బస్సు ఢీ.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీ.. ఒకరు మృతి

Mar 13 2026 8:55 AM | Updated on Mar 13 2026 8:55 AM

మక్తల్‌: పట్టణంలో గురువారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మున్సిపల్‌ పరిధిలోని దండు గ్రామానికి చెన్నారెడ్డి (36) అలియాస్‌ చిన్న తన కుమారుడితో కలిసి జీపులో మక్తల్‌కు బయలుదేరారు. గురువారం రాత్రి తిరుగు ప్రయాణంలో పెట్రోల్‌ బంకు దగ్గరకు రాగానే హైదరాబాద్‌ నుంచి మంగళూరుకు వెళ్తున్న వోల్వో బస్సు జీపును ఢీ కొట్టింది. ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతని కుమారుడు అభినందనకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, మక్తల్‌ సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకునేలోపే బస్సు డ్రైవర్‌ పరార్‌ అయ్యాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement