమ్మడి పాలమూరు సాగునీటి సమస్యపై జూలై 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సుకు సంబంధించిన పోస్టర్లను శనివారం జిల్లాకేంద్రంలోని టీఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదుల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నిర్మించి నీటితో నింపి సాగుకు యోగ్యమైన 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారని అనుకున్నా.. పూర్తిగా జరగలేదన్నారు. ఆర్డీఎస్, నెట్టెంపాడు, కల్వకుర్తి లిఫ్ట్‌లు అరకొర నీటిని అందిస్తున్నాయని తెలిపారు. జూరాల ఇన్నేళ్లయినా పూర్తిస్థాయిలో నీటిని అందించడం లేదని, దశాబ్దాలుగా పోరాడి సాధించిన పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి తరలించి డిండి, నల్లగొండ ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. ఇంకా పాలమూరు అభివృద్ధికి నోచుకోక కృత్రిమ కరువుతో పాటు నిత్యం వలసలు కొనసాగుతున్నాయని తెలిపారు. జూలై 5న నిర్వహించే రాష్ట్ర సదస్సుకు ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, నాయకులు అధిక సంఖ్యలో రావాలని కోరారు. కార్యక్రమంలో జక్కా గోపాల్, వెంకటేశ్వర్లు, తిమ్మప్ప, కేసీ వెంకటేశ్వర్లు, వెంకట్రాములు, వామన్ కుమార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బాక్సింగ్ పోటీలు ప్రారంభం
● వివిధ జిల్లాల నుంచి 500కు పైగా క్రీడాకారులు హాజరు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్‌లో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నారు. ఇలాంటి పోటీలు క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తాయని అన్నారు. మొదటిసారి కిక్‌బాక్సింగ్ పోటీలకు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి మోదీ ఖేలో ఇండియా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారానే గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులు రాణిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కిక్‌బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, కోశాధికారి శ్రీనివాస్, స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమా ర్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, సలహాదారులు ఎంఎన్.విజయ్‌కుమార్, జిల్లా యోగా సంఘం అధ్యక్షులు కె.రాములు, బీజేపీ నాయకులు పాండు రంగారెడ్డి, సీనియర్ విద్యార్థులు నిఖిల్, రోహిత్, యామిని, జయదీప్‌సింగ్, వర్షిణి పాల్గొన్నారు. -
సోమశిలకు సొబగులు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణా తీరంలోని సోమశిల సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్(సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్నెస్, స్పిరిచ్యూయల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ● కృష్ణాతీరంలోని సుందరప్రాంతాలు, నల్లమలలోపర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు ● సోమశిల, అమరగిరి, నార్లాపూర్ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్ జెట్టీల ఏర్పాటు ● జటప్రోలు, కొల్లాపూర్‌లోని పురాతన ఆలయాల అనుసంధానం ● హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం -
కలా్యణం.. కమనీయం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణం కనులపండువగా సాగింది. వేదమంత్రోచ్చరణ మధ్య పురోహితులు ఎంతో వైభవంగా వేడుకను నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సావాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఎంపీ డీకే అరుణ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సి.రాజేశ్వర్, నందకిషోర్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్‌కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్‌పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్‌కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పచ్చిరొట్ట.. ప్రయోజనాలెన్నో!
సాగువిధానం.. ప్రధానంగా వరిసాగు చేసే రైతులు దీన్ని సాగు చేసుకుంటారు. వరి నారుమడులకు ముందే పచ్చిరొట్టను సాగు చేసుకోవాలి. మే, జూన్నెలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ముందుగా దుక్కిని దున్ని విత్తనాలను చల్లుకోవాలి. జీలుగ విత్తనాలు ఎకరాకు 12కిలోలు, జనుము 15, పెసర 8, పల్లి పెసర 10, అలసంద 12 కిలోల విత్తనాలను చల్లుకోవాలి. అధిక దిగుబడులు వస్తాయి పచ్చిరొట్ట సాగుతో భూమి సారవంతంగా అవుతుంది. సాగుచేసిన పంటలకు సేంద్రియ ఎరువులతోపాటు నత్రజని అందిస్తుంది. పంటలు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగి అధిక దిగుబడులు వస్తాయి. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి తప్పనిసరిగా పచ్చిరొట్ట సాగును చేసుకోవాలి. – రాజేశ్ ఖన్నా, ఏఓ, చిన్నచింతకుంట చిన్నచింతకుంట: అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు పంటసాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతినడమే కాకుండ ఆహార పంటలు కలుషితమవుతున్నాయి. క్రమంగా పంటలో సూక్ష్మ స్థూల పోషకాలు లోపిస్తున్నాయి. అంతేకాక చీడపురుగుల ఉధృతి పెరుగడంతో రైతుకు పెట్టుబడుల భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. జీలుగ, జనుము, పెసర, పిల్లిపెసర, అలసంద వంటివి సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించుకోకుంటే భవిష్యత్‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా 16రకాలు పచ్చిరొట్ట సాగులో ప్రధానంగా 16రకాలు ఉండగా ఎక్కువగా రైతులు జీలుగ, జనుము, పెసర, పిల్లిపెసర వంటివి సాగు చేస్తారు. ఇది స్థూల సేంద్రియ ఎరువుగా తయారవుతోంది. ఇది నేలకు సేంద్రియ ఎరువుతోపాటు నత్రజనిని అందిస్తుంది. వీటిని మొగ్గ దశవరకు పెంచి భూమిలో కలియ దున్నుతారు. ఈ మొక్కలు లెగ్యుం జాతికి చెందినవి. వీటి ఏర్లలోని గుడిపెలు నత్రజనిని స్వీకరించి మళ్లీ సాగు చేసిన పంట మొక్కకు అందేలా తోడ్పడుతాయి. పచ్చరొట్ట పైర్లు పూత దశకు రావడానికి 40లేదా 50రోజుల సమయం పడుతుంది. ఇది కుళ్లే సమయంలో కొన్ని రకాల వాయువులు తయారవుతాయి. వాటి వల్ల నాటిన మొక్కకు హాని కల్గిస్తుంది. కాబట్టి పచ్చిరొట్ట కలియ దున్నిన రెండు వారాలకు మొక్కను నాటుకోవాలి. పచ్చిరొట్టతో లాభాలు పచ్చిరొట్ట ప్రధానంగా వరి పంటకు ముందస్తుగా సాగు చేసుకోవాలి. ఇది నేల సారవంతంగా తయారు చేస్తుంది. నేల భౌతిక స్థితిని మెరుగుపరిచి భూమిని గుల్లగా మారుస్తాయి. నేలలో నీరు ఇంకే గుణాని పెంచుతాయి. నేల కోతకు గురికాకుండా కాపాడుతాయి. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తాయి. జీవ రసాయనిక చర్యలతో నేలసారం పెరగడంతోపాటు పంటలు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్లతో మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది. పంటల నాణ్యత కూడా పెరుగుతుంది. చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడుతాయి. పంట మార్పిడికి సహాయపడుతాయి. పురుగులు, తెగుళ్ల బెడదను తగ్గించి సస్యరక్షణ ఖర్చును కూడా నియంత్రిస్తాయి. భూమి సారం, పంటలకు సంపూర్ణ ఆరోగ్యం సూక్ష్మజీవుల వృద్ధి, చీడపీడల నియంత్రణ అధిక దిగుబడి సాధించేందుకు అనుకూలం -
88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్
పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్‌లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 9, యూజీ కోర్సులలో టాపర్స్‌లో 17 మంది గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్‌మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఘనంగా నిర్వహిస్తాం.. పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్‌మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ ● -
టెన్త్ సప్లిమెంటరీలో 80 శాతం ఉత్తీర్ణత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 3వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,127 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 80.04 శాతంతో 902 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 583 మంది, బాలికలు 319 మంది ఉన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ చేయించాలకునే వారు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ అయితే ప్రతి పేపర్‌కు రూ.1,00 చొప్పున చెల్లించి... వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. 3న పీయూకు విద్యాకమిషన్ చైర్మన్ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి వచ్చేనెల 3వ తేదీన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రానున్నారు. ఈ సందర్భంగా పీయూలో విద్యారంగ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, యూనివర్సిటీల్లో సమస్యలు, సవాళ్లు తదితర వాటిపై ఆరా తీయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, హెచ్ఓడీలు, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తదితరులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. -
మెనూ ప్రకారం ఎందుకు ఇవ్వడం లేదు?
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘మెనూ ప్రకారం వైద్య విద్యార్థులకు భోజనం ఎందుకు వడ్డించడం లేదు? వంట గదిలోని వివిధ పరికరాలను వినియోగించుకోవడంలో ఇబ్బందులేమిటి?’ అంటూ మెడికల్ కళాశాలలో మెస్ నిర్వాహకులను కలెక్టర్ విజయేందిర బోయి, రాష్ట్ర మెడికల్ మానిటరింగ్ కమిటీ (ఎంఎంసీ) హెచ్ఓడీ వనం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం వీరు ఎదిర శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, స్థానిక జీజీహెచ్ ఆవరణలోని ఎంసీహెచ్, కొత్తబస్టాండుకు ఎదురుగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన సముదాయాలను తనిఖీ చేశారు. ముందుగా మెడికల్ కళాశాలలో అకాడమిక్–అమిషన్, లెక్చరర్ హాల్, విద్యార్థుల తరగతి గదులు, స్కిల్, హెమటాలజీ, క్లినికల్, పీజీ రీసెర్చ్ ల్యాబ్స్, సైకాలజీ విభాగం, డిసెక్షన్ హాల్–మ్యూజియం ఇలా అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భవన ప్రాంగణంలోని ఆయా అంతస్తుల కారిడార్‌లో పవర్ కేబుల్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈ ప్రాంతం నగరానికి శివారులో గుట్టల మధ్య ఉన్నందున వివిధ పక్షులు వచ్చి వాటిలో ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పవర్ కేబుల్ కనిపించకుండా వెంటనే సరి చేయాలని, ముఖ్యంగా హౌస్ కీపింగ్‌పై దృష్టి సారించాలన్నారు. అలాగే బాలురు, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంట గదుల్లో వెలుతురు సరిలేకపోవడంపై మండిపడ్డారు. అలాగే విలువైన కొన్ని పరికరాలను ఎందుకు ఉపయోగించడం లేదని అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనశాలలో తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. వైద్య విద్యార్థులకు కేవలం సాంబార్, టమాటా కర్రీ మాత్రమే వడ్డించడమేమిటని, ఇతర కూరగాయలు, ఆకుకూరలు ఎందుకు వండలేదని ప్రశ్నించారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ మెనూలో పేర్కొన్న విధంగా అన్ని రకాల ఐటమ్స్ తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. అంతకుముందు మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.రమేష్‌తో కలిసి ఆయా విభాగాల హెచ్ఓడీలతో 44 అంశాలపై సమీక్షించారు. కాగా, మౌలిక సదుపాయాలు కల్పించాలని, బోధన సిబ్బంది (ఫ్యాకల్టీ)ని నియమించాలని డైరెక్టర్ డా.రమేష్ విన్నవించారు. అనంతరం జీజీహెచ్ ఆవరణలోని మాతా శిశు సంరక్షణ విభాగం (ఎంసీహెచ్)లో లేబర్ రూం, చిన్నపిల్లల వార్డును, కొత్త బస్టాండు వద్ద అధునాతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో టీజీఎంఐడీసీ ఈఈ రవిచంద్ర, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శశికాంత్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకనుగుణంగా పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని ఎంఎంసీ హెచ్ఓడీ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి ఇక్కడి వైద్యాధికారులకు సూచించారు. ఇంకా ఏయే సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమో గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తేవాలన్నారు. ఆ మేరకు సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ఈనెల 30న ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. విద్యార్థులకు భోజనం వడ్డించేది ఇలాగేనా..! వంట గదిలోని పరికరాలకు వినియోగించాల్సిందే వెలుతురు సరిగా లేకపోవడంపై కలెక్టర్, రాష్ట్ర ఎంఎంసీ హెచ్ఓడీ అసంతృప్తి మెడికల్ కళాశాల భవనంలో పవర్ కేబుల్ ఏర్పాటులో లోపాలు -
బీఆర్ఎస్ నేతల మాటలు అర్థరహితం
నారాయణపేట: జూరాల డ్యాంపై బీఆర్ఎస్ నేతల మాటలు అర్థరహితమని.. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు గారికి నీళ్లు ఇవ్వాలనే జూరాల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారని అనడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమ, క్రీడాశాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం నుంచి నీరు వదిలితేనే జూరాలకు వస్తాయని.. ఇక్కడి నుంచి దిగువకు వదలడం మామూలేనని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని.. మోటారు ఆన్‌చేస్తే నీరు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోటరు ఆన్‌చేసి నీరు ఏ కాల్వలో వదలాలో చెప్పాలన్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే రాజకీయ జీవితానికి జీవం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని.. అధికారంలో లేకపోయినా అధికారం చెలాయించారని మంత్రి అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు లేనిపోని విమర్శలు చేస్తే సహించమన్నారు. బీఆర్ఎస్ పాలనలో సంగంబండ రిజర్వాయర్ వద్ద ఉన్న ఒక బండను పగులగొట్టేందుకు చేతకాలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే రూ. 12కోట్ల నిధులు తీసుకొచ్చి రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు రైతులకు పరిహారం అందించినట్లు తెలిపారు. దాదాపు 5,600 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమదేనని అన్నారు. జూరాల డ్యాం భద్రత, అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. బీఆర్ఎస్ నేతలు డేట్, టైం, ప్లేస్ డిసైడ్ చేయాలని మంత్రి సవాల్ విసిరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి, కోళ్ల వెంకటేశ్ తదితరులు ఉన్నారు. జూరాల డ్యాం భద్రత, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి వాకిటి శ్రీహరి -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్‌సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మతులు పూర్తయితేనే పూర్తిస్థాయి వినియోగం.. కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లూర్ పంప్‌హౌస్‌లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్‌లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్‌భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి జలకళ ఎగువన కర్ణాటక నుంచి కృష్ణానదిలో కొనసాగుతున్న వరద రిజర్వాయర్‌లో 125 టీఎంసీలకు చేరువైన నీరు ఈ సారి జూన్ నెలలోనే సగానికిపైగా నిండిన ప్రాజెక్టు కేఎల్ఐ కింద ఆయకట్టుకు సీజన్ ముందు నుంచే నీటి సరఫరాకు అవకాశం -
ఏసీబీ అధికారుల హల్చల్
అచ్చంపేట: స్థానిక బీసీ ప్రభుత్వ వసతిగృహాన్ని శుక్రవారం మహబూబ్‌నగర్ రేంజ్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆహార భద్రత, ఆరోగ్య, తూనికలు కొలతలు, విద్యుత్ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 7 వరకు హాస్టల్‌కు చేరుకున్న అధికారులు వార్డెన్ జనార్దన్ లేకపోవడంతో 10 గంటల వరకు నిరీక్షించారు. వార్డెన్, పదోన్నతిపై వెళ్లిన వార్డెన్ శ్రీరామ్ వచ్చిన అనంతరం ఆయా శాఖల అధికారులు కార్యాలయంలోని 18 రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూ, అరటి పండ్లు, సబ్బులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పలువురు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు, భవనం పరిస్థితిని చూశారు. ఏసీబీ తనిఖీల సమాచారం క్షణాల్లో ప్రచారం కావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఏ కార్యాలయంపై దాడులు చేస్తారన్న భయంతో వణికిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తమై భయం, భయంగా విధులు నిర్వర్తించారు. ఈ నెల 25న కల్వకుర్తి ఎస్ఐ–2 ఎం.రాంచందర్‌జీ ఏసీబీకి పట్టుబడటం, మూడు రోజుల వ్యవధిలోనే అచ్చంపేటలో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి నివేదిస్తాం.. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వసతిగృహాల్లో ప్రభుత్వం ప్రకటించిన మెనూ అమలు, ఇతర సౌకర్యాలు పరిశీలించేందుకే తనిఖీలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. హాస్టల్లో విద్యార్థుల నమోదు, ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య వివరాలను పరిశీలించినట్లు చెప్పారు. లోకల్, నాన్ లోకల్ విద్యార్థుల వివరాలు, హాస్టల్ భవనం పరిస్థితి, సౌకర్యాలు పరిశీలించామన్నారు. హాస్టల్ పరిసరాల పరిశుభ్రత, ఇతర సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ప్రతి హాస్టల్లో 18 రకాల రికార్డులను నిర్వహిస్తారని.. వాటి ఆధారంగా గుర్తించిన అంశాలను సరి పోల్చుకొని పూర్తి వివరాల నివేదికను ఏసీబీ డీజీకి అందజేస్తామని చెప్పారు. డిటేల్ రిపోర్టు ప్రభుత్వానికి పంపించిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్ చేస్తారన్నారు. తనిఖీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమా, తూనికలు, కొలతల అధికారి ప్రవీణ్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ వజ్రకుమార్‌రెడ్డి, ఏసీబీ సీఐలు ఎస్కేఏ జిలానీ, పి.లింగస్వామి, ట్రాన్స్‌కో ఏఈ రామకృష్ణ, వార్డెన్లు శ్రీరామ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట బీసీ హాస్టల్లో రికార్డులు, పరిసరాల పరిశీలన ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తామన్న డీఎస్పీ -
భారీగా మట్టి డంప్
జడ్చర్ల: వుండలంలోని పోలేపల్లి సెజ్ శివారులో భారీగా నిల్వచేసిన మట్టిని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వంద టిప్పర్ల మట్టిని రహస్యంగా రాజాపూర్ మండలంలోని వాగు నుంచి ఇక్కడికి తరలించినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ మట్టిని ఫిల్టర్‌చేసి ఇసుక తయారు చేసేందుకు వినియోగిస్తారని తెలిపారు.స్థానిక సీఐ కమలాకర్ మట్టి డంప్‌ను పరిశీలించి.. స్థానిక తహసీల్దార్ నర్సింగరావుకు సమాచారం ఇచ్చారు. మట్టి డంప్‌ను వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తామని తహసీల్దార్ తెలిపారు. కాగా, ఇక్కడికి మట్టి తరలించిన వారే తక్కువ ధరకు ఇసుకను వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
కేఎల్ఐ కాల్వలో జమ్ముతో ఇబ్బందులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని కేఎల్ఐ కాల్వలో జమ్ము ఏపుగా పెరగడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి డీ–38 కాల్వ జొన్నలబొగుడ, సాతాపూర్, కొత్తపేట, చెన్నపురావుపల్లి, గంట్రావుపల్లి, కల్వకోలుకు సాగునీరు అందించే కాల్వలో జమ్ము ఏపుగా పెరిగి కాల్వలో నీరు నిల్వ ఉండి రైతుల పొలాలపై పారుతున్నాయి. వేసవిలో ఈ కాల్వలో సాగునీరు వదలడంతో ఉపాధి హామీ పథకంలో ఈ కాల్వలను శుభ్రం చేయలేదు. మిగతా కాల్వలను ఉపాధి హామీ సిబ్బంది జమ్ము తొలగించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకొని కాల్వలో పేరుకుపోయిన జమ్మును జేసీబీల ద్వారా తొలగించాలని రైతులు పరశురాము, వీరయ్య కోరారు. 90 ట్రాక్టర్ల ఇసుక మాయం బిజినేపల్లి : మండలంలోని మమ్మాయిపల్లిలో ఫిబ్రవరిలో 90 ట్రాక్టర్ల ఇసుకను గత తహసీల్దారు శ్రీరాములు సీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఇసుక కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుతున్నారు. మండలంలో ప్రస్తుతం ఇసుక లేదని, ఉంటే అనుమతులు ఇచ్చేవాళ్లని అధికారులు చెప్పుకొచ్చారు. మమ్మాయిపల్లిలో సీజ్చేసిన 90 ట్రాక్టర్ల ఇసుక ఉండి ఉంటే స్థానిక గ్రామాల లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పేవని అంటున్నారు. ఈ విషయమై తహసీల్దారు ఎండీ మున్నీరుద్దిన్ వివరణ కోరగా.. సీజ్ చేసిన ఇసుకను పోలీస్‌శాఖకు అప్పగించామని, తమకేమీ సంబంధం లేదన్నారు. -
రిజర్వాయర్ పనుల్లో జాప్యమెందుకు?
వెల్దండ: పూర్వపు మండలంలోని ఎర్రవల్లి, గోకారం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ పనుల్లో జాప్యమెందుకు జరుగుతోందని రాష్ట్ర భూ నిర్వాసితుల పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్‌ను సందర్శించి అధికారులతో మాట్లాడి భూములు కోల్పోతున్న రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు అందిన పరిహారం, బకాయిల వివరాలు అధికారులు కమిషనర్‌కు వివరించారు. పనుల్లో వేగం పెంచాలని.. బకాయి పరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు. వెంటనే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, నీటిపారుదలశాఖ ఈఈ కుమార్, వెల్దండ, చారగొండ తహసీల్దార్లు కార్తీక్‌కుమార్, సునీత, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, కాంట్రాక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
పనిచేయించుకున్నారు.. పోస్టు లేదు పోమ్మన్నారు!
గండేడ్: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రారంభం నుంచి ఓ మహిళతో పనిచేయించుకున్నారు. తీరా ఐదు నెలలు గడిచిన తర్వాత పోస్టు లేదు.. వెళ్లి పొమ్మన్నారు. జీతం అడిగితే తమకు తెలియదంటూ దాటవేస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మబాద్కు చెందిన శశికళ గత జనవరిలో గండేడ్‌లో కొత్తగా ఏర్పాటైన కేజీబీవీలో వంటమనిషిగా చేరారు. అప్పట్లో ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు వర్కర్లను నియమించారు. అయితే అప్పటి నుంచి శశికళ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ వంట చేసేది. ఈ క్రమంలోనే వేసవి సెలవులు వచ్చాయి. విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయినా వర్కర్లు పాఠశాలకు రెగ్యులర్‌గా రావాలని చెప్పడంతో మిగతా వారితో పాటు శశికళ నిత్యం మహమ్మదాబాద్ నుంచి విధులకు హాజరయ్యేది. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత కూడా యథావిధిగా విధులకు హాజరై విద్యార్థులకు వంటావార్పు చేస్తూ వచ్చింది. అయితే ఈ నెల 17 తర్వాత ఎస్ఓ శివలీల వర్కర్ల జాబితాలో నీ పేరు లేదు.. రావొద్దని శశికళకు చెప్పడంతో ఖంగుతింది. ఇన్ని రోజులు పనిచేయించుకొని ఇలా చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించగా.. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని.. మీరు రావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే తాను పనిచేసిన ఐదు నెలల జీతమైనా ఇవ్వాలని అడిగితే తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. బయట పనిచేసుకున్నా కనీసం ఇల్లు గడిచేదని వాపోయారు. ఈ విషయమై శశికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓను విచారణకు ఆదేశించారు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. న్యాయం చేయాలంటూ కేజీబీవీ వంటమనిషి వేడుకోలు కనీసం పనిచేసిన ఐదు నెలల జీతం ఇవ్వాలని మొర -
బైక్ టైర్లో చీర చిక్కుకొని మహిళ మృతి
కల్వకుర్తి రూరల్: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ.. ఐదు నిమిషాల్లో పట్టణంలోని ఇంటికి చేరుకునేవారు.. అంతలోనే చీరకొంగు బైక్ టైర్లో ఇరుక్కోవడంతో జరిగిన ప్రమాదంలో శ్రుతి(24) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. మండలంలోని తోటపల్లికి చెందిన శృతి తిమ్మరాశిపల్లికి చెందిన రవితో నాలుగేళ్ల కిందట ప్రేమవివాహం చేసుకున్నది. ఇద్దరు కుమారులు. గురువారం కొల్లాపూర్‌లోని బంధువుల ఇంట్లో నిర్వహించిన దినవారాలకు వెళ్లారు. సాయంత్రం కల్వకుర్తికి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణ సమీపంలోని గ్రీన్‌పార్క్ కాలనీ వద్ద బైక్ వెనకాల కూర్చున్న శృతి చీరకొంగు టైర్లో ఇరుక్కుపోయింది. దీంతో కింద పడిపోవడంతో తల వెనుక భాగంలో బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటూ.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచింది. బైక్‌పై ఉన్న భర్త రవి, పిల్లలకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. రోడ్డుప్రమాదంలోమహిళ దుర్మరణంవెల్దండ: మండల కేంద్ర సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై యెన్నమ్స్ ఆస్పత్రి వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. ఎస్ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదం గుర్తు తెలియని మహిళ మృతిచెందినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలించగా మృతి చెందిన మహిళ దాదాపుగా (38) ఏళ్ల వయస్సు కల్గి ఉంటుంది. ఆకుపచ్చ జాకెట్, పసుపు రంగులో చీర ధరించి ఉంది. మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వెల్దండ పోలీస్‌స్టేషన్ సమాచారం అందించాలని పేర్కొన్నారు. యువతి అదృశ్యం:కేసు నమోదు మద్దూరు: మద్దూరు మున్సిపల్ పరిధిలోని నాగంపల్లికి చెందిన అఖిల (18) గురువారం నుంచి అదృశ్యమైనట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. దౌల్తాబాద్ మండలం మొగులమ డ్కలోని అమ్మమ్మకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. ఈ క్ర మంలో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి మరికల్: బైక్‌పై నుంచి పడి యువకుడు మృతిచెందిన ఘటన మరికల్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాము వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పెద్దకాబ్నూర్ మండలం ఉలికంది గ్రామానికి చెందిన మస్కి తిమ్మయ్య (36) బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మరికల్ సమీపానికి రాగానే బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘రాచాల’ వాహనంపై దాడి
కొత్తకోట రూరల్: బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ కథనం మేరకు.. యుగంధర్‌గౌడ్ వనపర్తి నుంచి స్వగ్రామం కొత్తకోట మండలం వడ్డెవాటకు తన కారులో వెళ్తుండగా గ్రామ సమీపంలోని భీమా ఫేస్–2 కాల్వ సమీపంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చిన వాహనాన్ని అడ్డగించారు. కారు డ్రైవర్ రాజు చాకచక్యంగా వ్యవహరించడంతో దుండగులు అద్దాలు ధ్వంసం చేసి పారిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి తనకు రక్షణ కల్పించాలని యుగంధర్‌గౌడ్ కోరారు. విద్యుత్ షాక్‌తో ఆవు మృతి కల్వకుర్తి రోడ్డు: మండలంలోని కురుమిద్దలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి పాడిఆవు మృతిచెందింది. గ్రామానికి చెందిన కాలె మల్లయ్యకు చెందిన ఆవు వ్యవసాయ పొలంలో మేత మేస్తున్న క్రమంలో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగ తగిలి అక్కడిక్కడే చనిపోయింది. దాదాపు రూ 1,20,000 నష్టం వాటిళ్లిందని, తనను ఆదుకోవాలని రైతు మల్లయ్య కోరారు. -
ఒడిశా టు పాలమూరు.. గంజాయి సరఫరా
మహబూబ్‌నగర్ క్రైం: ఒడిశా నుంచి పాలమూరుకు గంజాయి సరఫరా అవుతోంది. శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఎకై ్సజ్ పోలీసుల వివరాల మేరకు.. ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మయూరీ పార్క్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సంతోష్‌కుమార్‌గౌడ్, రూడావత్ రవికాంత్ అనే ఇద్దరు యువకులు వంద గ్రాముల ఎండు గంజాయితో బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నారు. అయితే సదరు యువకులను పోలీసులు విచారించగా.. నక్కలబండ ప్రాంతంలో ఒడిశాకు చెందిన చందన్ మహాంత అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో నక్కలబండ ప్రాంతానికి ఎకై ్సజ్ పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా.. సదరు వ్యక్తి వద్ద మరో 300 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. నక్కలబండ వద్ద చేపట్టిన టన్నెల్ నిర్మాణంలో చందన్ మహాంత రోజు కూలీగా పని చేయడంతో పాటు ఒడిశా నుంచి ఎండు గంజాయి తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తుల ద్వారా జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. 400 గ్రాముల ఎండు గంజాయి సీజ్ -
రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్‌గా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ.వెంకటేశ్ అన్నారు. నిజామాబాద్‌లో నేటి (శనివారం) నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు శుక్రవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఎన్పీ వెంకటేశ్ అభినందించారు. ఫుట్‌బాల్‌లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నత స్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, సభ్యులు నందకిషోర్, సూర్యప్రకాశ్, రాజేందర్, ఖేలో ఇండియా మహబూబ్‌నగర్ ఫుట్‌బాల్ కోచ్ నికేష్ పాల్గొన్నారు. జిల్లా జూనియర్ ఫుట్‌బాల్ జట్టు: కల్మూరి వంశీకృష్ణ, కొండపల్లి అభిరాం, కొండపల్లి సాయితేజ, జి.వంశీకృష్ణ, జర్పలావత్ ధ్యానవర్ధన్ నాయక్, మహ్మద్ అమాన్, జె.శివ, ఎం.రాఘవేందర్, బండి నవతేజ్, ఎండీ సుబాన్, ఎల్.కృపదాస్, కాట్రావత్ చరణ్, మహ్మద్ మజైన్ సదిమ్, మహ్మద్ ఖాజామైనద్దీన్, ఎం.చరణ్, మహ్మద్ అబ్దుల్ మతిన్, ఎండీ అబ్రార్ షరీఫ్, అనస్ తార. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్ నిజామాబాద్ తరలిన బాలుర ఫుట్‌బాల్ జట్టు -
యోగా సాధనతో ఒత్తిడి దూరం
ధన్వాడ: యోగా సాధనతో ఒత్తిడి దూరమవుతుందని డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ అన్నారు. గురువారం రాత్రి కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ఆయన శుక్రవారం తెల్లవారు జామున విద్యార్థులకు యోగా ఆసనాలపై అవగాహన కల్పించారు. స్వయంగా ఆయన వివిధ ఆసనాలను ప్రదర్శించారు. యోగా ప్రాధాన్యత, పౌష్టికాహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజారాంతో కలిపి ఔషధ మొక్కలను నాటారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రైమర్ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని త్వరగా వైద్యాశాఖకు అప్పజెప్పలని కాంట్రాక్టర్‌కు సూచించారు. -
నేడు, రేపు రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి గార్డెన్స్‌లో శని, ఆదివారం రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమార్ తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల నుంచి 600 మందిక పైగా బాక్సర్లు, 36 మంది రెఫరీలు హాజరవుతారని పేర్కొన్నారు. నాలుగు సింథటిక్ తతామిల్లో (కోర్టులు) బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. 4 నుంచి 40 ఏళ్ల లోపు వారికి వెయిట్ కేటగిరీల ప్రకారం పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజేతగా నిలిచిన బాక్సర్లకు బంగారు పతకాలు ఇవ్వడంతో పాటు త్వరలో జరగనున్న జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలకు ఎంపికవుతారని చెప్పారు. పోటీల్లో పాల్గొనే బాలురకు క్రీస్తూ జ్యోతి హైస్కూల్, ఫాతిమా ఉన్నత పాఠశాలల్లో బాలికలకు మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పోటీలు జరిగే ప్రదేశంలో భోజన వసతి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 29న పోటీల ముగింపు కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. హాజరుకానున్న 600కు పైగా విద్యార్థులు -
‘ఎమర్జెన్సీ’తో ప్రజాస్వామ్య హక్కులకు భంగం
వనపర్తి టౌన్: ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి వరకు సుమారు 21 నెలల పాటు విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైన రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్, అనంతప్ప, లక్ష్మణ్‌ను ఆయన సన్మానించి అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఏటా జూన్ 25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం (యాంటీ ఎమర్జెన్సీ డే) జరుపుకొంటామని, ఆ సమయంలో ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను జైలు పాలు చేయడంతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు విధించిందని, పత్రికలపై ముందస్తు సెన్సార్షిప్ ప్రవేశపెట్టారని, ఏ వార్తనైనా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి ఉండిందని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్తో సహా అనేక సంస్థలను నిషేధించారని.. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ పెత్తనం నడిచిందని, నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయని, రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలు నాటి, ప్రతి నాయకుడు ఒక మొక్క నాటాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర మహిళా జాయింట్ ట్రెజరర్ జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు, బండారు కుమారస్వామి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, సుమిత్రమ్మ, చిత్తారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల చరిత్రలోనే మొదటిసారి
తెలంగాణలోని కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టుపై నిర్మించిన ఎగువ, దిగువజూరాల జలవిద్యుత్ ప్రాజెక్టుల చరిత్రలో మొదటిసారి మే 30న ఉత్పత్తి ప్రారంభించి జూన్ 27 నాటికి 140 ఎంయూ ఉత్పత్తి సాధించాం. సిబ్బంది సహకారంతో 610 ఎంయూ టార్గెట్‌కు మించి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎగువలో మూడో యూనిట్లో నెలకొన్న సాంకేతిక సమస్య వారంలోగా తీరనుంది. గతేడాది ఆశించిన స్థాయిలో వరదనీరు చేరడంతో లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి చేపట్టాం. – శ్రీధర్, ఎస్ఈ, జెన్కో, జూరాల ● -
క్రషర్ ప్లాంట్ వద్ద హైడ్రామా
● ఆంజనేయులు మృతదేహంతో ఆందోళన ● పరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో సద్దుమణిగిన గొడవ గట్టు: మండలంలోని సల్కాపురం, జోకన్‌గట్టు గ్రామాల సమీపంలోని క్రషర్ ప్లాంట్ వద్ద గురువారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. తారాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు (63) క్రషర్ ప్లాంట్ వద్ద మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబ సభ్యులు క్రషర్ ప్లాంట్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండా ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జోకన్‌గట్టు, తారాపురం, గట్టు, సల్కాలపురం గ్రామాలకు చెందిన వారు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ఒకానొక దశలో క్రషర్ ప్లాంట్ నిర్వాహకులు పరిహారం చెల్లించేందుకు నిరాకరించడంతో ఆందోళనకారులు క్రషర్ ప్లాంట్పైకి రాళ్లు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు బాధిత కుటుంబ సభ్యులకు క్రషర్ ప్లాంట్ నిర్వాహకులు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఆంజనేయులు మృతి ఘటనపై అతడి కుమారుడు గుడిసె చిన్న వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. చపాతి గొంతులో ఇరుక్కోవడంతో మృతిచెందినట్లు పోస్టుమార్టం అనంతరం వైద్యులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. -
తేజేశ్వర్‌ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి
గద్వాలటౌన్: సర్వేయర్ తేజేశ్వర్‌ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్ ఫోరం, వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక స్మృతివనంలో తేజేశ్వర్ చిత్రపటానికి నివాళులర్పించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. మాధవి, అరుణ, రాములు, కుర్వ పల్లయ్య, సలాం, తేజేశ్వర్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, తేజవర్ధన్, రమాదేవి, మహేందర్ పాల్గొన్నారు. -
జూరాలకు జలసిరి
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో ఇన్‌ఫ్లో మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం ప్రాజెక్టుకు 98వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో లక్షా 5వేల క్యూసెక్కులకు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 12క్రస్టు గేట్లను ఎత్తి 85, 268 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27,532 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,14,469 క్యూసెక్కులను దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. వేగవంతంగా విద్యుదుత్పత్తి దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈమేరకు శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 64.680 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 74.613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 139.293 ఎంయూ విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 28 వేల క్యూసెక్కులను వినియోగించి విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని, దిగువన శ్రీశైలంకు నీటిని వదులుతున్నామని తెలిపారు. శ్రీశైలంకు 1,08,325 క్యూసెక్కులు దోమలపెంట: జూరాల స్పిల్‌వే, విద్యుదుత్పత్తి చేస్తూ మొత్తం 1,08,325 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ జలాశయంకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 865.7 అడుగుల నీటిమట్టం, 125.1322 టిఎంసీల నీటి నిల్వ ఉంది. 24గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 1,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద 12 క్రస్టు గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న వరద నీరు లక్షా5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత కొనసాగుతున్న విద్యుదుత్పత్తి దిగువకు 1,14,469 క్యూసెక్కులు -
బాధితులకు భరోసాగా నిలవాలి : ఎస్పీ
మిడ్జిల్: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి పోలీసు సిబ్బందికి సూఇచంచారు. శుక్రవారం మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారించి.. శిక్షల శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ అమలు తీరు, పైళ్ల నిర్వహణ పద్ధతులపై దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్ ఉన్నారు. -
పింఛన్ దరఖాస్తులు పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో 487 చేయూత పింఛన్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని.. వారంలోగా పరిష్కరించాలని గ్రామీణాభివృద్ధిశాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాలరావు, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ దరఖాస్తులు ఎలా పరిష్కరించాలి.. లోటు పాట్లపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పుర కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 73 వేల మందికి ప్రతి నెల రూ.17 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో సరైన నియంత్రణ లేక లబ్ధిదారు చనిపోయిన తర్వాత కూడా పింఛన్ చెల్లిస్తున్నారని.. ఎవరైనా లబ్ధిదారు చనిపోతే వారి స్థానంలో భార్య లేదా భర్త దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చనిపోయిన వారివి తొలగించి కొత్త వారికి వారం రోజుల్లో అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకునే అవసరం లేదని.. వివరాలు తెలుసుకొని అందజేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, పుర కమిషనర్లపై ఉందన్నారు. నిబంధనలు తెలియక కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోలేదని పెండింగ్‌లో ఉంచడం సరికాదని.. మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చేటప్పుడే ఫారం–7 పూరించి ఓటరు జాబితా నుంచి మరణించిన వ్యక్తి పేరు తొలగించాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబంలో కుటుంబ పోషకుడు చనిపోతే రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తారని.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొన్నారు. -
పురుడు పోసుకున్న అరుదైన సర్పం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య పరిశోధన విద్యకేంద్రంలో గురువారం రాబ్డోఫీస్ ప్లంబికలర్ అనే అరుదైన విషపు రహిత సర్పం పురుడు పోసుకున్నట్లు బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. ఏప్రిల్ 30న మహబూబ్‌నగర్ వీరన్నపేటలోని ఒక ఇంట్లో పాము రాగా స్థానికుడు లోకేష్ చంపకుండా పట్టుకొని తమకు అప్పగించారని.. అదేరోజు రాత్రి 9 గుడ్లు పెట్టిందని వివరించారు. ఆ గుడ్లను బయో డైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లో పొదగగా 6 పిల్లలు బయటకు వచ్చాయని.. సాధారణంగా ఈ పాములు ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే గుడ్లను పొదుగుతాయని, వాతావరణ మార్పులతో జూన్‌లోనే పొదిగిందన్నారు. పాము పిల్లల మెడలపై బాణం ఆకారంలో పసుపురంగు గుర్తులు.. కంటి నుంచి నోటి వరకు నలుపు రంగు చారలు ఉన్నాయని వివరించారు. రీసెర్చ్ సెంటర్లో ఉన్న అరకొర వసతుల నడుమ ఇప్పటికే పలుమార్లు పాములు పిల్లల్ని పొదగడం అనేక పరిశోధన కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పాము పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు చెప్పారు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్‌లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్‌గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్‌లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీల మయం.. -
అంగన్వాడీలో భోజనం బాగోలేదు
గండేడ్: ‘భోజనం బాగోలేదు.. గుడ్డు పెట్ట లేదు.. కనీసం పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోపోతే ఎలా?’ అంటూ కలెక్టర్ విజయేందిర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె గండేడ్ మండలం సల్కర్‌పేట అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చిన్నారులకు అందించే పోషకాహారం, మెనూ గురించి ఆరా తీశారు. మెనూ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 1, 2, 3 తరగతి గదుల్లో బోధనను పరిశీలించారు. మూడో తరగతిలో ఉపాధ్యాయులు గణితం బోధిస్తుండగా విద్యార్థుల వద్దకు వెళ్లి కూడికలపై ప్రశ్నలు వేశారు. ఒకటో తరగతి విద్యార్థులతో అక్షర మాల చదివించారు. ప్రాథమిక భావనలు, కొత్త పదాలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉన్నత పాఠశాలలోకి వెళ్లి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. భోజనం నాసిరకంగా ఉందని, చారు నీళ్లలాగా పెడితే విద్యార్థులు ఎలా తింటారని ఏజెన్సీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయి, పరిహారం అందని రంగారెడ్డిపల్లి, సల్కర్‌పేట్ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూమి ఎక్కువ ఉంటే పరిహారం తక్కువ వచ్చినట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతోపాటు పరిహారం మొత్తాన్ని కూడా పెంచాల ని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు అన్ని విషయాలు పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జునరావు, ఆర్ఐ యాసిన్, జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా? నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ విజయేందిర బోయి -
పనిలో నైపుణ్యం సాధించాలి: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో నైపుణ్యం సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఆర్పీలు, ఎస్‌హెచ్‌జీలకు కొన్ని రోజులుగా ‘నవరత్నాలు’ ఆధ్వర్యంలో సెట్విన్ సహకారంతో ఉచిత కంప్యూటర్ శిక్షణనిస్తున్నారు. గురువారం వారికి ఎమ్మెల్యే స్టడీ మెటీయల్ అందజేసి మాట్లాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల నిర్వహణ కంప్యూటరీకరించనున్నారని, ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన అప్రెంటిస్‌షిప్–జాబ్‌మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు పవన్, పావనిలను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు చేపట్టే ఇంటర్వ్యూలలో ఎక్కువ మంది విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జి.అరుణ కోసం రూ.50 వేలు, తస్లింబేగం కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీలు ఆయా కుటుంబసభ్యులకు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రీ, ఖాజాపాషా, బొట్టు శ్రీను, రాష్ట్ర పరిశీలకులు నండూరి శ్రీనివాస్, మహబూబ్‌నగర్ ఫస్ట్–నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్, సెట్విన్ కో–ఆర్డినేటర్ విజయ్‌కుమార్, ఫ్యాకల్టీ రోజారాణి, కళాశాల ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు , తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ధరూరు/ఆత్మకూరు/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 7 గంటలకు 98 వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ద్వారా 73,998 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని ఎగువ, దిగువ 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం 27,461 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు.. ప్రాజెక్టు నుంచి మొత్తం 1,03,307 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.389 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా.. ఎగువ విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 61.621 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 70.393 ఎంయూ, మొత్తం 132.014 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ● జూరాల స్పిల్ వే, విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 1,01,459 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 863.1 అడుగుల నీటిమట్టంతో 115.7856 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 1,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 19 అడుగులకు కేఎస్పీ నీటిమట్టం దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిమట్టం గురువారం సాయంత్రం వరకు 19 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు అలుగు స్థాయి 26.6 అడుగులు. అయితే ఈ నెల 1వ తేదీన 11 అడుగులుగా ఉండగా.. 26 రోజుల్లో 8 అడుగుల మేర పెరిగింది. జూరాలకు ఇన్‌ఫ్లో ప్రారంభం అయిన తరువాత కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉంద్యాల ఫేస్ వన్ నుంచి ఒక పంపును రన్చేసి నీటిని విడుదల చేశారు. ఈనెల 6 వ తేదిన తీలేరు వద్ద ఉన్న ఫేస్ టు పంప్‌హౌస్ నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని కోయిల్‌సాగర్‌కు వదిలారు. ఒక పంపు ద్వారా 315 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 98 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత శ్రీశైలం ప్రాజెక్టులకు లక్ష క్యూసెక్కుల వరద -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం.సునీతారావు విమర్శించారు. జిల్లాకేంద్రంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం జైబాపు జైభీమ్ జైసంవిధాన్ కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ చౌరస్తా వరకు చేరుకొని సిలిండర్లను ప్రదర్శించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సామాన్యుడి నడ్డివిరిచే విధంగా సిలిండర్ ధర 50 రూపాయలు పెంచారని విమర్శించారు. చీరలు, చిన్నారులు ఉపయోగించే పెన్సిళ్లు, పాలపై కూడా కేంద్రం జీఎస్టీ విధిస్తోందని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, జిల్లా ఇన్చార్జీలు సుకన్య, వెంకటసుబ్బమ్మ, అరుణ, జిల్లాలోని పట్టణ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. అనంతరం స్థానిక మోనప్పగుట్టలో సునీతారావు, తదితరులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యంతో భోజనం చేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం.సునీతారావు జిల్లాకేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా -
రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నల్లమల బిడ్డ
కందనూలు: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా అచ్చంపేట నియోజకవర్గం పదర గ్రామానికి చెందిన నందిని ఎంపికై నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి జూలై 1వ తేదీ వరకు హరిద్వార్‌లో నిర్వహించే అండర్–18 జాతీయస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారిణి నందిని తెలంగాణ జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడంపై డీవైఎస్ఓ సీతారాం తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ కబడ్డీ పోటీలకు అరవింద్ మహబూబ్‌నగర్ క్రీడలు: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు జరగనున్న మొదటి జాతీయస్థాయి అండర్–18 కబడ్డీ టోర్నమెంట్ జిల్లా లోని బాలానగర్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన అరవింద్ ఎంపికయ్యాడు. తొలిసారిగా జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. అరవింద్ ఎంపికపై జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.శాంతికుమార్, కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు దామోదర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు.. వనపర్తి టౌన్: హైదరాబాద్‌లోని కాసాని వీరేశం అకాడమీ క్యాంపులో శిక్షణ పొందుతున్న పిల్లిగుండ్ల తండాకు చెందిన అనూషతో పాటు మూలమల్ల గ్రామానికి చెందిన అంజి జాతీయస్థాయి కబడ్డీ జట్లుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని వనపర్తి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
‘రుణాలే తీసుకోలే.. ఎలా చెల్లిస్తాం’
మహమ్మదాబాద్: ‘రుణాలే తీసుకోలే.. ఎలా చెల్లిస్తాం’ అని మహిళా సంఘాల సభ్యులు డీఆర్డీఓ, బ్యాంక్ అధికారులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. మండలంలోని మహి ళా సమాఖ్య సంఘాల నుంచి రుణాల రికవరీ లేకపోవడంతో గురువారం మహమ్మదాబాద్ మహిళా సమాఖ్య కార్యాలయంలో డీఆర్డీఓ ఏపీడీ శారద, ఏపీఎం సునీత, మహమ్మదాబాద్ ఎస్బీహెచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లు కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో వీఏఓలను, సీసీలు, ఇతర మహిళా సంఘాల సభ్యులను పిలిపించి మాట్లాడారు. రుణాలు ఎందుకు చెల్లించడం లేదని సభ్యులను ప్రశ్నించారు. సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ తాము తీసుకోని రుణాలను ఎందుకు చెల్లిస్తామని ప్రశ్నించారు. కొందరు వీఏఓలు తమకు తెలియకుండా రుణాలు తీసుకున్నట్లు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే నెల వరకు పూర్తిస్థాయిలో రికవరీ చేయాలని, అక్రమాలు బయటపడితే చర్యలు తీసుకుంటామని, అందుకు బాధ్యులయిన వారిని తొలగిస్తామని ఏపీడీ శారద హెచ్చరించారు. -
ప్రాజెక్టుల నిర్వహణపై అవగాహన లేని ప్రభుత్వం
అమరచింత: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మాజీ మంత్రి ఆవంచ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్లును పరిశీలించి మాట్లాడారు. 4, 31వ గేట్ల రోప్‌లు రెండు వైపులా తెగిపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురిసి జలాశయానికి వస్తున్న వరదను దిగువకు వదిలే పరిస్థితులు లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. వేసవిలోనే ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, గ్రీస్ పూయడం, రోప్‌లు సరిచేయడం వంటి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రాజెక్టులు సందర్శించి అధికారులతో పనులు చేయించే సత్తా గత ప్రభుత్వానికే ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణలపై ఏ మాత్రం అవగాహన లేదని.. అందుకే ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు. వరద నీటిని ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన సైతం లేదన్నారు. జూరాల మరమ్మతులో జరిగే అలసత్వంపై నీటిపారుదలశాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యమేలా..?
మహబూబ్నగర్శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్‌లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్‌లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్‌గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్‌గేట్లకు ఉన్న ఇనుప రోప్‌లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
భూమి అక్రమంగా విరాసత్ చేశారని..
ఉండవెల్లి: ‘‘మా చిన్నాన్నను చిన్నమ్మ వదిలిపెట్టి వెళ్తే నేనే సేవచేశా.. అందుకు ఆయన కృతజ్ఞతగా తన పేరుపై ఉన్న భూమిని నాకు రాసిచ్చారు.. ఆ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. తీరా రెవెన్యూ కార్యాలయంలో మా చిన్నమ్మ పేరుపై అక్రమంగా విరాసత్ చేశారు.. నాకు చేయండి.’’ అంటూ ఓ మహిళ ఉండవెల్లి తహసీ ల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొ ని ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథ నం మేరకు.. ఉండవెల్లికి చెందిన మదర్సాబ్కు కంచుపాడు గ్రామ శివారులో 1.38 ఎకరాల ఇనా మ్ భూమి ఉంది. అతడిని భార్య ఖాజాబి కొన్నేళ్ల క్రితం వదిలిపెట్టి వెళ్లిపోయింది. వారికి సంతానం లేకపోవడంతో వృద్ధాప్యంలో మదర్సాబ్ బాగోగులను అతడి అన్న కూతుళ్లు రిజ్వాన, రిహానా చూశారు. అందుకు ప్రతిఫలంగా మదర్సాబ్ తన పేరుపై ఉన్న భూమిని వారికి రాసిచ్చాడు. అతడు 2023లో మృతిచెందగా.. సదరు భూమిపై కోర్టు లో కేసు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మదర్సాబ్ భార్య ఖాజాబి పేరుపై అధికారులు విరా సత్ చేశారు. ఈ విషయంపై బాధితురాలు తహసీల్దార్ ప్రభాకర్‌ను ప్రశ్నించారు. తన కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నా రు. గమనించిన రెవెన్యూ సిబ్బందిని ఆమెను అడ్డుకొని కార్యాలయంలో నుంచి బయటికి పంపించారు. అయితే బాధిత మహిళ తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు ది గింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శేఖర్ అక్క డికి చేరుకొని ఆమెకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించింది. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. భూ వివాదం కోర్టులో ఉన్న విషయం తమకు తెలియదన్నారు. తమకు ప్రొసీడింగ్ ఇవ్వడంతో విరాసత్ చేసినట్లు చెప్పారు. పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన అడ్డుకున్న ఉండవెల్లి రెవెన్యూ సిబ్బంది -
డ్రగ్స్ కట్టడికి అందరూ సహకరించాలి
పాలమూరు: విద్యార్థి దశలో ఉన్న యువత డ్రగ్స్‌కు అలవాటు పడకుండా, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి పాపిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్ వినియోగం అరికట్టేందుకు పోలీస్‌శాఖకు, ఇతర యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఇలా ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా నిత్యం డ్రగ్స్‌పై నిఘా పెట్టాలని సూచించారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల బారినపడి జీవితాలు, భవిష్యత్ నాశనం చేసుకోరాదని సూచించారు. పోలీస్ శాఖ, ఎకై ్సజ్ శాఖలు పూర్తి సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కళాశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారని, డ్రగ్స్ రవాణాపై ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100, 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ డ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ నిత్యం పోరాటం చేస్తోందని, యువత సైతం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నారు. అంతకుముందు స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను అధికారులు తిలకించారు. అలాగే ‘సే నో టూ డ్రగ్స్– ఎస్ టు లైఫ్’ అనే ప్రతిజ్ఞ బోర్డుపై అందరూ సంతకాలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, మహిలా శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా, న్యాయమూర్తి ఇందిర, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డీఈఓ ప్రవీణ్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ హాజరైన జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ‘స్పోర్ట్స్ స్కూల్’ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం గురువారం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బాలబాలికలు హాజరయ్యారు. విద్యార్థుల పేర్లు నమోదు చేయడంతో పాటు ఎంపికల్లో పొందుపరిచిన విధంగా వయసు నిర్ధారణ ధ్రువీకరణ, ఇతర పత్రాలను పరిశీలించారు. ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్‌త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, 6X10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ పర్యవేక్షించారు. జిల్లాస్థాయి ఎంపికల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులు హైదరాబాద్‌లో వచ్చేనెల 4, 5 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో శాట్ పరిశీలకుడు కె.సైదులు, సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, కోచ్‌లు సునీల్‌కుమార్, ఎండీ ఖలీల్, పర్వేజ్‌పాష, నికేష్, అంజద్, మల్లేష్, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేష్‌కుమార్, నరేష్ పాల్గొన్నారు. -
ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..
ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్‌కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్‌శాఖ గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్‌గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల పొంచి ఉన్న ముప్పు.. జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల ● -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
దోమలపెంట: హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిలో గురువారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన దోమలపెంటలో చోటుచేసుకుంది. ఈగలపెంట ఏఎస్ఐ బాలునాయక్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా జనగాం కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జనగాం నుంచి శ్రీశైలానికి వస్తుండగా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంటలో శ్రీశైలం ప్రధాన రహదారిలో బ్రేకులు ఫెలయి బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ సమయంలో డ్రైవర్ తుమ్మల సురేష్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. బస్సులో 11 మంది చిన్నారులతో సహ 40 మంది ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను కటకం రాములమ్మ ఫౌండేషన్ అంబులెన్స్‌లో జెన్కో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బస్సు ఓ కారును సైతం ఢీకొట్టడంతో కారు వెనక అద్దాలు ధ్వంసమయ్యాయి. రోడ్డు దాటుతున్న ఓ ఆవుకు సైతం తగలడంతో దానికి స్పల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిర్వాసితులకు అండగా ఉంటా
చారకొండ: మండలంలని సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి దేవాలయం స్థలంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటానని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సిర్సనగండ్లలో బాధితులను ఆయన కలిసి ఓదార్చారు. కూల్చిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ శాఖ సంబంధిత అధికారులు కోర్టుకెళ్లడంతో కోర్టు ఉత్వర్వుల మేరకు ఇళ్లు కూల్చారని వివరించారు. కాని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. ఇళ్లు కోల్పోయిన వారందరికి స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలో నిర్వాసితులకు స్థలాలు మంజూరు చేయాలని తహసీల్దార్ సునీతకు సూచించారు. సిర్సనగండ్ల శివారులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. అంతకుముందు గుట్టపై సీతారామచంద్రాస్వామి స్వాములవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, బాక్ల్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, వెంకట్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గుర్వయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రాం గౌడ్, మాజీ సర్పంచ్ ప్రశాంత్ నాయక్, మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్, డీసీసీ కార్యదర్శి మహేదంర్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జైపాల్, మాజీ ఎంపీటీసీ నర్సింహరెడ్డి, నాయకులు సందీప్‌రెడ్డి, శ్రీపతి రావు, వెంకటయ్య గౌడ్, నాగేంద్ర, అంజయ్య, అధికారులు తదితరులు ఉన్నారు. -
ఎనిదేళ్లయినా మోక్షం కలగలే..
దేవరకద్ర: నియోజకవర్గ కేంద్రం నుంచి 17 కిలోమీటర్లతో 44 వ జాతీయ రహదారిని అనుసంధానం చేసే లక్ష్మీపల్లి, వేముల డబుల్ రోడ్డు పనులు ఎనిమిదేళ్లైనా పూర్తి కాలేదు. డబుల్ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేయడంతో పాత రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టట్లేదు. దీంతో రోడ్డంతా గుంతలమయంగా మారడంతో వాటిని తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. చిన్న కార్లు ఆ రోడ్డుపై వెళ్లలేక పలుమార్లు గుంతల్లో ఇరుక్కున్న ఘటనలు ఉన్నాయి. 4 కిలోమీటర్లు పూర్తి గత ప్రభుత్వ హయాంలో 44వ జాతీయ రహదారి వేముల స్టేజీ నుంచి వేముల, లక్ష్మీపల్లి, హజిలాపూర్, చౌదర్పల్లి మీదుగా 167వ జాతీయ రహదారిని కలుపుతూ చౌదరపల్లి స్టేజీ వరకు 17 కిలో మీటర్ల డబుల్ రోడ్డు వేసేందుకు రూ. 23.36 కోట్లు మంజూరు చేశారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించారు. వేముల స్టేజీ నుంచి వేముల గ్రామం వరకు, అక్కడి నుంచి లక్ష్మీపల్లి వరకు 4 కిలో మీటర్ల మేర డబుల్ రోడ్డు పనులు పూర్తి చేశారు. అది కూడా మధ్యలో బీటీ వేయకుండ కొన్ని చోట్ల కంకర వేసి వదిలేశారు. మిగతా 13 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభం కాలేదు. చేసిన పనికి సరిగ్గా బిల్లులు రాకపోవడం వల్లనే పనులు నిలిచినట్లు వినిపిస్తున్నా.. ఆర్అండ్బీ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అధికారులు ఇప్పటికై నా రీటెండర్లు వేసి పనులు పూర్తి చేస్తే వాహనదారుల ఇబ్బందులు తప్పుతాయని పలువులు అంటున్నారు. మరమ్మతు కరువు డబుల్ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడంతో పాత రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో రోడ్డంతా గుంతలమయంగా మారింది. డబుల్ రోడ్డుతో వేస్తే అంతా సర్దుకుంటుందని భావించిన అధికారులు ఏళ్ల తరబడి మరమ్మతులపై దృష్టి సారించడం లేదు. డబుల్ రోడ్డు వేయకపోయినా పర్లేదు కానీ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చండి మహాప్రభో అని వాహనదారులు అధికారులను వేడుకుంటున్నారు. ఎన్హెచ్ఏ 44 టు ఎన్హెచ్ఏ 167 డబుల్ రోడ్డు అనుసంధానం పనులకు గ్రహణం 2017 లో రూ. 23.36 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం -
క్రీడా స్కూళ్లకు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయిలో సెలక్షన్స్ సందడి నెలకొంది. త్వరలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్ఎస్ హకీంపేటతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి స్కూల్లో 4వ తరగతిలో 20మంది బాలుర, 20మంది బాలికలను ఎంపిక చేస్తారు. ఉమ్మడి జిల్లాలో సందడి ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ సందడి నెలకొంది. నాగర్‌కర్నూల్ పట్టణంలో మంగళవారం, వనపర్తి పట్టణంలో బుధవారం జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించారు. గురువారం మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లా కేంద్రాల్లో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై నవారు వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌కు వెళ్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినవారు ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాలు పొందుతారు. గతేడాది ఉమ్మడి జిల్లా నుంచి 29మంది విద్యార్థులు ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాలు పొందగా.. నారాయణపేట జిల్లా నుంచి అధికంగా 14మంది ఎంపిక కావడం విశేషం. శారీరక సామర్థ్య పరీక్షలు ● విద్యార్థులకు వివిధ అంశాల్లో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ● ఎత్తు, బరువు, 30మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800మీటర్ల, 610 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాస్థాయిలో పూర్తి నేడు పాలమూరు, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో.. వచ్చేనెలలో రాష్ట్రస్థాయిలో ఎంపికలు కావాల్సిన ధ్రువవపత్రాలు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలకు విద్యార్థులు పలు ధ్రువీకరణ పత్రాలతో రావాలి. ఒరిజినల్ ఆధార్‌కార్డు, 4వ తరగతి చదువుతున్న సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం (పాఠశాల నుంచి తహసీల్దార్/మున్సిపాలిటీ), 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, పది పాస్‌ఫొటోలు, విద్యార్థులు 8నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు. -
లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో మొదటిసారి జూన్ 25 నాటికి 125 మి.యూ. ఉత్పత్తి సాధించామని.. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారని జెన్కో సీఈ కల్లూరి రామసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలను సందర్శించి సిబ్బందిని అభినందించి మాట్లాడారు. ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికి మించి ఉత్పత్తి చేపట్టాలని అధికారులకు సూచించారు. మూడో యూనిట్లో సాంకేతిక లోపం గురించి విద్యుదుత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 30 నాటికి మూడో యూనిట్ మరమ్మతు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. కర్ణాటక నుంచి వరద భారీగా చేరుతుండటంతో జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతుందని వివరించారు. బుధవారం ఎగువ 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 58.687 మి.యూ, దిగువ 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 66.961 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు శ్రీధర్, సురేష్, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు పవన్‌కుమార్, రూపేష్, రాజు, ధర్మారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, దర్బార్వలీ, ఏఈలు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి సెలక్షన్స్‌కు ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలకు ఏర్పాట్లు చేశాం. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సెలక్షన్స్ లో పాల్గొనాలి. సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. మిగతా వివరాలకు 9440656162 నెంబర్‌ను సంప్రదించాలి. – శ్రీనివాస్, జిల్లా యువజన, క్రీడల అధికారి, మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ స్కూళ్లతో ఉజ్వల భవిష్యత్ స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికై నవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. విద్యార్థులను ఇటు చదువుతోపాటు అటు క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతారు. ఈ ఏడాది జిల్లా నుంచి ఎక్కువమంది విద్యార్థులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికకావాలని ఆకాంక్షిస్తున్న. – వేణుగోపాల్, సీనియర్ పీడీ చిన్నదర్పల్లి, మహబూబ్‌నగర్ ● -
ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ–2
కల్వకుర్తి టౌన్: భూ తగాదాల విషయంలో స్టేషన్ బెయిల్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ–2ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామానికి చెందిన నంబి ఆంజనేయులు, నంబి వెంకటయ్యలకు మధ్య భూమి విషయమై కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 23న భూమిని దున్నే సమయంలో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ విషయమై ఇద్దరూ పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంకటయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో వెంకటయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఈ కేసులో స్టేషన్ బెయిల్ వస్తుందని చెప్పి అతనితో రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఎస్ఐ–2 రామచందర్‌జీ డిమాండ్ చేయగా.. రూ.10 వేలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు బుధవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్ఐ–2 రామచందర్జీపై కేసు నమోదు చేశామని, గురువారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదే విషయమై బాధితుడు సైతం మీడియాతో మాట్లాడుతూ కేసు నమోదు చేసిన వెంటనే స్టేషన్‌కు పిలిపించి తన తప్పు లేకున్నా అసభ్య పదజాలంతో దూషించడమే గాక, డబ్బులు డిమాండ్ చేయడంతోనే ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదని, ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని డీఎస్పీ బాలకృష్ణ కోరారు. పట్టుబడిన ఎస్ఐ రామచందర్జీకి ఏడాది మాత్రమే సర్వీసు ఉందని అధికారులు పేర్కొన్నారు. భూ వివాదంలో స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు డిమాండ్ కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ ఆవరణలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు -
జూరాలకు పెరిగిన వరద ఉధృతి
ధరూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 43 వేల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం సాయంత్రానికి 92 వేల క్యూసెక్కులకు చేరిందని వివరించారు. దీంతో 13 క్రస్ట్ గేట్లు పైకెత్తి 51,779 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నామన్నారు. విద్యుదుత్పత్తికి 32,169 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 298, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.010 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. 13 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
3 నెలలు పింఛన్ తీసుకోకుంటే తొలగించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లను క్రమంగా మూడు నెలలు పాటు తీసుకోని పక్షంలో వెరిఫికేషన్ చేసి తొలగించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మున్సిపాలిటీలో ఏడాదికిపైగా బ్యాంకు ఖాతాల నుంచి పెన్షన్ డ్రా చేయని వారు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంశాలపై జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నవన్నీ వారం రోజుల్లో పూర్తిచేయాలన్నారు. జూలై నుంచి ఫేస్ క్యాప్చరింగ్ ద్వారా పింఛన్ పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025లో జిల్లాలోని గ్రామాల ర్యాంకింగ్ మెరుగుపడాలన్నారు. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలకు పారా మీటర్లపై వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి పొడి చెత్త, ఇంకుడు గుంతలు, ఐఈసీ కార్యక్రమాలు, గ్రామం మొత్తం పరిశీలన చేస్తారన్నారు. గత సంవత్సరం గ్రామాల ప్రగతిలో గుజరాత్ తర్వాత తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. జీపీలు ఏ ప్లస్ కేటగిరిలో ఉండేలా అధికారులు కృషిచేయాలన్నారు. ఇందరిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన వాటిని మార్క్ ఔట్ గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సెర్ప్ పింఛన్ డైరెక్టర్ గోపాల్‌రావు, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి విపత్తులు జరగకుండా చర్యలు ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరదల వలన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వలన గత ఐదేళ్లలో నష్టం జరిగిన ప్రాంతాలు, హై రిస్క్ ఏరియాలు గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, సహాయ చర్యలు, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. అంగన్వాడీ బాటపై సమీక్ష మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై జిల్లా సంక్షేమధికారి జరీనాబేగం, సీడీపీఓలు, సూపర్వైజర్లతో అమ్మ మాట– అంగన్వాడీ బాటపై కలెక్టర్ విజయేందిర సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, చిన్నారుల హాజరుశాతం పెంచాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు అంగన్వాడీలపై పర్యవేక్షణ పెంచాలని చెప్పారు. -
అడ్డగోలుగా డిప్యుటేషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యా శాఖలో ఉన్నతాధికారులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. అక్కడ పనిచేసే వారి తీరు మాత్రం మారడం లేదు. గత డీఈఓపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చి.. చివరికి ఏసీబీకి చిక్కినా ప్రస్తుత అధికారుల్లో మార్పు రాకపోవడం కొసమెరుపు. కావాల్సిన వారికి, తమకు అనుకూలమైన వారికి అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో అప్పటి డీఈఓ సుమారు 95 వరకు డిప్యుటేషన్లు ఇచ్చారు. అయితే వీటిలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాటిని వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అనేక మార్లు విన్నవించినా ప్రస్తుత డీఈఓ పట్టించుకోకుండా అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారు. అయితే వచ్చే నెల 15 వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అక్రమ డిప్యూటేషన్లకు తెరలేపడం వివాదాస్పదంగా మారింది. అక్కడ ప్రమోషన్.. ఇక్కడ పోస్టింగ్ డీఈఓ కార్యాలయంలో రెండేళ్లుగా సీఎంఓగా పనిచేస్తున్న అధికారిని డీఈఓ అందలమెక్కించడం వివాదాస్పదంగా మారింది. ఆయన సీఎంఓగా బాధ్యతలు స్వీకరించక ముందే రూరల్ మండలంలోని ధర్మాపూర్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉంటూ ఫారెన్ సర్వీస్‌లో డీఈఓ కార్యాలయానికి సీఎంఓగా వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం గతేడాది హెచ్ఎంలకు పదోన్నతులు కల్పించగా జెడ్పీహెచ్ఎస్ వడ్డేమాన్‌లో హెచ్ఎం పోస్టు ఖాళీగా ఉందని అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకున్నారు. అక్కడ సర్వీస్ కనీసం రెండేళ్లు కూడా కొనసాగించకుండా డీఈఓ కార్యాలయంలో సీఎంఓగా కొనసాగుతూనే తాజాగా హెచ్ఆర్ఏ ప్లేస్ అయిన తాటికొండ హెచ్ఎంగా పోస్టింగ్ తీసుకున్నారు. గతంలో పనిచేసిన ధర్మాపూర్ లేదా వడ్డేమాన్లలో కొనసాగకుండా తన పరపతి, డీఈఓ అండదండలతో తాటికొండలో పోస్టింగ్ తీసుకోవడం విద్యాశాఖ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని పలువురు డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా పోస్టింగ్ ఆర్జేడీ ఇచ్చారని, తనకేం తెలియదని దాటవేశారు. జిల్లా విద్యాశాఖలో అధికారుల ఇష్టారాజ్యం తమకు కావాల్సిన వారిని అందలంఎక్కిస్తున్న వైనం గత డీఈఓ ఇచ్చిన ఆర్డర్లనే కొనసాగిస్తున్న ప్రస్తుత అధికారి వచ్చేనెల 15 వరకు చేపట్టొద్దని నిబంధనలున్నా బేఖాతర్ జిల్లా విద్యాధికారి తీరుపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు -
‘రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు’
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేశంలో నిర్బందాలు, నియంతృత్వాలకు కాలం చెల్లిందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 18 నెలలపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు చేపడితే.. సీపీఎం నాయకులు, కార్యకర్తలను జెలులో అక్రమంగా నిర్బంధించారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని అమలు పర్చకుండా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శివర్గ సభ్యురాలు పద్మ, నాయకులు చంద్రకాంత్, రాజ్‌కుమార్, దీప్లానాయక్, జగన్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరుకు లైన్‌క్లియర్
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తయ్యి 17 నెలల సమయం గడిచినా తిరిగి ఎన్నికలు నిర్వ హించని నేపథ్యంలో ఎట్టి పరిస్థితు ల్లో సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు, మూడు నెలల కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, ఆశావహుల్లో సందడి మొదలైంది. పల్లెల్లో పడకేసిన పాలన.. గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరగ్గా.. గతేడాది ఫిబ్రవరి 2 నాటికి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సుమారు ఏడాదిన్నర కాలంగా సర్పంచ్‌లు లేక గ్రామాల్లో పాలన బోసిపోయింది. సకాలంలో ఎన్నికలు చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయి.. గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చోటుచేసుకోలేదు. చాలావరకు గ్రామాల్లో అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర పనులు తప్పా మిగతా అభివృద్ధి పనులు, శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గాలు లేకపోవడంతో వారి స్థానంలో నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అడుగు పెట్టకపోవడంతో గ్రామాల్లో పరిపాలన మందగించింది. దీంతో పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడటంతో వారు సైతం ఏమీ చేయలేక చేతులేత్తేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోగా నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా పంచాయతీ ఎన్నికలా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపడుతారా.. అన్నదానిపై చర్చ మొదలైంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపై పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా.. అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాత్రమే ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ద్వారా బీసీల జనాభా, ఓటర్ల డాటా కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం లభిస్తే అదనంగా బీసీ జనాభా డేటా బేస్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఆలోపే ముగించేందుకు ప్రభుత్వం కసరత్తు ముందుగా పంచాయతీనా.. ప్రాదేశికమా అన్నదానిపై కొరవడిన స్పష్టత రాజకీయ పార్టీలు, ఆశావహుల్లో మొదలైన సందడి బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఉత్కంఠ -
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్‌జాన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది. 2, 3 రోజుల్లో శుభవార్త.. సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్‌లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. గద్వాల కాంగ్రెస్‌లో అదే తీరు.. మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన ముఖ్య కార్యకర్తలవిస్తృతస్థాయి భేటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో.. హరిత హోటల్లో సరిత వర్గంతో.. చర్చనీయాంశంగా పరిశీలకుల తీరు -
తీవ్రంగా ఖండిస్తున్నాం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చేనెల 15 వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వకూడదు. ఆ తేదీ తర్వాత సర్దుబా టులో భాగంగా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ డిప్యుటేషన్లు ఇవ్వలేదు. కానీ, మహబూబ్‌నగర్ డీఈఓ అక్రమ డిప్యూటేషన్లకు తెరలేపారు. డీఈఓ డిప్యుటేషన్లు ఇవ్వడంతో చాలామంది ఉపాధ్యాయులు క్యూ కడుతున్నారు. డిప్యూటేషన్లు అక్రమమని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో డీఈఓ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – వెంకటేష్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్డర్ రద్దు చేస్తాం.. గాజులపేట పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటు కోసం ఉపాధ్యాయురాలికి ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేస్తాం. ఎర్రవల్లిలో పనిచేసే ఉపాధ్యాయురాలికి ఓరాల్ డిప్యుటేషన్ ఇచ్చాం. ఆమెను కూడా వెనక్కి పంపిస్తాం. ఓ ఉపాధ్యాయుడికి జీహెచ్ఎంగా వడ్డేమాన్‌లో ప్రమోషన్ వస్తే తాటికొండలో పోస్టింగ్ ఇస్తూ ఆర్జేడీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇందులో నా ప్రమేయం లేదు. మా దృష్టి వస్తే ఈ విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అనారోగ్యంతో ఉన్న ముగ్గురికి ఓరాల్ డిప్యుటేషన్ ఇచ్చాం. అక్రమ డిప్యుటేషన్లు ఇచ్చినట్లు తెలి స్తే తప్పకుండా వాటిని కూడా రద్దు చేస్తాం. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ ● -
మత్తు పదార్థాలవినియోగాన్ని అరికట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని ఎస్పీ జానకి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ హాల్లో డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్–2025లో నషా ముక్త్ భారత్‌లో భాగంగా ఈ నెల నుంచి బుధవారం వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 9 గంటలకు స్డేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు విద్యార్థులతో మాదకద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీస్తామన్నారు. యాంటీ డ్రగ్ కమిటీ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, మెడికల్ కళాశాలల్లో ఎవరైనా డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం, రవాణా ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి సాగు చేయకుండా ఎకై ్సజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులలో మత్తు పదార్థాల బారినపడిన వారిని గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందిస్తే మత్తు పదార్థాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఏఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకొని రైతు బలవన్మరణం
కొత్తపల్లి: కడుపునొప్పి బరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తపల్లి మండలంలోని దుప్పడి గట్టులో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుప్పడిగట్టు గ్రామానికి చెందిన వేపూర్ గోపాల్ (42) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కడుపునొప్పి వచ్చినప్పుడు ఆర్ఎంపీలతో చూపించుకొని మందులు వాడేవారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున రోజువారిగా పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో మరోమారు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో భరించలేక మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలానికి వెళ్లిన గోపాల్ ఇంటిక రాకపోవడంతో భార్య సత్యమ్మ కొడుకును పంపింది. పొలం వద్ద చెట్టుకు వేలాడుతున్న తండ్రిని చూసి వెంటనే వెళ్లి తల్లికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి గోపాల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిర్వహించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు.యువకుడి ఆత్మహత్యభూత్పూర్: మండలంలోని పాతమొల్గరకు చెందిన నవీన్‌గౌడ్ (22) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం.. నవీన్‌గౌడ్ ఖిల్లాగణపురం, కొత్తకోటలోని వైన్స్ దుకాణాల్లో పనిచేస్తుండేవాడు. వైన్స్ దుకాణంలోని డబ్బుల లావాదేవీల కారణంగా ఒత్తిడికి తట్టుకోలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని మృతిచెందాడు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.చెట్టు పైనుంచి పడిబాలుడికి గాయాలుగండేడ్: చెట్టు పైనుంచి పడి ఓ బాలుడు గాయాల పాలైన ఘటన మండలంలోని సల్కర్‌పేట్‌లో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నవీన్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సీతాఫలం చెట్టుకున్న పండ్లను తెంచడానికి పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో కాలికి గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో స్థానిక ఆస్పత్రి అటు నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చైన్ స్నాచర్ అరెస్ట్జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రైల్వే స్టేషన్లు, నడుస్తున్న రైళ్లలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగ రితేష్ హరిశ్చంద్ర ధోత్రేను మంగళవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మత్కులి గ్రామానికి చెందిన ధోత్రే పలు చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడి దొరకకుండా తిరుగుతున్నాడు. మంగళవారం మన్యంకొండ రైల్వేస్టేషన్న్కు వెళ్లి తనిఖీలు చేస్తుండగా సమీపంలో అనుమానాస్పదకంగా తిరుగుతున్న ఐదుగురిని గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా నలుగురు తప్పించుకున్నారు. ఏ5గా ఉన్న ధోత్రేను అరెస్టు చేయడంతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మన్యంకొండ, కౌకుంట్ల, ఇటిక్యాల, మనవపాడు, అలంపూర్ రైల్వేస్టేషన్, అలాగే కర్నూలు, గుత్తి, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేశాడని రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ రాజు వివరించారు. -
ఆ బ్యాంకు ఉద్యోగి ఎక్కడ?
సహస్ర సోదరుడి మృతిపై అనుమానాలు.. తేజేశ్వర్ భార్య సహస్ర తమ్ముడి మృతిపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అక్క సహస్ర, తల్లి సుజాత వ్యవహారం గురించి పలుమార్లు సహస్ర తమ్ముడు హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ విషయం కూడా బ్యాంకు ఉద్యోగితో చెప్పడంతో పాటు రెండు నెలల క్రితం సహస్ర సొంత తమ్ముడిని సైతం హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే హత్య చేసి.. అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు నమ్మించారని తేజేశ్వర్ కుటుంబసభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. ● ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్యకు ప్రధాన వ్యక్తిగా బ్యాంకు ఉద్యోగి తండ్రి ఏపీ పోలీసుశాఖ కర్నూలు జిల్లాలో ఏఎస్ఐగా పనిచేశారు. ఈ క్రమంలో భూ సంబంధ దందాలో ఉన్నట్లు అప్పటి ఉన్నతాధికారులు విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బ్యాంకు ఉద్యోగి తండ్రిపై రౌడీషీటర్ ఓపెన్ చేసినట్లు కర్నూలు పోలీసు రికార్డులు ఉన్నట్లు తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన నేపథ్యమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గద్వాల క్రైం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు సీజ్ చేసినట్లు తెలిసింది. మంగళవారం విచారణ అధికారులు డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను కర్నూలు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడైన బ్యాంకు ఉద్యోగి తల్లిదండ్రులు, భార్యను వేర్వేరుగా రెండు గంటలకుపైగా విచారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హత్య, వివాహేతర సంబంధం విషయమై ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా.. వివాహేతర సంబంధం ఘటనలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయా.. తదితర అంశాలను ఆరా తీసినట్లు సమాచారం. తేజేశ్వర్ భార్య సహస్ర, ఆమె తల్లి సుజాతతో ఆర్థిక విషయాలను సైతం ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో తేజేశ్వర్ భార్య సహస్ర, తల్లి సుజాతలు పోలీసుల అదుపులో ఉండటంతో వారిని సైతం వారి ముందు పలు విషయాలను ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ప్రధాన నిందితుడి తండ్రి కర్నూలు జిల్లాలోని పోలీసు శాఖలో ఏఎస్ఐ స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసినట్లు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానిత వ్యక్తుల కుటుంబసభ్యులను సైతం పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు విచారణలో పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. నగదు మొత్తం విత్ డ్రా.. హత్య ఘటన అనంతరం ప్రధాన నిందితుడైన బ్యాంకు ఉద్యోగి సుఫారీ ఇచ్చిన వారికి రూ.2 లక్షలు అందజేసి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే తేజేశ్వర్ హత్యకు ముందే ప్రధాన నిందితుడు తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోంచి భారీ మొత్తంలో నగదు డ్రా చేసుకున్నట్లు తెలుస్తుంది. సుఫారీ ఇచ్చిన ముఠా సభ్యులను కలిసినప్పటి నుంచి తన కారులో హైదరాబాద్‌లోని తెలిసిన స్నేహితులు, బంధువులను కలిసి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు వినికిడి. అయితే పోలీసులు ముందుస్తుగానే ఎయిర్‌పోర్టు కార్యాలయానికి ప్రధాన నిందితుడికి సంబంధించిన వివరాలను చేరవేసి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం సైతం ప్రధాన నిందితుడు తెలుసుకుని హైదరాబాద్ శివారులో తెలిసిన వ్యక్తుల ఇళ్లలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టుకు ముందే న్యాయవాదులు తేజేశ్వర్ హత్య జరిగిన నేపథ్యంలో ఎప్పటికై నా అరెస్టు కావడం ఖాయమని గుర్తించిన ప్రధాన నిందితుడు న్యాయ నిపుణుల సలహాలు సైతం తీసుకున్నట్లు తెలిసింది. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు అనుమానిత వ్యక్తుల వివరాలలో బ్యాంకు ఉద్యోగి పేరు కూడా చెప్పడంతో విచారణ అధికారులు ఫోన్ చేసి మాట్లాడారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే.. బాం్యకు ఉద్యోగి తరఫున కర్నూలుకు చెందిన న్యాయవాదులు వచ్చి ఈ నెల 20వ తేదీన గద్వాల పోలీసుశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడడం గమనార్హం. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే న్యాయవాదులు రావడంతో పోలీసులే కంగుతిన్నారు. కాగా.. హత్య విచారణకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. హత్య చేసిన ముఠా సభ్యులు మారణాయుధాలను ప్రవహించే నదుల్లో పారవేసినట్లు తెలుస్తుంది. తేజేశ్వర్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్ ఇతర వస్తువులను సైతం తుంగభద్ర లేదా కృష్ణానదిలో పడేసినట్లు భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా ఓ పథకం ప్రకారం ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతా తారుమారు.. తేజేశ్వర్‌ను హత్య చేసి భార్య సహస్ర, బ్యాంకు ఉద్యోగి లడక్ లేదా ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు వివిధ కోణాల్లో ఆయా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతోపాటు విమానయాన కార్యాలయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, సహస్ర, ఆమె తల్లి సుజాత పోలీసుల అదుపులో ఉండడంతో కథ అంతా తారుమారైంది. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసుల గాలింపు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నం...దీంతో లుక్ అవుట్ నోటీసు జారీ అనుమానితుల కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు నిందితుడి బ్యాంకు ఖాతాలు సీజ్ హైదరాబాద్‌లో ఉన్నట్లు అనుమానం కీలక దశలో ఉంది.. తేజేశ్వర్ హత్య కేసు చాలా కీలక దశలో ఉంది. అయితే హత్యకు గల కారణాలు, హత్య చేసిన వారి వివరాలపై కూపీ లాగుతున్నాం. ఇప్పటి వరకు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. తాజాగా వారి కుటుంబసభ్యులను విచారించేందుకు పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు కోసం ఇప్పటికే పలు ప్రత్యేక బృందాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాయి. తెలంగాణలోనే తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలపై నిఘా ఉంచాం. దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాం. బ్యాంకు ఖాతాలను సీజ్ చేశాం. త్వరలో కేసు వివరాలను వెల్లడిస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల -
ఇసుక క్వారీ అనుమతులు రద్దు
జడ్చర్ల: డార్క్ ఏరియాగా గుర్తించిన మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారు దుందుభీ వాగు పరివాహక ప్రాంతంలోని పట్టా భూముల్లో ఇచ్చిన ఇసుక క్వారీ అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. సదుద్దేశంతో ఇచ్చిన అనుమతులను క్వారీ నిర్వాహకులు దుర్వినియోగం చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, రవాణా చేయడంపై మంగళవారం ‘కొల్లగొడుతున్నారు’ శీర్షికన ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన టీజీఎండీసీ అధికారులు విచారించి అనుమతులను రద్దు చేయాలని సిఫార్సు చేయడంతో కలెక్టర్ గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాల అక్రమాలపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారించిన తర్వాత కలెక్టర్ అనుమతులను రద్దు చేయడంతో డార్క్ ఏరియా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లోనూ క్వారీ అనుమతుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డార్క్ ఏరియా రైతుల స్థితిగతులతోపాటు క్వారీ అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
అటవీశాఖ అధికారులకు నెమలి అప్పగింత
పాన్‌గల్: అటవీశాఖ అధికారులకు జాతీయపక్షి నెమలిని అప్పగించిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యేక సాక్షులు, అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. పాన్‌గల్ సమీపంలో గుట్ట నుంచి నెమలి వచ్చి రాధాకృష్ణ ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయం ఇంటి యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తమ సిబ్బందింతో వచ్చి నెమలిని తీసు కెళ్లారు. గుట్ట నుంచి వచ్చిన నెమలిని సురక్షితంగా అటవీశాఖ అధికారులకు అప్పగించడంతో ఇంటి యజమాని రాధాకృష్ణను అటవీశాఖ అధికారులు అభినందించారు.మొసలి కలకలం మాగనూర్: మండల కేంద్రంలోని సమన్చెరువు (సబ్‌స్టేన్ స్టేషన్ పక్కన గల చెరువు)లో కొన్ని రోజులుగా వమొసలి కలకలం సృష్టిస్తోంది. ప్రతిరోజు మొసలి గట్టు మీద వస్తుందని, దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. గతంలో ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్ని వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫారెస్టు అధికారులు మొసలిని బంధించి తరలించాలని కోరుతున్నారు.నల్లమలలో గొర్రెల కాపరి అదృశ్యంమన్ననూర్: నాగర్‌కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గంగెడ్ల బాలయ్య మంగళవారం నల్లమల అటవీ సరిహద్దు ప్రాంతం కుడిచింతలబైలు గ్రామం సమీప అడవిలో తప్పి పోయినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. కొంతమంది గొర్రెల కాపరులు కొన్ని రోజుల నుంచి కుడిచింతలబైలు గ్రామం సమీపంలోని రేవువాగు సమీపంలో గొర్రెలను మేపుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు వారికి కావాల్సిన వస్తువులు, నిత్యవసరాలు తదితరాల కోసం గ్రామానికి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన బాలయ్య మద్యం తాగి గొర్రెల మంద వద్దకు తిరిగి వెళ్లాడు. రాత్రి ఎంతకూ తిరిగి మంద వద్దకు చేరుకోకపోవడంతో తోటి గొర్రెల కాపరులు తెల్లవారుజామున కుడిచింతలబైలుకు గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల సహయంతో రోజంతా అడవిలో వెతికిన బాలయ్య జాడ దొరలేదని తెలిపారు. -
సాగవుతున్నా పడావుగా చూపించారు..
