సింగిల్‌ స్టూడెంట్‌... బోధన జీరో! | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ స్టూడెంట్‌... బోధన జీరో!

Mar 14 2026 8:21 AM | Updated on Mar 14 2026 8:21 AM

సమస్య ఉన్నది వాస్తవమే..

నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో విచిత్ర పరిస్థితి

విద్యార్థుల భవిష్యత్‌తో

ఆటలాడుతున్న అధికారులు

కిష్టంపల్లిగేట్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండా

కొనసాగుతున్న పాఠశాల

నాగంబాయితండాలో ఉపాధ్యాయుడి రాక కోసం సింగిల్‌ విద్యార్థి మహేశ్‌ నిరీక్షణ

హన్వాడ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుల గైర్హాజరు కారణంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. మండల పరిధిలోని నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇలాంటి దుస్థితే నెలకొంది. పూర్తి వివరాలు.. మాదారం ఉమ్మడి పంచాయతీ నుంచి వేరుపడి నూతన పంచాయతీగా ఏర్పడిన నాగంబాయితండా ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒకే ఒక్క విద్యార్థి ఏ.మహేష్‌ ఐదో తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి నిర్మించిన భవనం, రూ.లక్షల్లో వేతనం పొందే ఉపాధ్యాయిని రేహానాబేగ్‌ను నియమించింది. కానీ ఆ ఉపాధ్యాయిని మాదారం పాఠశాలకు వెళ్లి తనకు బదులుగా అక్కడ ఉన్న మరో ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్‌ను కేటాయించారు. కానీ సదరు ఉపాధ్యాయుడు విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నాడే తప్పా, ఎలాంటి బోధన చేయడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మహే ష్‌కు క్రమబద్ధమైన విద్యాబోధన లేని కారణంగా తనకు కేవలం క, ఖ వరకు మాత్రమే ఓనమాలు వస్తాయని, కానీ ఐదో తరగతికి వచ్చినా తనకు చదవడం, రాయడం పూర్తిస్థాయిలో రాదని సదరు విద్యార్థి పేర్కొంటున్నాడు. ఉపాధ్యాయుడు రాకపోవడంతో అంగన్‌వాడీ చిన్నారులతో కలిసి కూర్చుంటున్నాని తెలిపాడు. ఇకపోతే ఇక్కడకు వచ్చే ఉపాధ్యాయుడు వచ్చేనెల రిటైర్మెంట్‌ ఉందని తెలిసింది. దీంతో అతను కూడా వెళ్లిపోతే అప్పుడు ఆ పాఠశాలకు, ఆ విద్యార్థికి దిక్కెవరు అన్న ప్రశ్న తండాలో కలకలం రేపుతోంది.

నాగంబాయితండాలో ఒకే విద్యార్థి ఉన్నాడు. అక్కడి ఉపాధ్యాయుడు మెడికల్‌ లీవ్‌ కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. సర్పంచ్‌తో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ విద్యార్థిని మాదారం పాఠశాలలో అడ్మిట్‌ చేస్తాం. కిష్టంపల్లిగేట్‌ పాఠశాలలో పరిస్థితి పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అంబటోనిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారు. మండలంలో ఎక్కడా వలంటీర్లను నియమించలేదు. అంబటోనిపల్లిలో వలంటీర్‌ను నియమించుకున్న విషయం తెలియదు. వీటన్నింటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

– గోపాల్‌నాయక్‌, ఎంఈఓ, హన్వాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement