సిలిండర్‌ కోసం తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ కోసం తప్పని తిప్పలు

Mar 14 2026 8:21 AM | Updated on Mar 14 2026 8:21 AM

గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి

తహసీల్దార్‌ జోక్యంతో

వినియోగదారులకు గ్యాస్‌ పంపిణీ

జడ్చర్ల టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని గ్యాస్‌ ఏజెన్సీల్లో గ్యాస్‌ నిల్వలున్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. సిలిండర్‌ కోసం గంటల తరబడి వేచి ఉన్నా ఇస్తారో.. లేదో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండేన్‌ గ్యా్‌ స ఏజెన్సీలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచే లబ్ధిదారులు బారులు తీరారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్నాక.. శ్రీనివాసనగర్‌ వద్ద ఉన్న కార్యాలయంలో రశీదులు పొందాల్సి రావటంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అక్కడ కొందరికి రశీదులు ఇచ్చారు. తీరా రశీదు తీసుకొని గోడౌన్‌కు వెళ్తే అక్కడ తాళం వేసి ఉండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఏజెన్సీ కార్యాలయానికి పెద్దఎత్తున వినియోగదారులు తరలి రావటం, వాగ్వాదం పడుతుండటంతో నిర్వాహకులు కొద్దిసేపు కార్యాలయం మూసివేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వినియోగదారులకు, ఏజెన్సీ నిర్వహకులు నచ్చచెప్పేందుకు

ప్రయత్నించారు. సర్వర్‌ సమస్య వల్ల గోడౌన్‌ వద్ద

సిలిండర్లు ఇవ్వటం లేదని నిర్వహకులు తెలియజేశారు. అయితే బుకింగ్‌ చేసి రశీదు పొందిన తరువాత ఎందుకు ఇవ్వరని వినియోగదారులు మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని రశీదుపై వినియోగదారుడి పేరు, ఫోన్‌ నంబర్‌ రాయించుకుని సిలిండర్లు ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో కొందరు వినియోగదారులు గోడౌన్‌ ఎంతకు తెరవకపోవటంతో తహసీల్దార్‌ నర్సింగ్‌రావుకు ఫి ర్యాదు చేశారు. స్టాక్‌ ఉన్నప్పటికీ సిలిండర్లు ఇవ్వ టం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన నిర్వాహకులతో మాట్లాడి వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే సిలిండర్లు ఇవ్వా లని ఆదేశించారు. 12.30 గంటలకు గోడౌన్‌ తెరిచి వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇబ్బందులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యం, బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు భోజనం వండి పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వంట చేసేందుకు గ్యాస్‌ సిలిండర్లు తప్పనిసరి. ఒక సిలిండర్‌ పొందాక 45 రోజులకు మరో సిలిండర్‌ ఇస్తారు. ఇటీవలే మండలంలోని కొన్ని కేంద్రాల్లో 45 రోజులు పూర్తి కావటంతో సిలిండర్‌ కోసం రశీదులు పొంది పడిగాపులు గాస్తున్నారు. రెండు రోజులుగా కార్యాలయం చుట్టు తిరుగుతున్నా ప్రయోజనం లేదని కేంద్రం నిర్వాహకులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement