కొట్టడానికి వచ్చారు
● భర్తను హత్య చేశారని ఆరోపిస్తున్న భార్య
● మృతదేహాన్ని తరలిస్తుండగా ఉద్రిక్తత
● పోలీసుల దురుసు ప్రవర్తన
కల్వకుర్తి టౌన్: తన భర్తను అత్తారింటి వారే హత్య చేశారని, ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని అడ్డదారిలో తరలించడానికి ప్రయత్నిస్తున్నారని మృతుడి భార్య ఆందోళనకు దిగిన ఘటన శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వాస్పతి వద్ద చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని భార్య తరఫు బంధువులు మృతదేహాన్ని తరలిస్తున్న ఆటోను అడ్డగించడంతో పోలీసులు వారితో దురుసుగా వ్యవహిరించారని ఆరోపించారు. వివరాలలోకి వెళ్లే.. చారకొండ మండలంలోని సారబండతండాకు చెందిన హారికృష్ణ (28)కు కల్వకుర్తి మండలంలోని కుర్మిద్దతండాకు చెందిన భారతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో భారతి రెండు సార్లు గర్భం దాల్చినా.. అది నిలవకపోవడంతో పిల్లలు కాలేదు. దీంతో కుటుంబంలో చిన్నపాటి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారతి రెండు నెలలుగా తన తల్లిగారిళ్లు అయిన కుర్మిద్దతండాలోనే ఉంటోంది. భారతిని భర్త దగ్గరికి పంపించాలని ఆమె తల్లిదండ్రులు చూసినా, భర్త తరఫు కుటుంబీకులు విజ్ఞప్తి చేసినా వెళ్లలేదు. చివరకు గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో హరికృష్ణ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కల్వకుర్తిలోని సీహెచ్‌సీకి తరలించారు. మృతుడిని చూసేందుకు భార్యతో పాటు గా వారి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని గురువారం నుంచి చెబుతున్నా పోలీసులు పట్టించుకోవటం భార్య, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆటోలోకి మృతదేహాన్ని సారబండతండాకు తరలించేందుకు ప్రయత్నించగా భార్య తరఫు బంధువులు అడ్డగించారు.
భర్త మృతిపై అనుమానం ఉందని నేను నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే నన్ను కొట్టడానికి చారకొండ పోలీసులు వచ్చారు. లాఠీ ని చూయించి నాతో పాటుగా, మా బంధువులను బెదిరించారు.న్యాయం చేయాల్సి న వారే ఇలా ఒకరికి వత్తాసు పలకడంపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పోలీ సుల తీరు పూర్తి అభ్యంతరకరంగా ఉంది.
– భారతి, మృతుడి భార్య


