గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రం కోసం గ్యాస్ సిలిండర్ తీసు కెళ్దామని వచ్చా. గురువారం వస్తే శుక్రవారం రమ్మన్నా రు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా గోడౌన్ తెరుచుకోలేదు. కార్యాల యంలో అడిగితే సర్వర్ సమస్య అంటున్నారు. ఇప్పటికే వంట చేయాలంటే కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుంది. స్టాక్ ఉన్నా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో తెలియటం లేదు.
– నాగరాజు, గొల్లపల్లి
కోడ్గల్‌లో రెండు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒకసారి సిలిండర్ తీసుకున్నాక 41 రోజుల తరువాతే మళ్లీ ఇసా రు. 41 రోజులు దాటి పోయినా ఇంకా ఇవ్వటం లేదు. సిలిండర్ బుకింగ్ చేసి గురువారం నుంచి తిరుగుతున్నా ఇవ్వటం లేదు. కార్యాలయానికి వెళ్తే గోడౌన్‌కు వెళ్లమంటున్నారు. ఇక్కడేమో ఇంకా తెరవలేదు. ఇలా అయితే అంగన్‌వాడీ కేంద్రాల్లో వంట వండటం ఇబ్బందిగా ఉంది. – విశ్వేష్, కోడ్గల్
●