నాకు చౌదర్పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్ కల్టివేటింగ్) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది. – భాగ్యమ్మ, చౌదర్పల్లి, దేవరకద్ర అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి.. 2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విషయం తెలియక పంట ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్ అధ్యక్షుడు 30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరోసా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబితా రూపొందించి కలెక్టర్‌కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. ఈ వానాకాలం సీజన్‌కు సంబంఽధించి రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల వ్యవధిలో 2,08,486 మంది రైతులకు రూ. 230.08 కోట్లు జమ అయ్యాయి. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటాం
అచ్చంపేట: ‘కొందరు స్వార్థం వల్ల మాకు అన్యాయం జరగతోంది. అధికారులు చేసిన తప్పులతో ఆర్థిక నష్టం జరుగుతోంది. మా గోడు అలకించి న్యాయం జరిగేలా చూడాలి’ అని ఎస్ఎల్బీసీలో భాగంగా నిర్మాణం చేపట్టిన నక్కలగండి రిజర్వాయర్ ముంపు గ్రామం కేశ్యతండా గ్రామస్తులు ఆర్డీఓ మాధవితో తమగోడును విన్నవించారు. మంగళవారం గ్రామానికి చెందిన యువకులు ఆర్డీఓను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. నక్కలగండి ప్రాజెక్టులో అచ్చంపేట మండలం మార్లపాడుతండా, కేశ్యతండా గ్రామాలకు చెందిన ప్రజల భూములు, ఇళ్లు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజల భూములకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించింది. దీంతో పాటు ముంపునకు గురవుతున్న మార్లపాడు, కేశ్యతండా గ్రామంలోని ఇళ్లకు సైతం నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇళ్లకు, ఖాళీ స్థలాలతో కలిపి గజం చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని నోటిఫికేషన జారీ చేశారు. 1989లో కేశ్యతండాకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం 167 సర్వేనంబరులో 89 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసింది. రెవెన్యూ అధికారులు సదరు భూమికి సంబంధించి ఇళ్ల నిర్మాణం చూపకుండా అమ్మిన వ్యక్తిపై అదే భూమిని చూపించడం వల్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు నష్టపరిహారం రాకుండా పోతోంది. ప్రస్తుతం పక్కా ఇళ్లకు మాత్రమే పరిహారం వస్తుందని, ఖాళీ స్థలం, ఇంటిస్థలానికి పరిహారం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో నిర్మించిన ఇళ్ల స్థలాలను వ్యవసాయ భూమిగా, అది కూడా గతంలో భూమిని అమ్మిన వ్యక్తి వారసులుగా చూపించారు. దీని వల్ల తండావాసులు ఇళ్లకు మినహా, మిగతా ఖాళీ స్థలానికి నష్టం పరిహారం రావడం లేదు. దీని వల్ల తమకు సుమారు రూ.40 కోట్ల మేరా నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఇళ్లను మాత్రమే తమవిగా చూపించి, మిగతా స్థలాలను గతంలోని వ్యక్తి వారసులుగా చూపించడం వల్ల అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. వారసులమని చెప్పుకునే వారికి భూమి నష్టపరిహారం సొమ్ము రూ.22 లక్షలు వారి ఖాతాలో జమచేయడం సరైంది కాదని తెలిపారు. వారి నుంచి సొమ్ము రికవరీ చేసి తాము కొనుగోలు చేసిన ఇళ్ల స్థలం, ఇళ్లకు పరిహారం ప్రభుత్వం నిబంధనల మేరకు చెల్లించాలని కోరారు. దీని గురించి ఇప్పటికే అనేక మార్లు అధికారులను కలిసి విన్నవించామని, ఇప్పటికై నా న్యాయం చేయాలన్నారు. దీనిపై ఆర్డీఓ స్పందిస్తూ వీలైనంత త్వరగా గ్రామానికి వచ్చి మరోమారు సర్వే చేసి గ్రామస్తులకు న్యాయం చేస్తామని చెప్పారు. దీనిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని తహసీల్దార్ సైదులును ఆదేశించారు. దీంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించి నష్టపరిహారమివ్వాలి ఆర్డీఓతో నక్కలగండి ముంపు ప్రజల గోడు -
అడవి పందులను వేటాడిన నిందితుల అరెస్ట్
నారాయణపేట క్రైం: జిల్లా సరిహద్దులోని జలాల్పూర్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి పట్టణ పోలీసుల ముమ్మర తనిఖీలో కర్ణాటకకు చెందిన ఓ బొలెరో వాహనంలో నాలుగు అడవి పందులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా, దేవదుర్గా తాలూకా భూమన కొండకు చెందిన 11మంది వేట కుక్కల సహాయంతో యానగుంది, దామరగిద్ద పరిసర ప్రాంతాల్లో పందులను వేటాడి కర్ణాటక దేవదుర్గాకు తరలిస్తుండగా నారాయణ పేట సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అప్పటికే అడవి పందులు వేటకుక్కల దాడిలో చనిపోయినట్లు తెలిపారు. వేటాడిన అడవి పందులను, వాటిని తరలిస్తున్న బొలెరో వాహనం, డ్రైవర్ అప్పన్నతో పాటు ఎల్లప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వ్యక్తులు పోలీసులను చూసి వేట కుక్కలతో సహ పారిపోయినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పందులకు వెటర్నరీ డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించి 12 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నూతన కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సెక్రెటరియేట్లో పీయూకు సంబంధించి ఈసీ (ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, విద్యా శాఖల అధికారులతోపాటు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబుతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పీయూలో నూతనంగా ప్రారంభించే లా, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈసీ ఆమోదం తెలిపింది. అలాగే విద్యార్థులకు కల్పించే వసతులు, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇక టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ఆమోదం కూడా జరిగింది. కానీ, ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉందని వీసీ పేర్కొన్నారు. అంతేకాకుండా పీయూలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి మెడికల్ రీయింబర్స్మెంట్ అవకాశం కల్పించే దానికి కూడా అనుమతించారు. 137 మంది సిబ్బంది.. పీయూలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై ఈసీలో చర్చ జరిగింది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 137 మంది సిబ్బంది వివరాలను ఇప్పటికే అధికారులు ఈసీ ముందు ఉంచగా దీనిపై పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో పీయూలోని పీజీ కళాశాల ప్రారంభంలో ఇచ్చిన జీఓ, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ వంటి పీజీ కళాశాలల ఏర్పాటు క్రమంలో ఇచ్చిన జీఓ సిబ్బంది నియామకానికి ఇచ్చిన అనుమతులపై ఈసీలో ప్రభుత్వ అధికారులు ప్రశ్నించారు. దీనిపై పీయూ అధికారులు పూర్తిస్థాయిలో వారు అడిగిన వాటికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే త్వరలో నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు వీసీ చెప్పారు. ఆమోదం తెలిపిన ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ వసతుల కల్పన, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకానికి సైతం అనుమతులు నాన్‌టీచింగ్ సిబ్బంది వేతనాలపెంపుపై చర్చ రెగ్యులర్ అధ్యాపకులకు మెడికల్ రీయింబర్స్మెంట్ -
అందరూ సమన్వయంతో పనిచేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయ వనరులపై ఆరా తీశారు. అందరూ సమన్వయంతో, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని సూచించారు. అంతకుముందు ఆయా విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వద్దకు ఆయన నేరుగా వెళ్లి క్షుణ్ణంగా పనిశీలించారు. కాగా ఇన్చార్జ్ ఎంఈ సందీప్వరల్డ్, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఏసీపీ కరుణాకర్‌గౌడ్, టీపీఓ లక్ష్మీపతి, ఆర్ఓ మహమ్మద్ ఖాజా, ఆర్ఐలు అహ్మద్షరీష్, రమేష్, టి.నర్సింహులు, ముజీబుద్దీన్, ఏఎస్ఓ సలీం, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు యాదయ్య, నిర్మల, దేవమ్మ, వరలక్ష్మి తదితరులు వేర్వేరుగా కొత్త కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. కొత్త కమిషనర్ ప్రవీణ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ -
నల్లమల అడవిలోకి కొండచిలువ
మన్ననూర్: వనపర్తి జిల్లా గోపాల్పేట పరిసర ప్రాంతంలో బంధించిన 13 అడుగుల కొండ చిలువను నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో మంగళవారం వదిలారు. వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం గోపాల్పేట మండల కేంద్రంలో అవుసలకుంటలో భారీ కొండచిలువను సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ బంధించాడు. కొండచిలువను సురక్షితంగా వదిలేయానే క్రమంలో సంబంధిత డీఎఫ్ఓ రోహిత్‌రెడ్డిని సంప్రదించారు. దీంతో స్పందించిన ఆయన శ్రీశైలం ప్రధాన రహదారి సమీపంలోని నల్లమల అడవిలోకి తీసుకొచ్చి వదిలేయాలని సూచించారు. దీంతో కొండచిలువను ఓ ప్రత్యేక వాహనంలో తరలించి మద్దిమడుగు ఎఫ్ఆర్ఓ మహేందర్, మన్ననూర్ సెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్, బీట్ ఆఫీసర్ ఆనంద్, శివ సమక్షంలో పిచ్చకుంట్ల చెరువు నల్లమల అటవీ పరిసర ప్రాంతంలో వదిలేశారు. సకాలంలో స్పందించిన డీఎఫ్‌ఓకు కృష్ణసాగర్‌తో పాటు సొసైటీ సభ్యులు గోవర్ధన్, విష్ణుసాగర్, ఆనంద్, నాగరాజు, సురేష్, ప్రకాష్ రాజు, సూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
11మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు
లింగాల: మండల కేంద్రానికి సమీపంలో ఓ వ్యవసాయ పొలంలో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 11మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో రూ.20, 020 వేల నగదు పట్టుబడగా మరో మూడు బైకులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పొలాల్లో పేకాడడం, మద్యం సేవించడం అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని, అంతేగాక పొలం యజమానులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. తేనెటీగల దాడి.. నలుగురికి గాయాలు గండేడ్: తేనెటీగల దాడిలో నలుగురు మేకల కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మండలంలోని కొంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నేతి వెంకటయ్య, అమృతమ్మ, బాలమ్మ, నర్సమ్మ తమ మేకలను మేపడానికి వెంకటయ్య పొలానికి వెళ్లారు. వెంకటయ్య పొలం వద్ద చెట్లు కొడుతుండగా కొమ్మ విరిగి పక్కనే మరో చెట్టుపై ఉన్న తేనె తెట్టపై పడింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు లేచి వారి తల, ముఖాలపై కరిచాయి. కాసేపటికి అక్కడి నుంచి తేనెటీగలు వెళ్లిపోవడంతో గ్రామస్తులు వారిని ఆటోలో చికిత్స నిమిత్తం గండేడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అటు నుంచి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
సాకులు చెబుతున్నారు..
నాకు 2.32 ఎకరాల పట్టా భూమి ఉంది. ఎకరాకు మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మిగతా 1.32 ఎకరాలకు పడలేదు. గత సీజన్లో భూమి మొత్తానికి రైతు భరోసా పడింది. వ్యవసాయ అధికారిని అడిగితే కాస్తు చేయలేదని సాకులు చెబుతున్నారు. నాకున్న భూమిలో కందులు వేశాం. రైతు భరోసా కోసం కాస్తు నమోదు చేయడంలో అధికారులు తప్పుడు నివేదికల కారణంగా నష్టపోయాం. – చంద్రప్ప, రైతు, వింజమూరు, కోయిలకొండ మండలం రెండెకరాలకే వచ్చాయి.. ఈసారి కాస్తు విస్తీర్ణాన్ని తగ్గించి రైతు భరోసా వేశారు. నాకు 4.14 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో కేవలం రెండెకరాలకు రైతుభరోసా డబ్బు లు నా ఖాతాలో జమయ్యా యి. మిగతా 2.14 ఎకరాల భూమికి డబ్బులు పడలేదు. నాకున్న మొత్తం విస్తీర్ణంలో కందులు వేశాం. సర్వే నిర్వహించి మాకు న్యాయం చేయాలి. – బాలకిష్టయ్య, రైతు, వింజమూరు, కోయిలకొండ -
పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
పాలమూరు: ఎంపీగా ఈ ఏడాదిలో పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఏడాది పాలన సంతృప్తినిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యామని, ఏడాదిలో రూ.562 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. జడ్చర్ల నుంచి రాయిచూర్ రోడ్ నాలుగు లైన్లుగా విస్తరించడానికి కేంద్రం అంగీకరించిందని, ఎన్‌హెచ్–44 6 లైన్లు అప్‌గ్రేడ్ చేశారని, కల్వకుర్తి హైవే పనులను ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించినట్లు చెప్పారు. నారాయణపేట మీదుగా ఎన్‌హెచ్–167 కర్ణాటక వరకు వెళ్లే రోడ్డు నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తామన్నారు. మెడికల్ కళాశాలల్లో వాటాలుగా నిధులు విడుదలలో కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. విద్యాపరంగా ఎన్నికల హామీ మేరకు ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, నవోదయ, సైనిక్ స్కూళ్లు తెచ్చుకున్నామన్నారు. అమృత్ స్టేషన్లలో భాగంగా పార్లమెంట్ పరిధిలో రూ.39.87 కోట్లతో మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్, మరో రూ.10.94 కోట్లతో జడ్చర్ల, రూ.9.59 కోట్లతో షాద్‌నగర్ రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కృష్ణ– వికారాబాద్ రైల్వేలైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మహబూబ్‌నగర్ మీదుగా వందేభారత్‌ను ప్రారంభించుకున్నట్లు వివరించారు. అనంతరం ‘వికసిత్ భారత్‌లో పాలమూరు నియోజకవర్గం’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేశారు. మేమూ బాధితులమే.. ఫోన్ ట్యాపింగ్‌లో తాము కూడా బాధితులమే అని ఎంపీ అరుణ పేర్కొన్నారు. దీనిపై సీబీఐతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, అందుకు కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్తో సంబంధం లేకుండా వెంటనే సీబీఐతో విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మత్తపదార్థాల నిర్మూలనకు సహకరించండి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: మత్తుపదార్థాల నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములై సహకరించాలని ఎస్పీ జానకి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలపై మహా సంకల్పంపై 2,500 మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారి నుంచి యువతను రక్షించడం మనందరి బాధ్యత అని, ఇందులో ప్రతి కుటుంబం, విద్యాసంస్థ, సమాజం భాగస్వామ్యం కావాలన్నారు. యువతే ఈ దేశ భవిష్యత్ అన్నారు. జిల్లా అంతటా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ప్రతి పోలీస్‌స్టేషన్ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమ కేలండర్ రూపొందించామని చెప్పారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణపై రూపొందించిన వివిధ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, డీఎస్పీ రమణారెడ్డి, డీఐఈఓ కౌసర్ జహార్, టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ ప్రిన్సిపాల్ రాములు, ఐటీ కోర్ టీం ఎస్ఐ రవి, మున్సిపల్, పోలీస్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వలంటీర్లు పాల్గొన్నారు.28న శ్రీజగన్నాథుడి రథయాత్రస్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో శనివారం శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం నిర్వహించనున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, ఇస్కాన్ ప్రతినిధి వరదరాజు దాసు ప్రభు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్ భక్తి వృక్ష కేంద్రంలో మంగళవారం రథయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ధార్మిక సంస్థల సహకారంతో పాలమూరులో నాలుగోసారి శ్రీజగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రథయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ కల్యాణ మండపం నుంచి ప్రారంభమై న్యూటౌన్, ఆర్టీసీ బస్టాండ్, అశోక్‌టాకీస్ చౌరస్తా, వన్‌టౌన్, రాంమందిర్, క్లాక్‌టవర్, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, రైల్వేస్టేషన్, శెట్టి కాంప్లెక్స్ మీదుగా తిరిగి కల్యాణ మండపం వరకు చేరుకుంటుందని తెలిపారు. భక్తుల నృత్యాలు, భజనలు, కోలాటాల మధ్య శ్రీజగన్నాథ రథయాత్ర అద్భుతంగా సాగుతుందని, పట్టణ ప్రజలు రథయాత్రకు హారతులతో స్వాగతం పలకాలని కోరారు. కార్యక్రమంలో రాజ మల్లేష్, జి.పాండురంగం, విజయ్ వెంకటేశ్, నత్మల్, కొండప్ప, సురేందర్, మల్లారెడ్డి, మూర్తి, డాక్టర్ మంజుల, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.నేడు మార్కెట్‌కు సెలవుదేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం సెలవు కారణంగా ఉల్లి వేలం, ధాన్యం క్రయవిక్రయాలు జరగవని వ్యాపారులు తెలిపారు. బుధవారం అమావాస్య కావడంతో మార్కెట్ యార్డు బంద్ ఉంటుందని పేర్కొన్నారు. -
జూరాలకు 43 వేల క్యూసెక్కులు
ధరూరు/ఆత్మకూర్: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు 7 క్రస్ట్‌గేట్ల తెరిచి 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 35,335 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 45, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 306, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 200, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.721 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. 115.854 మి.యూ. విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో మంగళవారం ఉత్పత్తి కొనసాగినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 54.320 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 61.534 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ఇప్పటి వరకు 115.854 మి.యూ. ఉత్పత్తి జరిగిందని వివరించారు. రామన్‌పాడులో 1,019 అడుగులు.. మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికి పైన 1,019 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలకు 920 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. రామన్‌పాడు జలాశయం కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. కోయిల్‌సాగర్‌లో 18.6 అడుగులు.. దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయంలో మంగళవారం సాయంత్రం వరకు 18.6 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 8 అడుగులు నీరు వస్తే పాత అలుగుస్థాయికి నీచేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు. 7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 11 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
ప్రాణం తీసిన డ్రైవింగ్ సరదా
గట్టు: సరదాగా ట్రాక్టర్‌ను పొలం దాకా తీసుకెళ్దామనుకున్న సరదా చివరికి ఆ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన మంగళవారం గొర్లఖాన్‌దొడ్డి సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామానికి చెందిన వీరేశ్, బజారి స్నేహితులు. ఇద్దరు కలిసి మగ్గం(చేనేత) నేసేవారు. బజారి తన పొలంలో వరి నారును చల్లడానికి గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ట్రాక్టర్‌ను తీసుకొని పొలానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వరినారు బస్తాలను ట్రాక్టర్‌పై వేసుకుని గొర్లఖాన్‌దొడ్డి నుంచి తప్పెట్లమొర్సు వైపున్న రోడ్డుపై బయలుదేరాడు. మధ్యలో వీరేశ్ తాను వస్తానని, ట్రాక్టర్‌ను నడుపుతానని, చెప్పి ట్రాక్టర్‌పైకి ఎక్కి, డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ట్రాక్టర్‌ను సరదాగా నడుపుకుంటూ వెళ్తుండగా.. కొంతదూరం వెళ్లిన తర్వాత కాల్వ ఉన్న చోటుకు చేరుకొగానే వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ను అదుపు చేసే క్రమంలో సడన్‌గా సింగిల్ బ్రేక్‌ను తొక్కడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌పై ఉన్న బజారి క్షణకాలంలో పక్కకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. ట్రాక్టర్ నడుపుతున్న వీరేశ్ (30) అక్కడిక్కడే మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. -
హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థి
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో ఉన్న కేజీబీవీ హాస్టల్ భవనం పైనుంచి ఓ విద్యార్థిని దూకగా వెన్నుముకకు తీవ్ర గాయామైన ఘటన మంగళవారం చోటు చేసుకున్నట్లు ప్రిన్స్‌పాల్ లోహిత తెలిపారు. ఆమె కథనం మేరకు.. మండలంలోని కిష్టగిరికి చెందిన గొల్ల సంజీవ్ కుమార్తె తరుణి వారం కిందట కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో చేరింది. హాస్టల్లో ఉండి చదవడం ఆమెకు ఇష్టం లేక మూడురోజులుగా బాధపడుతుండటంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు సకాలంలో రాకపోవడంతో ఇంటికి పారిపోవాలని నిర్ణయించుకొని మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హాస్టల్ భవనం పైనుంచి కిందకు దూకింది. వెనుముకకు గాయం కాగా నొప్పితో అరువగా వాచ్మెన్, ఉపాధ్యాయురాలు అక్కడికి చేరుకొని ఎస్ఓకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే సిబ్బందితో కలిసి బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. డీఈఓ అబ్దుల్ ఘని, జీసీడీఓ శుభలక్ష్మి ఆస్పత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వెన్నెముకకు గాయం -
నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్‌పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్‌గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్‌నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్‌పై కేసులు నమోదు కావడంతో భాస్కర్‌ను మహబూబ్‌నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్‌ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్‌ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్‌కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్‌కు జీపీఎస్ ట్రాకర్‌ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా తేజేశ్వర్‌పై నిఘా పెట్టారు. జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్‌ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు. కేసు విచారణ వేగవంతంతేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్‌ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్తేజేశ్వర్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్‌కుమార్, మల్లేశ్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్లై ఓవర్, తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. హత్యకు ముందే పరిచయం.. తేజేశ్వర్ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్‌ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో అనుమానితులు?పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్‌ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. -
బోర్లు అడుగంటాయి..
కొత్తపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో సైతం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సర్వే నం.97లో 7.35 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిని కూడా వదలడం లేదు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుపై విజిలెన్స్ అధికారులు, కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. – కృష్ణయ్య, రైతు, కొత్తపల్లి ఆందోళన చేసినం.. కొత్తపల్లి వద్ద ఇసుక క్వారీ అక్రమాలపై ఆందోళన చేపట్టాం. అక్కడే టెంటు వేసుకుని వంటావార్పు చేసుకుంటూ రోజుల తరబడి నిరసన తెలిపాం. మాకు అధికార, విపక్ష పార్టీ నేతలు ఎవరూ సంఘీభావం కూడా తెలుపలేదు. అధికారులైతే అటువైపు కన్నెతి చూడలేదు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయాలి. – పాండు, మాజీ సర్పంచ్, కొత్తపల్లి చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వ నిబంధనలు ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంతేగాక నిబంధనల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన అక్రమార్జనను రాబట్టాలి. అక్రమార్కులకు వంత పాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కొత్తపల్లి ఇసుక క్వారీ అనుమతులను రద్దు చేయాలి. – రాజేశ్వర్, బీజేపీ నాయకులు, మిడ్జిల్● -
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
జడ్చర్ల: మొక్కలు నాటి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.. కానీ, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు అంటూ ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం జడ్చర్ల డీటీసీలో జరిగిన కార్యక్రమంలో యువత, విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు మాదక ద్రవ్యాల నివారణ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. యువత తమ భావోద్వేగాలను మాదకద్రవ్యాల వైపు మళ్లించకుండా ప్రకృతి వైపు మళ్లించాలని తద్వారా వారితోపాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వారవుతారన్నారు. మాదక ద్రవ్యాలు మానవ జీవితాన్ని నాశనం చేసే వినాశకారక మార్గమని, అలాంటి దారి వైపు అడుగుపెట్టకూడదన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, తెలంగాణ నార్కొటిక్ ఇన్చార్జ్ డీఎస్పీ బుచ్చయ్య, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు కమలాకర్, నాగార్జునగౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులను నేరుగాసంప్రదించండి : ఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను స్వయంగా ఎస్పీ తెలుసుకుని వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయం, మరో వ్యక్తి మధ్యవర్తిత్వం, పైరవీలకు తావులేకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలన్నదే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని చాణక్య ఉన్నత పాఠశాలలో షీ టీం, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ ఈవ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ శైలజ, షీ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 45వేల క్యూసెక్కులు
ధరూరు, ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో కొన్ని రోజులుగా వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 53వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు ఇన్‌ఫ్లో 45వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా 12, 246 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో సోమవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఎగువ జూరాలలో ఐదు యూనిట్ల ద్వారా 50.971 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 107.266 ఎంయూ విద్యుదుత్పత్తి చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36, 340 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 46 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 850 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు, ప్రాజెక్టు నుంచి మొత్తం 51,957 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.710 టీఎంసీల నిల్వ ఉన్నట్లు తెలిపారు. మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి 51,957 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో జల విద్యుత్ కేంద్రంలో 11యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి -
వితంతువులను చిన్నచూపు చూడొద్దు
నాగర్‌కర్నూల్: వితంతువులను చిన్నచూపు చూడకుండా ప్రతిఒక్కరిలోనూ మార్పు రావాలని, తమ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వితంతు మహిళలపై గౌరవంగా ప్రదర్శించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేతృత్వంలో రాష్ట్ర మహిళా కమిషన్ బృందం సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అన్నిశాఖల జిల్లా అధికారులతో వితంతు మహిళా సంరక్షణ హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రథమంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటిసారిగా వితంతు మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనే వితంతు మహిళలు ఉన్నారని.. అందుకే వారి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో వితంతువుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. భర్తను కోల్పోయాక జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళల అభ్యున్నతికి పాటుపడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు. వితంతు మహిళల ప్రాథమిక హక్కులు, అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారని, అలాంటి వారి బాధలు, అనుభవాలపై దృష్టిసారించడంతోపాటు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కల్పిస్తున్న సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. వితంతువులు, వారిపై ఆధారపడినవారు ఎదుర్కొంటున్న సవాళ్లు, తరచుగా పేదరికం, సామాజిక వెలికితీత, హింస, వివక్షకు గురికాకుండా గుర్తించి కృషిచేయాలని సూచించారు. వితంతువులు కుటుంబాలను పోషించడానికి, కష్టపడుతున్నారని వారికి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో వితంతు మహిళలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ 5శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ సమావేశం నుంచే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. సమాజంలో వితంతు మహిళలు విద్య, ఆరోగ్య, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల అభ్యున్నతికి అమలు చేయనున్న పథకాలతో పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 13, 696 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, అందులో 1,47,123 మంది మహిళలు సభ్యులుగా నమోదై ఉన్నారని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 43, 703 మంది వితంతు మహిళాలకు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా చేపట్టిన స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాల్లో 10శాంతం వితంతువులు ఉండేలా చూడాలని డీఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వితంతు మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన పాల్గొన్న కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్, అధికారులు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో వితంతు మహిళల సామాజిక సంరక్షణ బాధ్యతలను పోలీస్ శాఖ సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. మహిళలపై అగౌరవంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీం ద్వారా ఇప్పటికే అనేక రకాల సమస్యలను పరిష్కరించామని, మహిళలు తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అదనపు ఎస్పీ రామేశ్వర్, మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజస్వరూప, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి, డీఆర్డీఓ చిన్నఓబులేశ్, ఎస్సీ కార్పొరేషన్ రామ్‌లాల్, సఖి కోఆర్డినేటర్ సునీత, మహిళలు, వితంతువులు పాల్గొన్నారు. -
పదకొండేళ్లు సాఫ్ట్‌గా..!
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం రాణిపేటకు చెందిన జక్కా కిరణ్‌కుమార్ సాఫ్ట్‌బాల్ క్రీడలో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. తండ్రి చిన్న బీరయ్య ఆర్టీసీ ఉద్యోగి, తల్లి రాములమ్మ. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉన్న కిరణ్‌కుమార్ సాఫ్ట్‌బాల్ క్రీడను ఎంచుకొని రాణిస్తున్నాడు. 11ఏళ్ల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు పలుమార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వివిధ విభాగాల్లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణం, రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాడు. 2016లో మొదటి నేషనల్ కిరణ్‌కుమార్ దాదాపు 20సార్లు రాష్ట్రస్థాయి అంతర్జిల్లా సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. 2016 సంవత్సరంలో చత్తీస్ఘడ్ రాష్ట్రం దుర్గ్‌లో జరిగిన జాతీయ స్థాయి నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో మొదటిసారిగా పాల్గొన్నాడు. 2017లో హైదరాబాద్, చత్తీస్ఘడ్ దుర్గ్, 2018 గుజరాత్లో జరిగిన జూనియర్ నేషనల్లో ఆడాడు. 2022లో ఏపీలోని అనంతపూర్‌లో జరిగిన జాతీయ సీనియర్, గుంటూర్లో జరిగిన సీనియర్ సౌత్‌జోన్ సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023లో జమ్మూకశ్మీర్(జమ్ము)లో జరిగిన సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఆలిండియా ఇంటర్ జోనల్ నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడగా.. జట్టు ప్రథమ స్థానంలో నిలవడంతో కిరణ్‌కుమార్ బంగారు పతకం సాధించాడు. 2024లో మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అంతర్జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి ఉత్తమ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. బ్యాంకాక్ టోర్నీలో ప్రాతినిధ్యం థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈనెల 2వ తేదీనుంచి 5వరకు జరిగిన 2వ అండర్–23 పురుషుల సాఫ్ట్‌బాల్ ఏషియా కప్– 2025లో కిరణ్‌కుమార్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈటోర్నీకి ముందు మహారాష్ట జలాగం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన సెలక్షన్స్ ట్రయల్స్, కోచింగ్ క్యాంపునకు ఎంపికై ఏషియా కప్‌లో పాల్గొనే తుది భారత జట్టుకు ఎంపికయ్యాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా కప్‌లో కిరణ్‌కుమార్ ఐదు మ్యాచులకు హాంకాంగ్–చైనా, సింగపూర్, థాయిలాండ్ జట్లతో భారత జట్టు తరఫున ఆడాడు. అంతర్జాతీయ స్థాయికి రాణిపేట యువకుడు సాఫ్ట్‌బాల్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్తమ ప్రతిభ బ్యాంకాక్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వివిధ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాల సాధన ఒలింపిక్స్‌లో ఆడడమే లక్ష్యం 2027 ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్ క్రీడకు చోటు దక్కింది. ఈ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న. అందుకు రెగ్యులర్‌గా సాధన చేస్తున్న. బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా కప్‌లో దేశం తరఫున ఆడినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. – కిరణ్‌కుమార్, అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడు, మహబూబ్‌నగర్ -
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావుతో కలిసి ప్రజల నుంచి 156 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ విద్య, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, వంటశాల, స్టోర్‌రూం శుభ్రంగా ఉన్నాయా.. లేవా.. అని పరిశీలించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ల్యాబ్‌లను 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలాఖరు వరకు సంసిద్ధతలో భాగంగా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల, గణిత భావనలు, గుణింతాలు వంటివి నేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లను మాత్రమే తీసుకోవాలని, చిన్నవి, పాడైపోయినవి తీసుకోరాదని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయితే చికిత్స ప్రొటోకాల్ పాటించాలన్నారు. గతేడాది జిల్లాలో డెంగ్యూ వ్యాధిపై ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ఈసారి అలా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలోనే మోడల్‌గా ఉర్దూ ఘర్
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణలోనే ఒక మోడల్‌గా మహబూబ్‌నగర్‌లోని ఉర్దూ ఘర్ నిలవనుందని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఉర్దూ ఘర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి షబ్బీర్‌అలీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో అధునాతనమైన ఉర్దూ ఘర్ నిర్మాణమవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటే చాలా కష్టమన్నారు. హిమాలయ పర్వతంలోని అంచువరకు ఎక్కొచ్చుగాని ప్రభుత్వం నుంచి డబ్బులు తేవడం కష్టమని, ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నానన్నారు. అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు, అందులో రూ.15 కోట్లతో ఉర్దూ ఘర్ నిర్మిస్తున్నందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి వరకు చాలా మంది మైనార్టీ విద్యార్థులు ఉర్దూ తీసుకోవడం లేదని, దీంతో కళాశాలల్లో ఉర్దూ చదివే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టడం చారిత్రాత్మకం అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఉర్దూలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ రోజు మహబూబ్‌నగర్ చరిత్రలో మరుపురాని రోజు అని, ఎన్నో ఏళ్ల నుంచి ఉర్దూ ఘర్ నిర్మించుకోవాలనే కల నెరవేరుతుందన్నారు. చదువును జీవితంలో భాగం చేసుకోవాలని, చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ ఉర్దూ ఘర్ మనలోని ఐక్యతకు చిహ్నం అన్నారు. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం సీఎంతో మాట్లాడి రూ.45 కోట్లు మంజూరు చేయించారన్నారు. రూ.5 కోట్లతో మౌలాలిగుట్టలో శ్మశాన వాటిక నిర్మిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి జహంగీర్‌పీర్ ఐటీఐ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆమేర్ అలీ ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబాని తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టిమిరిస్ చైర్మన్ ఫహిమోద్దీన్ ఖురేషి, మైనార్టీ గురుకులాల కార్యదర్శి షపీవుల్లా, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, అబ్దుల్ హాదీ, సిరాజ్‌ఖాద్రీ, సాదుల్లా, అజ్మత్‌అలీ, ఫయా జ్, తఖీయోద్దీన్, రియాజుద్దీన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్‌అలీ -
కొల్లగొడుతున్నారు
వివరాలు 8లో uజడ్చర్ల: రాష్ట్రంలోనే డార్క్ ఏరియాగా గుర్తించిన మిడ్జిల్ మండలంలోనూ దుందుభీ వాగును కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడకపోగా మరింత యథేచ్ఛగా సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాలతోపాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట, తాడూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల తదితర మండలాల్లోని అనేక గ్రామాల రైతాంగానికి ఆయువు పట్టుగా ఉన్న దుందుభీ వాగు నుంచి నిత్యం వందలాది లారీలలో ఇసుకను తరలిస్తుండడంతో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. గతంలో దొడ్డిదారిన రాత్రివేళల్లో సాగే ఇసుక దందా ప్రస్తుతం అనుమతుల మాటున ధర్జాగా సాగుతోంది. నిబంధనలు బేఖాతర్ మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో దుందుభీ వాగు పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతులను కలెక్టర్ రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా నిబంధనలను ఉల్లంఘించి 10– 12 అడుగుల మేరకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. టీజీఎండీసీ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నా సంబంధిత అధికారులు జాడ లేకుండాపోయింది. అధికారులు అమ్యామ్యాల మత్తును వీడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు.. ఇసుక అక్రమ రవాణాలో పాలక పక్షానికి వ్యతిరేకంగా ప్రజాపక్షంగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం బినామీగా భాగస్వామ్యం కావడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికై నా అధికార, విపక్ష పార్టీలు తీరు మార్చుకుని తమ పక్షాన నిలబడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. డార్క్ ఏరియా ప్రయోజనాలను కాపాడే విధంగా కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అనుమతులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి వివరణ కోరేందుకు టీజీఎండీసీ, తహసీల్దార్ అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం. డార్క్ ఏరియాలోనూ అనుమతుల మాటున ఇసుక అక్రమ రవాణా బినామీలుగా మారిన అధికార, విపక్ష నాయకులు అడుగంటుతున్న భూగర్భజలాలు ఆందోళనలో పరిసర గ్రామాల రైతులు -
చేతకాని హామీలతో కాంగ్రెస్ మోసం
మహబూబ్‌నగర్ రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతగాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం మండలంలోని మాచన్పల్లిలో ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్ల విజయోత్సవాల్లో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. సభకు ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై బలిదాన్ దివస్‌లో భాగంగా డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వికసిత్ సంకల్పానికి మేము సహకరిస్తామంటూ సభలో పార్టీ కార్యకర్తలతో నల్గొండ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జితేందర్‌కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. పాలమూరు వాస్తవాలను ప్రజలకు చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేకున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేంద్రం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కుటుంబంలోని ప్రతి మహిళకు రూ.2500, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ రూ.4వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పాలమూరు ఎంపీగా పేదలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ప్రఽభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు పాండురంగారెడ్డి, జయశ్రీ, అంజయ్య, మీడియా సెల్ కన్వీనర్ సతీశ్‌కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు గంగన్న, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ మాచన్పల్లిలో వికసిత్ భారత్ సంకల్పసభ -
భర్త మందలించాడని తెల్లారే సరికి అదృశ్యం
గోపాల్పేట: భర్త మందలించాడని మరుసటి రోజు తెల్లారేసరికి భార్య అదృశ్యమైన ఘటన రేవల్లి మండలంలోని తల్పునూరులో చోటుచేసుకుంది. మండలంలోని తల్పునూరుకు చెందిన ఉప్పరి రేణుక, దస్తగిరి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేసుకుని గ్రామంలోనే బతుకుతున్నారు. ఈనెల 14న సాయంత్రం 6గంటల ప్రాంతంలో రేణుక ఫోన్ మాట్లాడుతుండగా.. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని భర్త మందలించాడు. ఆ తర్వాత ఎప్పటిలాగే ఇంట్లో అందరూ పడుకున్నారు. 15వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చూస్తే భార్య రేణుక కనిపించలేదు. అప్పటినుంచి గ్రామంలో తెలిసిన వారి ఇళ్లు, బంధువుల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం రేవల్లి పోలీస్‌స్టేషన్‌లో దస్తగిరి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై రజినీ వివరించారు. మోకాళ్ల నొప్పులు.. అనారోగ్య సమస్యలతో.. ● ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం లింగాల: మోకాళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు భరించుకోలేక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసున్నది. ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అల్లె బాలీశ్వరయ్య(58) మండలంలోని అప్పాయపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంటమనిషిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడు. సోమవారం డ్యూటీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మార్గమధ్యంలో అప్పాయపల్లి శివారులోని పలుగురాళ్ల గుట్ట వద్ద ఉరేసుకొన్నాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి కుమారుడు బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఊర్కొండ: మండలంలోని కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై జిన్నింగ్ మిల్ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడి అనంతరెడ్డి(40) మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణదేవ కథనంప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం బొందలపల్లికి చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లిలో జూన్ 15 బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్‌పై వెళ్లి అక్కడే వదిలేశాడు. ఆదివారం తన చిన్నకుమారుడు శ్యాంసుందర్ రెడ్డి, పెద్దకుమారుడు అనంతరెడ్డి కలిసి తమ కొత్త వాహనంతో టీవీఎస్ ఎక్సెల్‌ను తాడుతో కట్టుకొని తీసుకొస్తున్నారు. అనంతరెడ్డి బైక్‌పైనుంచి అదుపు తప్పి కిందపడగా తలకు బలమైన గాయమైంది. 108లో కల్వకురి ఆస్పత్రి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుడి తల్లి కౌసల్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదని.. ● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య అయిజ: తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకన్న ఘటన అయిజ మున్సిపాలిటీలోని తుపత్రాలలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా మలిగబాదాకు చెందిన కుర్వ జములమ్మ (26)కు తుపత్రాలకు చెందిన కుర్వ తిరుమలేశ్‌తో వివాహం చేశారు. జములమ్మ తండ్రికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కూతురు జములమ్మ ఆస్తిలో తనకు సమాన వాటా కావాలని కోరింది. పెద్దమనుషుల సమక్షంలో రూ.10లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకొన్నారు. తర్వాత రూ.4లక్షలు మాత్రమే ఇస్తామని మాటమార్చడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతిచెందింది. ఘటనా స్థలాన్ని సీఐ టాటాబాబు, అయిజ ఎస్సై శ్రీనివాసరావు, మల్దకల్ ఎస్సై నందీకర్ పరిశీలించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
స్థానిక పోరుకు కసరత్తు
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వం సన్నద్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటి ఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు ప్రధాన పార్టీల కన్ను.. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ నాగర్‌కర్నూల్‌లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమో దం తెలిపి పార్లమెంట్‌కు పంపింది. పార్లమెంట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ ప్రధాన పార్టీల సమావేశాలతోవేడెక్కుతున్న రాజకీయ వాతావరణం -
నకిలీ విత్తనాలు విక్రయించిన ఇద్దరి రిమాండ్
నాగర్‌కర్నూల్ క్రైం: నకిలీ విత్తనాలు విక్రయించిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఆవంచలో గతనెల 30న నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తుల ఘటనపై ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మే 30న తిమ్మాజిపేట మండలం ఆవంచలో కనిక వెంకటయ్య ఇంట్లో 10కిలోల నకిలీ పత్తి విత్తనాలు పోలీసుల సోదాల్లో లభించడంతో అతడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా విచారించగా.. వెంకటయ్య అదే గ్రామంలోని పస్పరి వెంకటయ్య నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో జడ్చర్లలోని ఫర్టిలైజర్ దుకాణం నిర్వహించే వెంకట్‌నారాయణగౌడ్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించగా.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వెంకట్ నారాయణగౌడ్‌కు నకలీ పత్తివిత్తనాలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన సత్యకుమార్ నుంచి బ్లూడార్ట్ కోరియర్ ద్వారా తెప్పించుకుని రైతులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సత్యకుమార్‌ను గుజరాత్ నుంచి జడ్చర్లకు రప్పించి అదుపులోకి తీసుకుని విచారించగా‘‘ ఫ్రీడమ్ ’’ ప్రీమియమ్ హైబ్రిడ్ కాటన్ బ్రాండ్ పేరుతో మాక్స్జెని సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితులు వెంకట్‌నారాయణగౌడ్, సత్యకుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా నకలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కనకయ్యగౌడ్ ఉన్నారు. వివరాలు వెల్లడించిన ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ -
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/దోమలపెంట/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత నాలుగు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 72వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 53వేల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. దీంతో తెరిచిన 10 క్రస్టు గేట్లలో ఏడింటిని మూసివేసి మూడింటి ద్వారా 12,303 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తికి 38,164 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్టు–1కు 650, ఆవిరి రూపంలో 69 , ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750, ప్రాజెక్టు నుంచి మొత్తం 53,771 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. శ్రీశైలలానికి 49,363 క్యూసెక్కులు జూరాలలో ఆదివారం విద్యుదుత్పత్తి చేస్తూ 37,160 క్యూసెక్కులు, ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 12,203 మొత్తం 49,363 క్యూసెక్కుల నీటిని దిగువున శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 855.2 అడుగుల వద్ద 92.4860 టిఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో ఎంజీకేఎల్‌ఐకు నీటి విడుదల జరగలేదు. 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుదుత్పత్తి జూరాల దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వార విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 46.172 మి.యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 52.209 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ఇప్పటివరకు 98.381 మి.యూ విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. పదింటిలో.. ఏడు క్రస్టు గేట్ల మూసివేత కొనసాగుతున్న విద్యుదుత్పత్తి -
సాగుపై సందిగ్ధం..
గత వానాకాలంలో బోనస్ సకాలంలో చెల్లించినప్పటికీ యాసంగికి సంబంధించి మాత్రం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యి నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం లేదు. దీంతో సన్నాల సాగుపై రైతులు సందిగ్ధంలో పడుతున్నారు. సన్నరకం వరి సాగు చేస్తే దిగుబడులు తక్కువగా వస్తున్నప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఆ పంట వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో యాసంగిలో పెద్ద మొత్తంలోనే రైతులు సన్నాలను సాగు చేశారు. కానీ, ప్రభుత్వం ప్రకటించిన విధంగా బోనస్ చెల్లించకపోవడంతో రైతులు ఈ సీజన్లో సన్నాలు సాగు చేయాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఈ సీజన్లోనూ సన్నరకం ధాన్యానికి బోనస్ అమలు చేస్తుందా.. లేదా అని అయోమయానికి గురవుతున్నారు. -
పూలే దంపతుల జీవితం స్ఫూర్తిదాయకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రీబాయి దంపతుల జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బోయపల్లిలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జ్యోతిబాపూలే, సావిత్రీబాయి విగ్రహాలను ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. పూలే దంపతులు మహిళా విద్య, హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పిల్లలెవరూ ఇంట్లో ఉండకుండా పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని, అందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువ నిధులు తెప్పిస్తామన్నారు. ● విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు సూచించారు. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు కష్టతరమైన, క్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం నేర్పించాలన్నారు. అనంతరం అంబేడ్కర్ కళాభవన్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న ‘పాటల పల్లకీలో 12 గంటలు పాలమూరులో’ వాల్‌పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బెక్కరి అనిత, విగ్రహ దాతలు లక్ష్మీనారాయణ, వినోద్‌గౌడ్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, కవి– గాయకుడు నేర్నాల కిషోర్, టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు తదితరులు పాల్గొన్నారు. బోయపల్లిలో పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు -
13 అడుగుల కొండచిలువ పట్టివేత
గోపాల్పేట: ఐదడుగుల పొడవున్న ఉడుమును కొండ చిలువ మింగి కక్కేసిన ఘటన గోపాల్పేట మండలం ఔసులకుంట సమీపంలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి సమీపంలోని రేకులగడ్డ కాలనీ సమీపంలోని ఔసులకుంట వద్ద 13 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఉడుమును మింగుతుండగా స్థానికులు గమనించారు. అనంతరం స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు ఫోన్లో సమాచారం ఇవ్వగా స్పందించిన కృష్ణసాగర్ సిబ్బందితో కలిసి కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. అప్పటికే కొండ చిలువ ఉడుమును మింగి బయటికి కక్కడంతో ఉడుము చనిపోయింది. అనంతరం కొండచిలువను బంధించారు. విషసర్పాలు, అటవీ జంతువుతో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో స్నేక్ సొసైటీ సభ్యులు కుమార్‌సాగర్, అవినాష్, కుమ్మరి బాలస్వామి, బిక్షపతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉడుమును మింగికక్కిన వైనం -
చేతబడి ఘటనపై విచారణ
తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న చేతబడి ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ఓ చేతబడి చేశాడని చెప్పులు మెడలో వేసి గ్రామంలో ఊరేగించారని ‘సాక్షి’లో ఆదివారం వార్త ప్రచురితమైంది. ఈ విషయమై ఎస్ఐ స్పందిస్తూ బాధితులతో మాట్లాడుతున్నామని, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఈ సంఘటనలో ఇద్దరూ వృద్ధులే కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిటకు చెందిన ఎండీ రవూఫ్ (47) ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల వద్ద డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. శనివారం పనులు ముగించుకొని రాత్రి వేళ స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. బాదేపల్లిలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రవూఫ్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి.. అటు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. మిషన్ భగీరథ నీటిలో పురుగులు అమరచింత: మండలంలోని నందిమళ్ల లో మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిలో ఆదివారం పురుగులు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు వస్తున్నాయన్న విషయాన్ని మిషన్ భగీరథ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకులను వారానికోసారి శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమవుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోనూ ఓవర్ హెడ్ ట్యాంకుల ను మూడు నెలలకోసారి శుభ్రపరిచే వారేలేర ని ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి స మస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు తిమ్మాజిపేట: బైక్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. బిజినేపల్లి మండలం ఖానాపూర్ కి చెందిన ఊషన్న మండల కేంద్రం సమీపంలో నడుచు కుంటూ వెళ్తున్నాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో కోడుపర్తికి చెందిన వెంకటయ్య బైక్‌పై వెళ్తూ ఊషన్నను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఊషన్నకు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య చిన్న మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
భోజనం ఎలా పెడుతున్నారు..?
జడ్చర్ల టౌన్: ‘గురుకులంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. భోజనం ఎలా పెడుతున్నారు..’ అని కలెక్టర్ విజయేందిర విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. జడ్చర్ల– మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై మల్లెబోయిన్పల్లి గేట్ వద్ద ఉన్న తెలంగాణ గిరిజన బాలికల మినీ గురుకులంలో ఆదివారం పేరెంట్స్ సందడి కనిపించడంతో అటుగా వెళ్తున్న కలెక్టర్ గురుకులం వద్ద ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోనూ కలెక్టర్ మాట్లాడారు. ఎందుకు వచ్చారని తల్లిదండ్రులను అడిగారు. విద్యార్థులతో కొన్ని పాఠ్యాంశాలు చదివించి.. సామర్థ్యాలను పరిశీలించారు. కిచెన్‌ను పరిశీలించి అక్కడ చేస్తున్న వంటలు రుచి చూశారు. స్టోర్‌రూంలో నిల్వ ఉన్న వంట సరుకుల వివరాలు విచారించారు. కాస్మొటిక్స్ డబ్బుల కోసం.. కాస్మొటిక్స్ డబ్బుల కోసం బ్యాంక్ ఖాతాలు అవసరం కాగా.. కొందరు విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో మినీ గురుకులం ప్రిన్సిపాల్ గిరిజ హౌజింగ్ బోర్డు కాలనీ ఎస్బీఐ అధికారులతో మాట్లాడి రప్పించారు. బ్యాంక్ అధికారులు వచ్చే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని వివరాలు తీసుకుని గురుకులానికి చేరుకున్నారు. ఇటు బ్యాంక్ అధికారులు సైతం అక్కడికి వచ్చి విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సందడి నెలకొనడంతో కలెక్టర్ దృష్టిపడింది. ఆదివారం అయినప్పటికీ విద్యార్థుల కోసం వచ్చిన బ్యాంక్ సిబ్బందిని, వారిని పిలిపించిన ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ అభినందించారు. గిరిజన బాలికల మినీ గురుకులం విద్యార్థినులతో కలెక్టర్ ఆరా