అలివేలు మంగ హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

అలివేలు మంగ హుండీ లెక్కింపు

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన హుండీ లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.10,09,442 ఆదాయం వచ్చింది. ఈ హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, ఐడీబీఐ బ్యాంకు మేనేజర్‌ మల్లిఖార్జున్‌, పాలక మండలి సభ్యులు, సత్యసాయి సమితి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement